Tuesday, March 31, 2015

శ్రీ ఆంజనేయ స్తుతి

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు.!

.

శ్రీ ఆంజనేయ స్తుతి

.

 గోష్పదీకృత వారాశిం,మశకీకృత రాక్షసమ్.

రామాయణ మహామాలా,రత్నం వందే నిలాత్మజమ్.

అంజనా నందనం వీరం జానకి శోక నాశనం , 

కపీశ మక్ష హన్తారం , వందే లంకా భయన్గరమ్

మనో జవం , మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మాతం వారిష్టం , 

వాతాత్మజం వానర యుధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసా నమామి

ఆంజనేయ మతిఁపాటలాననం , కాంచనాద్రికమనీయ విగ్రహం , 

పారిజాత తరు మూల వాసినం , భావయామి పవమాన వన్దనం.

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్. 

బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.

బుధిర్బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం ఆరోగత 

అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ 

ఇతి ఆంజనేయ స్తుతి

Monday, March 30, 2015

భారత ధాత్రికి వందనం.

బంగరు పూవులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం

సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం


జీవనదులతో సిరులొలికించే చిర యశస్వినికి వందనం

పావన ఋక్కులు భవ్య కావ్యములు పలికిన మాతకు వందనం


హిమవదాది సుమహీధరాల విలసిల్లిన మాతకు వందనం

అమర ఋషీంద్రుల విమల వాక్కులు అలరిన మాతకు వందనం


సామగానముల జోలలు పాడుచు సాకెడు తల్లికి వందనం

సత సహస్ర నర నారీసంస్తుత చరణ పంకజకు వందనం


దివ్య శిల్పులను దివ్య గాయకుల తీర్చిన జననికి వందనం

దేశదేశముల కాదర్శమ్ముల తెలిపిన మాతకు వందనం

Thursday, March 26, 2015

సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది?


సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు?


 


రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..


అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం

ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే

అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్


అన్నారు. అంటే….  అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.


 


ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.


స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.


సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.


కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.


శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.

ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.


 


శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో

అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు

ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం

మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు


ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….

ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.

అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.

కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.

ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.


రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.


శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.


 


 

Wednesday, March 25, 2015

సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట.! . సావిత్రి ని ఆట పట్టించటానికి ఆమెను గిత్త తో పోల్చి ఆడుకున్న హాస్య పు పాట. ఆ పొగరు బోతు పొట్ల గిత్త కన్నూ ,మిన్నూ కాన రానిదట .పట్టుకుంటే మాసి పోయే పారు పళ్ళ గిత్త .అటు సావిత్రికి ఇటు గిత్తకూ సరి పోయే మాటల్ని చక్కగా పొదిగారు కొసరాజు .ఆమె పళ్ళను పార పళ్ళు అంటం ఎద్దేవాచేయటమే .ఎద్దు పళ్ళు కూడా పార పళ్ళు లానే ఉంటాయి . .ఆ గిత్త రూపమే బంగారం అవుతుందట .మీదకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుందిట .వెనక్కి వెళ్తే యెగిరి కాలు ఝాడిస్తుంది .విసురు కొంటు కసరుకొంటు అటూ ఇటూ ఇటూ అటూ గుప్పిళ్ళు పెడుతుంది ,కుప్పిగంతు లేస్తుంది ఆ గిత్తా ,ఆ అమ్మడు సావిత్రి కూడా .ఇద్దరి స్వభావాలు ఒకటే . అంతేనా –అదిలిస్తే రంకె వేసి బెదిరే గిత్త.కదిలిస్తే గంతులేసి కాండ్రు మనే గిత్త .దాని నడుము తీరు చూస్తె నవ్వు పుట్టుకొస్తుంది .మరి దాని నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తుంది .ఇంతకు మించి వన్నె చిన్నెల రాణి ఆటా అది .మంచి బోణీ ఇవ్వాలని కోరుకొంటున్నాడు నాయకుడు నాగేశ్వర రావు ,నమ్మిన బంటు .దాన్ని వదిలి పెడితే ఒట్టు అని ఒట్టెసుకొన్నాడు .ఇక దాని వగలను కట్టి బెట్టి లొంగి పొమ్మని అటు గిత్తనూ ఇటు గిత్త లాంటి అమ్మాయి సావిత్రిని హెచ్చ రించాడు . జాన పద సాహిత్యం లో పండిన కొస రాజు రాఘ వయ్య చౌదరి రాసిన పల్లె పదాలతో ఎద్దుల భాష లో ,పల్లె టూరి వాతావరణం లో ,నాయకా నాయిక ల హృదయావిష్కరణ లో తన పై చేయిని చూపిస్తూ నాయకుడు ఆడిన నాటకం .పరవశం కలిగించే పాట ఘంట సాల అమర గానం తో ఈ గీతానికొక మహర్దశ ప్రాప్తించింది ఆ విరుపులు ,ఓంపులూ సొంపులూ ,పరితాపం ,ఆమె పై ప్రేమ ,ఆమె తనది కావాలన్న ఆరాటం అన్నీ ఇందులో కలిసి పోయి హాయి హాయి అని పించాయి కొంటె పాట అయినా కోటి రాగాలున్న పాటఅయింది .కోణంగి పాటైనది.కాలు ఝాడించటం ,గుప్పిళ్ళు పెట్టటం ,కుప్పి గంతులేయటం ,రంకె వేయటం ,కాండ్రు మానటం ,,బోణీ కొట్టటం వంటి పదాలు పల్లె జీవితానికి వేసిన పందిరి . గిత్తలను గంగి రెడ్డు వాళ్ళు బహు చక్కగా ఆడిస్తారు వాడు చెప్పినట్లు అది అన్ని పనులూ చేస్తుంది .వంగి దణ్ణం పెడుతుంది .తలూపి ఆడిస్తుంది తోక ఝాదిస్తుంది .గిట్టల పై గిత్త డాన్సు కూడా చేస్తుంది.అలా తన వశం కావాలని అన్యాపదేశం ఇందులో ఉంది .అందుకే నాకు ఈ గీతం మకరందమయ్యింది .

Friday, March 20, 2015

ఉగాది శుభాకాంక్షలు... 

చిగురాకుల చిరు తొరణాలు, చిరుమావిళ్ళ నిండు కావడులు

చీనాంబారాల అలంకరణల శోభిల్లుతున్న సిరుల ప్రసాదించు సురులు

చిలకపచ్చ పావడాల పడచులు, చిందులతొ హోరెత్తించు చిన్నారులు

చిగురులు తొడిగి పచ్చదనాన పరవసించి మురిపించు ప్రకృతి సొగసులు

చేత వాద్యాలు పట్టి యజమానుల మెప్పుగొరవచ్చు గీతగాళ్ళు

చిత్రాలంకరణల శోభతొ పురప్రజల దీవించవచ్చు గరగలు

షడ్రుచుల సంగమముగ చేయు పత్యేక పచ్చడి నిండిన పాత్రలు

అవి వడ్డిస్తూ సకలైశ్వర్యాలు కలుగు జీవితం పొందమని ఆశీర్వదించు మాతృమూర్తులు

పంచాంగాలు చెతబట్టి వివరించ వచ్చు విపృలు, శ్రధ్ధగా విను పురప్రజలు

లోకకళ్యాణార్ధం సత్ ప్రవచనములు వల్లించు విఙులు, పురోభివృధ్ధికై యోచించు పాలకులు

పట్టువస్త్రల ధరించి పిల్లలను ఆశీర్వదించు పెద్దలు, వారి నుండి కానుకలు పొంది మురుయు పసివాళు

కొరమీసల రొశాలు చాటుతూ తిరుగు కుర్రవాళ్ళు, కొత్త వస్త్రాలు సొగసుల మురుయు బంధుమితృలు

అత్తవారింట అందాలు అలంకరించు కొత్తకోడళ్ళు, బావల ఆటపట్టించు ప్రయత్నాల మునుగు మరదళ్ళు

యెన్నొ, యెన్నెన్నొ మధుర స్మృఉతులు మహదానందకారకాలు...

మన్మద ఉగాది పండుగ తెలియపరచు నూతనవత్సర ఆనందభరితమవ్వాలని ఆకాంశిస్తూ, అందరికి ఇవే మా శుభాకాంక్శలు....

కవిత..శ్రీ Phanindra Bhargava Moparthi గారు.

