Monday, April 29, 2013

ఏమి చైనా ఏమి చైనా

నె

.

నే హ్రు గారు ఏమి చైనా ఏమి చైనా అని పోగాడేవారు...

తరువాత ..యుద్ధం  ... 

ఏమి చెయ్యనా ఏమి చేయ్యయన అంటో తల పట్టుకున్నారు.

Sunday, April 28, 2013

రామ లాలీ మేఘ శ్యామ లాలీ

రామలాలీ

రామ లాలీ మేఘ శ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయా లాలీ

అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలో పాలరుగుగాని నిదురపోవరా

జోలలుబాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూ

ఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురా
వింతగాని కొండ నుండు వీరరాఘవా

దేవులపల్లి వారి దెశ భక్తి.

దేవులపల్లి వారి దెశ భక్తి.

.జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి

వామనావతారం పోతన.

.

వామనావతారం పోతన. 


.


ఒంటి వాడ నాకు నొకటి రెండడుగుల


మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల 


కోర్కె దీర బ్రహ్మ కూకటి ముట్టెద 


దాన కుతుక సాంద్ర దానవేంద్ర !!


.


గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో


వడుగే నెక్కడ? భూములెక్కడ ?కరుల్ వామాక్షు లశ్వంబు లె


క్కడ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితం బైన మూ


డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ !!


.


వారిజాక్షులందు వైవాహికములందు


ప్రాణ విత్త మాన భంగమందు


చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు


బొంక వచ్చు నఘము వొంద దధిప !!
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందిరే


వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై


పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాయులై


ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా !!
.వారిజాక్షులందు వైవాహికములందు


ప్రాణ విత్త మాన భంగమందు


చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు


బొంక వచ్చు నఘము వొంద దధిప !!
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందిరే


వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై


పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాయులై


ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా !!
.


ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై


నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై


నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!

చరిత్ర చాలా విచిత్రమైనది! (తనికెళ్ళ భరణి)

చరిత్ర చాలా విచిత్రమైనది! (తనికెళ్ళ భరణి)

చరిత్ర పుటల్ని తవ్వుకుంటూ పోతే...ఎన్ని అనర్ఘ రత్నాలు దొరుకుతాయో..! ఎన్ని ఘనీభవించిన కన్నీటి బిందువులు ముత్యాలై దొరుకుతాయో!

అన్ని రంగాల్లోనూ ఎప్పుడూ కొంత మందే వెలుగులో కనిపిస్తారు.. కొంతమందే ప్రముఖులుగా వినిపిస్తారు.
మిగతావాళ్ళూ!! మసకమసకై పోతారు..కంటికి కనిపించరు..చరిత్ర హీనులైపోతారు!
ఆ పాపం ఎవరిదీ?
మనదే కదూ..!
ఇదిగో అలా చరిత్రకందకుండా పోయిన మరో మహానుభావుడే యానం రామకృష్ణ.. 1912 లో కార్వేటి నగరంలో పుట్టాడు. ఆయన బలిజ కులస్థుడు. కళలకి కులం కూడా అడ్డమొచ్చే కాలం.. రామకృష్ణకి సంగీతం నేర్చుకోవాలన్న తపన ఉంది.. కానీ గురువేడీ!

అయితే అపారమైన సంకల్పబలం ఉంటే.. మార్గం అదే ఏర్పడుతుంది గామేసు..
దొరికాడు..
గురువు దొరికాడు..
అల్లాటప్పా గురువు కాదు.. సాక్షాత్తు ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్య ప్రశిష్యులకు శిష్యుడు.. ఎంత తపించాడు.. ఎన్ని గుమ్మాలెక్కి దిగాడు.. ఎన్ని అవమానాల్ని భరించాడు.. అలాంటి స్వాతి చినుకంటి యానం రామకృష్ణ వెళ్ళి ముత్యపు చిప్పలో పడ్డాడు.

నీరము తప్త లోహమున నిల్చి అనామకమైన నశించు - నీటి బిందువు వేడి వేడి పెనం మీద పడ్తే చుయ్ అని ఆవిరైపోతుంది.
ఆ నీ రమె ముత్యమట్లు నళినీ దళసంస్థితమై తరర్చు
అదే నీటి బిందువు తామరాకు మీద పెడితే కాస్సేపైనా ముత్యంలా మెరుస్తుంది.
ఆ నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ ఆ నీటి బిందువే ముత్యపు చిప్పలో బడిందో ముత్యమై మెరిస్తుంది.

దాన్నే యోగం..అంటారు..ప్లేస్ మెంట్..
ఎలాంటి మహానుభావుడు దొరికాడయ్యా అంటే.. ఆ మహానుభావుడి పేరు కూత్తనూరు అయ్యాస్వామి అయ్యరు... ఆయన భార్య లలితాంగి వీళ్ళ బిడ్డ.. ప్రముఖ గాయని ఎం.ఎల్. వసంత కుమారి.. ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్.

