Wednesday, July 31, 2013

రాష్ట్రాలు తెలుగు ఖ్యాతికి అడ్డు గోడలు కావు

తెలంగాణ ఆంధ్రులు..
కోస్తా ఆంధ్రులు ..
రాయలసీమ ఆంధ్రులు ...
ప్రవాసాంధ్రులు....అందరు ..తెలుగు జాతికి ప్రతి బింబా లే ...
తెలుగు జాతికి గర్వ కారణాలే ...తెలుగు ఖ్యాతికి పెంపు చేసేవారే...
రాష్ట్రాలు తెలుగు ఖ్యాతికి అడ్డు గోడలు కావు

http://www.youtube.com/watch?v=PBwh69j5rTs&feature=youtu.be&a

అక్కినేని స్వంత పాట Cheliya kanarava..Balaraju old telugu moviee 1947-48.

అక్కినేని స్వంత పాట....

అక్కినేని స్వంత పాట Cheliya kanarava..Balaraju old telugu moviee 1947-48. 
సినిమాలో మనం ఘంటసాల గారి పాట వింటాం...
 కా నీ ఈ పాట నాగేశ్వర రావు గారు స్వయం గా పాడేరు...
నిర్మాతలు మర్చేరు...కారణం.. ఘంటసాల గారి పాటే  వారికీ  నచ్చింది..

శ్యామలా దండకం....

శ్యామలా దండకం

ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||

స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||

దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||

తనికెళ్ళ భరణి ...

Bhaasskar Palamuru
తెలుగు సాహిత్యంలో
అతడు అరివిరిసిన మందారం
కళామతల్లి మేడలో దారమై
నటుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ
రచయితగా ..కవిగా ..
కలాకారుడిగా .. దర్శకుడిగా ..విశ్లేషకుడిగా ...
తనికెళ్ళ భరణి అరుదైన పాత్రను పోషిస్తూ
ఎందరినో అభిమానుల
మనసు దోచుకున్నారు
కలకాలం గుర్తుంచుకునేలా
తనను తాను తీర్చిదిద్దుకున్నారు
భరణి మనకు దక్కిన గౌరవం
తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం ..
పదికాలాల పాటు బతకాలి

Divine quotes..

Divine quotes..
The first step in samskara (refinement) is to remove dirt from the mind. Know that envy is the stickiest dirt. You must be happy, when people around you are happy. That is the true test. The Ramayana says that Lord Rama was happy when joyous events happened to others around, as if they happened to Him. Krishna describes Arjuna as An-asuya (envy-less). What a great compliment to receive from the Master Himself! That is why Lord Krishna taught the mysteries of spiritual discipline to Arjuna. Have deep Love for the Lord. But be very careful not to become depressed with envy when others also love Him or get His attention and become attached to Him. Always be vigilant to have love without envy.
Divine quotes..
The women of a country should be happy, healthy and holy. Every woman has a very crucial role to play in their individual uplift and the uplift of their homes and societies around them. Young girls and women alike should learn the technique of mental calm, social harmony and contentment with their livelihood. They should also know that joy can be attained only through service to those in need and in distress without any expectation of the benefits that may follow from the kindness shared. They should learn to lay aside the egoism that poisons the service activities. Even those serving for years tend to extol and promote themselves as the founders of institutions and guardians of the poor and needy. The benefit and joy from any act of service is the act itself. The fruit of service is the removal of egoism, not its multiplication.
Geetha beti.

Divine quotes..
Walk the path shown to you by the Ramayana, Mahabharatha, Bhagavatha and other scriptures. Proceed along that path, unmindful of halts and handicaps, approvals or disapproval of kith and kin, of praise or blame from society. What exactly is praise or blame? They are words - just sound waves coming from across the air; waves that strike your ear. Let them strike only the outer ear, do not welcome them in. Grace is won by suffering alone. The Lord incarnates in the world when unrighteousness becomes rampant. Therefore adharma (unrighteousness) has to be suffered so that each one may have the joy of welcoming the Lord and experiencing His Presence.

Geetha beti..

భీమకవి ....

భీమకవి కాలం ఇంతవరకూ ఎవరూ నిర్ధారణ చేయలేదు కాని ఆయనగురించి చెప్పుకునే కథలు చాలా వున్నాయి. ముఖ్యంగా జననం గురించి. గోదావరిమండలంలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ప్రాంతంవాడని ఒకకథనం. ఆయన తల్లి బాలవితంతువు, సాటి చెలులతో కలిసి భీమేశ్వరస్వామి దర్శనసమయంలో స్త్రీలకోరికలు వింటూ నాకు నీవంటిపుత్రునివ్వమని కోరిందిట. స్వామి ఆవిడ అభీష్టం నెరవేర్చాడు. ఆవిడ తనముద్దుబిడ్డకి భీమన అని పేరు పెట్టుకుని పెంచుకుంటూంది. వూళ్లో ప్రజలు మాత్రం ఆమె మాట నమ్మక, వెలివేశారు. అ పిల్లవాడిని సాటిపిల్లలు రండాపుత్రుడని గేలి చేయగా, అతడు వచ్చి తల్లిని తనతండ్రి ఎవరని అడిగితే, ఆమె భీమేశ్వరుడేనని చెప్పిందిట. అంతట, ఆ చిన్నవాడు భీమేశ్వరాలయానికి వెళ్లి, “నన్ను వూళ్లో అందరూ తండ్రి లేనివాడని గేలి చేస్తున్నారు. నువ్వు నిజంగా నాతండ్రివవునో కాదో చెప్పకపోతే ఇక్కడే తలపగలగొట్టుకు చస్తాను” అని పట్టు బట్టాడు. అప్పుడు భీమేశ్వరుడు ప్రత్యక్షమయి, అతనితల్లిమాట నిజమేననీ, తానే తండ్రిననీ చెప్పి, అందుకు నిదర్శనంగా భీమన ఆడినమాట సత్యమవుతుందని వరం ఇచ్చాడుట.