Thursday, March 19, 2015

రావణ సంహారము:

రావణ సంహారము:

అనఘుం డుజ్జ్వల చాప దండమున బ్రహ్మాస్త్రంబు సంధించి యొ

య్యనఁ గర్ణాంతముగాఁ గడున్ దివిచి ప్రత్యాలీఢ పాదస్థుడై

దనుజాధీశ్వరు బాహుమధ్యము వడిం దాకంగ లక్ష్యంబుగాఁ

గొని బిట్టేసె నదల్చి తీవ్రతరమౌ కోపంబు దీపింపగన్.

(అనఘుండు = అఘములేనివాడు, పుణ్యాత్ముడైన శ్రీరాముడు; ఉజ్జ్వల చాప దండము = ప్రకాశిస్తున్న ధనుస్సు; కర్ణాంతముగా కడున్ దివిచి = చెవులవరకు వింటినారిసి సారించి; ప్రత్యాలీఢ పాదస్థుడై = శరసంధానము చేయునప్పటి భంగిమ; దనుజాధీశ్వరు = రాక్షసేశ్వరుడైన రావణుని; బాహుమధ్యము = రెండుచేతుల మధ్యన గల నాభిప్రదేశము; వడిన్ = వేగముగా; లక్ష్యంబుగా గొని = గురిచూసి; బిట్టేసె = బాణముతో కొట్టెను; తీవ్రతరమౌ = తీక్షణమైన; దీపింపగన్ = ప్రజ్వలిస్తుండగా)

భావము: రాఘవుడు తీవ్రమైన ఆగ్రహం ప్రజ్వలిస్తుండగా, ప్రకాశించే తన కోదండమునందు బ్రహ్మాస్త్రమును ఎక్కుపెట్టి, ప్రత్యాలీఢభంగిమలో నిలబడి, ఆకర్ణాంతము నారి సారించి, దశకంఠుని నాభిప్రదేశమునకు గురిచూసి, వేగముగా వెళ్ళి తాకేటట్లుగా బాణమును వదలినాడు.

ఆ వ్రేటు వడిగ నాటిన

రావణు డతివివశు డగుచు వ్రాలె ధరిత్రిన్;

దేవతతి పొగడి యప్పుడు

పూవులవర్షంబు గురిసె భూవరు మీదన్.

(వ్రేటు = దెబ్బ; నాటిన = తాకిన; వివశు డగుచు = తనను తాను నిలువరించుకోలేక సోలిపోయి; వ్రాలె = పడిపోయెను; దేవతతి = సురల సమూహము; భూవరుడు = రాముడు)

భావము: బ్రహ్మాస్త్రపు వ్రేటునకు గురియైన రావణుడు వివశుడైపోయి, ధారుణిపై వ్రాలి, అసువులు వదిలినాడు. అప్పుడు దేవతలందరు శ్రీరాముణ్ణి స్తుతించి, ఆయనపై పుష్పవర్షమును కురిపించినారు.

(రామాయణము, యుద్ధకాండము - మొల్ల.....వివరణ ..Satyanarayana Piska గారు..)

Tuesday, March 17, 2015

గిలిగింత.!

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది.

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది.

.

ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది.

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది

.

పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా....తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా.!

లటుకు...చిటుకు.!

లటుకు...చిటుకు.!

.

పెళ్ళి చేసి చూడు - ఇల్లు మారి చూడు

."అద్దె పది వేలు"..

"అద్భుతం సార్.."

"మెయింటెనన్స్ పదమూడు వేలు"

నేను ఆయన అసిస్టెంటు వైపు తిరిగి.."ఇదిగో..సార్ మీకేదో చెబుతున్నారు" అన్నాను

"నేను చెబుతున్నది నీకే. మెయింటెనన్స్ పదమూడు వేలు."

"అంటే మొత్తం ఇరవైమూడు వేలా? అసలు అంత మెయింటెనన్స్ ఎందుకు సార్? రోజూ పరిచారికలు వచ్చి నాకు గులాబి రేకులతో స్నానాలు చేయిస్తారా ఏంటి? మీరు 'ధిక్ ' అన్నా సరే..నేను అంత మెయింటెనన్స్ కట్టను.." అన్నాను

"అద్దెకు ఉన్న వారి కోసం ఎన్ని సదుపాయాలు ఏర్పాటు చేసామో తెలుసా?" అని..

"కింద జిం ఉంది" అన్నాడు

"అలవాటు లేదు"

"విమానం పార్కింగ్ ఉంది"

"అవసరం లేదు"

"పిల్లలను ఆడించటానికి డేకేర్ సెంటర్ ఉంది.."

"నాకు పెళ్ళే కాలీదు.." 

"వెరీ గూడ్. ఇక్కడ మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది.."

తిరుపతి గంగమ్మ జాతర లో నేర్చుకున్న బూతులన్నీ తిట్టి, అక్కడి నుంచి బయటికొచ్చేసాను..

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

లటుకు...చిటుకు .! (2)

"ఏరా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా?"

"పరీక్షల టైం లోనా..మమూలు టైం లోనా?"

"అన్ని సమయాల్లోనూ రా.."

"అంటే..పరీక్షల సమయాల్లో, రిజల్ట్ వచ్చేముందు ..మనసులో ధ్యానించుకుంటాను - 'వచ్చే సెప్టెంబర్ లోనైనా ప్రశ్నాపత్రం లో ప్రశ్నలేవీ లేకుండా చూడు తండ్రీ' అని. మమూలు సమయాల్లో - అంటే..పేకాటాడేప్పుడు, లాటరీ టికెట్లు కొన్నప్పుడు, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడేప్పుడు..'అవతలి వాడు సర్వనాశనమై పోయి...ఈ ప్రపంచమంతా సుఖ సౌభాగ్యాలతో తలతూగేలా చూడు స్వామీ..' అని లోకకళ్యాణం కోసం కోరుకుంటాను.."

"నీ లాంటి వాడికి ఏ నడి సముద్రం లో మునుగుతున్నప్పుడో తప్ప...దేవుడి విలువ తెలియదు రా.."

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

Saturday, March 14, 2015

బుడుగా?

బుడుగా?

..

నేను చదివాను. ఓహ్.. హీ ఈజ్ మై ఆల్-టైమ్ ఫేవరెట్. ఐ లవ్ హిమ్!” – సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వదులుకోలేదు.

లవ్ – ఎంత తేలిగ్గా పలికేస్తుంది ఆ పదం. 

ఎంత అందంగా ధ్వనిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది. గాల్లో తేలినట్టూ, ఈల వేసినట్టూ.

ఏం హాయిలే హలా!

x

ఆరుద్ర ఉవాచ,,!

ఆరుద్ర ఉవాచ,,!

,

అట్టేకాలం నిలిచేది కాదు ఆంధ్రులలో ఐకమత్యం

ఇట్టే ఋజువు చేయవచ్చునంటారు ఇందులో సత్యం

ఇద్దరు తెలుగువాళ్ళున్నచోట మూడు సంఘాలు

విడివిడిగా ఉండాలి వాళ్ళవాళ్ళ రంగాలు

ఒకటి సాగుతూ ఉంటే సవ్యంగా

ఇంకోటి పుట్టుకు రావాలి నవ్యంగా

అధికస్య అధికం ఫలం

అందరూ ఎక్కొచ్చు అందలం


x

ఒక మనసు ఉన్న కధ.!

ఒక మనసు ఉన్న కధ.!

.

“ఓ అందమైన భార్యా భర్త ఉంటారు. ఇక్కడ అందం అంటే రూపు రేఖల్ని గురించి కాదు. మనస్సు గురించి.............. మనస్సుల్లో కల్మషం లేనంతవరకూ 

ఏ బంధమైనా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ జంటలో భర్తకి ఓ వాచ్ ఉంటుంది. 

వాచ్ బావుటుంది కానీ దాని స్ట్రిప్ అంతగా బాగోదు. అతనికెలాగైనా స్ట్రిప్ ని గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందని ఆమె అనుకుంటూ ఉంటుంది. 

ఐతే ఆమె దగ్గర డబ్బులుండవు. అందమైన కురులు మాత్రమే ఉంటాయి. ఆమె భర్తకి ఆమె కురులంటే భలే ఇష్టం. ఆ కురులకి ఇంకా అందం తెచ్చేట్టు ఉందనిపించేలా ఓ క్లిప్ కనిపిస్తుంది. అతనిదగ్గరా డబ్బులుండవు. 

దాంతో చేతికున్న వాచీ అమ్మేసి ఆ క్లిప్పు, ఇంకొన్ని సామాన్లు ఆమెకోసం కొనుక్కుని ఆమెదగ్గరికి వెళ్తాడు. ఓయ్ .. నీకో గిఫ్ట్ తెచ్చానంటాడతను . 