అరైకుడి రామానుజ అయ్యంగార్ మొదలైన మహానుభావులు.. ఈయన సహపాఠులు..
మరో విషయం ఏమిటంటే ఏదైనా తేలిగ్గా లభిస్తే..దానికి విలువుండదు. ఏదైనా కుప్పలకొద్దీ దొరికితే ఆసక్తి ఉండదు.
బంగారం చూడండి.. వెండి చూడండి..ఇనుము చూడండి.
మొత్తానికి రామకృష్ణ కొలిమిలో కాలాడు.
సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
గురువుగారి ఆశీస్సులు ... పుష్కలంగా పొందాడు.
చాలా చోట్ల కచేరీలు చేస్తున్నాడు.! ఎందరికో సంగీతం కూడా నేర్పిస్తున్నాడు. కానీ ఏదో అసంతృప్తి...
ఏదో శూన్యం గుండెల్లో..ఏదో బెంగా... ఏదో దిగులు..
ఏదో స్ఫూరించింది..అన్నమయ్య కీర్తనల్లే..

ఆకటి వేళల.. అలిసిన వేళల
చేకువ హరినామ మొక్కటే.. వేరే గతిలేదు

సంగీతనికి.. పరమార్ధం...పరమ .. అర్ధం... తోచింది.
ఓ రాత్రివేళ నిద్రపట్టక...కూనిరాగాలు తీస్తున్నాడు..
కృష్ణుడి విగ్రహం... పిల్లనగ్రోవి... ఊత్తోంది.. అందులోంచి

అగరుపొగలు...రంగురంగుల ఇంధ్రధనుస్సులు.. ఆనందలహరులు..
పిల్లనగ్రోవి..ఘంటమైపోయినట్టూ..కృష్ణుడు అది తన చేతపెట్టి ఆశీర్వదించినట్టూ
కలం కాగితం మీద పెట్టగానే భావ సముద్రాలు పొంగినట్టూ..
సప్తవర్ణాలు..ఉబికి ప్రవహించినట్టూ.. వెళ్ళిపోతోంది కలం... కలిసిపోతుంది గలం..?
గొంతెత్తి పాడ్డం...దాన్నే రాయడం..
తన్మయత్వంలో మునిగిపోతూ...కీర్తన.. సుధాలహరిని మొదలెట్టేశాడు..

కళ్ళముందున్న కన్నయ్యతో మాట్లాడుతున్నట్టే...తన గోడు వెళ్ళబోసుకున్నట్లే..కొన్ని స్తోత్రాలు..కొన్ని స్తవాలు...కొన్ని లాలి పాటలు.. కొన్ని జోలపాటలు.. కొన్ని మేలుకొలుపులు..కొన్ని ఆధ్యాత్మిక ప్రబోధాలు ఒకటారెండా.. మొత్తం నూట మూడు..
మొట్ట మొదట సంగీత త్రయంలోని ప్రధముడైన త్యాగరాజ స్తుతితో ఆరంభించాడు. రుద్రప్రియ రాగంలో..

మంత్ర తంత్రాలు నేను ఎరుగను..
నిన్నే తలుస్తూ ఉండే దాసులకు నేను దాసుడనూ..
రామకృష్ణనుత అనేది ముద్ర..

ఆ తర్వాత సరస్వతీ దేవిని కళ్యాణిరాగంలో వాణీసుత శర్వాణీ వనజాతాసన రాణీ.. అని రూపకతాళంలో స్తుతి.

ఇంకా.. శ్రీరాగం, నాటకురంజిరాగం, హంసధ్వని, నాటంగం హంసానందినిలో కామాక్షి స్తోత్రం..
భైరవి, అభోగి, జంఝాట, కళ్యాణి, సావిత్రి, మహాలక్ష్మిని గురించి మధ్యమావతిరాగంలోను..
నరసింహస్తుతి మార్ కౌస్.
ఇలా అనేక రాగాల్లో అనేక దేవతల్ని కరువుతీరా..కన్నీరు స్తుతించాడు రామకృష్ణ.
రాముడి మీద రాసిన ఒక కీర్తన;

కలడా లేడా రాముడు - కలనైన గాన రాడే మనసా
అంతవాడని యందురే జగమంత వాడని యందురే..
అంతరాత్ముడే రాముడుండ యిల వింతగాదే గానరాక యుంట

అలాగే యదుకుల కాంభోజి రాగంలో హనుమంతుని మీద కీర్తన.

హనుమంతా బలవంతా ఘనవంతా బ్రోవుమా
నిన్ను సన్నుతించలేదా ... నన్ను బ్రోవగారాదా
కన్నతండ్రివి కాదా...కాపాడుటకు వాదా
కిన్నెర సుత సాదా.. సన్నుతి జేసేదా!

ఇలా ఉంటుండగా ఒకసారి రామకృష్ణునికి కలరా సోకింది.
ఆ కాలం ఎలాంటిదంటే.. ఏ పెద్ద జబ్బొచ్చినా.. పసర్లూ.. కాల్చివాతలూ.. తప్ప సవ్యమైన మందులు లేని కాలం.. అన్నిటికన్నా అవగాహన లేని కాలం.. మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్న కాలం.

