Thursday, August 31, 2017

కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు. .

కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు.

.

రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ. రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది:

కైకెయి సీత గౌగిటికి గైకొని, “ఓసి యనుంగ! నీవుగా

గైకొని యీ వనీచయ నికామ నివాసభరంబిదెల్లనున్

లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే

గాక దశాననాది వధ కల్గునె యన్న ప్రశంస లోనికిన్”

“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని, “ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”. అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ. దానికి కైక వరాలే కదా కీలకం! విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే కల్పవృక్షం చివరలో, “కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు. అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం.

దీనికి రాముని చిన్నతనం నుండే చక్కని ప్రాతిపదిక వేసారు విశ్వనాథ. కైక, రాముల మధ్యన ఒక అపురూపమైన అనుబంధాన్ని సృష్టించారు కల్పవృక్షంలో.

కాళ్ళువచ్చినదాదిగా గైక కొఱకు

పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి

నిద్ర మేల్కొన్నదిగ రామభద్రు కొఱకు

నంగలార్చుచు జను గేకయాత్మజాత

రాముని పసితనం నుండే ఏర్పడిన అనుబంధమది. రాముడేదైనా అద్భుత కార్యాన్ని చేసినప్పుడు, అది కైకమ్మకి చూపిస్తే కాని అతనికి తృప్తి ఉండదు. అది చూసి కైకేయి ఆనందబాష్పాలతో అతనికి దిష్టి తీస్తుంది. రామునికి ఉపనయనమైనప్పుడు, కైక యిచ్చిన భిక్షేమిటో తెలుసా? ఒక చుఱకత్తి, వజ్రంతో చేసిన వాడి బాణము, అని విశ్వనాథవారి కల్పన. అది చూసి రాముడెంత మురిసిపోయాడని! అంతేనా. రాముని ధనుర్విద్యాభ్యాసంలో కైకేయి ఎంతటి శ్రద్ధ తీసుకొనేదో!

పటుబాహాపటుమూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సే

యుటయున్ గైకెయి వచ్చి చూచుటయు, “నోహో తండ్రి, యా బాణమి

ట్టటు నట్టి”ట్లని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప జె

ప్పుట చేయించుటయున్ ముదంపడుటయున్ బొల్చున్ వనీవీధికన్

విల్లు ఎలా పట్టుకోవాలో, బాణాన్ని ఎలా సంధించాలో, కైకేయి చెప్పినట్టే చేస్తాడు రాముడు. అలా కైక చెప్పినట్టు లక్ష్యాన్ని ఛేదించి రాముడు నవ్వితే, అతడిని చూసి కైక మురిసిపోతుంది. రామభద్రుడు పెరిగి పెద్దవాడై, రాక్షస సంహారం చేస్తున్నప్పుడల్లా కైకమ్మనీ, ఆమె నేర్పిన విద్యని తలచుకుంటూనే ఉంటాడు! ఖరునితో భీకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు, ఖరుడు చూపిస్తున్న ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి రాముడిలా అంటాడు, “ఓయీ! వానికిన్ వానికిన్ నీవుం గార్ముక దక్షుడౌదు, నగిషీల్నేర్తీవు చేయన్, ధర్నుర్జ్యావల్లీకృత చిత్ర కర్షణ నినీషన్ గైకయీదేవి విద్యావిష్కారము నీ వెఱుంగవు సుమీ!”. అంటే “ఎవెరెవరికో నువ్వు నీ ధనుర్విద్యని చూపించి మెప్పించ వచ్చు కాని, వింటి నారిని చిత్రవిచిత్రంగా లాగడంలో ఎంతో నేర్పు గలిగిన కైక, నాకు నేర్పిన విద్య నీకు తెలియదు సుమా! నా ముందు నీ కుప్పిగెంతులు పనికిరావు” అని అర్థం. అలాగే రావణుడు సౌరాస్త్రం ప్రయోగిస్తే, అందులోంచి వేలకొలదీ చిన్న చిన్న చక్రాలు పుట్టుకు వస్తాయి. వాటిని కైకేయి నేర్పిన విలువిద్య చేతనే వమ్ము చేస్తాడు రామచంద్రుడు. తనకు రథం తెచ్చిన మాతలితో, కైకేయి నేర్పిన గతులలో రథాన్ని తోలమని చెపుతాడు.

ఈ విధంగా, రాముణ్ణి చిన్నతనం నుండీ విలువిద్యా ప్రవీణునిగా తీర్చిదిద్దడంలో కైక పాత్ర విశేషంగా కనిపిస్తుంది కల్పవృక్షంలో. కైక రామునికి తల్లి, గురువు, ఆప్తురాలు.

రామునిపై ఇంతటి వాత్సల్యమున్న కైక మరి అతణ్ణి అడవికి ఎలా పంపింది? నిజానికి, రామునిపై కైకకున్న వాత్సల్యం వాల్మీకి రామాయణంలో కూడా, ఇంత విస్తృతంగా కాకపోయినా, కొంత మనకి కనిపిస్తుంది. రాముని పట్టాభిషేక వార్త మంథర తెచ్చినప్పుడు, కైక ఎంతగానో సంతోషిస్తుంది. అంతటి శుభవార్తని తెచ్చినందుకు ఆమెని ఎంతగానో మెచ్చుకొని, ఆమెకి మంచి హారాన్ని కూడా బహూకరిస్తుంది. తనకి భరతుడిపైన ఎంత ప్రేమో, రాముడిపైన కూడా అంతే ప్రేమ అని, రాముడు కౌశల్య కన్నా తననే ఎక్కువగా ఆదరిస్తాడని కూడా అంటుంది. ఇంతటి అభిమానం మనసులో పెట్టుకొని, ఒక్కసారిగా అలా ఎలా మారిపోయింది కైక? ఆ ప్రశ్నకి వాల్మీకి మనకి సమాధానం చెప్పడు. మంధర మాటల ప్రభావమొక్కటే చూపించి ఊరుకుంటాడు. కాని మనకది అంత నమ్మశక్యంగా కనిపించదు. అందుకే తర్వాతి కవులు రకరకాల ఊహలు చేసారు. కొందరు ఆమెని పూర్తిగా దుష్టురాలిగా మార్చి వేసారు. దైవప్రేరణచేత సరస్వతీదేవి ఆమెని ఆవేశించి అలా వరాలని కోరినట్టుగా కొందరు చిత్రించారు. విశ్వనాథ మరొక వినూత్నమయిన, ఆశ్చర్యకరమైన కల్పన చేసారు! ఒకవైపు తల్లిగా పెంచిన మమకారం, మరొకవైపు గురువుగా నేర్పిన యుద్ధవిద్యకి సార్ధక్యం. ఒకవైపు లోకనింద, మరోవైపు రాముని కోరిక. వీటి మధ్య నలిగిపోతూ, అయినా తన కర్తవ్యాన్ని ఎంతో గుండె నిబ్బరంతో నిర్వహించిన ఒక శక్తివంతమైన పాత్రగా కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.

మరునాడు పట్టాభిషేకమనగా ముందు రోజు రాముడు యజ్ఞ దీక్షితుడవుతాడు. ఆ రాత్రి ధ్యానంలో ఉండగా అతనికి దేవతలు కనిపిస్తారు. అతణ్ణి నారాయణుడని పిలుస్తారు. నువ్వు నీ అవతారకారణం మరిచిపోయి యిలా రాజ్యాభిషిక్తుడవైతే ఎలా అని మొరపెట్టుకుంటారు. నీకు రాజ్యమేలే కోరికే ఉంటే ముందు నువ్వు వచ్చిన పని పూర్తి చేసి ఆ తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా రాజ్యం చేసుకో అని ప్రాధేయపడతారు. దానితో రామునికి సమాధి భగ్నమవుతుంది. ఏమి చెయ్యాలో పాలుపోదు. తనకి కూడా అంతరంగంలో ఏదో మూలన యీ పట్టాభిషేకం యిష్టముండదు. దేవతలకి కూడా యిష్టం లేదని తెలుస్తుంది. కాని తండ్రి మాటని త్రోసిపుచ్చి ఎలా తానీ పట్టాభిషేకాన్ని కాదనడం? అలాంటి పరిస్థితిలో తనకి సహాయం చెయ్యగలిగే వారెవరు? మెల్లగా కైక మందిరానికి వెళతాడు రాముడు. వారి మధ్య జరిగే సన్నివేశం, వారి సంభాషణ, గొప్ప నేర్పుతో చిత్రించారు విశ్వనాథ.

అంత రాత్రి రాముడక్కడకి రావడం చూసిన కైక ఆశ్చర్యపోతుంది. కంగారు పడుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం పెట్టుకొని యిలా అర్థరాత్రి ఎందుకొచ్చావని అడుగుతుంది. దీక్షా భంగం జరగకుండా వెనక్కి వెళ్ళిపొమ్మంటుంది. అప్పుడు రాముడిలా అంటాడు:

అనిన రాముడు, తల్లి! సమాధి నిలువ

దాయె నే నేమి చేయుదు నమ్మ యనుచు

ఱేపు మొదలుగ బద్ధవారీగజేంద్ర

మట్లు కదలగ వీలులే దనుకొనెదను

“అమ్మా! నన్నేం చెయ్యమంటావు, సమాధి నిలువడం లేదు! ఇక రేపటినుండీ గొలుసుకి కట్టేయబడిన ఏనుగులాగా కదలక మెదలక ఉండాలన్న చింతే మనసంతా నిండిపోయింది” అని అర్థం. దేవతలు సమాధిలో కనిపించి తనను రాజ్యం చెయ్యవద్దన్నారనీ, తనకీ రాజ్యమ్మీద కోరిక లేదనీ, ఎటూ పాలుపోక యిలా వచ్చాననీ చెపుతాడు. అప్పుడు,

అనినన్ గైకయి, “యిప్పుడిట్లెయగు ఱేపంకస్థయౌ జానకిం

గని, సింహాసనసీమ వేఱొకగతిన్ గన్పించు బొ”మ్మన్న, రా

ముని నేత్రంబుల నొక్క తీవ్రకళయై “మున్నీవు నువ్వెత్తు నే

ర్పిన కోదండకళావిచిత్ర గమనశ్రీ యేమగుం జెప్పవే!”

“ఇప్పుడిలాగే అంటావు. రేపు నీ భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నువ్వు సింహాసనమ్మీద కూర్చున్నప్పుడు వేరే రకంగా అనిపిస్తుందిలే” అని పరిహాసంగా అంటుంది కైక. ఆ మాటలకి రాముడు ఆమెవైపు తీక్ష్ణంగా చూచి, “నువ్వు నాకు ఎంతో గొప్పగా నేర్పిన నా విలువిద్యకింక సార్థక్యమేమిటి చెప్పమ్మా” అంటాడు. అంతే కాదు, “నా వద్దనున్న వాడిబాణాలతో నా కిరీటమ్మీద బొమ్మలు చెక్కుకోనా? నన్ను రోజూ స్తోత్రం చెయ్యడానికి వచ్చే ప్రజలమీద యుద్ధవ్యూహాలు పన్ననా?” అని నిలదీస్తాడు. అప్పుడు కైక “అయితే ఏమిటంటావు? నీ విలువిద్యకీ యుద్ధనైపుణ్యానికీ సార్థక్యం ఎలా కలుగుతుంది?” అని అడుగుతుంది. రాముడు దానికి సూటిగా జవాబు చెప్పడు. దానికి సమాధానం కైకకి తెలుసుకదా! తీక్ష్ణమైన చూపులతో ఒకటే మాట అంటాడు రాముడు, “నేనిప్పుడు రాజ్యం చెయ్యడమనేది వట్టి మాట”. అంతే! కైకేయి తన భవనంలోకి విసవిసా వెళిపోతుంది.

అదీ వారిద్దరి మధ్యన జరిగే సన్నివేశం! రాముడు కైక దగ్గరకే ఎందుకు వచ్చాడు? రాముని తీక్ష్ణమైన చూపుల్లో కైకకి అర్థమైనది ఏమిటి? రాముని కోరిక కైక ఎలా తీరుస్తుంది? ఇవన్నీ పాఠకుల ఊహకి వదిలిపెట్టేసారు విశ్వనాథ.

ఆ తర్వాత రోజు, మంధర పట్టాభిషేక వార్త విని కోపంతో కైక దగ్గరకి వచ్చి దాని గురించి చెపుతుంది. కైక అప్పుడే నిద్రనుండి లేస్తూ, “ఏమిటి రాముడు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడా! రాముడు పట్టాభిషేకం వద్దన్నట్టుగా పీడ కల వచ్చింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు”, అంటూ తన ముత్యాలహారాన్ని మంధరకి బహుమతిగా ఇస్తుంది. అప్పుడు వాల్మీకంలో లాగానే, మంధర దాన్ని విసిరి కొట్టి, రాముడు రాజైతే కైక పడవలసిన కష్టాలని ఏకరువు పెడుతుంది. వాటిని కైక తేలికగా కొట్టి పారేసి, రాముడి గొప్పతనం వర్ణిస్తుంది. అతను పరాక్రమవంతుడని, యోగి అనీ, రాక్షసాంతకుడనీ వివరిస్తుంది. ఇక్కడ, రామావతార రహస్యం తెలిసిన ఒక జ్ఞానిగా కైక పాత్ర మనకి కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. ముందురోజు రాత్రి రాముని కన్నుల్లో కైక చూసిన రహస్యమిదేనా అని అనిపిస్తుంది! మంధరకి యిదేమీ పట్టదు. పైగా, యోగి అయితే అడవుల్లో తిరగాలి కాని సింహాసనమెక్కి రాజ్యం చెయ్యాలన్న కోరిక ఎందుకనీ, రాక్షసులు అయోధ్యా పురవీధుల్లో తిరగటం లేదనీ, అంటుంది. ఆ మాటలు కైక మనసులో నాటుకుంటాయి! “It all fell in place!” అన్నట్టుగా, రాముడు తన దగ్గరకి ఎందుకు వచ్చాడో, తాను చెయ్యవలసినది ఏమిటో మొత్తమంతా అవగాహనకి వస్తుంది కైకకి. అప్పుడు కైక మనస్స్థితి ఎలా ఉంటుంది? ఒకవైపు రాముడు తనమీద మోపిన బాధ్యత. మరొకవైపు తానే స్వయంగా రాముణ్ణి అడవులకి పంపించాలన్న బాధ. ఇంకొకవైపు, దీనివల్ల తన మీద పడబోయే లోకనింద. తనకే ఎందుకిలా అయిందన్న కోపం. ఈ అవస్థని చాలా నేర్పుగా, హృద్యంగా, స్పష్టాస్పష్టంగా చిత్రిస్తారు విశ్వనాథ.