నేనూ మీకోసం ఓ గిఫ్ట్ కొన్నాను అంటుందామె. ఇద్దరూ ఒకేసారి గిఫ్ట్ లు చేతులు మార్చుకుంటారు. ఆమె కురులకోసం అతను వాచీ అమ్మేస్తే, ఆమె అతని వాచీకోసం 

ఆమె కురుల్ని అమ్మేసి స్ట్రిప్ కొంటుంది.

చివరకి ఇద్దరికీ ఇష్టమైనవి ”

“ రాముడెవ్వానితో రావణు మర్దించె?

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

.


పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.

.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)

2.రంగనగరం! ( శ్రీరంగం )

3.లకోల కోల! ( కోల= బాణం)

4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)

5.మందార దామం! ( దామం అంటే దండ)

6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)

7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)

8.నంద సదనం! ( నందుని ఇల్లు)

పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

Friday, March 13, 2015

మనసు లోతుల్లో ఏదో బాధ..

మనసు లోతుల్లో ఏదో బాధ..(అప్పు గారి కవిత.)!

మనసు లోతుల్లో ఏదో బాధ 

దేని కోసమో వెతుకులాట 

ఎవరి కోసమో ప్రాకులాట 

కళ్ళ వెంట నీరు నదిలా ప్రవహిస్తుంది 

గుండెలోని బాధ చెరువులా ముంచేస్తుంది 

ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఇంకేదో దూరమవుతున్నట్టు

చుట్టూ ఎంత మంది ఉన్నా

ఒంటరితనం కమ్ముకుంటుంది

నా ఆలోచనలలో నాకంటూ తావు లేకుండా

వేరే ప్రపంచంలో విహరిస్తున్నాయి

ఎవరికోసం ఈ ఆరాటం 

దేనికోసం నామనసు చేస్తున్న ఈ పోరాటం

కళ్ళల్లో నీరు కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది

గుండెల్లో బాధ గునపమై గుచ్చుకుంటుంది

ఎన్నటికి ఆగేను ఆ కన్నీరు ఎప్పటికి తీరేను ఈ హౄదయ పోరు

మాతృదేవోభవ".!

మాతృదేవోభవ".!

,

మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా"

ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు

.

"అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే"

.

మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు.

ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం

Wednesday, March 11, 2015

తప్పనిసరియై కూలికి చిప్పలుగొని పోయినారు స్త్రీలున్ గూడన్.

కం.

అప్పుల పాలై పౌరులు

తిప్పలు పడినారు, తగిన తిండియు లేమిన్

తప్పనిసరియై కూలికి

చిప్పలుగొని పోయినారు స్త్రీలున్ గూడన్.

(భీమ శంకరం గారి పద్యం.)

కాకికి కాకీక కాక కాకికి కోక కైకు?

కాకిగోల.!

నేను చదువుకునే రోజుల్లో మా తెలుగు మాష్టారు 'కాకి - కోకిల' ల మధ్య కనిపించే సారూప్య, వ్యత్యాసాలని వివరిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పేవారు:

కాకః కృష్ణః పికః కృష్ణః 

కో బేదః పిక కాకయో: 

వసంత కాలే సంప్రాప్తే 

కాకః కాకః పికః పికః

దీని అర్థం ఏంటంటే : కాకి నల్లగా ఉంటుంది . కోకిల కూడా నల్లగా ఉంటుంది . కానీ వసంత కాలంలో కాకి గొంతు లోని కాఠిన్యం, కోకిల గొంతులోని మాధర్యం సులువుగా గుర్తించ వచ్చు .

ఆ రోజుల్లోనే మా స్నేహితులు ఈ క్రింది వాక్యానికి అర్థం చెప్పమనేవారు:

కాకికికాకీకకాకకాకికికోకేల ?

పై వాక్యాన్ని అర్థవంతంగా విడగొడితే ఈ విధంగా వ్రాయ వచ్చు:

కాకికి కాకీక కాక కాకికి కోకేల ?

అంటే దీని అర్థం: కాకికి దాని తాలూకు ఈకలే చీరగా (కోక) ఉపయోగ పడినప్పుడు, ఆ కాకికి వేరే చీర (కోక) అవసరం ఏముంది?

నేను హైదరాబాదీయుడిని కాబట్టి పై వాక్యానికి కాస్త ఉర్దూ మిలాయించి ఇలా రాసాను:

కాకికి కాకీక కాక కాకికి కోక కైకు? 'కైకు' అంటే అర్థం చెప్పక్కర లేదనుకుంటా. ఎలా ఉంది?

పోతే, (ఎవరూ అని అడక్కండి) మన పట్టణ వాసులకి కాకుల కలకలారావాల తోటే తెల్లారుతుందని నా అభిప్రాయం . ఎందుకంటే , ఇక్కడ కోళ్ళూ కనిపించవూ, వాటి కూతలూ వినిపించవూ కాబట్టి .

మళ్ళీ బాల్యం లోకి వెళ్తే , ఒకే జామ కాయని 'కాకి ఎంగిలి' చేసి మిత్రులతో పంచుకోవడం మనకి అనుభవమే కదా !

'అనగనగా ఒక కాకి . ఆ కాకికి దాహం వేసింది , ఎక్కడా నీళ్ళు లేవు , ఒక్కచోట ఒక కుండలో అడుగున కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, కాని అవి కాకికి అందలేదు , అప్పుడు కాకి అలోచించి కొన్ని గులకరాళ్ళు తెచ్చి కుండలో వేసింది , అప్పుడు నీళ్ళు పైకి వచ్చాయి , అప్పుడు ఆ కాకి అ నీళ్ళు తాగేసి హాయిగా ఎగిరిపోయింది .' ఈ కధ మన చిన్నప్పుడు మన అమ్మమ్మలూ , నాయనమ్మలూ చెప్తే, లాజిక్కులు అడక్కుండా విని ఆనందించాము . అదే ఇప్పటి కాకి అయితే గులకరాళ్ళ కోసం చూడకుండా ఒక స్ట్రా తీసుకొని కుండ లోని నీళ్ళని తాగుతుందని ఈ మధ్య ఎవరో ఇంటర్నెట్ లో సచిత్రంగా వివరిస్తే చూసి తరించాను . వీటిని బట్టే 'కాకమ్మ కధలు' పద ప్రయోగం వాడుక లోకి వచ్చిందేమో!

సర్కారు వారు చేస్తున్న అభివృద్ధి వివరిస్తూ, వాళ్ళు మనకు చెప్పే అంకెల గారడీలు 'కాకుల లెక్కలు' కాదంటారా?

'కాకుల లెక్కలు' అంటే చిన్నప్పటి మరో విషయం గుర్తుకొస్తోంది:

ఒక అబ్బాయిని మరో అబ్బాయి ఇలా అడిగాడు - ఒక చెట్టు మీద పది కాకులు కూర్చున్నాయి. అందులో ఒక కాకిని తుపాకీ తో కాల్చావనుకో . ఇంకా ఆ చెట్టు మీద ఎన్ని కాకులు ఉంటాయి?

ఈ ప్రశ్నకి ఆ మొదటి వాడు 'తొమ్మిది' అని చెప్తే వాడ్ని ఓ అట పట్టించకుండా వదలరు కదా . ఇప్పుడు అటువంటి అమాయకపు పిల్లలు లేరనుకోండి.

'పంచతంత్రం లో కూడా ఈ 'కాకమ్మ' కథల ప్రస్తావన ఉంది. ఇది పిల్లలకి సుపరిచితమే .

సుమతీ శతకం లో కూడా కాకుల ప్రస్తావన ఉందండోయ్ !

'అల్లుని మంచితనంబును 

గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ 

బొల్లున దంచిన బియ్యము 

దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ'

సుమతీ శతక కారుడు పై నాలిగింటినీ అరుదైనవిగా చెప్పుకొచ్చాడు. ముగింపుగా కాకులన్నీ నల్లగానే ఉంటాయని తేల్చి చెప్పాడు .

పోచికోలు కబుర్లతో కొందరు కాలక్షేపం చేస్తుంటారు . ''ఏమిటర్రా మాట్లాడుకుంటున్నారు?' అంటే , 'ఏముందీ , ఏవో కాకమ్మ కబుర్లు' అన్న జవాబు వస్తుంది.

బయటి వాళ్ళకి అనిపించినా , అనిపించక పోయినా , ఎవరి పిల్లలు వాళ్ళకి నచ్చుతారు కదా . 'కాకి పిల్ల కాకికి ముద్దు' కాదూ ?

తన, మన అనే వాళ్ళు లేకుండా ఒంటరి జీవితం గడిపే వాళ్ళని 'అతనికి ఎవ్వరూ లేరు, అతను 'ఏకాకి' అంటాము కదా .