ఏదైనా మందు వేసాడో లేదో గానీ పరమ భక్తితో హనుమంతుణ్ణి ప్రార్ధిస్తూ..
కలరానుబారత్రోలు..కరుణతో మమ్మునేలు
చలమేలాశ్రితలోలా. ..సమయము ఇది వేళా
అంటూ ప్రార్ధించాడు. ప్రార్ధన బలం వల్ల కలరా పోయింది!

తెలుగులో చాల జోల పాటలున్నాయి. అందులో ముందు గుర్తొచ్చేది అన్నమయ్యది.. 
జో అచ్యుతానంద జోజో ముకుందా.. అని అది పాడుతుంటే వింటున్నవాళ్ళే ఖాదు..పాడ్తోన్న వాళ్ళూ కూడా పడుకుంటారు. అంత గొప్ప పాట.

అలాగే రామకృష్ణుడు ఒక అద్భుతమైన పాట రాశాడు.
బంగారు తొట్టేలో పవ్వళించర సామి
రంగానిదురబోర..జోల పాడేదా...

అంటూ జో కొడ్తూ.. రెండో చరణంలో చంకదిగని పసిబాలుడిలా ఎంతో ఎత్తు మరిగావు ఏం చెయ్యాలిరా రంగా...అండపిండాల్లో వెలిగేటి దొంగ..! అంటాడు. ప్రేమా..పిచ్చీ ఒకటి అని..కవి వాక్కు... పిచ్చంటే ఏవిటీ.. ఏదైనా ఒక విషయం మిద.. ఒక విషయం మీదే.. దృష్టిని కేంద్రీకరించడం..
డబ్బు పిచ్చి, పదవి పిచ్చీ.. స్త్రీల పిచ్చీ..అలాగే భక్తి పిచ్చి.
అందులో మునిగిన వాడికి ఐహికం పట్టదు.

మదిలో కోర్కెల లతలు తెగిపోతాయి. జుట్టు మాత్రం అట్టలు కడుతుంది. పలవరింపో కలవరిపో తెలీదు.. ఎవడ్తో మాట్లాడుతున్నాడో తెలీదు. వొళ్లంతా ఎండి పోయి ఉంటుంది. 
కళ్ళు మాత్రం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంటాయి.
తన సర్వస్వాన్నీ, పరమేశ్వరుడికి అర్పించి, అనుక్షణం ఆయనను స్మరిస్తూ.. అద్భుతమైన కీర్తనలు రాసి.. చరిత్రలో కరిగిపోయినా.. రామకృష్ణ..కిర్తన సుధాలహరి.. మాత్రం సంగీత విశ్వంలో చిరస్థాయిగా నిలుస్తుంది.!!

Saturday, April 27, 2013

కృష్ణ శతకము.

కృష్ణ శతకము. 
పదునాలుగు భువనంబులు
కుదరగ నీ కుక్షి నిలుపు కొను నేర్పరివై
విదితంబుగా నా దేవకి
యదరములో నెట్లు లొదిగి యుంటివి కృష్ణా!
.
కృష్ణ శతకము.
.ఓ శ్రీకృష్ణా!సమస్తములైన పదునాలుగు లోకములు నీ పొట్టలోనే ఉన్నవి గదా!అట్టి నీవు దేవకీదేవి గర్భములో ఎట్లు ఇమిడిపోయితివో పరమాశ్చర్యముగా ఉన్న విషయము గదా!
.
అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమున బుట్టి యా దేవికికిన్,
దుష్టుని కంసు వదింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా!
.
కృష్ణా!నీవు దేవకీదేవికి ఎనిమిదవచూలున రోహిణీ నక్షత్రముతో గూడిన అష్టమినాడు పుట్టి,లోక సంరక్షణార్థము పాపాత్ముడగు కంసుని (నీ మేనమామయైనను) చంపితివి.

శతకంద సౌరభముకంట నలుసు బడెఁ దామర
కంటికిఁ, దుంటరి యువకుఁడు గమనించెను, వె-
న్వెంటనె యాయమ చెలువపు
కంటికి నూదెను రమించి గాలినిఁ ద్వరగా

(రాధ కళ్లల్లో దుమ్ము పడితే కృష్ణుడు అలా చేసాడని ఒక గాథ ఉన్నది.)
.
శతకంద సౌరభమురచన : జెజ్జాల కృష్ణ మోహన రావు

దేశ భక్తి (గురుజాడ)

.దేశ భక్తి (గురుజాడ)

.


దేశమును ప్రేమించు మన్నా,


మంచి యన్నది పెంచు మన్నా;

.


వట్టి మాటలుకట్టి పెట్టోయ్


గట్టి మేల్ తల పెట్ట వోయ్!

.


పాడి పంటలు పొంగి పొర్లే


దారిలో నువు పాటు పడవోయ్ ;

.


తిండి కలిగితెకండ గలదోయ్


కండ గల వాడేను మనిషోయ్ !

.


ఈసురో మని మనుషు లుంతే


దేశ మేగతి బాగు పడునోయ్ ?

.


జల్దు కొని కళ లెల్ల నేర్చుకు


దేశి సరుకులు నించవోయ్!

.


అన్ని దేశాల్ క్రమ్మ వలెనోయ్


దేశి సరుకుల నమ్మ వలెనోయ్ ;

.