ఒకనాడు వేములవాడలో ఒక బ్రాహ్మణుని ఇంటిలోసంతర్పణ జరుగుతోంది. ఆ ఇంటి యజమాని అందరినీ ఆహ్వానించాడు, కానీ భీమన్నను మాత్రం ఆహ్వానించలేదు. భీమన్న పిలవకపోయినా సంతర్పణకు వెళ్ళారు. నేరుగా లోపలికి వెళ్ళి కూర్చొని, తనకు కూడా భోజనం వడ్డించమని అడిగారు. అక్కడి వారంతా భీమన్నను బయటకి పంపివేసి, నీవు లోనికి రావద్దని చెబుతూ తలుపులు వేసేశారు. బాలభీమన్న “భీమేశ్వరుని తనయుడనైన నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేరు” అని చెప్పి బయట అరుగుపై కూర్చొన్నారు. లోపల జరుగుతున్న తంతు అంతటినీ గమనిస్తూ వడ్డన ప్రారంభమయ్యేంత వరకు ప్రశాంతంగా ఉన్నారు. వడ్డన పూర్తీ అయిన వెంటనే ఈ క్రింది పద్యం చెప్పారు.

ఉ. “గొప్పలు సెప్పుకొంచు ననుఁ గూటికి బంక్తికి రాకుమంచునీ
ద్రిప్పుడు బాపలందఱునుఁ దిట్టిరిఁ గావున నొక్క మాఱ మీ
యప్పములన్ని కప్పలయి యన్నము సున్నముఁ గాగ మాఱుచున్
బప్పును శాకముల్ పులుసు బచ్చడులుఁ జిఱురాలుగావుతన్”

భావము: తాము (సత్బ్రాహ్మణులమని) గొప్పలు చెప్పుకుంటూ, నన్ను భోజనమునకు రావద్దని ఈ బ్రాహ్మణులందరూ తిట్టారు. కావున ఒకసారి మీ అప్పడాలన్నీ కప్పలుగా, అన్నము అంతా సున్నముగా మారి, పప్పు, కూరలు, పులుసు, పచ్చడులు చిన్నచిన్న రాళ్ళుగా అవ్వుగాక!
తక్షణమే వడ్డింపబడిన అన్నమంతా సున్నముగా మారింది. అప్పడాలన్నీ కప్పలై బెకబెక మంటూ గెంతుతూ, అటూ ఇటూ వెళ్తున్నాయి. పప్పు, పులుసు, పచ్చడి అన్ని చిన్నచిన్న రాళ్ళుగా మారిపోయాయి. ఈ వింత మార్పును చూసి భోజనపంక్తికి కూర్చున్న బాపలందరూ చాలా కలవరపడ్డారు. సంతర్పణ చేయిస్తున్న ఇంటి యజమాని అందరినీ చూసి కలవరపడవద్దని చెప్పి, మళ్ళీ వడ్డించడానికి క్రొత్త విస్తరులను వేయించాడు. తీరా అన్నపురాశి వద్దకు వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా అన్నమంతా సున్నంగా మారిపోయి ఉంది. గంపలోని అప్పడాలేమో కప్పలయ్యి బయటకు ఎగురుతూ గెంతులేస్తున్నాయి. మిగితా వంటలన్నీ రాళ్ళుగా మారిపోయి ఉన్నాయి. ఆ ఇంటి యజమానికి ఎందుకిలా జరిగింది? ఏమి చేయాలి? అని దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అంతలో అక్కడి వారిలో భీమన్న చెప్పిన పద్యం విన్న ఒక బ్రాహ్మణుడు, ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి ఆరుబయట కుర్చుని భీమన్ననే ఇవన్నీ ఇలా మారాలని పద్యం చెప్పాడనీ, ఇదంతా ఆ భీమన పలుకుల మూలంగానే జరిగిందనీ చెప్పాడు. అప్పుడు తెలిసింది ఆ యజమానికి “నన్ను విస్మరించి మీరు ఈ పూట భోజనం చేయలేర”ని చెప్పిన భీమన్న మాటలకర్థం.
అతను వెంటనే భోజనానికి వచ్చిన బ్రహ్మణులందరినీ భీమకవి వద్దకు పిలుచుకొని వెళ్ళి, వాటిని తిరిగి భోజనపదార్థాలుగా మార్చమని అడిగాడు. అలా చేసినట్లయితే భోజనానికి రానిస్తామని చెప్పారు. వారికి భీమకవి అంతరార్థం ఇంకా అర్థం కాలేదు. భీమకవి “మీరందరూ గొప్పజాతి వారే కదా! మరి మీరే మార్చుకొవచ్చుగా. నేను మీ అంతటి వాన్ని కాదు కదా! నా వలన ఏమవుతుంది? చెప్పండి?“ అని అడిగాడు. ఆ బ్రహ్మణుల కన్నులు తెరచుకున్నాయి. వెంటనే వారు "భీమన్నా! మేము తప్పుగా ప్రవర్తించాము. నువ్వు మహానుభావుడివి. నిన్ను భోజనానికి రానివ్వకుండడం మా అందరి అపరాధము. మమ్మల్ని అనుగ్రహించి యథాప్రకారము వాటిని భోజనసముదాయముగా మార్చండి. అంతేకాక మీరు కూడా మాతో పాటి భోజనానికి కూర్చొని మమ్ము కృతార్థులను చేయండి. ఇప్పటి నుంచి మీతో గౌరవాభిమానాలతో నడుచుకుంటాము” అని నమస్కరిస్తూ వేడుకున్నారు. భీమకవి తిరిగి ఇంకో పద్యం చెప్పారు.