ఆ తర్వాత కథ మామూలే. దశరథుని వరాలు అడగడం, దానికి దశరథుడు కైకని తిట్టిపోయడం, రాముడు అడవులకి వెళ్ళడం, దశరథుడు మరణించడం, కౌసల్య మొదలు లోకమంతా కైకని తూలనాడడం, చివరికి భరతుని చేతకూడా కఠినమైన మాటలు అనిపించుకోవడం. అయితే, యీ ప్రతి సన్నివేశంలోనూ మనకి కైక మీద అపారమైన జాలి కలగకమానదు. ఎన్ని మాటలు పడ్డా, నోరు మెదపలేని ఆమె నిస్సహాయత, ఎంత బాధని అనుభవించినా రహస్యాన్ని తన గుండెల్లోనే దాచుకున్న ఆమె స్థిరత్వం మనలని అబ్బురపరుస్తాయి. కల్పవృక్షంలో కైక పాత్రని అంత ఉదాత్తంగా తీర్చిదిద్దారు విశ్వనాథ. దీని వలన సాధించిన ప్రయోజనం ఏమిటంటే – రసావిష్కరణ. కైక పాత్రలోని సంఘర్షణ, సహృదయుని మనసుని కుదిపివెయ్యక మానదు. మరొక ప్రయోజనం – కథకి, ఆ పాత్రకి ఒక రకమైన సౌష్ఠవాన్ని చేకూర్చడం. కైక పాత్రనీలా మలచడంలో పాశ్చాత్య విషాదాంత నాటకాలలోని నాయక/ప్రతినాయక పాత్రల ప్రభావం ఉందేమో అనిపిస్తుంది! అయితే, యిక్కడ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయమొకటి ఉంది. ఈ పాత్ర చిత్రణ వాల్మీకి రామాయణంలో లేనిదే అయినా, వాల్మీకి రామాయణానికి ఏమాత్రమూ విరుద్ధం కానిది. అందుకే యిది వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం అయింది.

Wednesday, August 30, 2017


-

-పాలువాయి భానుమతి !

.

పద్మ భూషణ్ పాలువాయి భానుమతి అంటే తెలుగులుకు, తమిళులలో తెలియనిది ఎవరికి..

సహజ నటన , గాంభీర్యం..ఆమె సొంతం..మృదు మధుర స్వరాలతో ఆమె పాడిన పాటలు.. నేటికీ వినబడుతూనే ఉంటాయి.. తను నిర్మించి నటించిన ప్రతి ఒక్క చిత్రంలో ..చిత్ర కథను బట్టి.. సాంప్రదాయ సంగీతం ఉండేట్టు చూసుకున్నారు.. ముదితల్ నేర్వగ రాని విద్యల్ గలవే ముద్దార నేర్పించినన్ అన్నట్టు.. నటీమణిగా, గాయనిగా, రచయిత్రిగా, చిత్ర నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా , దర్శకురాలిగా.. సంగీత దర్శకురాలిగా, ఎడిటర్ గా ఆమె బహుముఖ ప్రజ్ఞ చూపారు..

వరవిక్రయం 1939 తో ప్రారంభం అయిన ఆమె చలన చిత్ర జీవిత ప్రస్థానంలో నటించినవి కొన్ని చిత్రాలు మాత్రమే అయినా.. ఆమె పోషించిన ప్రతి పాత్రకు జీవం పొసారు.. స్వర్గ సీమ, కృష్ణ ప్రేమ, గృహప్రవేశం, రత్నమాల,రక్ష రేఖ, అపూర్వ సహోదరులు, లైలా మజ్ను.. మల్లీశ్వరి.. మంగళ, ప్రేమ,చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, చింతామణి, తెనాలి రామకృష్ణ, వరుడు కావాలి..బాటసారి, అనురాగం, వివాహ బంధం, తోడు నీడ, అంతస్థులు.. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం.. అంత మనమంచికే వంటి ఎన్నో చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు మరువ లేనివి.. 1980 లలో వచ్చిన మంగమ్మ గారి మనవడు చిత్రం దిగ్విజయం సాధించింది అంటే.. అందులో పౌరుషం గల మంగమ్మ గా ఆమె సహజ గాంభీర్య నటనవలనే అంటే అతిశయోక్తి కాదు..

ఆమె పాడిన ప్రతి ఒక్క పాట.. సుమధురమే.. ఆమె నటించిన ప్రతి పాత్ర మరపురానిదే.. భర్త పాలువాయి రామకృష్ణతో కలసి ఆమె సుప్రసిద్ధ భరణీ స్టూడియో ను నెలకొల్పి మంచి చిత్రాలను నిర్మించి నటించారు.. మిస్సమ్మ, చెంచులక్ష్మి వంటి మరెన్నో విజయవంతమైన చిత్రాలలో.. ఆమె చివరి నిముషంలో తప్పుకున్నా దర్శక నిర్మాతలు ఆమెకు అహం అని తెగిడినా.. అంజలి,సావిత్రి, జమున వంటి సరికొత్త అందగత్తెలు చిత్ర సీమకు వచ్చినా.. ఆమె ఏ మాత్రం జంకకుండా. పురుషాధిపత్యం కూడిన చిత్ర సీమలో 60 సంవత్సరాలు మకుటం లేని మహా రాణిగా మెలిగారు.. ఆమె రచించిన అత్తగారి కథలు, రంభా చక్రపాణీయం నేటికీ చదువరులను కిత కితలు పెడుతూనే ఉన్నాయి..నాలో నేను అని ఆమె జీవితలోని మరపు రాని మధుర ఘట్టాలను ఎన్నో స్వయంగా రాసుకున్నారు..

రావణ కాష్ఠం : --

రావణ కాష్ఠం : --

-

సమస్య రగులుతూనే ఉంది అన్న అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నాం. అది సరైన భావనే. అయితే.. 

ఇంతకీ రావణ కాష్టం అన్న పదం ఎలా పుట్టిందో తెలుసా..?

.

రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్లినా.. మహా పతివ్రత అయిన ఆయన సతీమణి మండోదరి పూజామందిరంలో దీక్షకు కూర్చునేదట. రావణుడి శక్తికి, ఆమె అకుంఠిత దీక్ష తోడై.. అన్నీ విజయాలే సిద్ధించేవట. 

రామ రావణ యుద్ధ సమయంలోనూ ఆమె దీక్షలో కూర్చుందట. ఆమె దీక్షను భగ్నం చేయకుంటే రావణవధ జరగదని తెలిసిన దేవతలు, మండోదరి దీక్ష భగ్నం చేసే బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారట. మారుతి ప్రయత్నంతో మండోదరి దీక్షకు భగ్నమైందట.

దాంతో, రాముడు రావణుడిని మట్టుపెట్టగలిగాడట. రావణుడి కాయాన్ని చితిపై చేర్చి తగులబెట్టిన తర్వాత, సతీసహగమనం చేయబోతూ.. తనను వంచించిన దేవతలను మండోదరి శపించబోయిందట. మహాసాధ్వి శాపానికి భయపడ్డ దేవతలు.. ఆమెను శాంతింప చేసేందుకు, ఆమెకు శాశ్వత సుమంగళిత్వాన్ని వరంగా ఇచ్చారట.

భర్త చనిపోయిన తాను శాశ్వత సుమంగళిని ఎలా కాగలను అన్న ప్రశ్నకు, చితి ఆరిపోయి.. అస్తికలు, భస్మాన్ని పుణ్యతీర్థాల్లో నిమజ్జనం చేసి, పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్లు కాదు కాబట్టి, రావణాసురుడి చితి శాశ్వతంగా ఆరిపోకుండా, రగులుతూ ఉండేటట్లు దేవతలు ఆమెకు వరమిచ్చారు. తద్వారా, ఆమె సుమంగళిత్వానికి ఏ లోటూ రాదని దేవతలు ఆమెను శాంతింప చేశారు. అప్పటినుంచీ, రావణకాష్ఠం రగులుతూనే ఉంటుందన్నది ఇతిహాసం.

రావణకాష్ఠం అన్న పదం ఈ విధంగా ఉద్భవించింది.

(కాష్ఠం అంటే కట్టె)

బాలభాష! (శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.)

బాలభాష!

(శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.)

.

చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!

.

అయ్య రారా! చక్కనయ్య రార!

అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!

.

అప్ప రారా! కూర్మికుప్ప రార!

రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ

.

తోట రారా! ముద్దుమూట రార!

ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!

.

పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!

కన్నకాచి రార! గారాలకూచి రా!

.

నాన్నరార! చిన్నియన్నరార!

ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు

లాడ రార! కుల్కులాడ రార!

-

Tuesday, August 29, 2017

శ్రీనాధుడు-పిఠాపురం !

శ్రీనాధుడు-పిఠాపురం  !

.

పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. 

ఈ ఊరుకి అధిపతిపిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది

. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.

.

"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్

ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం

గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం

గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."

పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది

( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు).

ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-

-

"ఏలేటి విరినీట నిరుగారునుంబండు

ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."

-

అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. 

.

. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి

.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది.

-

గిడుగు- గురజాడ స్నేహం .!

.

గిడుగు- గురజాడ  స్నేహం .!

.

శ్రీ గిడుగు రామమూర్తిగారు విజయనగరం మహారాజా కళాశాలలో

లోయ ర్  ఎఫ్ .ఏ లోచేరారు. .అంతవరకూ ఆయన ఏకళాశాసకు

వెళ్ళి చదువుకోలేదు.

మహారాజా కళాల ప్రిన్సిపాల్ చంద్ర

శేఖరశాస్త్రిగారింట్లో గురజాడని కలిశారు.

అప్పటినుంచివాళ్ళిద్దరిమధ్యాస్నేహంపెరగసాగింది.

మెట్రికె తరువాత అప్పారావుగారు చదువుని కొనసాగించారు

కానితండ్రి చనిపోవడంతో

గిడుగు కుటుంబానికి అండగా ఉండడం కోసం విశాఖ

కలెక్టరేట్ లో నెలకి పదిహేను రూపాయలతో ఆరు నెలల

పాటు ఓతాత్కాలికోద్యోగాన్ని చేసారు. ఇద్దరి 

మధ్య వ్యత్యాసం పదిహేనురోజులుతక్కువ 

సంవత్సవరం .పెరిగిన తరువాత వీళ్ళిద్దరూ ఆధునిక భాషా సాహిత్యాలకి పెద్ద పట్టుగొమ్మలవుతారని ఎవరూ అనుకోలేదు,ఆఖరికి

వాళ్ళు కూడా!

.

గిడుగు,గురజాడ ఎంతటి ఆత్మీయులయ్యారంటే...ఇద్దరూ చరిత్ర అధ్యాపకులైనా తాము చేసిన శాశన పరిష్కారన్నింటినీ గురజాడకి చూపించిగాని ఏపరిశోధనా పత్రికలోనైనా ప్రచురణకు పంపేవారుకారు.ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గురజాడ చెప్పారనే గిడుగు భాషోద్యమాన్ని చేపట్టారు.ఆఖరులో గురజాడ గ్రాంధికంలో విద్యా బోధనలో తమ అసమ్మతిని తెల్పడానికి సబ్కమిటీకి

సమర్పించాల్సి వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం ఏమాత్రం సహకరించడంలేదు.అక్షరాల్ని కలం నిలిపి రాయలేకపోతున్నారు.టేబుల్ అవతల కూర్చున్న గిడుగుకి అందించలేని స్థితి.ఇష్టం వచ్చినట్లు రాసి అలాగే కిందకి వదిలేస్తే,కింద కూర్చున్న గిడుగు వాటిని

అందుకుని సాఫుప్రతి రాసి గురజాడద్వారా సబ్కమిటీకి సమర్పించారు.గురజాడ చనిపోయేముందు తనతో భాషోద్యమాన్ని వడిచి పెట్టవద్దని కోరారు కాబట్టే తరువాత25 సం.తను చనిపోయేవరకూ భాషోద్యమంతోనే గడిపారు.తమ ఆరోగ్యం దెబ్బతంటున్న రోజుల్లో భాషగురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అందరూ ఆయనని పొగుడుతుంటే పట్టించుకోకుండా ఇప్పుడు మా అప్పారావు ఉంటే ఎంత ఆవందించేవాడో అన్నారట.

అదీ వాళ్ళ స్నేహం.

Sunday, August 27, 2017

శ్రీ చైతన్య మహాప్రభు !

శ్రీ చైతన్య మహాప్రభు !

.

“ శ్రీ గురుగౌరాంగౌ జయతః ”-" హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరే " ”

-

చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం ఫిబ్రవరి 18, 1486 - జూన్ 14, 1534) జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నదియా). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒడిషాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు.

.

కృష్ణ ప్రేమను పంచుటకు అరుదెంచారు. సామూహిక హరినామ సంకీర్తనమునకు పితయును అయిన "శ్రీ చైతన్య మహా ప్రభువు" బెంగాల లోని నవద్వీపము లోని శ్రీధామ మాయాపురములో క్రీ. శ. 1407 శతాబ్దమున ( క్రీస్తు కాలమాన ప్రకారము ఫిబ్రవరి 1486 నంవత్సరమున) ఫాల్గుణ పౌర్ణమి సంద్యా సమయమున అవతరించిరి. శ్రీ చైతన్య మహా ప్రభువు తండ్రియైన జగన్నాథ మిశ్రులు సిల్హట్ జిల్లాకు చెందిన విద్వత్పూరుడైన బ్రాహ్మణుడు.చైతన్యుడి తల్లిదండ్రులకు మొదట ఎనిమిదిమంది సంతానం పుట్టడం, వెంటవెంటనే చనిపోవడం జరిగిన తర్వాత తొమ్మిదవ సంతానంగా విశ్వరూపుడు జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి దక్షిణానికి వెల్లిపోయాడు. ఆఖరి సంతానం చైతన్యుడు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు. తెల్లగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్నందున అతడిని గౌరాంగుడు అని పిలిచేవారు. ఇది కాక ఇతడి తోటి పిల్లలు ""నిమాయి" అని పిలిచేవారు. సన్యాసం స్వీకరించిన తర్వాతనే "శ్రీకృష్ణచైతన్యుడు" అనే పేరు వచ్చింది.

.

గౌరాంగుడు చిన్నతనంలోనే సకల శాస్త్రాలూ, పురాణేతిహాసాలూ చదివి మహా పండితుడయ్యాడు. తర్కం, వ్యాకరణం అతని అభిమాన విషయాలు. 16వ ఏటనే నవద్వీపంలో అతడు పాఠశాల స్థాపించి, వందలాది విద్యార్థులకు తర్క, వ్యాకరణాలు బోధించాడు. సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం కూడా రచించాడు. గౌరాంగుని 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి తన 23వ ఏట గౌరాంగుడు ఒకసారి గయ వెళ్ళాడు. అక్కడ ఒక విష్ణ్వాలయంలో పూజలు చేస్తుండగా అతని హృదయం భగవంతుని పట్ల అపార భక్తి భావంతో తన్మయుడయిపోయాడు. ఆ స్థితిలో అతడిని చూసిన ఈశ్వరపురి అనే సాధువు అతడు మహాభక్తుడు కాగలడని తలచి కృష్ణమంత్రోపదేశం చేసాడు.

ఆ సమయమున నవద్వీప ప్రాంతము విద్యాసంస్క్రతులకు కేంద్రమై ఉన్నందున ఆయన విద్యార్థిగా నవద్వీపమునకు చేరిరి. నవద్వీపములోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబరి చక్రవర్తి యొక్క తనయయైన శచీదేవిని వివాహము చేసికొనిన తరువాత జగన్నాథముశ్రులు గంగాతటమునందు తమ నివాస మేర్పరుచుకొనిరి. జగన్నాథ మిశ్రుడు తన భార్యయైన శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరు పసివయస్సులలోనే మరణించిరి. చివరికి మిగిలిన శ్రీ విశ్వరూపుడు మరియు విశ్వంభరుడను పుత్రుల వలననే పిత్రు ప్రేమను చూపుటకు వారికి అవకాశము కలిగినది. సంతానమున కడపటివాడును, దశమ సంతానము అయిన విశ్వంభరుడే తరువాత నిమాయి పండితుడుగా పేరుగాంచారు. ఆ నిమాయ పండితుడే సన్యాసమును స్వీకరించిన పిమ్మట " శ్రీ చైతన్య మహా ప్రభువు"గా ప్రసిద్ధిగాంచారు.

.