డబ్బు తేలేనట్టి నరులకు


కీర్తి సంపద లబ్బవోయ్ !

.


వెనక చూసినకార్య మేమోయ్ ?


మంచి గతమున కొంచెమేనోయ్

.


మంద గించక ముందు అడుగేయ్ !


వెనక పడితే వెనకెనోయ్ !

.


పూనుస్పర్ధను విద్య లందే


వైరములు వాణిజ్య మందే ;

.


వ్యర్ధ కలహం పెంచ బోకోయ్


కత్తి వైరం కాల్చవోయ్ !

.


దేశాభిమానం నాకు కద్దని


వట్టి గొప్పలు చెప్పు కోకోయ్

.


పూని యేదై నాను వొక మేల్


కూర్చి జనులకుచూపవోయ్ !

.


ఓర్వలేమి పిశాచి, దేశం


మూలుగులు పీల్చేసెనోయ్

.


ఒరుల మేలుకు సంతసిస్తూ


ఐకమత్యం నేర్చవోయ్ !

.


పరుల కలిమికి పొరలి యేడ్చే


పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?

.


ఒకరి మేల్ తన మేలనెంచే


నేర్పరికి మేల్ కొల్లలోయ్ !

.


స్వంత లాభం కొంత మానుకు


పొరుగు వాడికి తోడు పడవోయ్ !

.


దేశ మంటే మట్టి కాదోయ్,


దేశ మంటే మనుషులోయ్ !

.


చెట్ట పట్టాల్ పట్టుకొని


దేశస్థు లంతా నడవ వలెనోయ్,

.


అన్న దమ్ముల వలెను జాతులు


మతము లన్నీ మెలగ వలెనోయ్ !

.


మతం వేరై తేను యేమోయ్ ?


మనసు లొకటై మనుషులుంటే

.


జాతి యన్నది లేచి పెరిగి


లోకమున రాణించునోయ్ !

.


దేశ మనియెడి దొడ్డ వృక్షం


ప్రేమలను పూలెత్త వలెనోయ్,

.


నరుల చమటను తడిసి మూలం


ధనం పంటలు పండ వలెనోయ్ !

.


ఆకు లందున అణగి మణగీ


కవిత కోయిలపలుక వలెనోయ్

.


పలుకులను విని దేశమం దభి


మానములు మొలకెత్త వలెనోయ్ !!

.


Friday, April 26, 2013

శ్రీకాళహస్తీశ్వర శతకము.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివే / కుల్ జీవనభ్రాంతులై! 
కొడుకుల పుట్టరె కౌరవేంధ్రునకనే / కుల్,వారిచే నేగతుల్
పడసెన్? పుత్రులులేని యా శకునకున / వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ / శ్రీకాళహస్తీశ్వరా!
.
ధూర్జటీ

శ్రీకాళహస్తీశ్వర శతకము.

.
శ్రీకాళహస్తీశ్వరా!లోకంలో కొందఱు కొడుకుఅను కనలేక పోతిమి అని భాదపడెదరు.దృతరాష్ట్రునికి వందమంది పుత్రులు పుట్టలేదా?వారివలన యే సద్గతులు ఆయనకు కల్గినవి?పుత్రులులేని శుక మహర్షికి దుర్గతులు కల్గలేదు గదా!పుత్రులు లేని వారికి మోక్షము లభ్యము కాదా?అనగా పుత్రులు లేకపోయినను ముక్తిని పొందవచ్చును అని భావము.

Thursday, April 25, 2013

కృష్ణ శతకము

అక్రూర వరద మాదవ
చక్రాయుద ఖడ్గపాణి శౌరి ముకుంశా
శక్రాది దివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరుణఁ జూడుము కృష్ణా!
.
కృష్ణ శతకము
.
ఓకృష్ణా!నీవు అక్రూరుడు మొదలైన భక్తులకు కోరిన వరములను ఇచ్చినవాడవు. ధనమునకు దేవతయైన లక్ష్మీదేవికి నీవు భర్తవు. చక్రము, ఖడ్గము మొదలగు నాయుధములను ధరించి లోకముల భాదలను పోగొట్టు పరాక్రమము గలవాడవు. ఇంద్రాదులకు గూడ రాక్షసుల భాదను తొలగించుటజేత వారిచే ఎల్లపుడు కొనియాడబడువాడా, నీవు మహాత్ముడవు,నన్ను కృపతో చూడుము.

హనుమత్ జయంతి

నరసింహ శర్మగారు:- ఈ రోజు
హనుమత్ జయంతి అని భక్త జనులు అనుకుంటున్నారు. ఈ రోజు శ్రీసీతారామచంద్రుని పట్టాభిషేకము తరువాత వచ్చిన మొదటి పౌర్ణమి కావున శ్రీరామునికు యుద్ధములో అమితముగా సహాయము చేసిన స్వామి హనుమకు అయోధ్య ప్రజలు కృతజ్ఞతాపూర్వకముగా పూజలు సలుపుట సంప్రదాయము వచ్చినది. అది స్వామి హనుమ విజయోత్సవముగా జరుపుకోవాలి. స్వామి హనుమ వైశాఖమాసమున కృష్ణపక్ష దశమి పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతియోగమున మధ్యాహ్న సమయమున కర్కాటకలగ్నమందు, జన్మించెను. స్వామి హనుమ కౌండిన్యస గోత్రోత్భవులు.