మ. "ఘనుడౌ వేములవాడ వంశజుడు ద్రాక్షారామ భీమేశ నం
దనుఁడీ భీమన యంచు గుర్తెఱింగి, నిందల్ మానినన్ గౌరవం
బుననీ విప్రులుఁ జూచిరందువలనఁ బూర్వస్థితిన్ జెంది భో
జన వస్తు ప్రకరంబులన్నియు యథాస్వస్థంబు లౌగావుతాన్"

భావం: ఈ బ్రాహ్మణులందరూ, గొప్పవాడు, వేములవాడ వంశస్థుడు, ద్రాక్షారామ భీమేశ్వరుని తనయుడీ భీమన అని తెలుసుకొని, నిందించడం మాని, నను గౌరవంతో చూసారు. అందువలన ఈ భోజన, వస్తు సముదాయమంతా కూడా మునుపటి రూపు పొంది వాటి పూర్వస్థానానికి వచ్చును గాక!
వెంటనే మునుపటిలా అన్నపురాశి ప్రకాశించింది. కప్పలన్నీ తిరిగి అప్పడాలుగా మారిపోయాయి. చిన్నచిన్న రాళ్ళన్నీ తిరిగి పప్పు, పులుసు, పచ్చడులుగా మారిపోయాయి. విస్తరులన్నీ తిరిగి భోజనంతో నిండిపోయాయి. ఇది చూసిన ఆ బాపలంతా భీమకవి మహత్యానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. వెంటనే భీమకవిని తమతోపాటి భోజనానికి తీసుకుపోయి భోజనవరుసలో అగ్రస్థానాన కుర్చోబెట్టి గౌరవించారు. ఊరివారంతా ఈ భీమన్న ద్రాక్షారామ భీమేశ్వరుని వరపుత్రుడని తెలుసుకొని మసలుకున్నారు. ఇన్ని రోజులు నిందలు మోపి, వెలివేసి బాధ పెట్టినందుకు తమను మన్నించాల్

Tuesday, July 30, 2013

-<@ **శుభాకాంక్షలు** @>--

-
-<@ **శుభాకాంక్షలు** @>--
____________________________________________

స్వాతంత్ర్యం రాక ముందు తెల్ల వాళ్ళు దోచుకున్నారు..
వచ్చినాక నల్లవాళ్ళు (సొంత వాళ్ళే) దోచుకుంటున్నారు..

కాబట్టి స్వాతంత్ర్యం వచ్చినట్టా ?? లేనట్టా???
స్వాతంత్ర్యం ఎందుకొరకు పోరాడి తెచ్చుకున్నామో..,
స్వాతంత్ర్యం కోసం ఎందుకు అంతలా తపించామో ,
అదే నేరవేరనపుడు నామమాత్రపు స్వాతంత్ర్యం వచ్చీ ఏం ప్రయోజనం???
---

ఇన్నాళ్ళూ అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయ్ అంటూ
గొంతులు చించుకుని వేర్పాటు వాదానికి పునాదులేసి
రాష్ట్రాన్ని విడగొట్టి , రాష్ట్ర ప్రయోజనాల్ని చెడగొట్టి ,
సొంత రాష్ట్రం అంటూ గొడవ చేసి సాధించుకుంటున్న
సోదరులకి శుభాకాంక్షలు.

ఇప్పటి వరకూ మిమ్మల్ని రెచ్చగొట్టిన మీ ప్రతినిధులే
రేపు మిమ్మల్ని దోచుకోకుండా చూసుకోండి..
ఆత్మార్పణలతో , సొంతం చేసుకున్న ఫలితాన్ని అనుభవించండి.
జాగ్రత్తగా చూసుకోండి..., అక్రమాలను, అన్యాయాన్నీ పెరగనివ్వకండి..
వచ్చేస్తుందీ, వచ్చేసింది.., అంటూ తృప్తి పడకుండా,
వచ్చినదాన్ని కాపాడుకోవటంలో అభివృద్ధి చేసుకోవడంలో శ్రద్ధ చూపండి.

ఎలాగో మా నమ్మకాలపై , కలిసుండాలనే ఆశలపై నీళ్ళు చల్లారు..
ఇప్పటికీ మాకు మీ మీద కోపం లేదు..
విడిపోవాలంటూ మీరే మమ్మల్ని తూలనాడి, దోషత్వం అంటగట్టి దూరం చేసుకున్నారు.

అన్యాయం జరిగితే అన్యాయాన్ని చేసేవాళ్ళని తుదముట్టించాలి..
అంతే తప్ప అందరినీ ఒక గాటిన కట్టేసి దూరం చేసుకోవడం ఎంత మాత్రం భావ్యమో మీరే ఆలోచించండి.
రేపు మీలో , మీతో , మీ వాళ్ళతో ఇలాంటి అన్యాయం జరగదని నమ్మకం ఉందా???

--

చెట్టుకి పురుగు పడితే చల్లాల్సింది పురుగు మందు.
అంతే కానీ వేళ్ళని, కాండాన్నీ వేరు చేయటం సమస్యకి పరిష్కారం కాదు.
--
(ఇది ఆక్రోశం కాదు ఆవేదన.. దయచేసి తప్పుగా అనుకోవద్దు..
తెలిసో, తెలియకో , తెలిసీ తెలియని జ్ఞానంతోనో మిమ్మల్ని భాద పెట్టుంటే మన్నించండి..
విజ్ఞులు , ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం కలవారు సరిదిద్దండి.
తొందరపాటు కలవారు, అర్ధం చేసుకోలేని వాళ్ళు దయచేసి దూరంగా ఉండండి అని అర్ధిస్తున్నాను.)

ధర్మో రక్షతి రక్షితః , స్వప్రయోజనాల కోసం పక్కవాడికి అన్యాయం చేయొద్దు..
అన్యాయం జరిగితే న్యాయం అమలు జరిగేలా చూడండి , అంతే కానీ తెగేదాకా లాగొద్దు..
అందరి మనోభావాలకి సమాన హక్కునిద్దాం. మానవత్వాన్ని విస్మరించొద్దు..
ధర్మాన్ని విడనాడొద్దు.. నీతి తప్పొద్దు.
అన్యాయం సహించొద్దు..దైవాన్ని విస్మరించొద్దు..
నలుగురికీ ఉపయోగపడే పనులు చేద్దాం..
నలుగురిలో ఒకడిలా మెలుగుదాం..

