"అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే"

సరదాగా కాసేపు.!.....
"అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే"

.

ప్రాంతీయ తెలుగు సాంస్కృతిక సంఘం వారు, పాత సినీపాటల తో ఒక 

కార్యక్రమం ఏర్పాటుచేస్తున్నారని తెలుసుకొని దాని గురించి ఆలోచిస్తుంటే, 

జ్ఞాపకాల రైలు కదిలింది, రీలు తిరిగింది!

"రాజశేఖరా నీ పై మోజు తీర లేదురా, రాజసాన ఏలరా" పాడుతున్నారు 

ఒక్కరు.

ఆ పాట అయిపోయిందో లేదో కాని, దాన్ని అయిపోనిచ్చేలాగా ఇంకొకరు 

అందుకున్నారు "వస్తాడు మా బాబు ఈ రోజు, రానె వస్తాడు నెలరాజు ఈ సారి" 

అని పెద్దగా పాడడం వినిపించింది.

ఇంకొకాయిన మైకును ఆవేశంగా లాగేసుకొని మొదలుపెట్టాడు

"రాయినైనా కాకపోతిని అవ్వారి తలలను తాకగా

కోతినైనా కాకపోతిని తోకతో వూరేగగా"

మీకసలు సరిగ్గా పాటలు గుర్తుకు రావడంలేదు, నేను పాడతానని ఒకామె 

అందుకున్నారు "పాడనా తెలుగు పాట, పరవశమై పరేషాన్ చేయంగ 

పాడానా" అంటూ.

ఏమిటండీ ఇది, ఇట్లా చెత్తగా పాడుతున్నారు. ఒక్క భక్తి పాటైనా 

పాడుకుందాం అని ఒకాయన మొదలుపెట్టాడు

"ఎంత మధురం నీ నామం, 

ఎంత దివ్యం నీ రూపం, శ్రీనివాసా, వేంకటేశా" అని 

బావురుమన్నాడు. అంత మధురమైతే ఇంత ఏడుపెందుకని ఇంకొకాయిన 

మైకు లాక్కొన్నాడు.

"రానిక నీ కోసం సఖీ రాదిక వసంత మాసం, వాకిలిలో నిలబడకు 

ఇంక నాకై".. అంటూంటే, ఒకాయన ఆయన్ని తోసేసి మైకు 

లాక్కొని, "రాకపోతే రాకు, అపార్ట్మెంట్లో మేముంటుంటే ఇక వాకిలంటే 

ఏంది" అని ఆయన కొత్త పాట అందుకున్నాడు.

"ఎంత హాటు ప్రేమయో, ఇంత లేటు వయసులో" అంటుంటే, ఇంకొకాయిన 

ఆర్ద్రంగా నిలబడి "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్" అని 

మొదలుపెట్టాడు.

నేను మీకు ఎడమవైపునే నిలబడ్డానని ఒకాయన మైకు లాగేసుకున్నాడు.

"మనిషి గతి ఇంతే, మనసు గతి ఇంతే, 

మనసున్న మనిషికి సుఖము లేదంతే,

ఒకరికిస్తే మరలి రాదు" అంటూ ఊగిపోతున్నాడు.

ఇంకొకాయన ఆయన్ని నిలబెట్టి మైకు లాక్కున్నాడు, మరలి రానిది 

మనసు కాదు మైకు అని అంటూ.

"ఏతకేతం బెట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగనన్నా 

నేను గంజిలో మెతుకెరుగనన్నా" అన్ని గట్టిగా పాడుతున్నాడు.

అసలు ఫస్ట్ భోజనం చేసింది ఆయన్నే, దిట్టంగా తిన్నతరువాత 

స్టేజెక్కి మెతుకెరుగను అంటాడు, ఇదేమి న్యాయం అని ఇంకొకాయిన మైకు 

లాక్కున్నాడు.

పెద్దలేనా పాటలన్నీ పాడేడయడం, ఇదిగో ఈ చిన్ని పిల్లాడు 

పాడుతానంటున్నాడు, వీడికి కూడా ఒక అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలి 

అని ఒకాయన పిల్లాడికి మైకిచ్చాడు.

"ఎలుకా ఎలుకా ఉచ్ ఎక్కడికెల్లావ్ ఉచ్ 

కొమ్మ మీది కోతి చూసావా, 

పక్కనున్నా పిల్లి చూసావా

ఎలుకా ఎలుకా ఉచ్" అనేసరికి అందరూ భలే పాడాడు అబ్బాయి అని 

చప్పట్లు కొట్టారు.

ఒకాయన ఈ వూరి ఘంటసాలను నేనే అని చెప్పుకొని ఒక మంచి పాట 

పాడుతానంటూ అందుకున్నాడు

"ఊహలు గుస గుస లాడె, ప్రియురాలు రుస రుస లాడె,

వలదన్న వినదీ మనసు, వినిపించుకోదీ వయసు" అని అంటుంటే 

సభాధ్యక్షుడు ఇది గాన సభా లేక కాకిసభా అని ఇలా 

మొదలెట్టాడు.

"అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!