కృష్ణ శతకము


కృష్ణ శతకము
.
నీవే తల్లివిఁదండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియునిజముగ కృష్ణా!
.
ఓకృష్ణా!నాకు తల్లి,తండ్రి నీవే.నాకు ఎల్లపుడు వెంట ఉండువాడవు, సహాయము, స్నేహితుడు, గురువు, దేవుడు, నీవే నాకు సమస్తము నీవే నాకు దిక్కు.
.
నారాయణ పరమేశ్వర
ధారాధర నీలదేహదానవవైరీ
క్షీరాబ్దిశయన యదుకుల
వీరా నను గావు కరుణవెలయఁగ కృష్ణా!
.
శ్రీమన్నారయణుఁడవు,లోకములన్నింటికి అధిపతివి,రాక్షసులను చంపినవాడవు,పాలసముద్రమందు పవ్వళించిన వాడవు,యదువంశమునందు పుట్టిన వీరుడైన ఓ కృష్ణా!నన్ను దయతో కాపాడుము.
.
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
.
ఓ శ్రీ కృష్ణా!హరియను రెండక్షరములు కలిసిన హరియను నీ పేరే పాపములను పోగొట్టుచున్నది.ఓ పరమేశ్వరా!కృష్ణా నీ నామ మహిమను ఎవ్వరును పొగుడుటకు శక్తులు గారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!