భానుమతి గారు .. బల్లి !

భానుమతి గారు .. బల్లి !

.

భానుమతిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందరకూ తెలుసు.కానీ ఆమెలో ఉన్న ప్రత్యేకతలు చిన్న చిన్న బలహీనతలు - ఆ కుటుంబానికి సన్నిహితులే కే తెలుసు .

.

ఆమెకు బల్లి అంటే చచ్చే భయం. సినిమాలలో వేసే వేషాలు,రాసే రాతలు,ఇతరులు చెప్పుకునే కథలను బట్టి ఆమె చాలా ధైర్యశాలి అనుకుంటారు. కానీ కొన్ని విషయాలలో నమ్మలేనంత పిరికి.

.

ఒకరోజు డ్రాయింగు రూంలో కూర్చుని మాటాడుకుంటున్నారు,ఆమె,రామకృష్ణగారు...

ఆమెకు ఎదురు గోడ మీద బల్లి కనపడింది. కెవ్వున కేక వేసి ఎగిరి గంతువేసి,పక్క గదిలోకి పారిపోయి,నౌకరును గట్టిగా పిలిచి, అతను ఆ బల్లిని బయటకు తోలేదాకా ఆమె తిరిగి డ్రాయింగు రూముకి రాలేదు. రామకృష్ణగారు ఒకటే నవ్వు.ఆమెకు మాత్రం పది నిమషాలవరకు గుండెదడ ఆగలేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!