.కృష్ణ శతకము


క్రూరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మ నందును బిలువన్
ఏ రీతి నేలుకొంటిని
యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా!

.కృష్ణ శతకము
.
ఓ కృష్ణా!అజామీళుడు అను బ్రాహ్మణుడు పాపాత్ముడు అయినను,నిన్ను ఉద్దేశింపక తన కొడుకును నారాయణా అని మృత్యుకాలమున పిలిచిన మాత్రమున అతనికి మోక్షమిచ్చితివే!అట్టి నీ సాటి దేవతలింకెవ్వరు, ఎక్కడును లేరు.


.

దాశరథీ శతకము భక్త రామ దాసు

రాముఁడు ఘోరపాతక విరాముఁడు,సద్గుణ కల్పవల్లికా
రాముఁడు,షడ్వికారజయు రాముఁడు,సాదుజనావనవ్రతో
ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁగెం
దామరలే భజించెదను,దాశరథీ!కరుణాపయోనిధీ!
(దాశరథీ శతకము భక్త రామ దాసు )
.
రామా!దయాసముద్రా!రాముఁడు మహాపాపవిరాముఁడు,సద్గుణ కల్పవల్లికా రాముఁడు,కామాది మనోవికారముల నాఱింటిని గెలుచటచే మనోహరుఁడు, సజ్జన రక్షణమనెడి వ్రతముచే నుద్దాముఁడు, మాకు రాముఁడే పరమదైవమని మీ పాదపద్మములనే పూ జింతును.

Wednesday, April 24, 2013

కృష్ణ శతకము


కృష్ణ శతకము
.
నీవే తల్లివిఁదండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియునిజముగ కృష్ణా!
.
ఓకృష్ణా!నాకు తల్లి,తండ్రి నీవే.నాకు ఎల్లపుడు వెంట ఉండువాడవు, సహాయము, స్నేహితుడు, గురువు, దేవుడు, నీవే నాకు సమస్తము నీవే నాకు దిక్కు.
.
నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహదానవవైరీ
క్షీరాబ్దిశయన యదుకుల
వీరా నను గావు కరుణవెలయఁగ కృష్ణా!
.
శ్రీమన్నారయణుఁడవు,లోకములన్నింటికి అధిపతివి,రాక్షసులను చంపినవాడవు,పాలసముద్రమందు పవ్వళించిన వాడవు,యదువంశమునందు పుట్టిన వీరుడైన ఓ కృష్ణా!నన్ను దయతో కాపాడుము.
.
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
.
ఓ శ్రీ కృష్ణా!హరియను రెండక్షరములు కలిసిన హరియను నీ పేరే పాపములను పోగొట్టుచున్నది.ఓ పరమేశ్వరా!కృష్ణా నీ నామ మహిమను ఎవ్వరును పొగుడుటకు శక్తులు గారు.

Tuesday, April 23, 2013

పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ- కన్యాశుల్కం లో ..... గురుజాడ మహాకవి..


కన్యాశుల్కం లో ..... గురుజాడ మహాకవి.!క.


ఖగపతి యమృతముతేగా

భుగభుగ మని పొంగి చుక్క భూమిని వ్రాలెన్

పొగచెట్టై జన్మించెను

పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ |క|
గజేంద్రమోక్షము

లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యెఁ బ్రాణంబులున్ఠావుల్ దప్పెను, మూర్చ వచ్చెఁ, దనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్ నీవే తప్ప నితః పరం బెఱుఁగ, మన్నింపదగున్ దీనునిన్,రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!పోతనామాత్య భాగవతము గజేంద్రమోక్షము నుండిఅరి దిగుచు మకరి సరసికి
కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్
కరికి మకరి మకరికి కరి
భరమనుచును నతల కుతల భటులరుదు పడన్  !!

నానానేకప యూధముల్ వనము లోనన్ పెద్ద కాలంబు స
న్మానింపన్ దశ లక్ష కోటి కరిణీ నాధుండ నై యుండి మ
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్చాయ లందుండ లే
కీ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా !!

కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో !!

లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వడు
ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !!

ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?
ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా
డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా  !!

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై !!

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సాహి యై !!

అడిగెద నని కడు వడి జను
అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్
వెడ వెడ జిడి ముడి తడ బడ
నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!


                                       


                          

Monday, April 22, 2013

రుక్మిణీకల్యాణము ..


ఘనుఁడా భూసురుఁ డేగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో
విని కృష్ణుం డది తప్పుగా దలఁచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుగదో నా భాగ్య మెట్లున్నదో

పోతనామాత్య భాగవతము దశమ స్కంధము, రుక్మిణీకల్యాణము నుండి

Sunday, April 21, 2013

కృష్ణ శతకము.