ఆతడికి తరచుగా తన్మయ స్థితి కలిగేది. చివరి 12 ఏళ్ళు సగం సమాధి స్థితిలోను, సగం జాగ్రదావస్థలోను గడిపాడు. సమాధిలో ఉండగా కృష్ణ సంయోగ సుఖాన్ని, జాగ్రదావస్థలో కృష్ణవియోగ వేదనలోని సుఖాన్ని అనుభవించేవాడు.

.

చైతన్యుడు 1534, జూన్ 14న తన 48వ ఏట జగన్నాథాలయంలో పూజానిమిత్తం తలుపులు తెరుచుకుని లోనికి వెళ్ళినవాడు వెళ్ళినట్టే మహాప్రస్థానం చెందాడని ఒక కథనం. నదిలో స్నానం చేస్తుండగా అతడిని మామూలుగా ఆవరించే భగవత్తన్మయత్వంలో ఆ నీటిలో మునిగిపోయి తనువు చాలించడని మరొక కథనం.

.

చైతన్య సంప్రదాయానికి చెందిన వేదాంతాన్ని అచింత్య భేదాభేదవాదం అని అంటారు. మతపరంగా దానికి గౌడీయ వైష్ణవం అని కూడా పేరు.

చైతన్యుడి జ్ఞానమీమాంస మరియు ధార్మిక బోధనలు పదివున్నాయి. వీటినే "దశ మూల బోధనలు" అని వ్యవహరిస్తారు.

ధార్మిక గ్రంథాలు అయినటువంటి భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం, గ్రంథాల ఆధారంగా క్రింది తొమ్మిది సత్యాలు స్థాపించబడినవి;

శ్రీకృష్ణుడు "మహా" మరియు "అనంత" 'సత్యం'.

శ్రీకృష్ణుడు దివ్యశక్తి (transcendental), జీవశక్తి (living entities), మరియు భౌతిక (material nature) శక్తులకు మూలము.

కృష్ణుడు రస సముద్రుడు.

జీవులులన్నిటికీ మూలవస్తువు కృష్ణుడే.

కొన్ని జీవులు భౌతికశక్తుల ప్రభావాలకు లోనవుతాయి.

ఇతర జీవుల దివ్యశక్తులు, భౌతిక విధానాలకూ మరియు శక్తులకు అతీతంగా వుంటాయి.

జీవులు మరియు భౌతికపరమయిన ప్రకృతి అచింత్య భేద అభేద, ఒకదానికొకటి అంతర్భాగమైనప్పటికీ, శ్రీకృష్ణుడి అంతర్భాగాలు కావు.

భక్తి లేదా కృష్ణుడి పట్ల పరిపూర్ణ భక్తి మాత్రమే ముక్తికి మార్గము.

శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ అత్యున్నత లక్ష్యం.

బాపు రమణుల -కొత్త పెళ్లి కూతురు -ముత్యాలముగ్గు - -

బాపు రమణుల -కొత్త పెళ్లి కూతురు -ముత్యాలముగ్గు -

-

(ఆరుద్ర - సాహిత్యం....రామకృష్ణ - గాత్రం.)

.

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు .....

ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం

ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం

సోయగాల విందులకై వేయి కనులు కావాలీ .....

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో

నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు

పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు

గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

.

ఈ పాట డెభ్భై ఎనభై దశకాల్లో వచ్చిన అపురూపమైన పాటల్లో మొదటిదని నా నమ్మకం. సాహిత్యం ఎంత నిండుగా ఉంటుందో ఈ పాటలో. ప్రేమ,ఇష్టం,సున్నితమైన శృంగారం వీటన్నింటితో చక్కటి మేళవింపు ఈ పాట. "ముడుచుకునే కొలదీ మరీ మిడిసిపడే సింగారం". ముడుచుకోవటం, మిడిసిపడటం రెండూ ఒకదానికొకటి భిన్నమైనవి. ఆ రెంటినీ కలిపి ఒకచోట కూర్చి అపురూపం అనిపించిన ఆ రచయిత శైలి కి జోహార్లనద్దూ. :) సినిమాలో హీరో డబ్బున్నవాడైనా పీటల మీద పెళ్ళి చెడిపోయిన ఒక పేదింటి పిల్లని చేసుకుని కూడా "నింగిలోని దేవతలు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు" అని అంటాడు. తనకి ఉన్న కలిమికన్నా ఈ కలిమే ఎక్కువ అని ఆ అమ్మాయి పట్ల ఇష్టాన్ని ఎంత చక్కగా చిన్న మాటల్లో చెప్పాడో. సాహిత్యం,మహాదేవన్ గారి సంగీతం చక్కగా కుదిరిన పాట ఇది. రామకృష్ణ గారు పాడిన పాటల్లో అత్యుత్తమం అని నా నమ్మకం.

Saturday, August 26, 2017

జగన్మోహిని అమృతము పంచుట !

జగన్మోహిని అమృతము పంచుట !

( జాఱించు; జా ఱించి, లొలయించు; నొలయించి, . . అంటూ పూర్వపాదాంత పదాన్ని గ్రహించి, ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ, ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మథురాతి మథురంగా ప్రయోగించిన మన పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు.)

-

-సీ.

'పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు; 

జాఱించి మెల్లన చక్క నొత్తు

దళ్కు దళ్కను గండఫలకంబు లొలయించు; 

నొలయించి కెంగేల నుజ్జగించుఁ

గటు మెఱుంగులు వాఱు కడకన్ను లల్లార్చు; 

నల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు

సవరని దరహాస చంద్రికఁ జిలికించుఁ; 

జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు-

-తే.

'దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెఱపుఁ

గంకణాది ఝణంకృతుల్ గడలు కొలుపు

నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు

సన్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప.!

భావము:

పైటకొంగును వక్షోజాలపైనుండి జార్చి, మెల్లగా సర్దుకుంటోంది. 

తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళను చేతిపై చేర్చి మరల వదిలివేస్తోంది. జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి, మళ్ళీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చిలకరించి, ఎర్రని పెదవుని మెలిపెడుతోంది, కొప్పులోని వికసించిన పూలపరిమళాలు వ్యాపింపజేసి, కంకణాదులను మ్రోగేలా చేస్తోంది. నిలకడ లేకుండా మెలగుతూ నెమ్మేని కాంతులను పొంగిపొరలేలా చేస్తూ, పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది. 

కాంతులను పొంగిపొరలేలా చేస్తూ , పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది. 

జాఱించు; జా ఱించి, లొలయించు; నొలయించి, . . అంటూ

పూర్వపాదాంత పదాన్ని గ్రహించి, ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ, ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మథురాతి మథురంగా ప్రయోగించిన మా పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు . . .

ఇలా ఆ మాయలమారి జవరాలు, జగత్తుని మోహింపజేసే దేవతలాగ ఒప్పి ఉండి, తన అందమైన ముఖ సుగంధానికి ఆకర్షితమై ముసురుతున్న తుమ్మెదలను అదలిస్తూ, మురిసిపోతూ, చిగురాకుల పొదల వెంట సంచరిస్తున్న ఆమెను అసుర వీరులు చూసి, మోహంలో పడిపోయి, ఆమెతో ఇలా అనసాగారు. . . . . .

-

“ఓ కమలాల వంటి కన్నులున్న కోమలాంగీ! చక్కదనాల జవరాలా! ఓ వన్నెలాడీ! ఏమి లావణ్యం! ఏమి మాధుర్యం! ఎక్కడి నుండి వచ్చావు? ఏమి కావాలి? నీ పేరేమిటి? గంధర్వ, సిద్ధ, దేవత, రాక్షస, చారణ, మానవ కన్యలలో ఎవరి యందూ నీ అంత అందచందాలు లేవు. నీ మిక్కిలి ప్రియమైన మనసుకీ, అవయవాలకూ నిండుదనం సమకూర్చిన బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించాడు కాబోలు! మేము కశ్యపుని సంతతి వారము, దేవతలకు సోదరులము. ఎదురులేని పౌరుషం కలవారము. ఒకే ప్రయోజనాన్ని ఆశించి శ్రమించి సంపాదించిన ఈ పదార్థాన్ని పంచుకోడంలో జ్ఞాతులమైన మాలో మాకు పంపకాలు కుదరటం లేదు. నువ్వు పంచు అనిరి .

-

ఆ మాయా మోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు “ఈ మగువ మనకూ, దేవతలకూ తేడాలేకుండా పంచిపెడతాను అని పూనుకుంది కదా. అలా చేయకుండా మాట తప్పుతుందా. లేదు అలా తప్పదు. కానీ, మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో! తిరిగి చూడదేమో! స్తనద్వయం మీద పైట కప్పేసుకుంటుందేమో! మరోమాట కలిపితే కంగారుపడి వెనకడుగు వేస్తుందేమో! మన యందు అలుగుతుందేమో! మన మీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో!” అనుకుంటూ, జంకుతూ గొంకుతూ, ఊరకే ఉండిపోయారు తప్పించి “సుందరీ! తొందరగా తీసుకురా!” అని పిలవలేకపోయారు.

.

రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూసారు. చూసి మోహినికి సైగలు చేసారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన, రాహువు తల నిర్జీవం కాలేదు. అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది.

.

అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహుగ్రహం ఆ పగను వదలకుండా, అమావాస్య, పూర్ణిమలలో సూర్య చంద్రులను నేటికీ పట్టుకుంటోంది.

.

విష్ణు మూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా, అమృతమంతా దేవతకు బాహాటంగా పోసి, మోహినీ రూపాన్ని వదలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు.

.

దేవతలూ, రాక్షసులూ సరిసమానమైన సంకల్పమూ, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ ఉన్నవారే. కానీ ఇద్దరికి రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించని కారణంచేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాలపాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని వారు శుభాలు పొందలేరు కదా!


బాపు గారి బొమ్మ- నిలచెను బస్ కై-

బాపు గారి బొమ్మ- నిలచెను బస్ కై-

-

స్మైలింగు ఫేసు చిన్నది

పైలా పచ్చీసు మేను ఫెళ ఫెళ లాడన్

స్టైలుగ నిలచెను బస్ కై

సైలెంటయిపోవ ఆడియన్సుల హార్టుల్;

.

(బాపు గారి బొమ్మ)


మూడు ప్రశ్నలు-మూలం: లియో టాల్‌స్టాయ్ !

మూడు ప్రశ్నలు-మూలం: లియో టాల్‌స్టాయ్ !

(సేకరణ)

.

ఆ రోజుకి సభ చాలించి లేవబోతూ రాజు మంత్రి కేసి చూసేడు.

“ఇంకా ఏదైనా మిగిలి ఉందా?”

“మీకు కోపం రాదని చెప్తేనే కానీ చెప్పడానికి లేదు. ఆ మధ్య మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పినవాళ్ళని దండించేరు కనుక అలా అడగవలసి వస్తోంది.” చెప్పేడు మంత్రి.

ఆ రోజు సంతోషంగా ఉన్నాడేమో ఏవిటో కాని, రాజు నవ్వుతూ చెప్పేడు, “ఆ శిక్షలు మిగతావాళ్లకే లెండి. చెప్పండి ఏమిటి సంగతులు?”

“మన రాజ్యపు సరిహద్దు చివరలో ఒక ఊరికి బైటగా ఒక సాధువున్నాడనీ ఆయన మీ సందేహాలకి సరైన సమాధానం ఇవ్వగలడనీ చారుల ద్వారా తెల్సింది.”

“ఆ సమాధానాలు నాకు నచ్చకపోతే?”

“సమాధానాలు నేను చెప్తానని ఆయన అనలేదు మహారాజా. ఆయన ఆశ్రమంలోంచి బయటకి రాడు. ఎవరైనా కలవాలనుకుంటే ఆయన దగ్గిరకే ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది. రాజహోదాలో కాకుండా మామూలు బట్టలు వేసుకుని వెళ్తే తప్ప ఆయన మీతో మాట్లాడడని చెప్తున్నారు. చారులు చెప్తే విన్నాను తప్ప ఆయన నాకు పంపించిన వార్త కాదండి ఇది.”

“నేనొక్కణ్ణే వెళ్ళాలా? దారిలో నన్ను హత్య చేసి మరొకడెవడో రాజ్యం సంపాదించడానికి వేసిన ఎత్తులా లేదూ?”

“అది కూడా విచారించాను లెండి. ఆ సాధువు నిజంగా సాధువే. ఎవరో పంపిన గూఢచారి కాదు. ఆయన జ్ఞాని అని ప్రజలు చెప్పుకుంటున్నారు. మన దగ్గిరకి ఇలాంటి విషయాలు అంత తొందరగా రావు కదా?”

“అయితే?”

“మీరు వెళ్తానంటే రెండు షరతులు. ఒకటి, మీ వెంట కొంచెం దూరంగా మిమ్మల్ని రక్షించడానికి చారులు వస్తారు. కానీ ఆశ్రమంలో చారులూ, అంగరక్షకుడూ అడుగుపెట్టడానికి లేదు. మీకు మీరే రక్షించుకోవాల్సి ఉంటుంది లోపలకి

వెళ్ళాక…”

“సాధువుకెన్నేళ్ళుంటాయి?”

“ఆయనకి డబ్బై పైనే ఉండొచ్చు. మీకు ఆయన వల్ల ఏమీ ప్రమాదం రాదు. రెండోది, మీకు ఆయన సమాధానాలు నచ్చకపోతే సాధువుని ఏమీ చేయకూడదు. నేను విన్న ప్రకారం ఆయన జ్ఞానే, కానీ ఆయన్ని దండించడం వల్ల మనకి వచ్చేది ఏమీలేదు, ప్రజాగ్రహం తప్ప.”

“ఆ మాత్రం అర్ధం అయింది లెండి. నన్ను నేను రక్షించుకోగలను. వచ్చే వారానికి ఏర్పాట్లు చేయండి. చూద్దాం ఏమౌతుందో ఈ సారి. ఇప్పటికి ఎంతమంది వచ్చినా నోటికొచ్చిన సమాధానాలు చెప్పడమే గానీ ఏవీ సరిగ్గా ఆలోచించి చెప్పినట్టు కనబడదు.”

“సరే. ఈ సారెందుకో మీకు సరైన సమాధానాలు దొరుకుతాయని నాకనిపిస్తోంది.”

ఆ పై వారం రాజు మామూలు మనిషిలాగా బయల్దేరేడు సాధువుని కల్సుకోవడానికి. రాజుకి కనబడకుండా చారులు వెనకనే బయల్దేరేరు. మంత్రి చెప్పడం ప్రకారం సాధువు ఆశ్రమం ఊరి బయట, కానీ రాజు నడుస్తూంటే తెలిసి వచ్చినదేమిటంటే, ఊరికి దూరమే.

రాజు ఆశ్రమానికి వెళ్ళేసరికి, సాధువు పాదులు తవ్వుతూ ఆరుబయట ఉన్నాడు. రాజు లోపలకి రావడం చూసేడు తలెత్తి. ఓ క్షణం తర్వాత రాజు లోపలకి వచ్చినట్టు గమనించి పట్టించుకోనట్టూ మళ్ళీ మొక్కల మీద దృష్టి సారించేడు. రాజు సాధువు దగ్గిరకి వెళ్ళి కాసేపు ఆగి అన్నాడు.

“మీరు జ్ఞానసంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”

రాజు మాట్లాడుతూంటే సాధువు విన్నాడు గానీ ఏమీ సమాధానం చెప్పలేదు. సమాధానం మాట అటుంచి, మొక్కలకి గొప్పులు తవ్వడం చేస్తూనే ఉన్నాడు. కాసేపు గడిచేసరికి సాధువుకి చెమట్లు పట్టేయి. ఇది చూసి రాజు చెప్పేడు.