‪#‎సుష‬@4U4ever@

.మనవాళ్ళు అంత ఒట్టి ఇడియట్స్ ...

సూలురు పేట నుండి శ్రీకాకుళం దాక కాణీ.కాణీ కూడ పెట్టి చెన్నపట్నం అభి వ్రుది చేసారు...ఆనాడు....
అదే సూలుర్ పేట నుండి శ్రీ కాకుళం దాక పైసా .పైసా కూడ పెట్టి హైదరాబాదు ను అభి వ్రుది చేసారు..ఈనాడు..
రెండు సార్లు ..నెత్తిన తడి గుడ్డలు .. మిగిలియీ....
ఉరికే అనలేదు గిరీశం..
.మనవాళ్ళు అంత ఒట్టి ఇడియట్స్ ...అని.

Monday, July 29, 2013

నన్నయ్యగారి గడుసుదనం...

నన్నయ్యగారి గడుసుదనం....
కురుపాండవ రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తమ తమ విద్యలనీ, శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలాన్నీ ప్రదర్శించే సన్నివేశం.

సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క
నెంతయును సంతసంబున గుంతిదేవి
రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి
కెలన నుండె, నున్మీలితనలిననేత్ర

ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం!

"కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది. అందమైన కళ్ళని పద్మాలతో పోల్చడం మామూలుగా ప్రాచీన కవిత్వం అంతటా కనిపించేదే. ఇక్కడ మామూలు పద్మాలు కాదు, బాగా విచ్చుకున్న పద్మాలు. అంటే కుంతి కళ్ళు అంతగా విచ్చుకొని ఉన్నాయన్న మాట! పద్యం మొదట్లో చెప్పనే చెప్పాడు కాదా - ఆమె వేడ్కతోనూ సంతోషంతోనూ తన కుమారుల విద్యని చూడాలని కూర్చుంది. ఆ ఉత్సాహమూ ఆ సంతోషమూ, బాగా విచ్చుకున్న ఆమె కన్నుల్లో కనిపిస్తున్నాయన్న ధ్వని యీ విశేషణంలో ఉంది. ఇలా సార్థకమైన విశేషణాల ద్వారా ఒక విషయాన్ని ధ్వనింపజేయడం మంచి కవిత్వ లక్షణం.
బాగానే ఉంది కాని యిందులో గడుసుదనం ఏముంది, అనుకుంటున్నారా? పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. ఈ పద్యంలో ఎవరెవరున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి. గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొంది. అంచేత పాపం వాళ్ళు తమ పుత్రుల విద్యా ప్రవీణతని కళ్ళారా చూడలేరు. చూడగలిగింది కుంతి మాత్రమే. కుంతి సంతోషానికి అది కూడా కారణమేమో కూడానూ! ఇద్దరు చూడలేని వాళ్ళ పక్కన కుంతిని కూర్చోబెట్టి, ఆమె బాగా విచ్చుకున్న కళ్ళతో ఆనందంగా తన పుత్రుల విద్యానైపుణ్యాన్ని చూస్తోంది అని నొక్కి చెప్పడం ద్వారా, పాపం ఆ చూడలేని వారి దుస్థితిని వెక్కిరించినట్టు లేదూ! పైగా, అదెక్కడా పైకి తేలకుండా, పోలీసువాళ్ళ దెబ్బల్లాగా, కేవలం పద్యనిర్మాణం ద్వారా, చివర్న వేసిన విశేషం ద్వారా ధ్వనింపజేసారు నన్నయ్యగారు. అద్గదీ ఆయనగారి గడుసుదనం.

Lakshmi Sarma A.V. గారి మంచి మాటలు....

Lakshmi Sarma A.V. గారి మంచి మాటలు....

భగవంతుని చల్లని చూపు లభించకపోతే ,మంచి వారితో మైత్రి బంధం అసలే దొరకదు .

మానవునికి శత్రువులు బయటి ప్రపంచంలో లేరు.... దుష్ట సంకల్పాలే శత్రువులు ,,, సత్య సంకల్పాలే మిత్రులు.

జీవితంను చూచి చిరునవ్వు చిందించగలిగితే జీవితం మీ పట్ల ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తుంది -లక్ష్మి శర్మ.

మంచి ఉపన్యాసం చెవులకు మాత్రమే కాదు ఆత్మకు కూడా విందు.

మాట వినని మనిషికి మించిన చెవిటి వాడు ఎవడూ ఉండడు.

తెలివైన వ్యక్తి పుస్తకాలతో పాటు జీవితాన్ని కూడా అధ్యయనం చేసాడు .
చిన్న చిన్న విషయాలే పరిపూర్ణత్వానికి దారితీస్తాయి ,,కాని పరిపూర్ణత మాత్రం చిన్న విషయం కాదు -
మనిషికి ఎంత సృజనాత్మకమైన ఉహా శక్తీ ఉంటే,అంత మెండుగా ప్రణాళికలు అవతరిస్తుంటాయి.

అతి తొందరపాటు కంటే పిరికితనము వలన ఎక్కువుగా ఓటమి చెందుతాము.

మనుషులు కాలాన్ని వృధా చేస్తారు..... కాలం మనుషులని త్వరగా చంపుతుంది.

పగిలిన గాజుసీసాను అతికించలేక పోయినట్లే ...పోయిన కీర్తిని తిరిగి పొందలేము.

మనం చేపట్ట్టిన పనిలో జయాపజయాలు మానసిక సామర్ధం మీద కాకా ,మానసిక వైఖరి మిద ఆధారపడి ఉంటాయి -

నీ ఆస్తిని ,నీ జీవితాన్ని నిలబెట్టుకోవటం కంటే , నిజాయితీని నిలబెట్టుకోవడం అవసరం -లక్ష్మి శర్మ
మనలని అభిమానిందే వాళ్ళ దగ్గర అబద్దాలు మాట్లాడితే నమ్మకమనే బలమైన తాడు మెల్లి మెల్లిగా తెగిపోతుంది -శ్రీ
జీవితం చాల విలువైనది అందమైనది , ప్రతి నిమిషం ప్రతి గంట, ప్రతి రోజు చాల విలవైనది , కోపం భాద ఆవేశం వీటివల్ల మన విలువైన సమయాన్ని ఎంతో పోగొట్టుకుంటున్నాం. ప్రతి మనిషిని గౌరవించండి ,ఎవరిని ఆరాదించకండి , మీ విలువైన సమయములో అందరితో ప్రేమగా మాట్లాడండి , నవ్వుతూ మాట్లాడండి -శ్రీ

అంకిలి సెప్ప లేదు.

అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.
.
పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము.

రామప్ప మరియు లక్నవరం ..By - Venkatachary Rangoju ..

రామప్ప మరియు లక్నవరం ..By - Venkatachary Rangoju
..

ఏమి సరస్సు ! లేమి గిరు ! లేమి ధరాజము ! లేమి లోయ ! ల
వ్వేమి జలప్రవాహములు ! నేమి కళాత్మక కట్టడాల్ ! విధం
బేమని వర్ణనల్ సలుప, నేమి రచించెదఁ వాటి గూ ? ర్చహో !
రామపదేవళమ్మనినఁ, లక్నవరమ్మనినన్ గనన్వలెన్ !!

అందుకే ప్రేమిద్దాం... ప్రేమ కోసం జీవిద్దాం..

ఎదుటివారి గురించి పట్టించుకోవాలంటే ముందు మనమేమిటో మనకి తెలియాలిగా?
"ఏ వ్యక్తీ జీవిత భాగస్వామిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అందుకే అర్థం చేసుకొనే విషయం లో ఆరాటాలొద్దు. మనం చేయవలసిందల్లా ఒక్కటే... తక్కువగా అర్థం చేసుకోవడం. ఎక్కువగా ప్రేమించడం" నిజమే... మనకి అర్థం కాలేకపోవడం అవతలివాళ్ళ ప్రాబ్లం కానీ వాళ్ళని అమితంగా ప్రేమించడం మన ఎడదకి సాధ్యమైన పనే..

సో...

సముద్రంలోని అలల్లా మన మనసులో ఎన్ని కల్లోలాలు కలవరాలు కాపురమున్నా, మన జీవిత భాగస్వామిని సాధ్యమైనంతగా ప్రేమిస్తే చాలు- మనకన్నీ పున్నములే.... వెన్నెల పూల పున్నాగలే...
అందుకే ప్రేమిద్దాం... ప్రేమ కోసం జీవిద్దాం... జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిద్దాం....
By - Padma Sreeram Vangara

పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి. ..

చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.

వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ !

హరపురుడు నిన్ను దిను నెడ
గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!


ఈ పకోడీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని రుచి ఆస్వాదించవచ్చు.. కానీయండి మరి.

Sunday, July 28, 2013

మారుతి కోసిన మామిడిపండు.రచయిత : గోలి హనుమచ్ఛాస్త్రి .....
మారుతి కోసిన మామిడిపండు.

కందము:
ఆకసపు మావి చెట్టున
నా కాసిన పండు జూడ నాకలి పుట్టెన్
తోకనె యూపుచు తేజము
తో కపివరు డెగిరె భాను తొడిమను ద్రుంచన్.

ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!

ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు

సూపర్ శక్తి ఉన్నాడనడానికి సాక్షాలు.

బెర్ముడా ట్రాంగిల్ రహస్యము ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కానిది .. తెలుసుకునే ప్రయత్నాలు చేసిన వారి ఆచూకి గల్లంతైంది ..

ఇక మన దేశంలో ఇలాంటి చేదింప బడని విషయాలు ఎన్నో ...

అనంత పద్మనాభస్వామి ఆరో తలుపు నెంబర్ "B " నాగ భంధం చే మూయబడింది . టెక్నాలజీ తో తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తే తీవ్ర అనర్థం సంభవిస్తుందని సాత్వికులు హెచ్చరించడం , ట్రావన్కోర్ రాయల్ ఫామిలీ వారి దైవ భాషిని చిలుక హెచ్చరింపులతో తెరిచే ప్రయత్నం చేయక పోయినా లేజార్ కిరణాలు పంపి లోపల ఏముందో తెలుసుకొనే ప్రయత్నం చేసిన సిబ్బంది ఎ కారణం లేకుండా అర్థాంతర మరణం ....

కైలాసగిరి పర్వతం సాక్షాత్తు కైలాసం దానిని అధిరోహించ రాదు అన్నా కూడా అధిరోహించిన వారి మరణం . ఎత్తు తక్కువ ఉన్న పర్వతం పైన నిజంగా కైలాసం ఉందా లేదా అని హెలికాప్టర్ లో పైకి వెళ్ళినప్పుడు హెలికాప్తీర్ మాయమవడం . ఇలాంటి కేసులు ఎక్కువ ప్రచారం చేయకుండా వెంటనే క్లోజ్ చేయడం ..

ఇక రీసెంట్ గా విగ్రహం పొద్దున్న పసిపాపలా , మధ్యాన్నం యువతిలా , సాయం సంధ్యలో వ్రుద్దురాలిగా కనిపించే దారి దేవి మహత్యం ... ఎంతో ఉంది తొలగించకండి అని ఎంత మొరపెట్టుకున్నా , హైడ్రో ప్రాజెక్ట్ కొరకు తీసి పక్క పెట్టగానే 2 ఘంటల లోపే ప్రళయం లా అలకానంద నది కేదార్నాథ్ ను మున్చేయడం ..
అందరు చూస్తుండగానే రాయి దొర్లి ఆలయాన్ని విగ్రహాన్ని కాపాడడం ....

ఇవన్ని ఎప్పటికి చేదించలేని విషయాలే .. అద్భుతాలే ..
సూపర్ శక్తి ఉన్నాడనడానికి సాక్షాలే ..

Friday, July 26, 2013

స్వామి వివేకానంద ....

