దుర్గాబాయ్‌ అమ్మగారు !


దుర్గాబాయ్‌ అమ్మగారు !

- బాపు రేఖలలోని మహాత్మ్యం!

(ఎమ్బీయస్‌ : బాపు విశ్వరూపంనుండి )

పట్టుదల, ధైర్యం, సాహసం ఉన్న మహిళ అని యీవిడని వర్ణిస్తారు. తననుకున్న లక్ష్యం వైపు చూపు సారించడం, ఒక భుజం పైకి లేచి వుండడం, ముఖంలో దృఢత్వం! 

అవును, ఈవిడ దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌! స్వాతంత్య్ర యోధురాలు. ఉప్పు సత్యాగ్రహం మద్రాసులో చేసి తీరాలని ప్రకాశంగారితోనే పోట్లాడింది. 

ఇరవై ఏళ్లు రాకుండానే 'జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌' వంటి వీరవనితగా పేరుబడ్డారు. చిన్నవయసులోనే హిందీ నేర్చుకుని హిందీ పాఠాలు చెప్పేది.

వైధవ్యం ప్రాప్తించాక, చిన్నప్పుడు మానేసిన చదువు మళ్లీ మొదలుపెట్టి ఎం.ఎ.బి.ఎల్‌. వరకు చదివింది. రాజ్యాంగ నిర్మాణసభ సభ్యురాలైంది. మద్రాసులో ఆంధ్ర మహిళా సభ స్థాపించి ఎందరికో ఆశ్రయం కల్పించింది. మహిళల చదువు కోసం, స్వావలంబన కోసం నిరంతరం శ్రమించింది. ప్రముఖ ఆర్థికవేత్త సి.డి. దేశ్‌ముఖ్‌గార్ని పునర్వివాహం చేసుకుంది. ఆవిడ ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి. .

రెండు, మూడేళ్ల క్రితం మళ్లీ ఆవిడ బొమ్మ వేయవలసి వచ్చినపుడు ఆమె చూపుల్లోని పట్టుదలకు కరుణ కలిపి, మహిళాశిశుసంక్షేమానికై ఆమె చేసిన కృషిని గుర్తు చేస్తూ యింకో బొమ్మ వేశారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!