బాపురే విశ్వనాథ !

బాపురే విశ్వనాథ !

.

ఫేస్‌బుక్‌లో కనిపించిన దీనిని అనుమతి లేకుండా ప్రకటించినందుకు మన్నించమని వారికి విన్నపం. భండారు శ్రీనివాస రావు గారికి, ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదములు

1. ఏ

2. మంచి

3. కవైనా

4. విశ్వనాథ

5. గ్రంథావళిని

6. చదవకపోతే

7. కవిత్వరచనలో

8. పద్యనిర్మాణశక్తికి,

9. సద్గుణాలంకారవ్యక్తికి,

10. రసోచితశబ్దార్థయుక్తికి,

11. సుమకోమలభావభావనకు,

12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,

13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,

14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,

15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,

16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,

17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,

18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,

19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,

20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,

21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,

22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,

23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,

24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,

25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,

26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!

.ఈ వాక్యంలో 26 పదాలున్నాయి. 

మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ పదం ఇరవైయారు 

అక్షరాలతో ఉన్నాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!