“మీరు అలిసిపోయేరు. కాసేపు అలా కూర్చోండి, వీటి సంగతి నేను చూస్తాను.” ఇలా అని ఆయన తవ్వే గునపం చేతిలోకి తీసుకున్నాడు. సాధువు మొహంలో సంతోషం కనిపించింది.

ఎంతసేపు ఇలా తవ్వినా సాధువు రాజు ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు, ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు తవ్వడమే గానీ. దాదాపు సాయంత్రం అవుతూంటే రాజు మళ్ళీ అడిగేడు సాధువుని, “మీరు మంచి జ్ఞానులని మా మంత్రి చెప్తే విని ఇలా మిమ్మల్ని నా సందేహాలు అడుగుదామని వచ్చాను. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే సరే, నేనేమీ అనుకోను. కానీ…”

సాధువు నోరు విప్పేలోపుల దూరంగా ఎవరో పరుగెడుతున్నట్టు చప్పుడైంది. “ఇటు వైపు ఎవరో వస్తున్నట్టున్నారే? చూద్దాం రా,” అంటూ అటువైపు నడిచేడు. రాజు అనుసరించేడు.

వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఒకాయన కడుపు చేత్తో పట్టుకుని వస్తున్నాడు. కడుపులో కత్తీ, కారే రక్తంతో భయానకంగా ఉంది పరిస్థితి. సాధువూ, రాజూ అతణ్ణి తీసుకెళ్ళి ఆశ్రమం లోపల గుడిసెలో పడుకోబెట్టేరు. రాజు గాయాన్ని శుభ్రం చేస్తూంటే, సాధువు పక్కనుంచి సహాయం చేశాడు చేతనైనంతలో. కాసేపటికి రక్తం కారడం తగ్గాక అతనికి తాగడానికి ఏదో ఇచ్చి పడుకోబెట్టారు. ఈ తతంగం అయ్యేసరికి బాగా చీకటి పడింది.

బాగా అలిసిపోయిన రాజు, సాధువు ఉంటున్న ఆశ్రమంలో ఏమి తింటున్నాడో చూసుకోకుండా ఉన్నదానితో కడుపు నింపుకుని, ఉత్తరక్షణంలో నిద్రలోకి జారిపోయేడు. ఇంతటి శరీర శ్రమ అలవాటులేని రాజుకి ఆ నిద్ర ఎంతగా పట్టిందంటే కళ్ళు తెరిచేసరికి మర్నాడు బారెడు పొద్దెక్కి ఉంది.

గాయం తగిలిన మనిషి రాజు లేవడం చూస్తూనే, లేచి వెంటనే చెప్పేడు చేతులు జోడించి, “మీరు నన్ను క్షమించాలి మహారాజా!”

రాజు అతనికేసి నిశితంగా చూసి అన్నాడు, “మీరెవరో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఎందుకు క్షమించడం?”

“నేనెవరో మీకు తెలియకపోవచ్చు. కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. మా అన్న చేసిన తప్పుకి అతన్ని ఉరి తీయించి ఆస్తి జప్తు చేసుకున్నారు మీరు. మిమ్మల్ని ఎప్పటికైనా చంపాలని నేను అనుకున్నాను. నిన్న ఒక్కరూ ఇలా బయల్దేరారని తెల్సిన వెంటనే నేను మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను – తోవలో చంపేయడానికి. కానీ వెనకాల వచ్చే మీ అనుచరుల్లో ఒకడు నన్ను గుర్తు పట్టి కడుపులో బాకు గుచ్చాడు. పారిపోయేను ఇటువైపుకు వాళ్ళకి కనబడకుండా అక్కడ్నుంచి. ఏదో పొదల్లోనో, తుప్పల్లోనో పడిపోయుంటే రక్తం కారిపోయి చచ్చిపోయి ఉండేవాణ్ణి. కానీ మీరు కనిపించి ఆశ్రమంలో గాయానికి కట్టు కట్టడం వల్ల బతికాను నిన్న రాత్రి. నేను మిమ్మల్ని చంపుదామనుకుంటే మీరు నన్ను చావకుండా రక్షించారు. అందుకే మిమ్మల్ని క్షమించమని ఆడిగేను,” అని చెప్పి తల దించుకున్నాడు ఆగంతకుడు.

రాజు మొహంలో ఒక్కసారి ఆశ్చర్యంతో కూడిన ఆనందం కనబడింది. మళ్ళీ అన్నీ కనుక్కుని న్యాయం జరిగేలా చూస్తానని ఆగంతకుడికి హామీ ఇచ్చేడు అక్కడికక్కడే. గుడిసెలోంచి బయటకొచ్చి సాధువుని చూసి చెప్పేడు రాజు, “మీరు సమాధానం చెప్తారేమో అని చూశాను నిన్నంతా. చూడబోతే మీకు తెలియదో, లేకపోతే చెప్పడం ఇష్టం లేదో. రాజ్యం మంత్రులకొదిలేసి నేనిక్కడ కూర్చోవడం కుదరదు కదా? అందుచేత శెలవు ఇప్పించండి. వెళ్ళాలి.”

సాధువు చెప్పేడు “నీకు అన్ని సమాధానాలూ నిన్ననే దొరికాయి కదా? ఇంకా చెప్పడానికేం ఉంది?”

“అవునా? అదెలా?” రాజు ఆశ్చర్యపోయేడు.

“నువ్వు నిన్న వచ్చినప్పుడు నేను పాదులు తవ్వుతున్నాను. నా మీద జాలిపడి గునపం తీసుకుని నువ్వు తవ్వడం మొదలు పెట్టావు. అలా జాలి పడకుండా నీ దారిన నువ్వు వెళ్ళినట్టైతే ఈ ఆగంతకుడు నీ మీద దాడి చేసి నిన్ను చంపి ఉండేవాడు. అప్పుడు నాతో ఉండకుండా వెళ్ళిపోయినందుకు నీకు చెడు జరిగి ఉండేది. అందువల్ల అప్పుడు నీకు అన్నింటికన్నా ముఖ్యమైన మనిషిని నేను. ముఖ్యమైన సమయం పాదులు తవ్వే సమయం. ముఖ్యమైన పని నాకు పాదులు తవ్వడంలో సహాయం చేయడం.

ఆ తర్వాత ఈ ఆగంతకుడు వచ్చినప్పుడు ముఖ్యమైన పని ఆగంతకుడి గాయానికి కట్టుకట్టడం. ముఖ్యమైన మనిషి ఆగంతకుడే. సరైన సమయం ఆగంతకుడికి సహాయం చేస్తూ మంచి చేసే సమయం. ఇవన్నీ చూస్తే తెలుస్తోందిగా? అన్నింటికన్నా ముఖ్యమైన సమయం ఇప్పుడే. ఎందుకంటే భూత, భవిష్యత్ వర్తమానాల్లో ఈ ప్రస్తుత సమయంలోనే మనకి ఏ పని అయినా చేయగలిగే అధికారం, స్తోమతా ఉన్నది. అందరికన్నా ముఖ్యమైన మనుషులు – ఆ సమయంలో నీ కూడా ఎవరు ఉంటే వాళ్ళే. ఎందుకంటే జీవితంలో ఎవరికి ఎవరితో సంబంధాలు ఉంటాయో, అవి ఎప్పుడు ఎలా ఉంటాయో, ముందు ముందు అసలు ఉంటాయో పోతాయో మనకి తెలియదు కనక. అన్నింటికన్నా ముఖ్యమైన పని ఈ సమయంలో నీతో ఉన్నవాళ్ళకి మంచి చేయడం. ఆ మంచి చేయడం కోసమే భగవంతుడు మనిషిని సృష్టించాడు.”

సాధువు సమాధానాలకి తృప్తి పడ్డట్టూ తలాడించి ఆశ్రమంలోంచి బయటకి నడిచేడు రాజు.

(మూలం: Three questions – Leo Tolstoy)

కోనసీమ కథలు: న్యాయవాదం! (రచన: సాయి బ్రహ్మానందం గొర్తి.....సేకరణ )

కోనసీమ కథలు: న్యాయవాదం!

(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి.....సేకరణ ).

ఉదయం పెందరాళే భోజనం చేసి కోర్టుకి వెళదామనుకుంటూండగా ‘ఒక్కసారి పెరట్లోకి రండీ’ అంది నా భార్య సులోచన. ఎందుకని ప్రశ్నించకుండానే వెళ్ళాను. కోర్టుకి టైమవుతోంది.

పెరట్లోకి వెళ్ళగానే అక్కడ కారునలుపులో ఉన్న ఒక ముసలావిడ కనిపించింది. బాగా ఏడిచినట్టుందేమో కళ్ళన్నీ ఉబ్బినట్లున్నాయి. ముడతలుపడ్డ మొహంలో కంటికింద చారికలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందెక్కడో చూసినట్లుగా వుంది. వేంటనే గుర్తుకు రాలేదు.

నన్ను చూడగానే ఏడవడం మొదలుపెట్టింది. నాకేం అర్థం కాలేదు. ఇది చూసి సులోచనే చెప్పింది. “ఈవిడ మన మన రైతు పనసయ్య అక్కట. సత్తిరాజు గారి కేసు విషయమై మాట్లాడాలని వచ్చింది.” విషయం ఏమిటని అడిగాను.

“అయ్యా సత్తిరాజుగారన్యాయంగా మా మీద కేసు బనాయించారయ్యా. సత్తె పెమాణంగా ఆ పొలం మాదేనయ్యా. మేమెవరిదీ కబ్జా చెయ్య లేదయ్యా. ఎలాగయినా మీరే చూడాల. ఈ పొలం కూడా పొతే కుటుంబం రోడ్డెక్కుతుందయ్యా.” ఆమె ఏడుస్తూ చెప్పింది.

ఆమె ఎందుకొచ్చిందో అర్థమయ్యింది.

ఇవాళ రవణం సత్తిరాజు కేసుంది. ఈరోజే ఫైనల్ జడ్జిమెంటు. ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడింది. సాధారణంగా చిన్న చిన్న సివిల్ కేసులు నేను తీసుకోను. నా దగ్గరున్న అప్రెంటిస్ లాయర్లు చూసుకుంటారు.

“సూర్యం! ఈ కేసు మీ పిల్లాళ్ళ చేతిలో పెట్టకుండా నువ్వే వాదించు. ఇప్పటికే నాలుగేళ్ళగా నలిగిపోతోంది. ఇది మాట్లాడదామనే వచ్చాను.” అంటూ వారం క్రితం బార్ అసోషియేషన్ క్లబ్బుకి సత్తిరాజొచ్చి ప్రాధేయపడ్డాడు.

సత్తిరాజుకి పాలగుమ్మి దగ్గర అక్షరాలా నలభై ఎనిమిది ఎకరాల పొలముంది. ఆ పొలాల పక్కనే ఆ ముసలావిడ పొలం కూడా వుంది. ఆ రెండెకరాలూ జత చేస్తే ఏభైకి చేర్చచ్చనీ సత్తిరాజు ఆశ. వీళ్ళ ముత్తాతలు ఈ పొలం కౌలు చేసారు తప్ప, ఈ పొలం వీళ్ళది కాదనీ, దాన్ని ఆక్రమించుకున్నారనీ సత్తిరాజు కోర్టులో కేసుపెట్టాడు. ముందు మధ్యవర్తుల చేత అమ్మమని చెప్పించాడు. అది ఫలించక కోర్టుకెక్కాడు. ఈ ముసలావిడ తరపున ఈ కేసుని లాయరు ప్రకాశరావు చేపట్టాడు. సత్తిరాజు ప్రకాశరావునీ కొనేసాడు. ఎలాగయినా గెలవాలనీ పంతం కొద్దీ నన్నే రంగంలోకి దింపాడు.

సత్తిరాజు కోనసీమలో పెద్ద పేరుమోసిన వ్యక్తి. అయినా ఎందుకు ఈ రెండెకరాల మీద ఇంత పంతంగా ఉన్నాడో అర్థం కాలేదు. విరివిగా పెరిగిన సంపద ధిక్కారాన్ని సహించదు, అదెంత చిన్నదయినా! సత్తిరాజూ, నేనూ ఒకే బళ్ళో కలిసి చదువుకున్నాం. వాడు బి.ఏ అయిదుసార్లు దండయాత్ర చేస్తే, ఈలోగా నేను బీ.ఎల్లూ, ఎం.ఎల్లూ పూర్తి చేసాను. వాడు రాజకీయాలకి అంకితమయితే, నేను అమలాపురం కోర్టులో సివిల్ ప్లీడరుగా సెటిలయ్యాను.

సత్తిరాజు కేసని చెప్పగానే ఈవిణ్ణి ఎక్కడ చూసానో గుర్తొచ్చింది. ఏడాది క్రితం కేసు విచారణ సమయంలో ఎలాగయినా సత్తిరాజుకి నచ్చచెప్పమని, కాళ్ళట్టుకుని అమలాపురం కోర్టులో నన్ను ప్రాధేయపడడం చటుక్కున మెదిలింది. అప్పుడు నేనే నిర్దాక్షిణ్యంగా పట్టించుకోలేదు. నాకు సత్తిరాజుతో స్నేహం ముఖ్యం. అతను చెల్లించే ఫీజు మరీ ముఖ్యం.

“చూడమ్మా! నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. పైగా ఈ కేసులో సత్తిరాజు వైపు బలమయిన సాక్ష్యాధారాలున్నాయి. ఇప్పుడు నేను చేసేదేమీ లేదు. నీకు వ్యతిరేకంగా నేను వాదిస్తున్నాను. కాబట్టి నా క్లయింటు తరపునే నేను వాదించాలి.” నా అశక్తత చెప్పాను.

నా మాట విని ఆమెలో దుఃఖం పెల్లుబికింది. మాట లేదు. నా కేసి దీనంగా చూసింది.

“మీరే ఏదోకటి చేసి ఆమెకు సాయం చెయ్యండి. పాపం గంపెడు సంసారమట. అందరూ వీధిన పడిపోతారని ఏడుస్తోంది. ప్లీజ్! మీరు తలుచుకుంటే చెయ్యగలరు.” ఈసారి సులోచన బ్రతిమాలింది.

గతంలో ఎన్నో క్లిష్టమయిన కేసులు నేను గెలిచానని సులోచనకి తెలుసు. సులోచన ఎవర్నీ నాకు సిఫార్సు చెయ్యదు. ఎందుకింతగా చెబుతోందంటే ఆమె చెప్పింది నమ్మే ఉంటుంది. అయినా ఆ ముసలామె కొడుకు వద్ద ఆధారాలేమీ లేవు. నిన్ననే ఆ పొలం తాలూకు దస్తావేజులన్నీ సత్తిరాజు నాకు పంపించాడు. అవి చూసాకే సత్తిరాజు ఈ కేసు గెలవడం ఖాయం అని చెప్పాను.

“పోనీ నీ దగ్గర పొలం తాలూకు దస్తావేజులేమయినా వున్నాయా?” అని అడిగాను. అవన్నీ వాళ్ళ లాయరు ప్రకాశరావుకి చాలా ఏళ్ళ క్రితమే ఇచ్చారనీ చెప్పిందామె. ప్రకాశరావు దగ్గర అసలు కాయితాలు సత్తిరాజు డబ్బుకి కొనేసాడని అర్థమయ్యింది. అసలు దస్తావేజులు తన దగ్గరుంచుకొని, రెవెన్యూ ఆఫీసరుకి లంచమిచ్చి నకీలివి పుట్టించాడని ఇప్పుడు మరింతగా అర్థమయ్యింది.

