గుర్రం జాషువా!

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి

గుర్రం జాషువా!

(సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971).

..

సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు.

తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. 

అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

.

అలనాడు భారత కాలంలో అస్త్రవిద్యా ప్రదర్శన లో కర్ణుడికి జరిగిన అవమానమే తిరిగి ఆనాడు కీ జరిగింది. ఆ రోజంతా ఇల్లుదాటి బైటికి రాకుండా, భోజనం చేయకుండా, తనలో తానే ఏడ్చు కుంటూ దుఃఖంలో తలమున్కలై పొద్దుపుచ్చాడట. ఇలాంటి సన్నివేశాల నెన్నింటినో ఆయన కవిగా నిలదొక్కుకునే రోజులలో ఎదుర్కొన్నాడు. "కుల భేదానికి నువ్ మెదలెడు దేశమిద్ది నిను మెచ్చదు, మెచ్చిన మెచ్చకున్న శారద నిను మెచ్చె మానకుము ప్రాప్త కవిత్వ పరిశ్రమంబులున్" (నా కథ)- అని జాషువా భుజం తట్టి కందుకూరి వీరేశలింగం అన్న మాటలు జాషువాకు అదర్శాలయ్యాయి.

.

.

"చక్కని కవితకు కులమే

యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం

కెక్కడి ధర్మము తల్లీ? 

దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ!

.

అ లాగే 1933-34 సం. ల ప్రాంతంలో ఒకనాడు జాషువా వెంకటగిరి రాజైన యాచేంద్రభూపతిని సందర్శించటానికి రైల్లో వెళ్తున్నాడు. రైల్లో పరిచయమైన వ్యక్తి జాషువా కవి అని తెలుసుకొని అయన కవితలు విని ఎంతో సంతోషించాడు, జాషువాను ఎంతగానో అభినందించాడు. ఇంతలో ప్రసంగం కులంమీదకు మళ్లింది. జాషువాని ఆయన 'మీదే కుల'మని ప్రశ్నించాడు. జాషువా చెప్పాడు; అంతే అప్పటి వరకు జాషువాని పొడిగిన వ్యక్తే చివాలున లేచి వెళ్లిపోయాడు. గుండెను పిండే ఈ సంఘటననే జాషువా రాజుకు ఇలా చెప్పుకొని వాపోయాడు.

.

నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే

ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ

దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో

బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్ 

.

.

ఇలాంటి సన్నివేశాలకు జాషువా జీవితంలో కొదవలేదు. అంతేకాదు, అన్నింటి కంటే విచిత్రమైంది - అటు క్రైస్తవ సోదరులచేత వెలివేయబడ్డాడు. ఇటు సవర్ణ హిందువుల చేత ఈసడింపబడ్డాడు. ఇంటి నుండి తరిమివేయబడ్డాడు. ఇదంతా కేవలం 'కులం కుట్రే'! కవిగా ఆయన లబ్దప్రతిష్టుడైన తర్వాత కూడా సభల్లో, సన్మానాల్లో ఈయన గురించి ప్రసంగించే వక్తలు 'పంచమ జాతిలో పుట్టి ఇంత గొప్పకవిగా రాణించినవాడు' అని అంటుంటే జాషువా గుండెలు అవిసిపోయేవి. 'నన్ను జాషువాగా ఎందుకు గుర్తించరు?' అని ఆయన అంటుండేవాడట. ఇలా ఆయన జీవితంలో కుల ప్రాతిపదిక మీద ఎన్ని దూషణాల్ని, తిరస్కారాల్ని ఎదుర్కొన్నా, వాటిని లెక్కచేయలేదు! ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు.

.

"గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న

న్నెవ్వెధి దూఱినన్ ననువరించిన శారద లేచిపోవునే

యవ్వసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంట మూనెదన్

రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్ !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!