బాలరసాల సాల

శ్రీనాథ మహాకవి భాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని చెప్పటానికి పోతన ఇంటికి పల్లకి లో వెడుతున్నారు. పోతనకొడుకు పొలం దున్నుతున్నారు. 

శ్రీనాథుడు తన మహాత్మ్యము చూపుదాం అని, ఒక పక్క పల్లకి బొంగు మోస్తున్న బోయీలను తొలగిపొమ్మన్నారు. ఆ బోయీలు లేకున్నా పల్లకి వెళ్తోంది.

అది చూసి కొడుకు వింతపడగా, పోతన నాగలి కాడికి గట్టిన వెలపలి ఎద్దును తొలగించమన్నారు. ఆ ఎద్దు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది.

శ్రీనాథుడు రెండో పక్క బోయీలను కూడ తొలగిపొమ్మన్నారు. ఏ బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది. 

పోతన లోపలి ఎద్దును సైతం తొలగించమన్నారు. 

ఏ ఎద్దు లేకుండానే గాలిలో తేలుతూ నాగలి పొలం దున్నుతోంది. ఆ దృశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో "హాలికులకు సేమమా?" అని పరిహాస మాడారు.

వెంటనే పోతన ఆశువుగా ఇలా కవిత్వ పటుత్వపు పద్యం రూపంలో సమాధాన మిచ్చారు.

ఉ.

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్

గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్

హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ

ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.

గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో దీవించువా రైనప్పటికి తప్పులేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!