ఒక వ్యక్తి గురించో, అతని వ్యక్తిగత సమస్యల గురించో చుట్టుపక్కల వాళ్ళు పలు రకాలుగా మాట్లాడుతూంటే 'లోకులు కాకులు' అనడం మామూలే .

ఏదో సాయం కోరుతూ మనం ఎవరింటికైనా వెళ్ళామనుకకోండి. వాళ్ళేమంటారో తెలుసా? మీకెందుకండీ శ్రమ, కాకితో కబురెడితే నేనే వచ్చే వాడ్ని కాదూ - అని.

రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవలు ఉంటే, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు - అంటారు కదా . 

'కాకి దొండ' అని ఓ కూరగాయ కూడా ఉందిట . కాని నాకు దాన్ని చూసే అవకాశం రాలేదు.

జిలుగు వెలుగులతో ధగధగా మెరిసిపోయే వస్త్రాభరణాలని 'కాకి బంగారం' అని చెప్పడం మనకు తెలుసు. 

ఒక కాకికి ఏదైనా ఆపద కలిగితే మిగతా కాకులన్నీ అరిచి గోల పెడుతూ వాటి సమైఖ్యతని చాటుకుంటాయి . 

ఇంట్లోనో , స్కూల్లోనో పిల్లలు బాగా గోల చేస్తుంటే, ' ఆపండి మీ కాకి గోల ' అంటాము కదా .

ఏ జంట అయినా ఈడు జోడు సరిగ్గా లేకపోతే వాళ్ళని కాకి ముక్కుకు దొండపండులా ఉన్నారని అంటాము . 

మన పురాణాల్లో కాకిని శని దేవతకు వాహనముగా వర్ణించడం మనకు తెలుసు.

కాకిలా కలకాలం బతికే కన్నా హంస లా ఆర్నెల్లు బతికినా చాలు - అనే ప్రయోగం మనం తరచూ వాడుతుంటాం కదా .

ఎవరికైనా ఆకస్మిక మరణం సంభవిస్తే దాన్ని 'కాకి చావు' అంటారని ఓ నిఘంటువులో వివరించారు .

Tuesday, March 10, 2015

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.!

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.!

.

ఎప్పుడూ తిట్టే మిత్రుని పాత్రను అడ్డుపెట్టి తన విమర్శకులకు సమాధానం

ఇలా ఇస్తారు విశ్వనాథ గారు.

నీవు నన్ను తిడుతున్నావంటే అర్థమేమిటంటే నన్ను చదువు తున్నావన్న మాట! 

చదవక తప్పదన్న మాట. నీకు తెలియకుండానే నన్ను మెచ్చుకుంటున్నావన్న మాట.

అసలు తిట్టడానికీ, మెచ్చుకోవడానికీ పెద్ద భేదం లేదు. రెండూ ఒకటేననుకో. 

రూపాయి ఉందనుకో. అక్షరాలవైపు ఒకటీ. బొమ్మ వైపు ఒకటీ. ఎటు తిప్పినా రూపాయే.

కొండరేం చేస్తారంటే అర్థరాత్రి వేళ వస్తారు. తలుపు తట్టుతారు. ఎవరు వారు అంటే నేను అంటారు. ఏమి నేను, శ్రాద్ధం నేను .

,

నేను విష్ణుశర్మని కాదని అర్జీ పెట్టుకున్న వాళ్ళందరూ ఏకవాక్యంగా వీరేశలింగం పంతులు గారు గనుక ఒప్పుకుంటే పంచతంత్రం రాసింది ఈయనేనని ఒప్పుకుంటాము అన్నారు.

"'నేను రాసిన పుస్తకానికి ఒకడు ఒప్పుకోవడమేమిటి? మీలో ప్రతివాడూ ఎవడో ఒకడై ఉంటాడు కదా! వాడు వాడేనని ఇంకొకడు చెప్తే గానీ కాడా ఏమిటి?"' 

. "ఎవ్వడూ ఎరగని వాడొకడుంటాడు, వాడి గతి ఏం కావాలి?" . 

"వాడి గతి అంతే" .

వావ్.. బుడుగు!”

వావ్.. బుడుగు!”

.

పరీక్షలకు కావాల్సిన పుస్తకాలేవో దొరక్క, ఎండలో మాడు పేలిపోతుంటే, 

నీడకని ఓ కొట్టు దగ్గర ఆగాం. ఇంకా వేడిగాల్పు కొడుతూనే ఉంది. 

అందుకని పుస్తకాలను చూసే వంకతో కొట్లోకి దూరాం. కొనే ఉద్దేశ్యం లేదు కాబట్టి

, పైపైన పెట్టిన పుస్తకాలే పుణుక్కుంటున్నాను. లోపలికెళ్ళిన నా స్నేహితురాలు,

“యు రిమెంబర్ హిమ్?” అనడిగింది.

“హు?” అంటూ చూశాను చేతిలో పుస్తకం.

.

“వావ్.. బుడుగు!” ఆనందాశ్చర్యాలకు చోటు చాలక, కళ్ళు పెద్దవయ్యాయి.

ఇంటికొచ్చాను. “చూడు, మన ఇంటికి ఎవరు వచ్చారో?!” అని అమ్మకి చూపించాను.

.

“నా బంగారు తండ్రే!” అని వాణ్ణి దగ్గరకు తీసుకొని, “ఏ తల్లి కన్న బిడ్డో..” అననబోయి నాలుక్కర్చుకొని నవ్వింది.

“వాళ్ళ అమ్మ పేరు రాధ. వాణ్ణీ దేవుడు తీసుకొచ్చి వాళ్ళింట్లో పడేసాడట. నాకన్నీ బస్సులోనే చెప్పేసాడు తెల్సా.. ” – నాతో ఇదో సమస్య,

నాకే కొంచెం తెల్సినా లొడలొడా వాగేస్తాను.

“వెళ్ళి కాళ్ళు కడుక్కురా.. టిఫిన్ పెడతాను.”

“నో.. ఇది చదవటం అయితే గానీ, ఏం తినను.”

చదవటం అయింది. పుస్తకం ఎక్కడ పెట్టానో..

.“నీ పుస్తకాలన్నీ అటూ ఇటూ పడేస్తావేం?! చూడు, నేనే సర్దాలా అన్నీ..” అక్కర్లేని నాన్న సాయం.

” ఆ పుస్తకం అక్కడ కాదు. పై అరలో. అర్రె, నేనిప్పుడా పుస్తకం చదువుతా కదా, పెట్టదు. నే చదూతాఆ! బుడుగ్గాడేడీ? ఉన్నాడా! ఒకే!” – నేను థాంక్స్ చెప్పే విధానం.

“బుడుగా? నేను చదివాను. ఓహ్.. హీ ఈజ్ మై ఆల్-టైమ్ ఫేవరెట్. ఐ లవ్ హిమ్!” – సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వదులుకోలేదు.

లవ్ – ఎంత తేలిగ్గా పలికేస్తుంది ఆ పదం. ఎంత అందంగా ధ్వనిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది. గాల్లో తేలినట్టూ, ఈల వేసినట్టూ. ఏం హాయిలే హలా!

Sunday, March 8, 2015

కావాలిస్తే తెలుగొచ్చిన తెలుగువాణ్ణి అడుగు.!

.వీడి పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు.
కావాలిస్తే తెలుగొచ్చిన తెలుగువాణ్ణి అడుగు.!

.

మాది అమ్మాయిల బడి. నలుగురు వాచ్‍మెన్లు, ఇద్దరు మాష్టర్లూ, ఒక కాంటీన్ వాడు తప్పించి మగపురుగు కూడా కనిపించదు. నేను ఏడో తరగతిలో ఉండగా, ఎలా వచ్చాడో మరి ఒక పిల్లాడు, మా తెలుగు టీచర్ వేలు పట్టుకొని దర్జాగా వచ్చేశాడు. “ఎవరు?”, “ఎవరు?” అన్న గుసగుసల మధ్యలోనే కబుర్లు చెప్పటం మొదలెట్టాడు.


“సరసం అంటే నాకు తెలీదనుకో.” అన్నాడు అమాయకంగా.


“మనకూ తెలీదుగా!” అన్నారు టీచరు లౌక్యంగా


“మాకు తెల్సుగా” అనుకున్నాం కొంటెగా. నవ్వుకున్నాం ముసిముసిగా.


పరీక్షలవ్వగానే, అందరికీ బై-బైలు చెప్తూ, బుడుక్కి కూడా చెప్పేయటం అయిపోయింది.


***************

ముళ్ళపూడి వారి సందేహాలు.!

ముళ్ళపూడి వారి సందేహాలు.!