దేవేంద్రుఁడలుక తోడను
వావిరిగా ఱాళ్ళవాన వడి గురియింపన్
గోవర్థనగిరి యెత్తితివి
గోవుల గోపకుల గాచు కొఱకై కృష్ణా!
.
కృష్ణ శతకము.
.కృష్ణా!దేవేంద్రుడు కోపగించి దట్టమైన,ఱాళ్ళను వేగముగల వానగా కుఱిపించగా గోవర్థనగిరిని గొడుగు వలె చిటికినవ్రేలితో పైకెత్తి ఆవులను,ఆవులను కాచువారిని రక్షించితివి.

Saturday, April 20, 2013

సుత్తి వీరుడు....

సుత్తి వీరుడు
సినిమాలు, వాటిలోని పాత్రలు, ఆ పాత్రలు పలికే కొన్ని ప్రత్యేకమైన పదాలు జన బాహుళ్యంలోకి ఎలా చొచ్చుకుపోతాయో చెప్పడానికి విజయ వారి చిత్రాల్లో పింగళి నాగేంద్రరావు గారు సృష్టించిన ' డింగరి ', ' గురూ ' లాంటి పదాలు ఉదాహరణగా చెబుతుంటాం ! ఆ తర్వాత అలాంటి విచిత్రమైన, కొత్తరకమైన పదాల్ని సృష్టించడంతో బాటు కొన్ని పదాల్ని,,,, వాటి అసలు అర్థమే మారిపోయేలా చేసిన రచయిత జంధ్యాల. అంతేకాదు. మన చుట్టూ కనిపించే కొన్ని విచిత్రమైన, ప్రత్యేకమైన మనస్తత్వం గల వ్యక్తులను తన చిత్రాల్లో పాత్రలుగా మలచిన దర్శకుడు కూడా జంధ్యాలే ! ఆయన సృష్టించిన వాటిల్లో ఇప్పటికీ, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయిన, నిలిచిపోయే పదం ' సుత్తి ' . నిజానికి సుత్తి అనే పదానికి మనకు తెలిసిన అర్థం కాకుండా మరో అర్థాన్ని జంధ్యాలగారు ఆపాదిస్తే ఆ పాత్రలో జీవించి, ఆ పాత్రకు శాశ్వతత్వాన్ని కల్పించడమే కాకుండా ' సుత్తినే ఇంటి పేరుగా మార్చేసుకున్న నటుడు వీరభద్రరావు. మామిడిపల్లి వీరభద్రరావుగా కోనసీమలోని అయినాపురం గ్రామంలో జన్మించిన ఈయన చిన్నతనంలోనే తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడ చేరారు. చదువు, ఉద్యోగం, నాటకాలు వగైరా అన్నీ విజయవాడలోనే ! ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రసిద్ధుడవడంతో బాటు రంగస్థలం మీద కూడా లబ్దప్రతిష్టులైన కళాకారులతో పనిచేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
జంధ్యాల సహచరునిగా ఆయన ప్రోత్సాహంతో చిత్రరంగంలో అడుగుపెట్టి ఆయన మార్క్ కామెడీని అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వులజడిలో తడిపారు. తెలుగులో ఎన్ని రకాల తిట్లు వున్నాయో అన్నీ జంధ్యాల తన చిత్రాల్లో వాడుకున్నారు. అంతే కాదు అదే ఒరవడిలో కొత్త కొత్త తిట్లు కూడా కనిపెట్టి మరీ వాడారు. వాటిని తెర మీదకు ఒలికించింది జంధ్యాల అయినా పలికింది మాత్రం వీరభద్రరావు గారే ! జంధ్యాల సృష్టించిన పాత్రలకు, సంభాషణలకు అంత బాగా న్యాయం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరేమో !

వీరభద్రరావు గారు సంభాషణలు పలికే తీరులో, ఆయన ప్రదర్శించే హావభావాలలో కృత్రిమత్వం ఎక్కడా కనబడదు. మన మధ్యన నిత్యం తిరిగే సగటు మధ్యతరగతి వ్యక్తి ఆయన నటనలో కనిపిస్తాడు. అందుకే ఆయన ఆలస్యంగా చిత్రరంగానికి వచ్చినా అచిరకాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులను చూరగొన్నాడు.

వీరభద్రరావు గారు కేవలం హాస్య పాత్రలే కాక కరుణ రసాత్మకమైన పాత్రలు, దుష్ట పాత్రలు లాంటివి కూడా ప్రతిభావంతంగా పోషించి తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.(శిర కదంబం సౌజన్జ్యము.)

గురుజాడ వారి అడుగు జాడా,

నలుగురు కలసి నవ్వే వేల నా పేరు ఒక తరి తలవండి....
(పుత్తడి బొమ్మా పూర్ణమ్మా. గురుజాడ. )

గురుజాడ వారి అడుగు జాడ...

