ప్రముఖుల అమృత గుళికలు

తన ఆత్మ గురించి ముళ్ళపూడి
====================
శరీరాలు వేరైనా ఆత్మలోకటే బాపురమణ లకి ................
తన ఆత్మ బాపు గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమన్నారో చూడండి..........

బాపు అంటే పని. రోజుకి ఇరవై గంటల పని. లొంగని గుర్రాల మీద సవారీకి కసి, పట్టుదల. 

బాపు కళాతపస్వి కాదు. అంటే గడ్డాలూ, విగ్గులూ పెంచేసి, గుహల్లో దూరిపోడు. తెల్లారగట్ట నాలుగ్గంటలకి లేచి ఓ రెండు గంటలు బొమ్మలేస్తాడు. తర్వాత సరదాగా ఓ రెండు గంటలసేపు బొమ్మలేసుకోవడం, ఆ తర్వాత ఇంకో గంటన్నర బొమ్మల ప్రాక్టీసు, ఆలసిపోతాడు గదా, అందుకని - ఓ రెండు గంటలసేపు హాయిగా బొమ్మలు గీయడం, అదయ్యాక తనకిష్టమైన కథలకి బొమ్మలు గియ్యడం, ఆ తర్వాత..... ఇదీ వరుస.

ఈలోపున వచ్చేపోయే ఫ్రెండ్స్ తో జోక్స్ చెప్పుకోవడం, వాళ్లకి గ్రీటింగ్స్ కార్డ్స్ వేసి పెట్టడం, వాళ్ళ కథలకి బొమ్మలు వేసి పెట్టడం, కార్టూన్లు వేసి పెట్టడం - వాళ్ళని నుంచోమని, కూర్చోమని, చెయ్యలా పెట్టమని, చెయ్యిలా పెట్టమని, రకరకాల భంగిమలలో రేఖాచిత్రాలు వేసుకోవడం.........



====================================================================

* " నేను సిగరెట్లు త్రాగడం మానేసాను తెలుసా ? " అన్నారు దర్పంగా ఆరుద్ర.
" అదేం పెద్ద గొప్ప ! నేను అలా చాలాసార్లు మానేసాను " అన్నారు ముళ్ళపూడి వారు.


====================================================================

* " ఏమిటండీ మీ వ్రాత ఇలా వుంటుంది ? " అన్నాడట ఓసారి ముళ్ళపూడి వారి పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేస్తున్న కంపోజిటర్.
" అందుకేనయ్యా ! నా రాత ఇలా వుంది " అని ముళ్ళపూడి వారి సమాధానం.


====================================================================
Labels * ఒకాయన ముళ్ళపూడి వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ ఆయన రమణ గారితో " మద్రాసులో ఎక్కువగా అరవ వాళ్ళే వుంటారు కదా ! వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా ? " అనడిగాడు. దానికి రమణ గారు తన మార్కు జవాబిచ్చారు.

" ఏముందీ ? మీరు పేపర్ కొని చదువుకుంటుంటే, మధ్యలో ఆ పేపర్ని ఎవరు అడిగి తీసుకుంటారో వాడే తెలుగు వాడు " అన్నారు.

=====================================================================

జంధ్యాల మచ్చుతునకలు
భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేదించే పద్ధతికి సరైన నిర్వచనం :- పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క - ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచెక్క, నీ పీకనొక్క
మొక్కుబడికి బుక్కులన్నీ చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్క మొహం వేసుకొని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కు జుట్టు వేసుకొని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్క బల్ల మీద బక్క చిక్కి ఇలా పడుకోకపోతే --- ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్దీ తిరిగి, నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కని ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చక్కటి అడ్వాన్సు చెక్కు, చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి.
శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి "అప్పాజీ" అని పేరు పెట్టుకున్నాడంటే.... అప్పు ఎంత విలువైనదో గ్రహించండి. ఇంగ్లీషులో కూడా "డౌన్" కంతే "అప్" ఉన్నతమైనది కాదా?
డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.
కుంతీ సెకండ్ సన్ బూన్… అదే భీమవరం…
గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర


=====================================================================

అదేంటమ్మాయ్ ... పెళ్లయి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వచ్చేశావ్? పైగా «ధర్మరాజులాంటి భర్తపైన నిందలు కూడా వేస్తున్నావా?'' కోపంగా అన్నాడు తండ్రి రాఘవయ్య.
"నింద కాదు, నిజంగా ధర్మరాజే నీ అల్లుడు. పేకాటలో నన్ను తాకట్టు పెట్టబోయాడు మరి'' గొల్లుమంది అరుంధతి.
నారా వారి జోకు.


=====================================================================

Tribute to Sri Dr. Veturi Sundera Rama Murthy. Poet, Lyricist, Song Writer, Philosopher. Chip carving by Narendra Sajja.
గతమంతా శ్రుతం నాది, ప్రస్తుతానికి అది పునాది
gatamantaa Srutam naadi, prastutaaniki adi punaadi

which translates to "I heard (and learned) a lot of things from great people in the past, and I use them as my present base". He had great respect for the lyricist Acharya Atreya, whom he considered his mentor and guru. In an interview with Gemini Television he said, "Atreya is a much greater lyricist than me. You may find beauty of words and phrases in my lyrics, but Atreya's lyrics have 'life' in them. And this comes only from real experiences and Atreya had much more 'life experience' than me. He was more passionate about tradition and Telugu literature". His relation with veteran composer Ilayaraja is described in his book komma kommakO sannaayi (Telugu: కొమ్మ కొమ్మకో సన్నాయి).....నరేంద్ర ప్రసాద్ సజ్జ







Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!