“చెప్పాను కదమ్మా! నేనేమీ చెయ్యలేను. నీకో విషయం తెలుసా! మీ లాయరు పైకి నీ వైపున్నాడు కానీ, ఆయనా నీకు వ్యతిరేకంగానే పనిజేస్తున్నాడు. ఇప్పుడు చాలా కష్టం.” నా మాటలు విని ఆమె లోలోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. చూసి నాకూ పాపం అనిపించింది. నే చెప్పాల్సింది చెప్పి లోపలకెళుతూండగా సులోచన నా దగ్గర కొచ్చింది.

“ప్లీజ్! ఆమెకు న్యాయం దక్కేలా చూడండి… ఈ ఒక్కసారికీ!”

జాలితోనూ, దయతోనూ కోర్టు తీర్పులు నడవ్వు. తెల్ల కాయితమ్మీద నల్ల సాక్ష్యాలే దానికి ప్రమాణం.

సులోచనకి వెళ్ళొస్తానని చెప్పి గబ గబా బయటకొచ్చేసాను. నాకోసం నా అసిస్టెంట్లు ఎదురుచూస్తున్నారు. వెనక సీట్లో నేనూ మా గుమాస్తా కూరుచున్నాం. నాదగ్గరున్న అసిస్టెంటు లాయరు ముందు కూర్చున్నాడు. పొలం తాలూకు ఒరిజినల్ దస్తావేజులు చూపించమనీ అడిగాను. నా అసిస్టెంటు చేతికిచ్చాడు. అవన్నీ పరిశీలనగా చూస్తూండగా మధ్య పేజీల్లో సంతకాల వద్ద నిలిచి పోయింది దృష్టి.

ఇవాళ ఈ కేసు హేండిల్ చేసే జడ్జెవరనీ అడిగాను. జడ్జి కుటుంబరావని చెప్పాడు మా అసిస్టెంటు. గతంలో ఈ కుటుంబరావునీ కొనేద్దామని సత్తిరాజు ప్రయత్నించాడు. సదరు జడ్జిగారు సత్తెకాలపు వ్యవహారం. ఛీ పొమ్మన్నాడు. దాంతో సత్తిరాజుకి ముసలమ్మ మీద కన్నా ఈ జడ్జిగారినెలాగయినా ఓడించాలనీ కసీ, పట్టుదల పెరిగాయి. అది మా ఇనప్పెట్టెలో డబ్బు జల్లింది.

కోర్టులో కేసు ఉన్న ఆధారాలు తీసుకొని వాదించాను నేను. మా దగ్గరున్న సాక్ష్యాలూ జడ్జి ముందుంచాను. ప్రకాశరావు ఏ మాత్రం ప్రతివాదన చెయ్యలేదు. నేను వాదిస్తున్నంత సేపూ దూరంగా బల్లమీద కూర్చుని ముసలమ్మ కుటుంబం భయంగా చూస్తున్నారు. వాదిస్తున్నంత సేపూ ఆ ముసలమ్మ మొహంలోకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూళ్ళేకపోయాను. జడ్జి మా వాదనలన్నీ విని తీర్పిచ్చాడు. రవణం సత్తిరాజు కేసు ఓడిపోయాడు. సత్తిరాజు నోట మాటలేదు. ఆ ముసలమ్మదే పొలమనీ తీర్పిచ్చాడు జడ్జి. అది విని ఆ ముసలమ్మ కళ్ళల్లో కాంతిని మాత్రం స్పష్టంగా చూడగలిగాను.

బయటకొచ్చాక సత్తిరాజు నెత్తీ నోరూ బాదుకుంటూ “ఏంది సూర్యం! ఈ కేసిలా చచ్చింది. ఆధారాలిచ్చాను కదరా! ఆఖరికా ప్రకాశరావుకీ పాతికవేలిచ్చాను. పరువు పోయింది కదయ్యా!” అంటూ ఏడ్చాడు.

“నన్నేం చెయ్యమంటావు? నువ్విచ్చిన సాక్ష్యాలే చూపించాను. అయినా దస్తావేజులు కొత్తవి చేయించేటప్పుడు కాస్త చూసుకోవద్దా? ఎవడయ్యా ఆ గుమాస్తా నీకీ పత్రాలిచ్చిందీ? అన్నీ తప్పులూ తడకలతో రాసి చచ్చాడు. పొలం దస్తావేజుల మధ్య సంతకాల పక్కన బుద్ధున్న వాడెవడూ క్రితం ఏడాది డేటెయ్యాడు. పాతికేళ్ళ క్రితం పొలానికి ఏడాది క్రిందట డేటేసిచ్చాడు. ఆ ఆధారంగానే ఆ జడ్జి వాళ్ళ వైపు తీర్పిచ్చాడు.” నాకేమీ తెలియనట్లే అన్నాను.

“ఇవాళ కేసు ఓడిపోయారట కదా? గుమాస్తా గారు చెప్పారు. ఎంత ఆనందం వేసిందో? నా మాట విని మీరా ముసలమ్మని గెలిపించారా?” ఆ సాయంత్రం ఇంటికొచ్చాక సులోచన సంతోషంతో అంది.

సాధారణంగా నేను కేసు చేపడితే గెలవకపోవడం అంటూ వుండదు. తిమ్మిని బమ్మి చేసయినా గెలుస్తాను. న్యాయవాదం నాకు వృత్తి కాదు. వ్యాపారం. ఓడినందుకు మా అసిస్టెంట్లు ఏడ్చినంత పని చేసారు. ఇదంతా మామూలేనని వాళ్ళని సముదాయించాను.

“నేను గెలిపించడమేవిటి? ఎవరైనా వింటే పీకట్టుకుంటారు. ఆధారాలు బట్టే జడ్జిమెంటుంటుంది.”

“కోర్టుకెళుతూ ఆమె వైపు ఒక్క ఆధారమూ లేవన్నారు. ఎలా గెలిచిందట మరి?” సులోచనకి నా మాట నమ్మబుద్ధి కాలేదు.

సత్తిరాజు నకిలీ దస్తావేజులు పుట్టించాడానీ, పాతికేళ్ళ క్రితం నాటి వాటిలో పొరపాటున ఏడాది క్రితం డేటు వేసారనీ, అదే ఆధారంగా అవి నకిలీ పత్రాలనీ జడ్జి నిర్ధారించారనీ చెప్పాను. పాతిక పేజీల దస్తావేజులో ఆ జడ్జెలా కనిపెట్టాడన్న ధర్మసందేహమొచ్చింది సులోచనకి.

“ఆధారాలు ఇచ్చేటప్పుడు నేనే కావాలని ఆ పేజీ మడత పెట్టి ఆ తేదీ చూసేలా ఇచ్చాను. కారులో కోర్టుకెళుతూండగా దార్లోనే గమనించానది. అయినా నువ్వు ఆర్డరు వేసావు కదా. తప్పుతుందా మరి.” నా మేధస్సుకి తెగ సంబరపడిపోయింది సులోచన.

“తెలీకడుగుతాను. ఇన్నేళ్ళూ నే గెలిచిన కేసులన్నీ న్యాయంగానే గెలిచానంటావా?”

“ఆ! మీరలాగే అంటారు. మీరు న్యాయంగానే వాదిస్తారు లెండి. ఏదో నన్ను మభ్య పెట్టడానికిలా అంటారంతే!” సులోచనకి నా మీద కంటే నా నడవడిక మీదే నమ్మకమెక్కువ.

“పిచ్చిదానా! ఈ న్యాయాలూ, ధర్మాలూ ఇవన్నీ మనకు మనం రాసుకున్నాం. ఇన్నేళ్ళుగా చూసి చూసి వాటినెలా మనకనుగుణంగా మార్చుకోవాలో తెలుసుకున్నాను. నీకు తెలుసో తెలీదో సగానికిపైగా కేసులు న్యాయశాస్త్రంలో లొసుగులు ఆధారంగానే గెలుస్తాము తప్ప, న్యాయంగా కాదు.”

“వాదనకేం తక్కువలేదు. మీరెన్ని చెప్పండి. ఆ ముసలమ్మ వైపు ధర్మమూ, న్యాయమూ ఉంది కాబట్టే ఆమె గెలిచింది. మీరేం చెప్పినా నేను వినను.” అంటూ నన్నూ, నా మాటల్నీ కొట్టి పారేసింది. మమకారం కళ్ళకి తప్పులన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి. సులోచన ఆనందంగా ఉంది కదాని నేనూ రెట్టించలేదు.

నెల్లాళ్ళ తరువాత సులోచన ఓ దుర్వార్త మోసుకొచ్చింది.

“ఏవండీ! ఇది విన్నారా? రావులపాలెం పెళ్ళికి వెళ్ళొస్తూ, ట్రాక్టరు బోల్తా కొట్టి ఆ ముసలమ్మ కుటుంబం మొత్తం చనిపోయారట. వాళ్ళు చచ్చి పోలేదండీ. ఆ సత్తిరాజే చంపించాడనీ అందరూ అనుకుంటున్నారు. నాకూ సత్తిరాజు మీదే అనుమానంగా వుంది. వాడు ఎంతకయినా తెగిస్తాడని అందరూ అంటారు. వాడో రాక్షసుడు. ఈ ఉసురు వాడికీ, వాడి కుటుంబానికీ తగలక మానదు.” ఆవేశంగా అంది.

“గట్టిగా శపించకు. ఆ పాపంలో నీకూ, నాకూ భాగముంది.” అర్థం కానట్లు నాకేసి చూసింది.

“నేను ఆ కేసులో లొసుగు జడ్జీకి చూపించకపోతే సత్తిరాజు కేసు గెలిచుండేవాడు. వీళ్ళూ కష్టమో, నష్టమో బ్రతికుండేవారు. నువ్వు మరీ మరీ చెప్పావనీ ఆ ముసలమ్మని గెలిపించాను. చూసావా ఏమయ్యిందో? సత్తిరాజు ఓడి బ్రతికాడు. ఆ ముసలమ్మ కుటుంబం గెలిచి సమాధయ్యింది.”

నేనిలా అంటానని సులోచన ఊహించలేదు. ముసలమ్మ కుటుంబం మరణించిందన్న విషయంకన్నా, తనకీ ఉసురు తగులుతుందన్న భయం వల్లనేమో తెలీదు – వెక్కి వెక్కి ఏడ్చింది.

కళ్ళు మూసుకుంటే కేసు గెలిచాక కోర్టు బెంచీ మీద కళ్ళల్లో కృతజ్ఞత నింపుకున్న ఆ ముసలమ్మే మెదిలింది – పాపం!

(పంతొమ్మిదివందల డెబ్భై కాలంలో కోనసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా – ఈ కోనసీమ కథలు.

Friday, August 25, 2017

స్వయంభూ.. వినాయకుడు.. చోడవరం...విశాక.! -

స్వయంభూ.. వినాయకుడు.. చోడవరం...విశాక.!
-
చోడవరంమా అత్త గారి ఊరు-
చోడవరం లో ని వినాయకుని గుడి చాలా ప్రసిద్దమైనది.
ఈ విగ్రహం మానవ నిర్మితమైనధి కాధు.
ఈ విగ్రహం స్వయంభూ వినాయకుడు.-
.
విశాఖజిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, విఘ్నేశ్వరాలయాల్లో ఆలయ మూర్తులు స్వయంభువులు. వీటికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. విశాఖజిల్లాలో ఈ రెండు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ వుంటారు. చోడవరానికి తూర్పు ముఖంలో వున్న ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో గర్భగుడి ద్వారంపైనా తలపైభాగంలో చేప చిహ్నాలు ఉండడంతో దీనిని మత్స్యగణపతిగా పేర్కొంటారు.
.
ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభూ విఘ్నేశ్వరాలయాలు ఉన్న క్షేత్రాలు రెండే రెండు. ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉండగా రెండవది విశాఖ జిల్లా చోడవరంలో ఉంది.
చాలా కాలం క్రితం అక్కడబావి తవ్వటానికి తవ్వుటలో వినాయక విగ్రహం బయటపడింది. వినాయకుని తొండం భూగర్భం ద్వారా ఊరు చివర వున్న చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉంటుంది. దాని తొండము చివర ఎవరు కనుక్కోలేకపోయారు.
--వినాయకుని తొండము చివర తెలుసుకోటానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు.
.
సుమారు 200 సంవత్సరాల నుంచి స్వయంభూ విఘ్నేశ్వరుని దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడి విఘ్నేశ్వరుని విగ్రహము నడుము పై భాగము మాత్రమే దర్శనమిస్తుంది
. తొండం చివరి భాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి.
అక్కడ భక్తి తో ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రజల నమ్మకం. ఆక్కడ వినాయకుని కార్యసిద్ది వినాయకునిగా ప్రజలు కొలుస్తారు

Thursday, August 24, 2017

కవుల రైలు-రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్

తిలక్ కథలు!- - - -(సేకరణ)

కవుల రైలు-రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్

-

తెలుగుదేశం కవులతో నిండి మూడవతరగతి రైలు పెట్టె లాగ క్రిక్కిరిసిపోయింది. “ఇంక జాగా లేదు” అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టిక్కెట్లు కొనుక్కొని కొత్త కవులు తోసుకు లోపలి కెగబడుతున్నారు. కొందరు ఫుట్‌బోర్డుల మీద నిలబడీ, కొందరు కమ్మీలు పట్టుకుని వేలాడుతున్నారు.

-

ఒకావిడ మేలిముసుగు వేసుకుని వచ్చింది. సుతారంగా అందంగా వుంది. కళ్ళల్లో అపూర్వమైన వెలుగు. ఎర్రని పెదవుల్లో తియ్యని సిగ్గు వొంపులు. వెన్నెలనీ, ఉషఃకాంతినీ, మల్లెపువ్వుల్నీ, మంచిగంధాన్నీ, రత్నాలనీ కలబోసి మనమీద జల్లినట్లు అనిపిస్తుంది ఆవిడను చూస్తే.. అక్కడ దగ్గరలో నిలుచుంటే…

-

ఆవిడ నిస్పృహగా చూసింది రైలుపెట్టె కేసి. లోపలి బొగ్గు పులుసు గాలీ, చుట్టపొగా వాగుడూ కలసి పెట్టెలోంచి బయటకి దుర్భరంగా వ్యాపిస్తున్నాయి.

-

“ఇక్కడ చోటులేదు దయచేయవమ్మా. నువ్వు కూడానా మా ఖర్మ” వగలొలకబోసుకుంటూ అన్నాడొక చుట్ట ఆసామీ కాండ్రించి ఉమ్మివేస్తూ. ఆయన కవి శార్దూల బిరుదాంకితుడు. అప్పకవీయం అడ్డంగా బట్టీ వేశాడు.

-

“నో ప్లేస్ మేడం వెరీసారీ” అంటూ కన్ను గీటాడొక నవయువకుడు గాగుల్సు తీసి, సెకండ్‌హాండ్ బీడీ నోట్లో ఉంచుకునే.

-

కొందరు వెకిలిగా నవ్వారు. కొందరు దగ్గారు. మరికొందరు ఈలలు వేశారు. పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్ళిపోయింది. రైలు కదిలిపోయింది. స్టేషన్‌మేష్టర్ వచ్చి ఆమెను చూచి “పాపం చోటు లేదా అమ్మా, నీ పేరు?” అని అడిగాడు.

“కవిత” అందా సుందరి.

=

కవుల రైలు గమ్యం తెలీకుండా వడివడిగా వెళ్ళిపోతోంది.

సీత రాముడి కంటే వయసులో పెద్దదా ?? -

సీత రాముడి కంటే వయసులో పెద్దదా ??