.

“అరే, నేనెలా మిస్సయాను.” 

.

ఆడ అప్పారావు లా…. (అప్పీరావు అనాలా?)

Saturday, March 7, 2015

"అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే"

సరదాగా కాసేపు.!.....
"అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే"

.

ప్రాంతీయ తెలుగు సాంస్కృతిక సంఘం వారు, పాత సినీపాటల తో ఒక 

కార్యక్రమం ఏర్పాటుచేస్తున్నారని తెలుసుకొని దాని గురించి ఆలోచిస్తుంటే, 

జ్ఞాపకాల రైలు కదిలింది, రీలు తిరిగింది!

"రాజశేఖరా నీ పై మోజు తీర లేదురా, రాజసాన ఏలరా" పాడుతున్నారు 

ఒక్కరు.

ఆ పాట అయిపోయిందో లేదో కాని, దాన్ని అయిపోనిచ్చేలాగా ఇంకొకరు 

అందుకున్నారు "వస్తాడు మా బాబు ఈ రోజు, రానె వస్తాడు నెలరాజు ఈ సారి" 

అని పెద్దగా పాడడం వినిపించింది.

ఇంకొకాయిన మైకును ఆవేశంగా లాగేసుకొని మొదలుపెట్టాడు

"రాయినైనా కాకపోతిని అవ్వారి తలలను తాకగా

కోతినైనా కాకపోతిని తోకతో వూరేగగా"

మీకసలు సరిగ్గా పాటలు గుర్తుకు రావడంలేదు, నేను పాడతానని ఒకామె 

అందుకున్నారు "పాడనా తెలుగు పాట, పరవశమై పరేషాన్ చేయంగ 

పాడానా" అంటూ.

ఏమిటండీ ఇది, ఇట్లా చెత్తగా పాడుతున్నారు. ఒక్క భక్తి పాటైనా 

పాడుకుందాం అని ఒకాయన మొదలుపెట్టాడు

"ఎంత మధురం నీ నామం, 

ఎంత దివ్యం నీ రూపం, శ్రీనివాసా, వేంకటేశా" అని 

బావురుమన్నాడు. అంత మధురమైతే ఇంత ఏడుపెందుకని ఇంకొకాయిన 

మైకు లాక్కొన్నాడు.

"రానిక నీ కోసం సఖీ రాదిక వసంత మాసం, వాకిలిలో నిలబడకు 

ఇంక నాకై".. అంటూంటే, ఒకాయన ఆయన్ని తోసేసి మైకు 

లాక్కొని, "రాకపోతే రాకు, అపార్ట్మెంట్లో మేముంటుంటే ఇక వాకిలంటే 

ఏంది" అని ఆయన కొత్త పాట అందుకున్నాడు.

"ఎంత హాటు ప్రేమయో, ఇంత లేటు వయసులో" అంటుంటే, ఇంకొకాయిన 

ఆర్ద్రంగా నిలబడి "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్" అని 

మొదలుపెట్టాడు.

నేను మీకు ఎడమవైపునే నిలబడ్డానని ఒకాయన మైకు లాగేసుకున్నాడు.

"మనిషి గతి ఇంతే, మనసు గతి ఇంతే, 

మనసున్న మనిషికి సుఖము లేదంతే,

ఒకరికిస్తే మరలి రాదు" అంటూ ఊగిపోతున్నాడు.

ఇంకొకాయన ఆయన్ని నిలబెట్టి మైకు లాక్కున్నాడు, మరలి రానిది 

మనసు కాదు మైకు అని అంటూ.

"ఏతకేతం బెట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగనన్నా 

నేను గంజిలో మెతుకెరుగనన్నా" అన్ని గట్టిగా పాడుతున్నాడు.

అసలు ఫస్ట్ భోజనం చేసింది ఆయన్నే, దిట్టంగా తిన్నతరువాత 

స్టేజెక్కి మెతుకెరుగను అంటాడు, ఇదేమి న్యాయం అని ఇంకొకాయిన మైకు 

లాక్కున్నాడు.

పెద్దలేనా పాటలన్నీ పాడేడయడం, ఇదిగో ఈ చిన్ని పిల్లాడు 

పాడుతానంటున్నాడు, వీడికి కూడా ఒక అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలి 

అని ఒకాయన పిల్లాడికి మైకిచ్చాడు.

"ఎలుకా ఎలుకా ఉచ్ ఎక్కడికెల్లావ్ ఉచ్ 

కొమ్మ మీది కోతి చూసావా, 

పక్కనున్నా పిల్లి చూసావా

ఎలుకా ఎలుకా ఉచ్" అనేసరికి అందరూ భలే పాడాడు అబ్బాయి అని 

చప్పట్లు కొట్టారు.

ఒకాయన ఈ వూరి ఘంటసాలను నేనే అని చెప్పుకొని ఒక మంచి పాట 

పాడుతానంటూ అందుకున్నాడు

"ఊహలు గుస గుస లాడె, ప్రియురాలు రుస రుస లాడె,

వలదన్న వినదీ మనసు, వినిపించుకోదీ వయసు" అని అంటుంటే 

సభాధ్యక్షుడు ఇది గాన సభా లేక కాకిసభా అని ఇలా 

మొదలెట్టాడు.

"అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే"

Friday, March 6, 2015

రమణ తన రచనాస్త్రాలు .!

రమణ తన రచనాస్త్రాలు .!

,

కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి, తన స్వార్థం కోసం ఇంకోళ్లను బలి చేయడానికి వెనుకాడని సుబ్బారావు మామగారు (జనతా ఎక్స్‌ప్రెస్‌), 

.

డొక్కుదైనా సరే ఓ కారు కొనేస్తే గొప్పవాళ్లయిపోతామనుకునే సుందరమ్మ (జనతా ఎక్స్‌ప్రెస్‌),

.

ఇంట్లో పెళ్లాం పిల్లలు పస్తులున్నారని తెలిసినా చేతిలో ఉన్న ఒక్క రూపాయి హోటల్లో తిండికి ఖర్చు పెట్టేసిన చిరుద్యోగి (మహరాజూ యువరాజూ),

తిండికి లేకపోయినా సిగరెట్టు కోసం తపించే నిరుద్యోగి (మహరాజూ యువరాజూ)

.

మామయ్య వాచీ తాకట్టు పెట్టేసి పేకాడేసిన గురునాధం (ఈశ్వరేచ్ఛ)

.

, సినిమా లోకంలోనే నివసిస్తూ ఇహలోకంలో విఫలమయ్యే యువకుడు (సెరిబ్రల్‌ సినేమియా);

.

తమ్ముడి కోసం వెతుకుతూ, సినిమా చూడ్డానికి వెళ్లిపోయిన ఎస్కేపిస్టు పగటికలల కుర్రాడు (ఛాయలు) 

.

వీళ్లందరినీ కాగితాలపై కెక్కించి వాళ్లను వెక్కిరించిన రమణ లక్ష్యం ఏమిటి? 

ఆయన నిష్క్రియాత్వాన్ని (ఏమి చెయ్యకుండా చూస్తో ఉరుకొనే తత్వం.)నిరసించాడు

.

x

రాధమ్మ బాకీ' !

రాధమ్మ బాకీ' !


(రాధా గోపాలం) కథలో అదర్‌సైడ్‌ ఆఫ్‌ ది కాయిన్‌ చూపాడు రమణ గారు..

సాధారణంగా తామే స్త్రీల కోసం ఊహూ తపించి పోయి, ప్రేమించి పెళ్లాడి వాళ్లని 

ఉద్ధరించామని అనుకునే పురుషులకు కనువిప్పు కలిగేట్లా,

స్త్రీలు కూడా తాము వలచిన వారి కోసంఎలా తపన పడతారో, 

ఎన్ని కష్టాలు పడతారో, అయినా పెదవి విప్పి ఎందుకు చెప్పరో

రాధా గోపాలం కథలో చక్కగా వర్ణించారు.

చిలిపి ప్రశ్నలు.!

చిలిపి ప్రశ్నలు.!

.

 కాకి కావు కావుమని ఎందుకు అరుస్తుంది?

(నోరుంది కాబట్టి!)

 పోపుల డబ్బాను తేలిగ్గా ఉంచాలంటే అందులో ఏం పెట్టాలి?

(చిల్లుల) 

నీరు ఎప్పుడు తాగగలం?(

ద్రవరూపంలో ఉన్నప్పుడు!)

 బోరింగు ఎంత కొట్టినా బిందె నిండలేదు ఎందుకని?

(బిందె తిరగేసి పెట్టారు కాబట్టి)

 ఎదుటి వారు మన మాటలను ఆత్రుతగా వినాలంటే ఏమి చేయాలి?