తెలుగు అడుగుజాడ
" చెడ్డవారి వల్ల చెప్పుదెబ్బలు తినచ్చును గానీ - మంచివారి వల్ల మాటకాయడం కష్టం " 
" నిజమాడేవాడు సాక్ష్యానికి రాడు ! సాక్ష్యానికొచ్చేవాడు నిజవాళ్ళేడు "
" నమ్మించోట చేస్తే మోసం... నమ్మని చోట చేస్తే లౌక్యమను " 
" అడగ్గానే యిస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది " 
" ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్ కానేరడు "
" కుంచం నిలువునా కొలవడానికి వీల్లేనపుడు - తిరగేసి కొలిస్తే నాలుగ్గింజలైనా నిలుస్తాయి "
" ఒకడు చెప్పిందల్లా బాగుందనడమే - సమ్మోహనాస్త్రం అంటే అదేగా "
" లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనేగానీ - పల్లెటూళ్ళో ఎంతమాత్రం పనికి రావు "
" పేషన్స్ ఉంటేనే గానీ లోకంలో నెగ్గలేం "
" ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ "

- చివరగా " మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్ "
" డామిట్ ! కథ అడ్డం తిరిగింది " అని తేల్చేసారు గురజాడ.

సుమారు నూట పదిహేనేళ్ళ క్రితమే తన ' కన్యాశుల్కం ' ద్వారా పలికిన ఈ భాష్యాలు నిత్య సత్యాలు. ఇలాంటివి ఆ నాటకంలో కోకొల్లలు. ఆనాటి సాంఘిక దురాచారాలైన కన్యాశుల్కం. బాల్యవివాహాలపై ఆయన ఎక్కుపెట్టిన కలం వాడి ఈనాటికీ చెక్కు చెదరలేదు. ఆ దురాచారాలు ఈనాడు అవే రూపాల్లో లేకపోవచ్చు. రూపాలు మారి ఉండవచ్చు. కానీ అప్పుడు ఇప్పుడూ అలాంటి దురాచారాలకు తొలుత బలవుతున్నది స్త్రీలు మాత్రమే !

గురజాడ స్త్రీ పక్షపాతి అన్నది ఈ నాటకం ద్వారా అర్థమవుతుంది. అమాయక బుచ్చమ్మ దగ్గర్నుంచి గడుసుతనం గల పూటకూళ్ళమ్మ దాకా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని, దానికి నాగరికత రంగు పూసే గిరీశం పాత్ర దీనికి పెద్ద ఉదాహరణ. గిరీశమే కాదు... డబ్బుకోసం అన్నెం పున్నెం తెలియని కూతుళ్ళ జీవితాలు బలి చేసే అగ్నిహోత్రావధానులు... కాటికి కాళ్ళు జాచినా, తలచెడి వయసులో వున్న కూతురు ఇంట్లో వున్నా మళ్ళీ పెళ్లి కోసం వెంపర్లాడి పోయే లుబ్దావధానులు, సానివాడలని పోషిస్తూ తన లౌక్యాన్ని ప్రదర్శించే రామప్ప పంతులు.... ఇలా ప్రధాన పురుష పాత్రల్లో మగవారికి ఆనాడు స్త్రీల పట్ల వున్న చులకన భావాన్ని మన కళ్ళ ముందుంచారు గురజాడ.

ఆడ అయినా, మగ అయినా మంచి చెడ్డా రెండు ఉంటాయనడానికి ఉదాహరణగా కొన్ని పాత్రలను మలిచారు గురజాడ తన ' కన్యాశుల్కం ' లో. వాటిలో ప్రధానమైనవి - ఒకటి తన మేనకోడలికి జరుగుతున్నా అన్యాయాన్ని సహించలేక, మూర్ఖుడైన తన బావగారికి నచ్చచెప్పలేక సతమవుతూ, ఆ పెళ్లి తప్పించడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమయ్యే పాత్ర గుంటూరు శాస్త్రి అదే కరటకశాస్త్రి. రెండు ప్లీడరు సౌజన్యారావు పంతులు గారు. అన్యాయాన్ని, దురాచారాలను సహించలేని ఆయన పాత్ర మొదట్లో వేశ్యలపైన దురభిప్రాయాన్ని కలిగి వుంటుంది. అయితే మధురవాణితో మాట్లాడాక ఆయనలో మార్పు వస్తుంది.

ఇక స్త్రీ పాత్రలలో చాలా ముఖ్యమైన పాత్ర మధురవాణి. వృత్తి రీత్యా ఆమె వేశ్య. కానీ ఆ పాత్రను నిశితంగా పరిశీలిస్తే వేశ్యలంటే చులకన భావం కలుగదు. ఎన్నో జీవిత సత్యాలను ఆమె మనకు తెలియజేస్తుంది. వేశ్యలకు కూడా నీతి ఉంటుందని, వాళ్ళు కూడా మనలాంటి మనుష్యులే, వాళ్ళకీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఉంటాయని ఆ పాత్ర ద్వారా మనకి తెలియజేస్తారు. అప్పట్లో వేశ్యలుగా వున్న స్త్రీలపట్ల సమాజంలో వున్న చులకన భావాన్ని ఈ పాత్ర ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తారు గురజాడ. అయితే ఆయన ఆశయం నెరవేరిందా అనేది వేరే విషయం. కానీ ఆయనకు స్త్రీల మీద వున్న గౌరవం ఈ పాత్ర ద్వారా ప్రస్పుటమవుతుంది.

