రాణి పద్మిని !

ఆమె మేవార్ మహారాణి, అందాల భరిణ అయిన పద్మిని.


ఆ పేరు వింటూనే ఖిల్జీ ఆమె మీద మనసు పారేసుకున్నాడు అతిథిగా వచ్చి ఆమెను తన సోదరిలాగా భావిస్తున్నాని చెప్పి రాణి పద్మిని భర్త మేవార్ మహారాజు రతన్ సింగ్ ని తనకు ఆమెను చూడాలని ఉన్నట్టు కోరాడు.


సోదరి సమానం అన్నాడు కాబట్టి నమ్మకంతో రతన్ సింగ్ సరే అన్నాడు , కానీ రాణి పద్మిని దానికి ఒపుకోలేదు.చివరికి ఆమె అంత:పురములోని స్త్రీ జనంతో వచ్చి ఆమె ప్రతిబింబాన్ని అద్దములో చూపించారు.


కానీ.. సోదరి సమానం అని చెప్పిన ఖిల్జీ ఆమెను చూసిన పిమ్మట ఆమె మీద కాంక్షతో ఆమెను అప్పగించాలి లేదా తనతో యుద్ధానికి సిద్ధం కావలి అన్నాడు. అప్పుడు పరాక్రమవంతులైన రాజపుత్రులు యుద్ధానికి సిద్ధం అయ్యారు. యుద్ధం లో అనేక మంది సైనికులు రాజ పుత్రులతో బాటు మహారాజు రతన్ సింగ్ కూడా మరణించాడు.


ఈ వార్త విన్న వెంటనే రాణీవాసం మొత్తం రాణి పద్మిని తో సహా , ఖిల్జీ యొక్క క్రౌర్యం తెలిసిన వారు కావున మొత్తం స్త్రీలు అందరూ అగ్ని ప్రవేశం చేసారు.


ఎంతో ఆశతో రాణి పద్మిని ని పొందాలనుకున్న ఖిల్జీ సైనికులతో అంత:పురములోని కి వెళ్ళి చూస్తే మొత్తం భస్మరాశులే కనబడ్డాయి.శౌర్య విక్రమ పరాక్రమ చక్రవర్తులే అల్లా ఉద్దీన్ కి జీహుజూర్ అనే మ్రొక్కే రోజులవి. అలాంటి సుల్తాన్ కి లొంగని మహా సాహసి- రాణి పద్మిని.

పవిత్రతకు ఆత్మ గౌరవానికి, స్థైర్యానికి ప్రతీక రాణీ పద్మిని.


కాగా ఈ రాణి పద్మిని కదను మాలిక్ మహ్మమద్ జాయిసీ అనే పర్షియన్ కవి 1540లో “పద్మావతి” అనే పేరుతో అద్భుతమైన విషాదాంత కావ్యంగా రచించాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!