(మాట్లాడాలి!) 

ఈగ తేనెలో పడితే ఏమవుతుంది? 

(తేనెటీగ అవుతుంది) 

మిరపకాయ కొరికితే ఏమవుతుంది?

(ముక్కలవుతుంది) 

సూర్యాస్తమయం స్పష్టముగా ఏ కాలంలో కనిపిస్తుంది?

(సాయంకాలం) 

నిఘంటువులో తప్పుగా ఉండే పదం? 

(తప్పు అనే పదమే) 

ఒంటినిండా రంధ్రాలున్నా నీటిని నింపుకోగలదు, ఏమిటది?

 (స్పాంజి)

 సూది, దారం అవసరం లేకుండానే ఎవరు కుట్టగలరు?

(దోమలు, చీమలు)

 తిరగలేని మర?(పడమర) 

మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్నముల్లు, పెద్దముల్లు ఎక్కడుంటాయి?

(గడియారంలో) 

అన్నమాటకు వ్యతిరేకం?

(తమ్ముని మాట!)

 HOTEL లో టీ ఎక్కడ ఉంటుంది?

(O,E ల మధ్య)

 పున్నమి నాడు చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తాడు?

(మనం చూస్తాం కాబట్టి)

 జనాలు గుడికెందుకు వెళతారు?

(అవి మన దగ్గరకు రావు కాబట్టి) 

ఒక వ్యక్తి విమానంలో నుంచి ప్యారాచుట్ లేకుండా కిందికి దూకినా ఏమి కాలేదు. ఎలా?(విమానం ల్యాండై ఉంది కాబట్టి) 

వాటర్ లో ఐస్ వేస్తే ఏమవుతుంది?

(ఐస్ వాటర్ అవుతుంది) 

మీ ఒక చేతిలో యాభై మామిడి పండ్లు, మరో చేతిలో యాభై అరటి పండ్లు ఉన్నప్పుడు మీకు ఏమున్నట్టు?

(రెండు పెద్ద చేతులున్నట్టు!) 

దేవుడు లేని మతం ఏది?

(కమతం)

 రాజులు నివసించని కోట ఏది?

(తులసి కోట)

 నోరు లేకపోయినా కరిచేవి, ఏవి?

(చెప్పులు)

 చేయడానికి ఇష్టపడని ధర్మం?

(కాల ధర్మం)

 ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర?

(విసన కర్ర)

 ఒక్క డ్రైవర్ తో నడిచే రెండు బస్సులు? 

(డబల్ డక్కర్ బస్సు) 

ఆలోచన లేకుండా చేసే పని ఏది?

 (ఊపిరి పీల్చుకోవడం) 

నిండు నూరేళ్ళు ఎవరు బ్రతుకుతారు? 

(ఆయుష్షు ఉన్నవాళ్ళు) 

గడియారంలో పదమూడు గంటలు కొడితే అది ఏ సమయం? 

(రిపేరు సమయం) 

భారతీయులు శ్రీలంక వాళ్ళకన్నా ఎక్కువ అన్నం తింటారెందుకు? 

(మన జనాభా ఎక్కువ కాబట్టి) 

తిరుపతి లో ఎవరు గుండు కొట్టించుకుంటారు?

 (జుట్టు ఉన్నవాళ్ళు) 

మనకు కలలు ఎందుకు వస్తాయి?

 (కంటాం కాబట్టి) 

భరత్, పాకిస్తాన్ ల మధ్య ఏముంది?

 ('కామా' ఉంది) 

అప్పుడప్పుడు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? 

(నవ్వలేవు కాబట్టి)

 తినగలిగే నగ ?-----------> శనగ 

తినలేని ఫలం ------------------>కర్మ ఫలం 

మానవత్వం ఎక్కడుంటుంది?------------------->తెలుగులో 

ఏనుగులు ఆహారాన్ని ఏ సమయంలో తింటాయి?--------->ఆకలైన సమయంలో 

చప్పట్లకు వ్యతిరేఖం ఏది?---------------------------------->పుల్లట్లు 

ఇస్తానంటే వద్దనని బలి?------------------------------------>అంబలి

 మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?----------->పెన్నుతో

 అల్లరి నరేష్ కారు నడపాలంటే ముందు ఏమి చేస్తాడు?------->కారు తలుపు తీస్తాడు

. గోడ మీద నుంచి టీవిలో సినిమా చూస్తున్న బల్లిపిల్లని తల్లి ఏమని వారిస్తుంది?

------->సినిమా బాగున్నా చప్పట్లు కొట్టద్దని 

గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు ?--------------------->నుదుటికి

 రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు ఎలాగా ?-------------->రసం తీసి 

ఈ ప్రపంచంలోనే ఉండదు.అయిన మనం వాడతాం.ఏమిటది ?----------->గాడిద గుడ్డు 

డ్రైవర్ లేని బస్ ------------------------------------------------------->సిలబస్

 చలి కాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?-------------------------->కప్పు ఖాళీ అవుతుంది.

 ఒకే గొడుగు కింద నలుగురు వెళ్ళినా, తడవలేదు. ఎందుకు? ----------> వర్షం పడటం లేదు కాబట్టి

బాపు గారి బొమ్మ మనసు.! .

బాపు గారి బొమ్మ మనసు.!

.

కళ్లలోనే వుండిపోయాడు కానీ

గుండెల్లోకి ఎప్పుడూ చూడలేదు.!

Wednesday, March 4, 2015

ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన.....(

ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన....
.
.
ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు. వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు.
.
శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా
భరత శతృఘ్నులపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా
మారుతాత్మజులప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా
సుగ్రీవుడాకొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా
… …
సకలదేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను

సీతాదేవి వచ్చి రాముడివైపు తిరిగి “రామమచంద్రా, మనం అడివికి వెళ్తున్నపుడు, లక్ష్మణుడితోపాటు ఊర్మిళ కూడా వొస్తానంది, అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు, అప్పటినించి ఆవిడ నిద్ర పోతోంది. లక్ష్మణుడిని వెళ్ళి ఆమెను లేపమనండి.” అని సవినయంగా మనవి చేస్తుంది.
తాము అడివికి వెళ్ళిన రోజు మొదలుకొని ఊర్మిళ నిరంతరాయంగా నిద్రపోతోందని రాముడికి అప్పుడే తెలుస్తుంది. వెంటనే తమ్ముణ్ణి వాళ్ళావిడ దగ్గరికి పంపిస్తాడు, ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళతాడు.
 నిద్రపోతున్న ఊర్మిళ చీర సవరించి, ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా ఆవిడతో మాట్లాడడం మొదలు పెడతాడు.

కొమ్మ నీ ముద్దుమొగమూ సేవింప కోరినాడే చంద్రుడూ ….
అమృతధారలు కురియగా పలుకవే ఆత్మ చల్లన చేయవే

అ నిద్రలో తన గదిలోకి ఎవరో పరపురుషుడు ప్రవేశించాడనుకుంటుంది ఊర్మిళ.

తన్ను తా మరచియున్న ఆకొమ్మ తమకమున వణకదొడగే

.

మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో

.

హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ
కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

.
.
ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయే
పరసతిని కోరి గాదా రావణుడు మూలముతొ హతమాయెనూ

.

ఆడతోడా బుట్టరా మావంటి తల్లి లేదా మీకును

.

శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ
.

న్ను బాసినది మొదలూ ప్రాణసఖి నిద్ర హారములెరుగనే
నీవు లేవకయున్ననూ ఓ సఖీ ప్రాణములు నిలుపలేనే
.
మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా
.
సింహవిక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ?

ఇది విశేషమైన ప్రశ్న. లక్ష్మణుడి పరాక్రమం మీద ఊర్మిళకి అపారమైన విశ్వాసం ఉందని ఇప్పుడు చెప్పించడంలో కవయిత్రి ఉద్దేశించిన సూక్ష్మం ఒకటి వుంది. ఇంతవరకూ ఊర్మిళ అన్న మాటలవల్ల దెబ్బ తిని, కుంగిపోయిన అతని ఆత్మ విశ్వాసాన్ని, మళ్లా ఆవిడే పునరుద్ధరించగలదు. మొగవాళ్ల బలమూ బలహీనతా కూడా ఆడవాళ్ల చేతుల్లోనే వున్నాయని కవయిత్రికి తెలుసు..

x

పాండురంగ మాహాత్మ్యము!..... ....తెనాలి రామకృష్ణకవీంద్రుడు .!


పాండురంగ మాహాత్మ్యము!..... ....తెనాలి రామకృష్ణకవీంద్రుడు .!