కృత్రిమమైన పాత్రలు, వాతావరణం కాక సహజమైన, సజీవమైన పాత్రల్ని, వాతావరణాన్ని, సంఘటనల్ని మనముందు ఆవిష్కరించడం వలన వంద సంవత్సరాలు దాటిపోయినా ఆ నాటకం సజీవంగా వుంది. ఆ నాటకం ద్వారా గురజాడ కూడా నేటికీ అందరి మనస్సులో సజీవంగా వున్నారు. ఇప్పటి తరానికి సమకాలీన రచయితల పేర్లు తెలియకపోయినా గురజాడ గురించి తెలియని వారు ఉంటారని అనుకోను.

గురజాడ కలం నుండి జాలువారిన ' దేశమును ప్రేమించుమన్నా... ' వింటుంటే మనలో దేశభక్తి పొంగి ప్రవహించవలసినదే ! ప్రామాణికమైన తొలి తెలుగు కథగా ఆయన ' దిద్దుబాటు ' గుర్తించబడింది. ఆయన రచనల్లో చెప్పుకోదగిన మరొకటి ' పుత్తడిబొమ్మ పూర్ణమ్మ '. బాల్యవివాహం నేపథ్యంలో స్త్రీ వివక్షతను గురించి స్పష్టంగా తెలియజెప్పిన రచన. ఇది ఈనాటికీ పూర్తిగా సమసిపోలేదు. స్త్రీలు ఎంత ముందంజలో వున్నా అక్కడక్కడ ఈ వివక్షత ఇంకా కొనసాగుతోనే వుంది. ఇంకో వందేళ్ళు గడిచినా గురజాడ కోరిక తీరదేమో !

తెలుగుభాషకు అడుగుజాడ గురజాడ వెంకట అప్పారావుగారి నూట ఏభైవ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ...
(శిరా కదంబం... సౌజన్జముతో)

Friday, April 19, 2013

దాశరథీ శతకము----రామదాసు...

శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,విరజానది గౌతమిగా,వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
.
దాశరథీ శతకము----రామదాసు...
.
రామా!దయాసముద్రా!లక్ష్మియే సీథ,విష్ణు భక్తకోటియే రామభక్తకోటి.విరజానది గోదావరి.వైకుంఠమె భద్రాద్రి.అందు వసించు చేతనోద్దారకుఁడవగు విష్ణుఁడవు నీవు.

శ్రీ రామాయణ కాలము - కొన్నివివరణలు

రాముడు ఉనికి సత్యం. దేవుడు అనేది మన నమ్మకం.
శ్రీ రామాయణ కాలము - కొన్నివివరణలు

శ్రీ వెంకట్ మధు గారు మ్యూజింగ్స్ అనే సమూహములో ఇలా పేర్కొన్నారు.
చైత్ర మాస శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో, మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ జన్మించాడు. దీన్ని అభిజీత్ ముహూర్తం అంటారు. హిందువుల పండుగల్లో శ్రీరామనవమి ముఖ్యమైంది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినము, కల్యాణమూ కూడా! పురాణాలను అనుసరించి రాముడు త్రేతాయుగంలో పుట్టాడు. జ్యోతిష్య పండితులు పరిశోధనలు జరిపి శ్రీరాముడు క్రీస్తుకు పూర్వం 5114, జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చని అంచనా వేశారు.

కాని ఇది పూర్తిగా అవాస్తము

శ్రీ రామాయణ కాలాన్ని కుదించటానికి ప్రాశ్చాత్య పరిశోధనలు, వారితో కలిసిన మనవారి పరిశోధనలు అవాస్తవాలు. త్రేతాయుగమునకు , ద్వాపరయుగమునకు, కలియుగమునకు మధ్య లక్షల సంవత్సరమూల అంతరము ఉన్నది. వీరి పరిశోధనలు ఎక్కడ దెబ్బతిన్నాయంటే, అంతరిక్షములో అదేవిధమైన నక్షత్ర సమూహములు తిరిగి తిరిగి ఏర్పడుతుంటాయి. అది విరు గమనించిన రామాయణం కాలము సరిగా మన శాస్త్రములు చెప్పినట్లు ఋజువు అవుతుంది. ఇప్పుడున్న సాకేతిక పరిజ్ఞానము ద్వారా అన్ని లక్షల సంవత్సరములు వెనక్కి వెళ్లి చుచినట్లయితే చైత్ర మాస శుక్ల పక్ష నవమి పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో, మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ తిరిగి వస్తుంది. ఇది ఖగోళ శాస్త్రజ్ఞులు అమ్గికరిమ్చిన సత్యము.

లోని చెడు " రావణుడు " నీలోని మంచి " రాముడు "

.

.

నీలోని చెడు " రావణుడు "


నీలోని మంచి " రాముడు "


నీలోని చెడుని , నీలోని మంచి నిజాయితీతో గెలిస్తే


నువ్వూ ఒక రామాయణం రాయొచ్చు ...

కాకపోతే మనిషి విషయంలో అది జరిగి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది.. అందుకే ఇప్పటికీ మనకి ఒక్క రాముడే ఉన్నాడు .. ఒకటే రామాయణం ఉంది ... అందుకే ఇప్పటికీ మానవజాతికి రాముడే ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు .