శ్రీ ఎస్. నటరాజన్ – కలం పేరు శారద.

శ్రీ ఎస్. నటరాజన్ – కలం పేరు శారద.

-17 ఆగస్టు –వర్ధంతి సందర్భంగా –

...

తెలుగు సాహితీ వీధుల్లో ఎప్పటికీ చెరిగిపోని తన పాద ముద్రలు విడిచి వెళ్ళిపోయిన తెలుగు వాడు కాని తెలుగు రచయిత ఎస్. నటరాజన్ (శారద).

.శారద రాసిన మంచి చెడు అపస్వరాలు . ఆంధ్ర పత్రికలో సేరయాలుగా వచ్చేవి ..

1924లో తమిళునాడులో పేద బ్రహ్మణ కుటుంబంలో పుట్టి, పొట్ట కూటికై 12 వ ఏట తెనాలి వచ్చి, హొటల్‌లో సర్వర్‌గా జీవితం మొదలు పెట్టాడు. మొదట తెలుగు మాట్లాడడం నేర్చుకొని, 13వ ఏట తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకొని , 22వ ఏట తెలుగులో స్వంతంగా రచనలు చేసాడు.

మూర్చరోగంతో బాధ పడుతూ, రోజంతా గొడ్డు చకిరి చేస్తూ, రాత్రి గుడ్డి కిరసనాయిల్ దీపం వెలుతురులో తెలుగులో రచనలు చేసాడు. 

100 దాకా సాంఘిక, డిటెక్టివ్ కధలు, మంచీ-చెడు, అపస్వరాలు వంటి ఒక డజన్ నవలలు, ఇంకా నాటికలు, వ్యంగ్య రచనలు చేసి, కొడవటిగంటి, చలం, గోపిచంద్, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టుల మన్ననలు పొందాడు.

తొలిసారిగా ఆయన వ్రాసిన వ్యంగ్య రచన 'ప్రపంచానికి జబ్బుచేసింది'. 

ఇది 1946 లో ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడింది. ఆ రచన వారి సొంత పేరైన యస్.నటరాజన్ పేరు మీదే అచ్చయింది. ఆ రోజుల్లోనే, ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత 'చంద్రిక'ను మొదలు పెట్టారు. అయితే, వాటిని అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల ఎక్కువకాలం కొనసాగించ లేకపోయారు. 1948 నుండి1955 వరకు అంటే ఏడేళ్ళు మాత్రమే రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర, జ్యోతి, హంస వంటి పత్రికలు ఆయనకు మంచి ఊతమిచ్చాయి. ప్రస్తుతం, రక్తస్పర్స, శారదరచనలు, శారద నవలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

ఇవి కూడా, 'శారద' అభిమానుల పూనికవల్లనే వెలుగు చూశాయి. శారద, రావూరి భరద్వాజలు దాదాపుగా ఒకే సమయంలో రచనలను ప్రారంభించారు. 

ఇద్దరి మీదా చలం గారి ప్రభావం పూర్తిగా ఉంది. శారద జీవితమంతా దరిద్రంతోనే గడిచింది. ఒక చేత్తో, గారెలు చేసి అమ్ముతూ, మరో చేత్తో 'మంచి-చెడు' అనే నవలను వ్రాశారు. ఎంత దుర్భర పరిస్థితులు ఎదురైనా రచనా వ్యాసంగాన్ని మానలేదు. ఇక అతని శైలి చాలా భిన్నమైనది. ఎంచుకునే కథా వస్తువు విభిన్నంగా ఉండేది. ఈ రెండు లక్షణాలే శారదను తెలుగు సాహితీలోకంలో విశారదుడిగా నిలబెట్టాయి."కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి గార్ల రచనలకు వారధి వంటి వాడు శారద" అని ఆ రోజుల్లోనే సాహితీ ప్రియుల మన్ననలను పొందాడు శారద. కార్మిక ఉద్యమాలతో సంబంధమున్న ఈయన రచనలలో, కార్మికుల జీవనవిధానం కనపడేది. కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు పొందిన కార్యకర్త. ఇంతటి సాహితీ సుసంపన్నుడైన 'శారద' దుర్భర దారిద్ర్యంతో, మూర్ఛవ్యాధితో, 17-08-1955 న, తన 31 ఏటనే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఇదీ, 'శారద నీరదేందు ఘనసార' కన్నీటి కథ. నటరాజన్ అనే తమిళ యువకుడు 'శారద'గా మారిన నిజమైన కథ. 'శారద'జీవితం మరో సత్యాన్ని చెబుతుంది--కష్టాల కొలిమినుండే ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలిదప్పులు, దారిద్ర్యంఅతనిని భౌతికంగా బాధపెట్టాయేమో కానీ, అతనిలోని సాహితీ పిపాసను అంటుకోవటానికి, అడ్డుకోవటానికి కూడా అవి భయపడ్డాయి. కేవలం అతను ఒక రచయితే కాదు, తత్వవేత్త, క్రాంతదర్శి, దార్శనికుడు. తెనాలిలో ఆయన స్మారకచిహ్నాలు లేకపోవటం చాలా విచారకరం. ఆ మహనీయుని ఫోటో కోసం, నా దగ్గరవున్న ఆయన నవలనొక దానికోసం వెదికాను.ఆ నవల వెనకవైపు అట్టమీద ఆయన ఫోటో ఉంది. ఆ నవల కోసం ఎంత వెదికినా కనబడలేదు. "మంచి పుస్తకాలకు రెక్కలు వచ్చి ఎగిరి పోతాయి" అన్న నార్ల వారి మాటలు నిజమే కాబోలు. ఎవరైనా ఆయన ఫోటోను పంపితే ఆనందిస్తాను. తెలుగువారికి మంచి కథలను అందచేయటానికే ఆంధ్రదేశానికి వచ్చిన ఈ విశారదుడికి బాష్పాంజలి!

అనారోగ్యంతో, ఆకలి దప్పులతో జీవితాంతం పోరాడుతూ 17-08-1955 న 31 ఏళ్ళ చిన్న వయసులోనే కన్నుమూసాడు.

అపస్వరాలు విశ్వనాథ వారిని దృష్టి లో పెట్టుకొని రాసేడు అనెవారు.

మంచి చెడు లో పద్మ భాస్కర ల పాత్రలు .. విశ్వనాథ వారి చెలియలకట్ట గుర్తు చేస్తాయి .. విరి డిటెక్టివ్ నవల పలకల వెండి గ్లాసు కూడా చదివెను.. అబ్బో ఏనాటి కాలం మాట ...

విరే రాసిన ఏకాకి అసంపూర్ణం అనుకుంటా ..

...

వింజమూరి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!