.

ఈ చిగురాకు నీప్రసవ మీపువుఁ దేనియ యెంత యొప్పెడిన్

జూచితిరే యటంచుఁ దనచుట్టు శుకాదులుఁ గొల్వగాఁ గప

ర్థాంచిత చంద్ర గాంగజలమైన శివాహ్వయకల్పశాఖ వే

దాచల మంత్రికీర్తి కలశాబ్ధిని వెన్నెలమాడ్కిఁ జూచుతన్.

.

శివుడు తన కృతిభర్తను పాలించు గాక యన్న యాశీర్వచనము.

శివుడు కల్పవృక్షము. శుకమహర్షి మొదలైనవారీ కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు.

శివుని జుత్తు – జడముడి – చివురాకు. చంద్రుడు పువ్వు. గంగ తేనియ.

.

ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా

విదితంబైన మహిన్ మహాంధ్ర కవితా విద్యానల ప్రౌఢి నీ

కెదురేరీ? సరసార్థ బోధఘటనాహేల పరిష్కార శా

రద నీరూపము రామకృష్ణకవిచంద్రా! సాంద్ర కీర్తీశ్వరా!

.

తూర్పు కొండలు, పడమటి కొండలు, దక్షిణ సముద్రము, ఉత్తరాన హిమాలయ పర్వతం – ఈ నాలుగు ఎల్లల మధ్య గల యావద్భారతదేశంలో మహాంధ్ర కవితా విద్యలో, ఓ రామకృష్ణకవీంద్రా, నీ అంతటి మహాకవి వేరొకరు ఎవరు? ఎవరూ లేరు. సరసమైన అర్థబోధ ఘటించెడి ఒయ్యారపు నగలు గల సరస్వతీ దేవి నీ రూపము! అని విరూరి వేదాద్రి మంత్రి అన్నాడని పాండురంగమాహత్మ్యము అవతారికలో రామకృష్ణకవీంద్రుడు చెప్పుకున్నాడు. కృతి స్వీకరించే సందర్భంలో వేదాద్రి మంత్రి మహాకవికి తాంబూలం ఇచ్చాడు. కవి ఆ తాంబూలాన్ని ఈ రమణీయమైన పద్యంలో వర్ణిస్తున్నాడు.

.

పలుకుం దొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలు నయ్యింతి చె

క్కులఁ బోలుం దెలనాకులయ్యువిద పల్కుల్వంటి కప్రంపుఁ బ

ల్కులతోఁ గూడిన వీడియంబొసఁగు నాకుం బద్మనాభార్చనా

కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్

.

సరస్వతీదేవి (పలుకుల తొయ్యలి) పెదవుల (మోవి) కాంతికి సమానమైన (ఎనయౌ) పోకచెక్కలు (బాగాలు); [మౌళి కాంతి కెనయౌ - అనే పాఠాంతరం కూడా ఉంది.

సర్వశుక్లాం సరస్వతీ అన్నారు; ఆవిడ ఆపాదమస్తకం తెలుపేనట!] 

ఆ ఇంతి చెక్కులను పోలే పండుతమలపాకులు (తెలనాకులు); [తమలపాకుల్లో కవటాకులెంత భోగమో పండుటాకులు అంతకంటే భోగమట] 

ఆమె పలుకులవంటి పచ్చకర్పురపు పలుకులతో కూడిన తాంబూలాన్ని ఇచ్చాడట. ఏ చేతులతో అయితే పద్మనాభస్వామిని నిత్యం అర్చిస్తాడో ఆ చేతులతో – 

కంకణాలు ఝణఝణ ధ్వనులు చేస్తున్న ఆ హస్తాలతో ఈయనకి తాంబూలం అందించాడట.

ఇది ఎక్కడి పోయకాలమో .....

ఇది ఎక్కడి పోయకాలమో ..... మనం కష్టాలు లో ఉంటేనే దేవుడు గుర్తు వస్తాడు.

.

సా గినంత కాలం మనకంటే అధికులు ఎవరు కనపడరు.!

Monday, March 2, 2015

అరగుండు + అరగుండు = ఎంత?...”గుండు ! ..... (కథ- శ్రీ చంద్రశేఖర్ ఇండ్ల)

.


“మీరెన్ని చెప్పినా నేనొప్పుకొనేదేలేదు” అని ఖచ్చితంగా చెప్పింది వెంకటమ్మ గుడ్డలమూటమీద బాసిపట్లేసుకొని కూర్చుంటూ.

.


“నీకే అంతుంటే నీ మొగుడ్ని అందునా మొగోడ్ని నాకెంతుండాలి, నేను మాత్రం ఎందుకొప్పుకుంటాను” ఎదురు ప్రశ్నించాడు యాకోబు కండవని తలకు చుట్టుకుంటూ.

.


కథ మళ్ళీ మొదటికొచ్చేసరికి కందులూరు గ్రామస్థులందరికి విసుగొచ్చి లేచి ఇంటికి వెళ్ళాలనిపించింది. చూస్తే కరెంట్ లేదు టీవీలు కూడా రావు, ఇంటి దగ్గర పనులేమి లేవనే విషయం గుర్తుకొచ్చి ఊరికే వచ్చే ఆనందాన్ని ఎందుక్కాదనాలని అక్కడే కూర్చుండి పోయారు.

.


“ఒరేయ్ వెంకటేసు నువ్వే చెప్పరా మీయమ్మ మాట వింటావా ? మీ నాన్న మాట వింటావా?” అన్నాడు అంత అందమైన తగాదా లో నిశ్శబ్దాన్ని భరించలేక తంబారంబావ ( తంబారం అనే వూరి నుంచి కందులూరు కొచ్చిన మొట్ట మొదటి అల్లుడు కాబట్టి అందరు అతన్ని బావ అనే అంటారు).

.


తను నమ్మేవన్ని నగ్న సత్యాలే అని నమ్మే ఆదాము, నత్తేసేబు, కత్తేసు, చిన్న నవాకు, పెద్ద నవాకు, పేతురు, దేవనందం, కొండయ్య, గోవిందమ్మ, జానూ, ఉలిపిరి నాగేంద్రం మరియు ఆమె ఏడేళ్ళ కూతురు నల్లకుమారి, మేరిమ్మ, మరియమ్మ, ఇస్రాంతమ్మ, రూబేను, పులిబొంగరాలు (పుణుగులు) అమ్ముకునే ఆదెయ్య, జిలకర ఏసుపాదం, మాజీ పసిరెంటు పిచ్చమ్మ తదితరులందరూ ఆసక్తిగా వెంకటేసు వైపే చూస్తున్నారు ఏమి చెప్తాడా అని. నవమాసాలు మోసి, కని ,పెంచి ఇప్పుడు తూర్పుకి తిరిగి కూర్చున్న అమ్మ మాట వినాల? లేకపోతే అమ్మకు, తనకు అన్నీ తానే అయ్యి ఇప్పుడు పడమరకు తిరిగి కూర్చున్న నాన్న మాట వినాలో అర్ధం కాని వెంకటేసు అలా ఆకాశంలోకి చూస్తు పట్టపగలే చుక్కలు లెక్క పెడుతుంటే వెనకాలగా వచ్చి వెంకటేసు తల్లో పేలు చూడడం మొదలెట్టింది నాన్నమ్మ కోటమ్మ.


ఇంతలో దేవుడిలా వచ్చాడు సుబ్రమణ్యం మాష్టారు. ఆనాడు కూలికిబోయిన యాకోబును, ఆసామి కూతురు వెంకటమ్మ ప్రేమిస్తే, అది అర్ధం చేసుకొని యాకోబు వెంకటమ్మ కు మనసిస్తే, ఇది తెలిసిన ఆసామి కోపంతో ఇంతెత్తున యెగిరి గంతేస్తే, ఆయన్ని కాదని ఆరోజుల్లోనే కులాంతర వివాహం జరిపిన జూనియర్ కందుకూరి అతను. ఇంకా చెప్పాలంటే యాకోబు వెంకటమ్మలకు కొడుకు పుట్టినప్పుడు ‘నా కొడిక్కి వెంకటేశ్వరస్వామి పేరు పెడతానని వెంకటమ్మ , కాదు ఏసుప్రభు పేరు పెడతానని యాకోబు గొడవ పడుతుంటే అలా కాదని వెంకటేశ్వర స్వామిలోంచి వెంకటను తీసి, ఏసుప్రభు లోంచి ఏసును తీసి దానికి గుణసంధి సూత్రం ఆపాదించి, వెంకట+ఏసు=వెంకటేసు అని నామకరణం చేసిన ఈ కాలపు తెనాలి రామలింగడతను. అటువంటి మహానుభావున్ని చూసి గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకొని పైకి లేచారు.