తనకోసం తాను బతికేవాడు గాక, సమాజం కోసం, సమాజంలోని పీడితుల కోసం బతికేవాడే నిజమైన శక్తివంతుడు. తనలో ఉన్న అద్భుత భావస్ఫూర్తి, ఉత్సాహపూరిత రక్తాన్ని అందరికోసం వెచ్చించేవాడే నిజమైన యుక్తిపరుడని స్వామి వివేకానంద తన సూక్తుల ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పారు.

ముఖ్యంగా శ్రమైకజీవన సౌందర్యాన్ని గుర్తించినవాడే ఈ ధరణిలో నిజమైన సుఖాన్ని పొందగలడని, ఆయాచితంగా వచ్చే ఫలాల కోసం ఆశించేవాడి తత్వం జగానికి శ్రేయోదాయకం కాదు. ఎప్పుడూ జడత్వంతో నిండివుండి, తాను శ్రమించక, పక్కవాడి కార్యాన్ని చెడగొట్టేవాళ్లు ఈ సమాజంలో గడ్డిపువ్వులా భావించబడతారని పేర్కొన్నారు.

జడత్వం అనే భావన మనిషిలో నాటుకుంటే ఆ వ్యక్తి శ్రేయోదాయకమైన ఆలోచనలకు తనలో చోటు కల్పించలేడు. అతని దృష్టిలో 'నేను' అన్నదే మహితమైన పదంగా నిలిచిపోతుందట. అతనికి శ్రేయస్సు అంటే తానూ, తన కుటుంబం మాత్రమే. మిగిలిన సంఘం అతనికి అనవసరమైన వస్తువు స్వామి వివేకానంద తెలియజెప్పారు.

నేను ప్రయోజకుణ్ణి అని అనుకుంటే అలాగే అవుతారు. కాకుండా, నేను ఏమీ చేయలేననే జడత్వంలో కుంగిపోతే నిజంగా వృద్ధుడవే అవుతావు. ఈ మహాసత్యం ఎల్లవేళలా జ్ఞప్తి పెట్టుకోవాలని స్వామి వివేకానంద సమాజానికి ప్రభోదించాడు. మనం పనికిమాలిన వాళ్లం కానే కాము. అమోఘ శక్తి సంపన్నత మన హృదిలో నిద్రాణమై ఉంది. దానికి జాగృతి కల్పించి సర్వాన్ని సాధించే సాధక ధీరరులం మనమేనని, ఇది జీవన సత్యమని ప్రభోదించారు.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు...ఎన్నెనెన్నొ కధలు

సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు...ఎన్నెనెన్నొ కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహుప్రే..మ లేఖ

ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి..చప్పున బదులివ్వండి


తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా..సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడేఆహ్ ఆహ్..
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండిఇప్పుడే.. బదులివ్వండి

Thursday, July 25, 2013

కొత్త అమ్మ ,

ఒక 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది..
కానీ వాళ్ళ నాన్న మల్లి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు..
ఒక రోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయితో ఒరేయ్ బాబు నీకు
కొత్త అమ్మ , చనిపోయిన పాత అమ్మ మద్య ఏం తేడా అనిపించింది రా
అని అడిగాడు..
.
.
.
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు..
నా కొత్త అమ్మ నిజం..
పాత అమ్మ అబద్ధం ...
అది విన్న తండ్రి అవాక్కయి..
అదేంటి బాబు అల అంటున్నావ్ అంటే..
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు..
నేను ఎపుడైనా అల్లరి చేస్తే అప్పుడు ఆ అమ్మ అనేది నువ్ ఇలాగె అల్లరి
చేస్తే నేకు అన్నం పెట్టాను అని..అయిన నేను అల్లరి చేసేవన్నీ..
కానీ ఆ అమ్మ నన్ను లాక్కొని వెళ్లి తన దగ్గర కుచోబెట్టుకొని అన్నం తినిపించేది..
ఇప్పుడు ఉన్న కొత్త అమ్మ కూడా అల్లరి చేసావంటే నీకు అన్నం పెట్టను అంది ..
కాని ఈ కొత్త అమ్మ 3 రోజుల నుండి నాకు నిజంగానే అన్నం పెట్టడం లేదు నాన్న..
అందుకే ఆ పాత అమ్మ అబద్ధం .. ఈ కొత్త అమ్మ నిజం..
ఇది విన్న ఆ తండ్రి నోట్లో నుండి మాటరాలేదు.....

అద్భుత చిత్రం.......

1949 బాల పత్రికలో శ్రీ వడ్డాది పాపయ్యగారుగీసిన అద్భుత చిత్రం. 

ఈ బొమ్మని త్రిప్పిచూస్తే రామున్ని వనవాసానికి పంపమన్న కైకేయి 

ఒక వైపు, మరో వైపు త్రిప్పి చూస్తే ఆ మాట

విని విచారిస్తున్న దశరధ మహారాజు కనిపించడం విశేషం. 

Wednesday, July 24, 2013

వివేకవతి రంభ By - Satyanarayana Piska

వివేకవతి రంభ By - Satyanarayana Piska


రంభను గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. ఆమె అందానికి మారుపేరు! సౌందర్యానికి ప్రతీక! దేవలోకంలోని దేవేంద్రుని ఆస్థానములోనున్న అప్సరసభామినులలో అగ్రగణ్య! అప్సరసల జాబితా చెప్పవలసివచ్చినపుడు ' రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ' అంటూ రంభనే ప్రథమస్థానంలో పేర్కొనడం పరిపాటి. చాలా అందమైన యువతి కనబడితే "రంభలా ఉంది" అంటారు. ' మరి, ఇటువంటి చరిత్ర కలిగిన రంభను "విలాసవతి" అంటే బాగుంటుంది కాని, "వివేకవతి" అంటున్నారేమిటి?! ' అని పాఠకమిత్రులకు సందేహం కలగవచ్చు. ఐతే, ఇది నామాట కాదు. రంభ యొక్క వివేకం గురించి శ్రీనాథ కవిసార్వభౌములు తమ రసవత్ప్రబంధమైన "శృంగార నైషదము" లోని ఒక పద్యములో ఉల్లేఖించారు. ఆ పద్య వివరాల్లోకి వెళ్ళేముందు, రెండు మాటలు.
ఒకసారి పుష్పకవిమానంపై గగనవీధిలో విహరిస్తున్న రావణాసురునికి, ఇంద్రుని నందనవనములో నుండి నడిచివెళ్తున్న రంభ కనిపిస్తుంది. సర్వాభరణభూషితయైన ఆమె సౌందర్యాన్ని చూసి మోహించిన దశకంఠుడు తమకంతో రంభను సమీపిస్తాడు.

