పోతననీతి ! (బలి చక్రవర్తి శుక్రాచార్యులవారికి నీతి బోధించుట .అద్భుతం.)

పోతననీతి !

(బలి చక్రవర్తి శుక్రాచార్యులవారికి నీతి బోధించుట .అద్భుతం.)

.

"చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్? 

శిలలం జేసెనె బ్రహ్మదన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే; 

చలితం బౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ

దలఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణాధర్మాదినిర్ముక్తుఁడై !

.

మరణం మన స్నేహితుడా?.. 

యమ ధర్మారాజు మన చుట్టమా..

యమకింకరులు  మనసేవకులు కారుగదా..

బ్రహ్మదేవుడుమనలనిబండరాళ్ల తో చెయ్యలేదు...

ఈ మాయసంసారంలో దానం కరుణ దయాధర్మం లే సత్యంబు.

.


చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు; 

కాంతలు సంసార కారణములు; 

ధనము లస్థిరములు; దను వతి చంచల; 

గార్యార్థు లన్యులు; గడచుఁగాల

మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర; 

మని కాదె తమ తండ్రి నతకరించి

మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు; 

నీ పాదకమలంబు నియతిఁ జేరె

.


భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె

వైరులై కాని తొల్లి మా వారుఁ గాన

రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల

బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!