'చాపకూడు'- చెన్నకేశవాలయం (కారంపూడి) ! .

.
'చాపకూడు'- చెన్నకేశవాలయం (కారంపూడి) !

.

సమాజంలో వేళ్ళూనుకుపోయిన హెచ్చు తగ్గులను రూపు మాపేందుకు 13వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు 'చాపకూడు'

అనే కొత్తసాంప్రదాయాన్ని తీసుకువచ్చి అన్నివర్గాల ప్రజలు

ఒకేచోట కూర్చుని ఒక కుటుంబంలా కలసి భోజనం చేసే

సంస్కృతికి నాందిపలికాడు,

.

కారంపూడి చెన్నకేశవాలయాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు కట్టించాడు. ఇది పల్నాడులో విశిష్టమైన దేవాలయం. చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఒకపక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. అందుకే ఈ గుడిని గురించి విశేషంగా చెప్పుకుంటారు.

.

కులాల వ్యత్యాసం విపరీతంగా ఉండి, నిమ్న జాతులుగా పరిగణించే కొన్ని కులాలు అవమాన భారంతో కుంగిపోతున్న రోజుల్లో బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలుపరిచాడు. అన్ని కులాలవారినీ ఒకదగ్గర కూర్చోబెట్టి ఈ ఆలయంలో బంతి భోజనం పెట్టించాడు .

.

ఆంధ్ర కురుక్షేత్రముగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. యాంధ్రపహ్లవులే నివసించుప్రదేశమే పల్లవనాడని తరువాత నేడు పల్నాడని పిలవబడింది.

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

-ఇది శ్రీనాథ కవిసార్వభౌమ విరచితం.

"పలనాడు వెలలేని మాగాణిరా!" ఇది పులుపుల వెంకట శివయ్య గారి మాట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!