అప్పుడు రంభ "నేను మీ అన్నగారైన కుబేరులవారి కోడలిని; నలకూబరుని పత్నిని. మామగారి స్థానములో ఉన్న మీరు నాకు పితృతుల్యులు. కాబట్టి, కామవాంఛతో నా దరికి రావడం మీవంటి పెద్దలకు భావ్యం కాదు" అని ప్రార్థిస్తుంది. ఆ మాటలను పెడచెవిని పెట్టిన రావణుడు, బలాత్కారంగా ఆమెను లొంగదీసుకుని అనుభవిస్తాడు. ఆ తర్వాత రంభ విలపిస్తూ వెళ్ళి, తనకు జరిగిన పరాభవాన్ని నలకూబరునితో చెప్పుకుంటుంది.
అందుకు ఆగ్రహించిన నలకూబరుడు "ఇకపై నీమీద ఇష్టంలేని స్త్రీని బలవంతంగా పొందడానికి ప్రయత్నిస్తే నీ శిరసు వేయి వ్రక్కలవుతుంది" అని రావణుణ్ణి శపిస్తాడు. ఆ శాపభయ కారణంగానే రావణుడు సీతాదేవిని చెరబట్టినపుడు అశోకవనములో ఉంచాడేగాని, ఆమెను సమీపించడానికి, స్పర్శించడానికి సాహసించలేదు.

ఇప్పుడు మనం శ్రీనాథులవారు రంభ గురించి ఏమని చెప్పారో చూద్దాం. "శృంగార నైషధము" లోని ఈ పద్యాన్ని చిత్తగించండి.
వినుకలిఁ గూర్మి జిక్కి, పృథివీభువనంబునకుం డిగంగ నే
యనువును లేక, రంభయను నచ్చరలేమ, నలున్ వరింపఁ బూ
నిన దన కోర్కి నొక్కమెయి నిండగఁ జేయుటకై భజించెఁ దాఁ
గొనకొని వేల్పులందు నలకూబరుఁ దచ్చుభనామ వాసనన్.
దివిజలోకంలోని దిక్పాలురనూ, హేమాహేమీలైన సురప్రముఖులనూ వదిలిపెట్టి, కుబేరసుతుడైన నలకూబరుణ్ణే రంభ ఎందుకు వరించి చెట్టబట్టింది?!... ఈ ప్రశ్నకు జవాబుగా కవీశ్వరులు మనకొక మనోహరమైన కథ చెప్తున్నారు. భూలోకంలోని నిషధరాజ్యాన్ని పరిపాలిస్తున్న నలమహారాజు యొక్క గుణగణాల గురించి, సౌందర్య పరాక్రమాల గురించి ఆనోటా ఆనోటా కర్ణాకర్ణిగా విన్న రంభ మనస్సులో ఆ రాజు పట్ల రాగోదయం కలిగింది. ఎలాగైనా అతణ్ణి తనవాడిగా చేసుకోవాలని ఆమె పరిపరి విధాల పర్యాలోచన చేసింది. కాని, అదేమీ సాధ్యమయ్యే వ్యవహారంలాగా కనబడలేదు. తానేమో అప్సరాంగన! ఆ మహీపతేమో మానవమాత్రుడు! తామిద్దరికీ పొత్తు ఎలా పొసగుతుంది?............. పోనీ, తానే సాహసించి మనుజలోకానికి వెళ్ళి కార్యం సానుకూలపరచుకుందామనుకుంటే, చండశాసనుడైన మహేంద్రుని క్రోధం తనకు తెలియనిది కాదు. తనను శాశ్వతంగా మానవకాంతగా మార్చివేయగల సమర్థుడు అతడు! ------------ బాగా ఆలోచించిన మీదట, వివేకవతియైన రంభ ఆ రాజేంద్రునితో సంయోగం తన యోగంలో లేదని గ్రహించింది. ఐనా, నలునిపై తనకు గల మమకారాన్ని చంపుకోలేక, దేవలోకవాసుల్లో నలునితో 'నామసామ్యం' గల నలకూబరుణ్ణి వరించింది. అతడు నలుడు - ఇతడు ' నల 'కూబరుడు. ఆ విధంగా నలుని నామధేయాన్ని తన పేరుకు జోడించుకున్నానని సంతృప్తి పడింది. ఇదంతా నిజమేనని చెప్పేటందుకు పురాణాల్లో మనకేమీ ఆధారాలు లేవుకాని, కమనీయమైన ఈ కథను కల్పించడంలో కవిగారి ఊహాపటిమ అత్యంత రమణీయమని ఒప్పుకోక తప్పదు.

అధార్మికాభివృద్ధి ....

అధార్మికాభివృద్ధి ....

"లోకంలో ధార్మికులకంటే అధార్మికులే సుఖంగా బ్రతుకుతున్నారు" అనే మాట తరచూ వింటూ ఉంటాం. వ్యక్తిగతజీవితంలో ఎదురయ్యే సమస్యలు, సమాజంలో ఉత్పన్నమౌతున్న భయంకరమైన అనుభవాలు మనను ధర్మాచరణవిషయికంగా విచికిత్సకు గురిచేస్తాయి.
"న్యాయానికి రోజులు కావండీ"
"మడికట్టుకు కూర్చుంటే మట్టే మిగులుతుంది"
"ఎలా సంపాదించావనేది కాదు – ఎంత సంపాదించావనేది ముఖ్యం"
"నిజాయితీ కూడూ గుడ్డా పెడుతుందా ?"
"చాదస్తాలు పెట్టుకోక నాలుగురాళ్ళు వెనకేసుకో"
ఇలాంటి మాటలు బలహీన మనస్కులను ప్రలోభపెడతాయి. ఇవి నిజమేనేమో అనిపిస్తాయి. తాము పాటిస్తున్న నైతికవిలువలు ఆదరణీయాలా –కాదా? అనే సంశయాన్నీ కలిగిస్తాయి. అసలు ఏ విలువలూ పట్టించుకోకుండా , నిస్సంకోచంగా అధర్మవర్తనానికే అలవాటుపడినవాడికి ఈ ఊగిసలాటే ఉండదు.

