అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”

“మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..” అన్నాడు గిరీశం. 

.

పుస్తకానికి ఖోపం వచ్చేసింది. 

పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు – సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. 

హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు.

.

“అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే.

.

“నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలి” అన్నది.

,

“ఓస్ అంతే కదా.. ఏమిటో చెప్పు” అన్నాడు రవణ

.

“ఈ టెలుగుస్ వున్నారే వీళ్ళకి పుస్తకం విలువ, చదువుల విలువ, అక్షరం విలువ అట్టే తెలిసినట్టు లేదు.. నువ్వెళ్ళి అలాంటి వాళ్ళందరిచేత పుస్తకం కొనేట్టు చెయ్యాలి..”

.

“హమ్మబాబోయ్.. అంత పని నా వల్ల కాదు నాకు ఎవరైనా తోడు కావాలి..”

.

“తోడుకేం తక్కువోయ్ – ఇదుగో బొమ్మల బాపు, అంత్యప్రాసల ఆరుద్ర, “పొగల”సెగల శ్రీశ్రీ, నండూరి నీకు ఫ్రెండూరి.. అందాల రాముడు అక్కినేని, దుక్కిపాటి, భానుమతి..”

.

“ఇంకా ఇంకా..!!”

.

“కష్టాలు కన్నీళ్ళు.. ఇబ్బందులు సొబ్బందులు..”

.

“విల విల లాడించే సంతోషాలు, పక పకలాడించే కష్టాలు..”

.

“హన్నా..”

.

“హ హ… ఇంకా చెప్తాను చూడు.. బుడుగు, సీగానపెసునాంబ, రెండు జెళ్ళ సీత, గోపాలం, అప్పుల అప్పారావు, జనతా ఎక్స్‌ప్రెస్ జనాలు.. వీళ్ళు నేను పుట్టించిన మనుషులు.. మీ ఆయన పుట్టించిన మనుషులకి నకలు డిటోకి కాపి స్ఫూర్తి..”

.

“ఏమిటా కోతివేషాలు..”

“అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”

“తథాస్తు”

“మరి నువ్వు రావా అమ్మా..?”

.

“పిచ్చినాయనా.. నిన్ను చూసుకోడానికి నేనెందుకూ? నా బదులుగా తొమ్మిదిమంది అమ్మల్ని ఇస్తాను సరేనా?”

.

“సరే”


x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!