-

ఎందుకో – సీతాదేవి శ్రీరాముడికన్నా వయసులో పెద్దది అనే ప్రచారం వ్యాప్తిలో ఉంది. ఈ అంశంపై ఇప్పటికి ఎక్కడో ఒక చోట చర్చ నడుస్తూ ఉంటుంది.

ముఖ్యంగా వధువు వయసు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఏదో విధంగా పెళ్లి చేయాలనే లక్ష్యంతో సీత కూడా రాముని కంటే వయసులో పెద్దది .. ఆయన చేసుకోగా లేనిది నువ్వు చేసుకుంటే తప్పు ఏమిటి అని వరుడికి నచ్చచెప్పే యత్నాల్లో ఈ వయసు ప్రస్థావన వస్తోంది . ఇంతకు మించి మరోకారణం ఉండకపోవచ్చు. 

.

కొన్ని కథల్లో కూడా సీతారాముల వయసులో కొంచెం తేడాలున్నాయి కానీ రామునికంటే సీత పెద్దది అన్నట్టు ఎక్కడ కనిపించదు. వాల్మీకి రామాయణంలో ఈ విషయం గురించి, ఒక సందర్భంలో తేటతెల్లంగా వివరాలు దొరుకుతాయి.

.

అరణ్యకాండ 47వ సర్గ. యతి వేషంలో రావణాసురుడు సీతాదేవి వద్దకు వచ్చినప్పటి సందర్భం . తానెవరని యతి వేసిన ప్రశ్నకు సమాధానంగా తన వివరాలు చెబుతుంది సీత. 

ఆ సర్గలో పదవ శ్లోకం…

.

"మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః |

అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||

.

అర్థం: మిగులు పరాక్రమశాలియగు నా భర్త యొక్క అప్పటి* వయస్సు ఇరువదిఐదు సంవత్సరములు.

నా వయస్సు పదునెనిమిది సంవత్సరములు.

.

‘అప్పటి’ – అంటే తాము అరణ్యవాసానికి బయలుదేరినప్పటి వయసును సీత తెలిపారు.

శ్రీరాముడు సీతకన్నా వయసులో ఏడేళ్ళు పెద్ద వాడు. ఇందులో అనుమానమే లేదు. వనవాసంలో పదునాల్గవ సంవత్సరం మొదలుకావస్తున్నందున, యుద్ధం జరిగినప్పటికి వారి వయసును లెక్క కట్టవచ్చు. రామరావణ యుద్ధం జరిగినపుడు శ్రీరామునికి 39వ సంవత్సరం నడుస్తుంటే, సీతాదేవికి 32 నడుస్తున్నాయి అంటున్నారు పండితులు

Wednesday, August 23, 2017

బాల త్రిపుర సుందరి !

బాల త్రిపుర సుందరి !

.

త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం.

.

త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. 

సాక్ష్యాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావు షోడసి అని వ్యవహరిస్తారు. 

.

త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో

ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.

* స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది.

* సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.

* పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది.

శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.

* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి

* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి

* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి

ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే

లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. 

.

త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. స్వామి వారు కొండ ఎగువన ఉంటారు. అమ్మ వారు కొండ దిగువ భాగాన ఉండి భక్తులను కటాక్షిస్తారు…అమ్మ వారు చిదగ్ని గుండం నుండి ఆవిర్భవించారు.జపమాల పుస్తకాన్ని ధరించి శ్వేతకమలాన్ని అధిష్టించి అమ్మవారు చిన్న రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించినంతనే దేవీ ఉపాసన సిద్ధి లభిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా, ప్రకృతి అందాలకు నెలవుగా మారిన ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది…

.

శివుడు కొలువు దీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన మహా శైవ ధామం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది.అమ్మ వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం,మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూ చక్రపీఠము గుండా క్రిందకు జారి పాతాళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.

.

స్వామి వారు శ్రీ చక్ర ఆకార నిర్మిత ఆలయంలో దర్శనమిస్తారు.ఆకాశం నుండి చూస్తే శ్రీ చక్ర ఆకారం స్పష్టంగా కనబడుతుంది.ఈ పుణ్య క్షేత్ర అభివృద్ధికి చోళ,రాష్ట్ర కూట,విజయనగర సామ్రాజ్య దీశులు విశిష్ట కృషి చేశారు. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. కాశీ, ఉజ్జయిని తరువాత అమ్మవారికి ఇష్టమైన కదంబ వృక్షాలు ఉన్న ఆలయం. ఈ కదంబ వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనపడవు. 

.

నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి.కానీ అది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దూలములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు

-మంచి ఆలోచన--రేపటి వార్తలు ఈ రోజు !

-మంచి ఆలోచన--రేపటి వార్తలు ఈ రోజు !


.

-ఒక జూదరి తన ఆస్తి అంత గుఱ్ఱం పందేలలో వొడి పోతాడు.

.

తన ఇల్లు ఆఖరి తాకేట్టు పెట్టి -ఆఖరి దావు అంటో,

-మల్లి బయలు దేరు తాడు.

.

దారిలో ఒక పేపర్ కుర్ర వాడు పేపర్ ఇస్తాడు,

- అది రేపటి పేపరు.

-తప్పు డేట్ అని బయటకు విసిరేస్తాడు. 

-రోడ్ మీదపేపర్ పడే కూడదు అని ట్రఫిక్ పొలిసు ఆయనకి తిరిగి తీసి ఇస్తాడు.

- సర్లే అని అయన చూద్దాం అని నవ్వుకొంటూ పేపరు చూస్తాడు.

-దానిలో ఆ రోజు జరిగే రేస్ లో గెలిచే గుఱ్ఱాలు పేర్లు చూసి సరదాగా ఆడి 

బాగా డబ్బు చేసుకుంటాడు...

-తన పోయిన ఆస్థి కు రెండితలు డబ్బు చేసుకుంటాడు .

-అప్పుడు సంతోషంగా మల్లి పేపర్ చూస్తే

-అందులో తన పేరు ఉంటోంది..

.

-గుఱ్ఱం పందేలలో బాగా డబ్బు చేసుకొని గుండె ఆగి చనిపోయాడు

-అని మరణ వార్త..

-అంతే ... అక్కడకి అక్కడే మరణిస్తాడు..

.

-ఇది ఒక బెంగాలీ కధ..

Tuesday, August 22, 2017

కరుణశ్రీ - విశ్వ ప్రేమ !

కరుణశ్రీ - విశ్వ ప్రేమ !

(కరుణశ్రీ - శ్రీజంధ్యాల పాపయ్య శాస్త్రి .) 

-

సీ. 

ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర 

మిరుసు లేకుండనే తిరుగుచుండు 

ఏ ప్రేమమహిమచే నెల్ల నక్షత్రాలు 

నేల రాలక మింట నిలిచియుండు 

ఏ ప్రేమమహిమచే పృథివిపై బడకుండ 

కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును 

ఏ ప్రేమమహిమచే నీ రేడు భువనాల 

గాలిదేవుడు సురటీలు విసరు

గీ. 

ఆ మహాప్రేమ - శాశ్వతమైన ప్రేమ - 

అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ - 

నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల 

ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము !

భర్తృహరి నీతి శతకము .

భర్తృహరి నీతి శతకము .

.

-శ్లోకము

దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, సాఠ్యం సదా దుర్జనే ।

ప్రీతిః సాధుజనేనయోః నృపజనే, విద్వజ్జనేచార్జవం ।

శౌర్యం శతృజనే, క్షమా గురు జనే, నారీజనే ధృష్టతా ।

యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ।। 

.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి యొక్క తెలుగు సేత....

చంపకమాల -

"వరకృప భృత్యులందు నిజసర్గమునందనుకూల వృత్తి కా

పురుషులయందు శాఠ్యము సుబుద్ధులయం దనురక్తి దాల్మి స

ద్గురువులయందు శౌర్యము మృగాక్షులయందు బ్రగల్భభావ మీ

వరుస కళాప్రవీణులగు వారలయందు వసించు లోకముల్!

.

భావం-

బంధువుల యెడ దాక్షిణ్యముతోనుండుటయు, 

అనగా వారి యిష్టానుసారము నడచుకోనుటయు, 

సేవకుల యెడ దయతోనుండుటయు,

దుర్జనుల యందు కఠినముగా వ్యవహరించుటయు, సజ్జనులయందు ప్రీతి పాత్రమై మెలగుటయు, 

రాజులయందు – అనగా నేటి రాజకీయ నేపథ్యములో రాజకీయ నాయకులయందు నీతితో వారికి అనుగుణముగా వ్యవహరించుటయు, 

విద్వాంసులయందు క్రమ ప్రవర్తనము లేదా ఋజు ప్రవర్తనము కలిగియుండుటయు, శత్రువులయందు పరాక్రమమును, పెద్దలయందు ఓర్పును, స్త్రీల యందు దిట్టతనూ అనగా ధృఢచిత్తము కలవారుగానూ యే పురుషులు కనపఱుతురో అట్టివారలే లోకస్థితికి, లోక మర్యాదకి, లోకము యొక్క అస్తిత్వానికీ కారణభూతులు.

నందో రాజా భవిష్యతి ' !


నందో రాజా భవిష్యతి ' అంటే ?

(సేకరణ)

.

చాలామంది ఈ శ్లోక పాదాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఏ సందర్భం లో ఉపయోగించాలో, అసలు ఈ శ్లోకం ఎలా పుట్టిందో, దాని అర్ధం ఏమిటో, పూర్తి శ్లోకం ఏమిటో ఇప్పుడు వారికి కూడా తెలియక పోవచ్చు.

ఇదొక పురాణ కథ.

.

ఉత్తుంగ భుజుడు అనే రాజుకు నందుడు అనే కొడుకు ఉన్నాడు. అయితే, యితడు పుట్టిన తరువాత రాజు గారు కామావేశుడై, మరొక అందమైన వేశ్యను తెచ్చుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. భార్యా కొడుకు ను నిర్లక్ష్యం చేసాడు. వీరికి కనీసం డబ్బు, ఆహారం కూడా అందించకుండా నిరంతరం వేశ్య తోనే కాలం గడుపుతూ, ఆమెకు బోలెడంత ధనం ఇస్తున్నాడు.

రాజుగారి భార్య, కొడుకు చేతిలో చిల్లిగవ్వ లేక పేదవారుగా రాజమందిరం లోనే గడుపుతున్నారు. ఒకరోజు ఒక నగల వర్తకుడు మేలిమి ముత్యాల నగలు అమ్ముతూ రాజమందిరానికి వచ్చాడు. ఈమె ఆ నగలవంక ఆశగా చూసింది. కానీ కొనడానికి డబ్బు లేదు. ఆ విషయం గ్రహించి ఆమె పనిమనిషి ఒక సలహా ఇచ్చింది. అప్పటి భాష సంస్కృతం కాబట్టి ఆమె సలహా సంస్కృతం లో ఇచ్చింది.

"ఉత్తుంగ భుజనా శోవా

దేశకాల గతోపివా 

వేశ్యా వణి గ్వినా శోవా

నందో రాజా భవిష్యతి"

దీని అర్ధం ఏమిటంటే;;;;

"మహారాణీ, ముందు ఆ హారం కొనుక్కోండి. నెల రోజులు ఆగి డబ్బు పుచ్చుకోమని వర్తకుడికి చెప్పండి. తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు. ఈలోగా రాజు చనిపోవచ్చు. లేదా వర్తకుడు చనిపోవచ్చు.. మన నందుడు మహారాజు కావచ్చు...ఏమి చెప్పగలము?" అని.

ఆ తరువాత ఏమైంది అనేది ఇక్కడ అప్రస్తుతం.

***

పై కథ ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటి?

సంపాదన నెలకు ఇరవై వేలు కూడా ఉండదు. అయినా సరే పదివేలు పెట్టి త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుంటారు. అప్పులు చేసి కార్లు కొంటారు. పెద్ద పెద్ద హోటల్స్ కు వెళ్తుంటారు. ఎందుకు? వీరికి భవిష్యత్తు మీద గొప్ప ఊహాగానాలు ఉంటాయి. టీవీల్లో, పేపర్స్ లో వారఫలాలు చూసుకుంటూ, ఈ వారం ధన సిద్ధి అని చెప్తే, నిజంగానే ఈ వారం లో డబ్బు వస్తుందేమో అని ముందుగానే అప్పులు చేసి అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. కారు కొందాం అని భార్య అంటుంది. మన ఆదాయానికి కారు వద్దు అంటాడు మగడు. "ఏమో? ఎవరు చూసారు? రేపు మీకు ప్రమోషన్ రావచ్చు, జీతం పెరగొచ్చు, అప్పుడు ఈ అప్పు చిటికె లో తీర్చొచ్చు. అయినా అనుభవించడానికి మనకు యోగం ఉండాలి కదా" అని మూతి విరుస్తుంది ఇల్లాలు. అప్పుడు అతడు "నందో రాజా భవిష్యతి" అనుకుంటూ కారు కొంటాడు.

ఒకవేళ మనం వెనుకాడినా, మన బంధువులు, స్నేహితులు మనలను రెచ్చగొడతారు. రేపు అప్పులపాలై, కోర్టుకు వెళ్తే, ఒక్కరు కూడా మనకు ఆసరాగా రారు. కనుక బుధజనులు ఈ సత్యాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలు ఒలకపోసుకోకుండా అప్రమత్తులై ఉండాలి.

చివరకు ఆ ప్రమోషన్ రావచ్చు, రాకపోవొచ్చు, జీతం పెరగొచ్చు, పెరగక పోవచ్చు...ప్రమోషన్ వచ్చి, జీతం పెరిగితే ఫరవాలేదు. ఒకవేళ రాకపోతే? ఈ అప్పు ఎలా తీర్చాలి? ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఎదుర్కునే వారు ఈ శ్లోకానికి నిదర్శనాలుగా మిగిలిపోతారు.

Monday, August 21, 2017

శ్రీ కృష్ణ సౌదర్య మహిమ - "మధురాధి పతే అఖిలం మధురం"!

శ్రీ కృష్ణ సౌదర్య మహిమ - "మధురాధి పతే అఖిలం మధురం"!

.

"దినే దినే నవం నవం, 

నమామి నంద సంభవం"

- శ్రీ శంకర భగవత్పాదులు

.

శ్రీ కృష్ణుడి పేరులోనే ఉంది ఆకర్షణ.

నిత్య నూతన సౌదర్యంతో మోహింపచేస్తాడన్నమాట. ఎన్ని సార్లు చూసినా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే, నిత్య నూతనమైన ముగ్ధమోహన సౌందర్యము ఆయనది.

ఆయన లీలలు కూడా నిత్య నూతనమే.

.

కౌరవ పాండవ యుద్ధంలో, ఆయుధం పట్టను అన్నప్పటికీ, తన సౌదర్యంతో అరి వీరులను మోహపరవసులను చేసి, వారు ఆ అద్భుత దృశ్యంలో మైమరచి తేరుకునే లోపల అర్జున బాణ ధాటికి, కూలిపోయే వారట. ఆయన నిజంగా ఎవరినైనా నిర్జించాలంటే, ఆయుధాలు అవసరమా?

.

ఆయనను ఆరాధించే వారికి, నిత్య నూతనంగా, కొత్త కొత్త అందాలతో, నిత్యరమణీయతతో కనిపిస్తాడు. అప్పుడే మొదటిసారి చూస్తున్నట్లుంటుంది.

.

ఆయన బోధించిన భగవద్గీత ఎన్ని సార్లు చదివినా,

నిత్య నూతనంగా, ప్రతీసారీ కొత్త కొత్త అర్ధాలు నీ కోసమే ప్రత్యేకంగా నీ ప్రక్కనే కూర్చుని నీ అంతరాత్మగా చెప్తున్నట్లు, స్ఫురిస్తూ ఉంటాయి.