.


సుబ్రమణ్యం మాష్టారు నవ్వి, అందర్నీ కూర్చోమని సైగ చేసి, తనూ పక్కనే వున్న నాబ్బండరుగు మీద కూర్చుని, చేతి కర్రను జాగ్రత్తగా ఒల్లో పెట్టుకొని, నిమిషాల్లో విషయం తెలుసుకొని గర్వంగా మీసాలు దువ్వి , ఛాతి నిండా గాలి పీల్చి “ఓస్ ఇందుకేనా గోలంతా! ఎరీ సింపుల్, అరగుండు + అరగుండు = ఎంత?” అని అడిగాడు అక్కడ కూర్చున్న వాళ్ళని , ఆ లెక్కకు జవాబు తెలియక అందరు తిక మక పడుతుంటే ఆ గుంపులో వున్న జాన్ అప్పుడే స్కూల్కి వెళ్ళడం మొదలెట్టిన తన ఆరేళ్ళకొడుకుని చెప్పమన్నాడు. ఆ పిల్లాడు బాగా ఆలోచించి, బలపం కోసం బ్యాగంత వెతికి అది కనపడక పోయేసరికి వేలితో నేలమీద రాసి మరీ చెప్పాడు “అరగుండు + అరగుండు = రెండరగుండ్లు” అని. అది విన్న జాన్ సంతోషంతో సుబ్రమణ్యం మాష్టారు వైపు చూసాడు ‘అవును కదా!’ అన్నట్లు. మాస్టారు ఆ అజ్ఞానులను చూసి అందంగా నవ్వి “అరగుండు + అరగుండు = గుండు” అని, వెంటనే “ అంటే వెంకటేశ్వర స్వామికి సగం వెంట్రుకలు, ఏసుప్రభు కి సగం వెంట్రుకలు ఇస్తే సరి “ అన్నాడు పొంగిన ఛాతిని ఇంకొంచం పొంగిస్తూ . “అదెలా కుదుర్తుంది” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

ఏం తేడా పడింది?

ఏం తేడా పడింది?

.

స్వతంత్రం వచ్చిందని తెలిసి ఆబాలగోపాలం తెగ సంబరపడిపోయారు. ‘‘ఇన్నాల్టికి కష్టం ఫలించింది’’ అనుకున్నది బామ్మ.

.

ఆ మర్నాడు గారెలకి పప్పు నానపోయాల్సి వచ్చింది. ఎటూ స్వతంత్రం వచ్చింది కదా, రాత్రే దేనికి పొద్దున్నే నానపోయచ్చులే అంది బామ్మ. అమ్మకేమీ అర్థం కాలేదు. పొద్దున్నే నానపోస్తే అవి సమయానికి నానలేదు. మరి స్వతంత్రం వచ్చిందన్నారు - ఏమి తేడా పడిందని దీర్ఘాలు తీసింది బామ్మ.

.

.

మూడు వాయలు పప్పు రుబ్బడానికి మూడు గంటలూ పట్టింది. ‘‘స్వతంత్రం వచ్చిందన్నారు కదే’’ అన్ని కళ్లతోనే అడిగింది - ఒక చెయ్యి పొత్రం మీద ఉంచి మరో చేత్తో ఎత్తిపొడుపు ముద్ర పట్టి. అమ్మకేం అర్థం కాలేదు.

.

‘‘అమ్మాయ్! నూనె కూడా ముందుకులాగే లాగాయి. ఏమీ తగ్గలేదు. తేడా ఏమిటో...’’ బామ్మ సమస్య ఏమిటో అర్థం అయింది గాని అమ్మకి ఎలా సర్దిచెప్పాలో అర్థం కావడం లేదు.

సాయంత్రానికి గారెల బుట్ట ఖాళీ అయింది. మునుపు మూడు రోజులు బుట్ట కళకళలాడుతూ ఉండేది. ఇదేవిటో బుట్టెడు గారెలూ మరు పూటకే మాయం అయినాయంటూ బామ్మ బుగ్గలు నొక్కుకుంటుంటే- ‘‘స్వతంత్రం వచ్చింది కదోచ్’’ అంటూ పిల్లలు అడుగూ బొడుగూ కూడా ఖాళీ చేసి పారిపోయారు. బామ్మకి స్వతంత్రం అంటే తినడం అని అర్థమైంది.

Sunday, March 1, 2015

ఆశ.

ఆశ. 

.

( మేఘ...కవిత.)

ఆకాశమనే ఓ పర్ణశాలను రంగులన్నీ అద్ది

ప్రపంచమనే వసుదైక కుటుంబానికి

పంచరంగుల అందాలను తోడుగా పంపి

చుట్టూరా ఆనందాలు నింపినా

అన్నీ ఉన్న మనసుకు తెలీలేని వెలితి

జీవితమనే పుస్తకానికి నేనున్నాను అంటూ

విడని నీడల్లే వెంటాడే అసంతృప్తి!

ఎంతున్నా ఎంతేత్తున్నా కడుపులోకి వెళ్ళేవి

నాలుగు వెళ్ళేలని కంటి నిండా కునుకే అని తెలిసి కూడా

పడి పడి లేచి పడి వడి వడిగా లేస్తూ పడుతూ ఆపని అంతులేని ఆరాటం

వేదనే వెంటాడినా వేరువని జీవితాన్ని ఒకటి చూడాలని నాకుంది

కోరికే ఉవ్వెత్తుగా ఎగసినా బోసి నవ్వుల చిన్ని పాపాయి నవ్వుల

సంతృప్తి మనసులో నింపుకొని సాగిపోవాలని కోరికుంది

స్వార్ధ చింతన, సంకుచితం,ఆవేదన, ఆక్రోశం మనషుల్లో లేకుండా ఉండే

ఒక్కనాటి ఆనందం రుచి చూడాలని ఆశైతే నాకుంది

x

మనసు లో మాట.!మనసు లో మాట.!

మనసు లో మాట.!

.

ఈ ప్రపంచంలో ABSOLUTE అన్నది ఏది లేదు. 

.

ప్రతిదీ RELATIVE కొలమానంలో నిర్దేశింపబడినదే.

.

నిన్న సరి అనుకున్నది నేడు సరికాకపోవచ్చు.

.

ఈరోజు ఇక్కడ సరి అనుకున్నది వేరేచోట అది సరి కాదేమో. 

.

ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతం

మనసు న మనసే ..తోడు ఉండిన .. భాగ్యం మన మహా నటి.!

x

అన్నమయ్య జోల పాట.!

అన్నమయ్య జోల పాట.!

.

జోఅచ్యుతానంద జోజో (రాగం: నవరోజు) (తాళం: ఖండచాపు)

జోఅచ్యుతానంద జోజో ముకుంద

రావె పరమానంద రామ గోవింద

నందు నింటను జేరి నయము మీఱంగ

చంద్రవదనలు నీకు సేవ చేయంగ

నందముగ వారిండ్ల నాడుచుండంగ

మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు

బాలుగా మునుల కభయమిచ్చినావు

మేలుగా వసుదేవు కుదయించినావు

బాలుడై యుండి గోపాలుడైనావు

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే

పట్టి కోడలు మూతిపై రాసినాడే

అట్టె తినెనని యత్త యడగ విన్నాడే

గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి

కొల్లలుగా త్రావి కుండలను నేయి

చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ

చిల్లతనములు సేయ జెల్లునటవోయి

రేపల్లె సతులెల్ల గోపంబుతోను

గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను

మాపుగానే వచ్చి మా మానములను

నీపాపడే చెఱిచె నేమందుమమ్మ

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి

జగడములు కలిపించి సతిపతులబట్టి

పగలు నలుజాములును బాలుడై నట్టి

మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి

అంగజుని గన్న మా యన్న యిటు రారా

బంగారు గిన్నెలో పాలు పోసేరా

దొంగ నీవని సతులు గొంకుచున్నారా

ముంగిట నాడరా మోహనాకార

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి

కావరమ్మున నున్న కంసుపడగొట్టి

నీవు మధురాపురము నేలచేపట్టి

ఠీవితో నేలిన దేవకీపట్టి

అలిగి తృణావర్తు నవని గూల్చితివి

బలిమిమై బూతన బట్టి పీల్చితివి

చెలగి శకటాసురుని జేరి డొల్చితివి

తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల

శృంగార రచనగా చెప్పెనీ జోల

సంగతిగ సకల సంపదల నీవేళ

మంగళము తిరుపట్ల మదనగోపాల....

.

https://www.youtube.com/watch?v=TobCFwDWmDE