.

పద్దెనిమిది పురాణాలు రచించినా తీరని ఆర్తి, 

వ్యాస భగవానుడికి, భాగవతం రచించాక కొంత తీరిందేమో! అప్పటికీ, ఊరుకోలేక, "కృష్ణస్తు భగవాన్ స్వయం" అనీ, శ్రీకృష్ణ ధ్యానమే భక్తి అనీ,

"మయ్యావేశ్య మనోయేమాం నిత్య యుక్తా ఉపాసితః,..," అనీ, "మయ్యర్పిత మనో బుద్ధి, అత ఊర్ధ్వం, నసంసయః" అనిన్నీ

.

కేవలం భక్తి ద్వారానే, భగవంతుని చేరవచ్చని, భగవత్గీత సూత్రాలలో వ్యాఖ్యానం చేసేక కానీ తృప్తి చెందలేదు

. శ్రీకృష్ణ చింతనామృత సేవనంలో తృప్తి ఉండగలదా అసలు?

అదే కదా, అందుకే కదా సనాతనతముడు

(శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం) అన్నది ఆయనని.

.

కౌరవ పాండవ యుద్ధంలో, అర్జున రధ సారధ్యంలో, ఆయుధం పట్టను అన్నప్పటికీ, తన సౌదర్యంతో అరి వీరులను మోహపరవసులను చేసి, వారి ఆయువు పట్లు తన గుప్పెట పట్టుకుని, వారు ఆ అద్భుత దృశ్యంలో మైమరచి తేరుకునే లోపల అర్జున బాణ ధాటికి, కూలిపోయే వారట. ఆయన నిజంగా ఎవరినైనా నిర్జించాలంటే, ఆయుధాలు అవసరమా?

.

ఆయన సౌందర్య మహిమ

"అధరం మధురం, నయనం మధురం, వదనం మధురం.." అంటూ మొదలు పెట్టి, ఇక ఎంత వర్ణించినా తృప్తి తీరక, వర్ణించలేక, "మధురాధి పతే అఖిలం మధురం" అని తేల్చేసారు వల్లభాచార్యులు. అహో భాగ్యం.

.

శ్రీకృష్ణ శరణం మమ!

.

బాపూ రమణు ల- పెళ్ళిపుస్తకం’.! -

బాపూ రమణు ల- పెళ్ళిపుస్తకం’.!

-

'పెళ్ళిపుస్తకం’. రావి కొండలరావు గారు మిస్సమ్మ కథ 

తిరగేసి ఇచ్చారు. నంది అవార్డే కాక జనం కూడా రివార్డిచ్చారు. చాలా గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ – కొత్తనటి దివ్యవాణి.

-

కొంతభాగం మా మిత్రులు NCL రాజుగారి తోటలో తీశాం. 

రమణగారు అక్కడ చక్రాలు లేని రైలుపెట్టి ఉండడం చూసి గుమ్మడిగారి పాత్రకి చక్కని సీను రాశారు

సినిమాలో “అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటరు” అన్న

డైలాగు చాలా ఇష్టం.

-

ఆరుద్రగారి “శ్రీరస్తు శుభమస్తు” పాట షూటింగుకి మా ఆర్టువారు కళ్యాణమండపం అద్దె, డెకొరేషన్సు, జూనియర్సు, వార కాస్ట్యూమ్సు లెక్కేసి పొడుగాటి జాబితా తెచ్చారు. వద్దనుకుని ఓ తమాషా చేశాం. ఓ గదిలో నాలుగిటుకలూ పుల్లలూ, కాస్తమంట, ముగ్గులు, నాలుగు అరటి పిలకలు, నాలుగు మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బొండాం, మంగళ సూత్రం, పుపు కలిపిన బియ్యం ఓ పళ్ళెం, రెండు కర్రలకి పూలదండలు అమర్చుకుని Tight Close shots తో ఓ పూటలో పాట ముగించేశాం.

హీరో హీరోయిన్లు తప్ప జూనియర్సు లేరు. అక్షింతల వేసన చేతులు కూడా మా యూనిట్ వాళ్లవే!

-

క్లైమాక్సు రాసుకుని రమణగారు పద్మాలయ స్టూడియోస్ లో పెద్ద ఫ్లోరు బుక్ చేశారు. వేరే షూటింగులో ఉన్న సమయంలో క్రాంతి కుమార్ గారు ‘’సీతారామయ్య గారి మనుమరాలు’ (What a picture!) కి రెండు నెలలు అదే ఫ్లోర్ అడిగారని తెలిసింది.

పద్మాలయ హనుమంతరావుగారు “చూస్తే ఇది పెద్ద గిరాకీ – కానీ రమణ గారికి మాటిచ్చాశానే” అని ఇరకాటంలో పడ్డారని తెలిసింది. రమణగారు వెంటనే తనంతటతనే ఆ ఫ్లోరు అక్కరలేదని కబురు చేసి NCL రాజు గారి తోటలో చక్రాలు లేని రైలు పెట్టి కీ పాయింటుగా పెట్టుకుని ….అంతా తిరగరాసి షూటింగు పూర్తి చేశారు.

-ముళ్ళపూడి వెంకట రమణ గారు .

అలుగ కారణమేమిరా రామ!

త్యాగరాజు!

పలుకవేమి నా దైవమా

పరులు నవ్వేది న్యాయమా!

.

అలుగ కారణమేమిరా రామ

నీవాడించినట్లుయాడిన నాతో !

.

తల్లి తండ్రి భక్తినొసగి రక్షించిరి తక్కిన వారలెంతో హింసించిరి

తెలిసియూరకుండేదియెన్నాళ్ళురా దేవాది దేవ త్యాగరాజునితో!

Sunday, August 20, 2017

పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’!పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’!

.

మొదట్లో మనకు ఎన్నో పర్వదినాలు, పండుగలు ఉండేవి.

అవన్నీ మన సంస్కృతికి, సంప్రదాయాలకి అద్దం పట్టేవిగా ఉండేవి. అప్పట్లో ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు. ఇప్పుడు 

మ్యుఖ్యమైన పండగలకి కూడా కుటుంబం లోని సభ్యులు కలవడమే గగనం అయిపోతోంది. మన అమ్మమ్మలు చేసుకున్న పండగలలో కొన్నిటిని హడావిడి జీవనంలో పడి మనం ఇప్పటికే 

వదిలేసాము 

మన. దాని వలన పాపం మన పిల్లలికి మన పండగలలో చాలా పండగల విశిష్టత మాట పక్కకు పెడితే, పేర్లు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు.

అలా మన పిల్లలతో పాటు మనలో చాలా మంది విస్మరిస్తున్న పండగలలో ఒక పండగ ప్రతి శ్రావణ మాసంలో అమావాస్య రోజు చేసుకునే ఎంతో ముఖ్యమైన పండుగ. 

అదేనండీ 'పోలాల అమావాస్య' పండుగ.

దీనినే 'పోలాంబ వ్రతం' లేక ‘కంద గౌరీ వ్రతము’ అని

కూడా అంటారు. ఈ వ్రతం, తల్లి అయిన ప్రతి స్త్రీ తప్పక చేయవలసిన విధానం.

సంతానం ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికి ఆచరించ తగ్గది ఈ వ్రతం.

మనము, మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా కటాక్షాలే! 

అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. 

మరి అటువంటి గ్రామదేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన 

దేవత .

'పొలాల అమావాస్య' భక్తి శ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని పూజించాలి.

పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క 

కాని కంద పిలక కాని తెచ్చుకోండి. మిగతా పూజ సామాను అంతా మీకు తెలిసినవే; పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు.

.

పొలాల అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కంద మొక్క ని కాని కంద పిలకను కాని పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు 

వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి. 

నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ 

సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఇద్దరు 

వున్నవారు రెండూ సిద్దం చేసుకోవాలి. రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు 

కట్టి ఉంచుకోవాలి. ఈ వ్రత కథ ప్రతి స్త్రీల వ్రత కథల పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి.

ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీవీకరించాలి.

ఇంతేనండీ పొలాల అమా వాస్య వ్రతం అంటే! ఈ పండుగ. పధ్ధతి తప్పినా 

భక్తి తప్పకూడదండీ! భక్తి శ్రద్ధలతో చేసుకుని అమ్మ వారి దయకు పాత్రులై, పిల్ల పాపలతో 

వందేళ్ళు చల్లగా ఉండండి!

.

”ఆముక్తమాల్యద- శ్రీకృష్ణ దేవరాయ ప్రభు !!”

”ఆముక్తమాల్యద- శ్రీకృష్ణ దేవరాయ ప్రభు  !!”

.

”ఆముక్తమాల్యద” రసజ్ఞులకు రసజుష్టంగానూ..

ఆలంకారికులకు నవరత్నపేటికగాను..

అర్థజ్ఞులకు సర్వార్థ నిధిగాను..

పాండితీ పూజారులకు నూత్నార్థ పదకోశంగానూ..

వర్ణనా ప్రియులకు సర్వభావ పూర్ణముగానూ..

భాసించే ఈ కావ్యరాజమునకు

ధీటైన మరో కావ్యము నభూతో..ణ భవిష్యతి..!

.

కృష్ణదేవరాయలు 1474 ప్రాంతాల్లో పుట్టి, 1509లో రాజై,

అనేక దిగ్విజయాలు చేసి, 1515,16ల్లో విజయవాడకు వెళ్ళి, 

అక్కడికి దగ్గర్లో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించేడు

(ఈ శ్రీకాకుళం విశాఖపట్టణం దగ్గరిది కాదు, విజయవాడ దగ్గరిది). 

--ఏకాదశి నాడు ఉపవాసం చేసేడు. 

ఆ పుణ్యదినాన, రాత్రి నాలుగో జామున ఆ “ఆంధ్ర జలజాక్షుడు” 

అతని కల్లో ప్రత్యక్షమయేడు “లేములుడిపెడు లేజూపు లేమ తోడ”. చిరునవ్వుతో ఇలా అన్నాడు 

.

“రసికులు మెచ్చేట్టు మదాలసచరిత్ర పలికేవు, భావం, ధ్వని, వ్యంగ్యం మేళవించి సత్యావధూప్రీణనం చెప్పేవు, వేదపురాణాల కథల్నేరి సకల కథాసారసంగ్రహం తయారుచేసేవు, శ్రోతల పాపాలు ఎగిరిపోయేట్టు జ్ఞానచింతామణిని వినిపించేవు, రసమంజరి మొదలైన మధురకావ్యాలు రచించేవు అన్నీ గీర్వాణభాషలో! 

ఇలాటి నీకు ఆంధ్ర భాష అసాధ్యమా? 

మాకు ప్రీతిగా ఓ కృతి నిర్మించు. నా అవతారాల్లో దేన్ని గురించి చెప్పాలా అని నీకు సందేహం రావొచ్చు.

.

కృష్ణావతారంలో సుదాముడిచ్చిన పూలదండలు వెనకాడుతూ తీసుకున్నాను అతను మగవాడాయె! శ్రీరంగంలో తను ముందుగా ధరించిన పూదండల్ని నాకిచ్చిన వయ్యారిని పెళ్ళి చేసుకున్నా ఆ కొరత తీరలేదు నాకు. 

నేను తెలుగురాయడిని, నువ్వో కన్నడరాయడివి. కనుక నువ్వు ఆ మా పెండ్లికథను చెప్తే అది పూర్తిగా తీరిపోతుంది. 

.

తెలుగెందుకంటావా? ఇది తెలుగుదేశం, నేను తెలుగువల్లభుణ్ణి, కలకండలాటి తియ్యటిది తెలుగు, ఎన్నో భాషల్లో మాట్టాడే నీకు తెలీదా అన్నిట్లోనూ ఉత్కృష్టమైంది తెలుగని! 

ఈ కృతిని నీ ఇష్టదైవమైన వెంకటేశ్వరుడికి అంకితం చెయ్యి మాకేం భేదం లేదు. 

ఇలా చేస్తే నీకు ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది” అని ఆనతిచ్చేడు.

.

వెంటనే నిద్ర మేల్కుని, దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని, 

తెల్లవారేక నిండుసభలో దండనాథ సామంతుల పనులు త్వరగా ముగించి 

వేదవేదాంగ వేత్తల్ని రప్పించి వాళ్ళకీ కల గురించి వివరించేడు రాయలు.

వాళ్ళు ఎంతో ఆనందించి ఆ స్వప్నాన్ని విశ్లేషించి దాన్లోని అన్ని అంశాలూ మంగళప్రదమైనవని తేల్చి సాహితీసమరాంగణ సార్వభౌముడైన అతను ఆంధ్ర మహావిష్ణుడు కోరిన విధంగా ఆముక్తమాల్యదని నిర్మించమన్నారు. అతను కూడా సంతోషంగా కావ్యరచనకి పూనుకున్నాడు. 

.

1521 నాటికి ఇది పూర్తయిందని పరిశోధకుల అభిప్రాయం. 1530లో రాయలు మరణించేడంటారు. )

బాపూ రమణు ల రాముడు !

బాపూ రమణు ల రాముడు !

.

రాముణ్ణి నమ్ముకుంటే అందరికీ మంచే జరుగుతుంది.

ఇరవై ఏళ్ళ క్రితం తీసిన ఆయన కథ “సంపూర్ణ రామాయణం” వట్టిపోని పాడి ఆవు. 

అయిదేళ్ళకోసారి అమ్మి లాభం పొందేవాళ్ళం. ఆ మధ్య మా పార్ట్నర్స్ లో ఒకరు మాకు చెప్పకుండా రామాయణం సినిమాని మరో అయిదేళ్ళకి అమ్మేసి జేబులో వేసుకున్నాడు. రమణగారు ఆయన్ని నిలేస్తే – 

“అవును. తిన్నాను. ఏం జేస్తావ్? కోర్టుకెడితే వెళ్ళు. సివిలు కేసు హియరింగు కొచ్చేసరికి నువ్వైనా వుండవు. నేనైనా వుండను.

ఈ లోగా మరిన్ని మాట్లు అమ్ముకుంటాను” అని హామీ ఇచ్చారు.

అంటే – రాముడు పాపం ఆయనకు అవసరమైన సొమ్ము జతపరిచాడు. 

మాకు కోర్టు వ్యవహారాల గురించి జ్ఞానమూ ప్రసాదించాడు.

_ ముళ్ళపూడి వెంకట రమణ గారు .

Saturday, August 19, 2017

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.!

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.!


(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి )

.

కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు?

కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు?

కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,

కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.

* * *

లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?

కొడుకులను గంటేను కోటి లాభమ్ము.

గోరంతదీపమ్ము కొండలకు వెలుగు,

గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.

మాడంతదీపమ్ము మేడలకు వెలుగు,

మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు.

* * *

Friday, August 18, 2017

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

.

బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.

(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.

సెగట్రీ: నారాయుడొచ్చాడండి.

రావు: వచ్చాడా తీసుకొచ్చావా?

సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?

(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)

రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?

సెగట్రీ: యెస్సర్

రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?

సెగట్రీ: అద్భుతం సార్!

రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !

అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.

.

ఈస్ట్ కోస్ట్ మాష్టారు తనకిష్టమైన

అతికష్టమైన బారిష్టర్ టెస్ట్

ఫస్ట్ లో పాస్ అయినందుకు

తన పక్కింటివాడిని ఫీస్ట్ కని

పిలిచి చికెన్ రోస్ట్ టేస్ట్ ను

బెస్ట్ బెస్ట్ అనుకుంటూ

సుస్టుగా లాగించి బ్రేవ మన్నాట్ట" అంటూ

ప్రాసకోసం అతి ప్రయాసపడి రాసేడు

వేటగాడులోని ఈ సంభాషణ మన జంధ్యాల!

సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి !

సీతారామాభ్యామ్ నమః - యాయ వారం, ముష్టి !


.

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం .. అనే లోకోక్తి

పై లోకోక్తి ఎలా వచ్చింది?

.

మాచిన్న తనంలో కొందరు బ్రాహ్మణులు నిత్యజీవితానికి ఆరోజుకు అవసరమైన అవసరమైన ఆహారాన్ని ధాన్యం, లేదా బియ్యమును యాచనతో సంపాదించుకునేవారు.

ఇత్తడి చెంబు శుభ్రంగా తోముకొని, సీతారామాభ్యామ్ నమః అని చెప్పుకుంటూ ఆరోజు పంచాంగ శ్రవణం చేస్తూ పిడికెడు బియ్యం తో సంతుష్టిచెంది వెళ్ళేవారు.

బిక్షం వేయగానే ఆశీర్వచన మంత్రం చదివే వారు. దీనిని యాయవార వృత్తి అనేవారు. ఇది సంస్కృత పదం.

సంస్కృత నిఘంటువు - ప్రత్యహం ధాన్య యాచనా - అని అర్థం ఇస్తుంది. 

ముష్టి అంటే పిడికిలి, యాచన కాదు సవ్య ముష్టి ప్రహారంతో లంకాపురిని జయిస్తాడు . 

ఒక విద్యావిహీనుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునికి చిన్నప్పుడు తండ్రి ఉరుములతో కూడీన వర్షం వచ్చినప్పుడు ఇంద్రుని వజ్రం (పిడుగు) పాలి పడకుండా అందరికీ తెలిసిన ఈ శ్లోకం చెప్పాడు

.

“అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః 

భీభత్స విజయోర్జిష్ణుః సవ్యసాచీ ధనంజయః” .||

.

తరువాత కొన్ని దినాలకే తండ్రిపోవడం, దరిద్రస్థితిలో చదువులేక పోవడం జరిగింది. యాయవారంతో పొట్ట పోసుకుంటూ యాచనకు వెళ్ళీ తనకు తెలిసిన పిడుగు మంత్రం చెప్పడం మొదలు పెట్టాడు. పంచాంగం చదవడం, ఆశీర్వచనం చేయడం తెలియదు తెలిసినది ఒకే మంత్రం - పిడుక్కీ బియ్యానికి అదే!

మధ్యాహ్నం మాణిక్యం!

మధ్యాహ్నం మాణిక్యం!

(ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ కలబోసి రాసిన కథ )

.

మా తాత గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆయన తమ్ముళ్ళూ, మేనల్లుళ్ళూ, బావ మరిదీ, మొత్తం పిల్లా పెద్దా కలిసి ఎప్పుడు చూసినా పెళ్ళి ఇల్లులా ఉండేది. ఎప్పుడూ ఏవో నోములూ పేరంటాలూ పురుళ్ళూ తద్దినాలూ సమారాధనలూ చాలా సందడిగా ఉండేది. పక్కన అతిథి కూచుని భోంచేస్తేనే మా తాతగారు తినే వారు. ఆస్థి ఉండి అట్టహాసముండి సరదాలూ సంబరాలూ వేడుకలతో నిండి, బొత్తిగా ముందు చూపూ జాగ్రత్తా లేని ఆ కాలపు పెద్ద కుటుంబం మా తాతగారిది.

పెద్ద మండువా ఇల్లూ నాలుగు వేపులా పెద్ద పెద్ద వసారాలూ, పెద్ద భోజనాల సావిడీ, నాలుగు పెద్ద పడక గదులూ, కొన్ని చిన్న గదులూ, పాల మజ్జిగలకి ప్రత్యేకం గదీ, వంటకి వేరే, పిండి వంటకి వేరే గదులూ ఉండేవి. మా బామ్మ కూర్చుని పిండి వంటలు చేస్తూ ఉంటే మేవంతా చుట్టూ కూర్చుని ఖాళీ చేసేవాళ్ళం.

“చేసినంతసేపు పట్టదర్రా, ఖాళీ అయిపోవడానికి” అనేదావిడ.

మా నాన్న కన్నతల్లి చంటితనంలోనే పోతే తాతగారి రెండో భార్య దగ్గిరే ఆయన పెరిగారు. “అమ్మా” అనే పిలిచే వారు. చాలా కాలం దాకా ఆవిడే మా అసలు బామ్మని అనుకునే వాళ్ళం.

దేవుడి గుళ్ళో ఏ వేడుక జరిగినా మా ఇంటికే పెద్ద పీటగా ఉండేది. దేవుడి కళ్యాణానికి బామ్మా తాత గారూ, తరవాత కాలంలో అమ్మా నాన్నా, పీటలమీద కూర్చునే వారు. ఆ అయిదు రోజులూ, ఏ రోజుకారోజు కొత్త బట్టలు మడత నలగకుండా కట్టుకునే వారు.

మా అమ్మకి సినీమాలంటే చాలా ఇష్టం. నాన్న మమ్మల్నందరినీ కాకినాడ తీసికెళ్ళి అక్కడ ఉన్న చుట్టాలతో సహా సినీమాకి తీసుకెళ్ళేవారు. అమ్మ స్థిమితంగా సినీమా చూసేందుకు వీలుగా పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళీ ఆడిస్తూ ఏవో కొనిపెడుతూ, కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు.

కథలంటే ఆయనకి మహా సరదా. ఆయన చెప్పే కథలు ఇంటిల్లిపాదీ ఆసక్తిగా వినేవారు.

దీపావళొస్తే మా ఇంట్లో సంబరం చూడవలిసిందే. సూరేకారం, పటాసూ పేక ముక్కలూ, పాత పోస్టు కార్డులూ పెట్టి మతాబాలు, చిచ్చుబుడ్లు, టపాకాయలూ చెయ్యడంలో నాన్న నేర్పు గురించి ఊరంతా చెప్పుకునే వారు. గది నిండేలా బాణసంచా పేర్చి, బాగా ఆరనిచ్చి, దీపావళికి ముందూ తరవాతా వారం రోజులు ఊరందరికీ పండగలా నడిపించే వారు. ఊరి పిల్లలందరికీ ఆయన పెద్దన్నయ్య.

అంత మందిలోనూ మాకేలోటూ రాకుండా చూస్తూనే, అందరితో కలిసి మెలిసి ఉండేలా, అందరితో మంచీ చెడ్డా పంచుకునేలా అలవాటు చేశారు.

ఆ రోజుల్లో గ్రామఫోను తప్పనిసరి సౌకర్యంగా ఇంట్లో ఉండేది. ఎవరికి తోచిన రికార్డు వాళ్ళు పెట్టుకుని వినే వాళ్ళు. నాన్న సైగల్‌ పాడిన “దునియా రంగ్‌ రంగేళీ బాబా, దునియా రంగ్‌ రంగేళీ” చాలా మాట్లు వింటూ ఉండేవారు. ఆ మాటలకి పూర్తి అర్థం ఆయనకి తెలుసునోలేదోగానీ, నాకు అర్థం కాకుండానే ఆ పాట వింటూంటే రంగు రంగుల దారాల కలనేత కళ్ళకి కట్టినట్లుండేది. ఎందుకో, నాన్నా ఆ పాటా ఒకటే అనిపించేది.

ఇన్నేళ్ళకి మా అబ్బాయి CD player లో ఆ పాట మళ్ళీ విన్నాను. ఎందుకో కలిమిలో నాన్న, కష్టాల్లో నాన్న, కలగలుపుగా ఒకే పిక్చరు మనసులో మెదిలింది.

“పొద్దున్న వేళలా పొడిచేటి భానుడు పొన్న పువ్వూ ఛాయ, మధ్యాహ్న వేళల పొడిచేటి భానుడూ మంకెన్న పూఛాయ”.

“ఏవిటీ ఎప్పుడూ లేనిది కూని రాగాలొస్తున్నాయి, పూర్తిగా పాడరాదా” అన్నారు మా వారు.

“ఆ, నా మొహం నాకొకటి ఒస్తే కదా! నా చిన్నప్పుడు మా దొడ్డ పాడే పాటలు గుర్తొచ్చాయి, ఈ ఆకుల వైభవం చూస్తుంటే. మా వూళ్ళో నా వానా కాలం చదువుకి వొంటి పూటి శలవులప్పుడు బడి నించి ఇంటికి వస్తూంటే దారిలో రెండు పక్కలా దుబ్బులమీద తీగలకి పూసిన ఎర్రని మధ్యాహ్నం మాణిక్యాలు, వాటి తొడిమలు తుంపి నోటిలో పెట్టుకుంటే కొద్దిగా మకరందం రుచీ, తీరీ తీరని దాహం, ఏవేవో జ్ఞాపకాలొస్తున్నాయి” అన్నాను.

“మధ్యాహ్నం మాణిక్యాలేమిటీ, నేనెప్పుడూ చూడలేదూ, వినలేదూ?”

“ఏమో, మా దొడ్డా మంకెన్న పువ్వుల్నే మధ్యాహ్నం మాణిక్యాలంటారని చెప్పేది”

ఉపవాసము!

.

ఉపవాసము!

.

ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.

భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.

.

హిందూమతంలో ఉపవాసదీక్ష!

శివరాత్రి

నాగులచవితి

తొలి ఏకాదశి

కార్తీక సోమవారం

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ!


.శ్రీశ్రీ ప్రతిజ్ఞ గేయానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారి పేరడీ!

.

అవాకులన్నీ, చవాకులన్నీ

మహారచనలై మహిలో నిండగ,

ఎగబడి చదివే పాఠకులుండగ

విరామ మెరుగక పరిశ్రమిస్తూ,

అహోరాత్రులూ అవే రచిస్తూ

ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు, 

వారికి జరిపే సమ్ మానాలకు

బిరుదల మాలకు, దుశ్శాలువలకు,

కరతాళలకు ఖరీదు లేదేయ్!

.

అలాగే-

.

నేను సైతం తెల్లజుట్టుకు

నల్లరంగును కొనుక్కొచ్చాను

నేను సైతం నల్లరంగును

తెల్లజుట్టుకు రాసిదువ్వాను

యింతచేసి, యింత క్రితమే

తిరుపతయ్యకు జుట్టునిచ్చాను.

.

జొన్నవిత్తుల రాసిన తిట్లదండకం కూడా సినిమాల్లో కొత్త ప్రయోగమే.

ఓరేయ్ త్రాపి, మహాపాపి, కురూపి, 

నిన్ను చూడంగనే వచ్చు హై లెవెల్ బీపీ

ముండమోపి, జిరాఫీ, నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హ్యాపి

అంకఛండాలుడా, బంకబధిరాంధుడా,

పరమపాపిష్ట, నికృష్ట దుష్టాత్ముడా

నీ నీచ రూపంబు చూడంగ పాపంబు,

నీకంఠనాళంబు కక్కోసు గొట్టంబు 

ఇలా సాగే ఈ పాటలో తెలుగు, సంస్కృత, ఇంగ్లీష్ పదాలు కనిపిస్తాయి.

Thursday, August 17, 2017

నమో‘ ‘చంద్రా‘! -సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా! – ఏలూరిపాటి

నమో‘ ‘చంద్రా‘! 

-సంస్కృత కళాశాలల దీనగాథ వినుమా!

– ఏలూరిపాటి

విద్యార్థులు లేరని కళాశాల మూసివేయడం, ముసలి తల్లితండ్రులను గోదావరి పుష్కరాలలో వదిలి వేయడం, పాలు లేవని గోవును కబేళాకు పంపడం సమానం కాదా?

సంస్కృత కళాశాలలను మూసివేయాలని ముఖ్యమంత్రి అయిన మొదటి సారి

ఎన్ టి రామారావు కు కొందరు నూరిపోశారు. ఆయనకు చెప్పిన కారణాలు ఒకే ఒక్కటి. సంస్కృతం చదవడానికి పిల్లలు ఎవరూ రావడంలేదు. కనుక వీటిని ప్రభుత్వం వదిలించుకోవాలని సిఫార్సు చేశారు.

.అయితే తెలుగు, సంస్కృత భాషలపై మక్కువ ఉన్న రామారావు వీటిని అధ్యయనం చేయమని ఒక అధికారిని నియమించారు. 

అంతేకానీ ఆయన సంస్కృత కళాశాలలను తీసివేయలేదు.

కానీ, ఆయన చేసిన అద్యయనం వల్ల చాలా ఆసక్తికర విషయాలు, ప్రతిపాదనలూ ముందుకు వచ్చాయి. వీటిని అమలు చేయాలని నాటి ముఖ్యమంత్రి ప్రయత్నించినా, రాజకీయ కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. అంతేకాదు నేటికీ అవి అమలు కాలేదు. ఆ వివరాలు ఇవి.

1) చదవడానికి పిల్లలు లేరు అనడానికి కారణం చదివితే ఉద్యోగాలు రాకపోవడమే.

2) విద్యాప్రవీణా, భాషా ప్రవీణా పట్టాలు

3) నిధుల కొరత:

అస్తుబిస్తు మంటూ ఉన్న సంస్కృత కళాశాలలకు నిర్వహణ నిధుల కొరత ఉంది. 

చాలా కళాశాలలకు మౌలికమైన సౌకర్యాలు కూడాలేవు. 

కేవలం కెవికె సంస్కృత కళాశాల వంటి వాటికే మౌలికమైన వసతులు ఉన్నాయి.

.

ప్రభుత్వం మైనార్టీ సంస్థలకు అంగలార్చుకుంటూ వేల కోట్లాది రూపాయలు నిధులూ గ్రాంటులూ రూపంలో, విందు భోజనాలకు కోట్లాది రూపాయలూ వెదచల్లుతోంది కానీ, సంస్కృత పాఠశాలల్లో విద్యార్థులకు పిడికెడు మెతుకులు విదిల్చే కరుణ లేదు.

.

బహుశా సెక్యులరిజం అనే తద్దినం అడ్డం వచ్చి ఉంటుంది.

దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాళ్లే నిధుల కోసం ఊరిలో చందాలకు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి కొన్ని యాజమాన్యాలు ఉపాధ్యాయుల గోళ్లూడగొట్టి వారి జీతాల నుంచీ నిర్వహణ నిధులు సేకరించేవారు. కుటుంబాలను రోడ్డు మీద పడేయలేక మౌనంగా ఉపాధ్యాయులు తమ జీతాలు సమర్పించుకుని గంజితాగి బతుకులీడుస్తూ వచ్చారు.

.

ఇప్పటి వరకూ మీకు చెప్పింది అతిముఖ్యమైన సమస్యలు మాత్రమే.

.

కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చినందున ఈ కళాశాలలకు ఒరిగింది ఏమిటి?

.

ఈ సంస్కృత కళాశాలను కబేళాకు పంపుతున్నది ఎవరు?

.

అటు కేంద్రమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా కొడికడుతున్న కళాశాల దీపాన్ని కాపాడతాయా, తల దగ్గర దీపాన్ని వెలిగిస్తాయా?

.

బ్రాహ్మణోత్తములు డాక్టర్ కొలచల వెంకట కృష్ణమూర్తిగారు సంస్కృత భాషాభివృద్ధికి చేసిన దానాలు వృథా కావల్సిందేనా?

.

మరికొద్ది రోజుల్లో భూస్థాపితం కానున్న కళాశాలకు పునరుజ్జీవం కల్పించగలమా?

.

ఏం చేయాలో మీరే తేల్చుకోండి.

.

-ఏలూరిపాటి

/