"ధర్మశీలురకు కష్టాలేమిటి ? అధర్మవర్తనులకు సుఖాలేమిటి ?" అనే ఆలోచన సాక్షాత్తూ ధర్మరాజుకే వచ్చింది. ఒకప్పుడు అరణ్యవాస సమయంలో ఆయన రోమశమహర్షిని –
ధరణిన ధార్మికులగు – కా
పురుషుల కభివర్ధనంబుఁ బుణ్యచరిత్రం
బరగెడు ధార్మికులకు –దు
ర్ధరమగు నవివర్ధనంబుఁదగునె మహాత్మా ?
అని ప్రశ్నించాడు.

తమ విషయంలో జరిగినదదే. తాము ధర్మానికి కట్టుబడి ఉన్నా కష్టాలు తప్పటంలేదు. అధర్మవర్తనులైన కౌరవులు హాయిగా సుఖాలు అనుభవిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది ? అనే శంక సకలధర్మవేదియైన ధర్మరాజుకే వస్తే , సామాన్యులకు రావటంలో ఆశ్చర్యమేముంటుంది?

ఈప్రశ్నకు సమాధానంగా రోమశుడు - "ధర్మనందనా ! ప్రపంచంలో అధర్మవర్తనుల అభివృద్ధి ఏనాడూ సమంజసం కాదు. అది నిలిచేదీ కాదు. త్వరలోనే నశిస్తుంది. దుర్మార్గులకు దక్కేది కుహనాభివృద్ధిమాత్రమే. ఇలా అధార్మికాభివృద్ధితో విర్రవీగిన దుర్మార్గులెందరో వేల సంఖ్యలో నశించిపోవటం మాకు తెలుసు" అన్నాడు.
బలాన్నీ, ధనాన్నీ, అధికారాన్నీ దుర్వినియోగం చేస్తూ తమంతటివారు లేరని అహంకరించేవారు కొంత కాలం గడ్డిమంట వెలుగులా వెలిగిపోతారు. ఆ తరువాత దుర్గతులు సంభవించి, చరిత్రహీను లౌతారనటానికి అనేకానేక నిదర్శనాలు – పురాణాల్లో, చరిత్రలో, సమకాలీనసమాజంలో మనం గమనించగలం.
పరస్యపీడయాలబ్ధం , ధర్మస్యోల్లంఘనేన చ
ఆత్మావమాన సంప్రాప్తం న ధనం తత్సుఖాయ వై
- అనేది ఒకసూక్తి.

పరపీడనం ద్వారా, ధర్మాన్ని ఉల్లంఘించటం ద్వారా, తనను తాను అవమానించుకోవటంద్వారా సంప్రాప్తించిన ధనం ఏకోశానా సుఖాన్ని ఇవ్వజాలదని దీని భావం.

దీనిని ఒక ఆదర్శంగా స్వీకరించి జీవించే సన్మార్గులను కొందరు హేళనచేస్తూ ఉంటారు. అపార ధనరాసులే జీవిత సర్వస్వమనీ, ఆ రాసులను సంపాదించటానికి – మంచి, చెడులతో నిమిత్తం లేకుండా ప్రయత్నించాలనీ, చేతకానివారే "నీతి, నియమం" అంటూ వ్రేలాడి అన్ని సుఖాలకూ దూరమౌతారనీ వీరి వాదన. మహోత్కృష్ట మానవజన్మను అధర్మాంకితం చేయటమంటే సువర్ణపాత్రికలో కల్లుపోయటమే ! జీవితం సుఖ, దుఃఖాల సంకలనం. ధర్మవీరులుగా మానవులు దానిని ఎదుర్కోవాలి. తమ అడుగుజాడలను భావితరాలకు ఆదర్శ నిధులుగా ఇవ్వగలవారి ధార్మికాభివృద్ధియే ఆదరణీయం.

అంతిమంగా మనం నమ్మి తీరవలసినదేమిటో ఈ సూక్తి సుస్పష్టంగా చెప్తోంది –
ధర్మో జయతి నాధర్మః, సత్యం జయతి నానృతం
క్షమా జయతి న క్రోధో , విష్ణుర్జయతి నాసురః

ధర్మమే జయిస్తుంది , అధర్మంకాదు !
సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు !
క్షమయే జయిస్తుంది, క్రోధం కాదు !
విష్ణువే జయిస్తాడు, రాక్షసుడు కాదు !
అని దీని అర్థం.

మనసైన చెలి పిలుపు...

ఈ పాట మిత్రుడు పొన్నాడ మూర్తి గారికి కానుక...
ఈ పాట యు ట్యూబ్ లో దొరక లేదు... నేను అప్ లోడ్ చేశాను...
మనసైన చెలి పిలుపు... సీనియర్ సముద్రాల రచన...మ్యూజిక్ టి వి రాజు..
పాడినది రావు బాల సరస్వతి...ఏ .పీ. కోమల..
జయ సింహ లో పాట....వహీదా రామారావు ల జంట.

A Song From Suvarna Sundari..

This superb classical duet is based on four Ragas, one each for each stanza, Sohni (Hamsanandi), Bahar (Kanada), Jaunpuri (Juanpuri) and Yaman (Yamuna Kalyani).Adi Narayana Rao was producer and his wife Anjali Devi acted in the film along with A Nageshwar Rao.

'' ఓం హ్రీం భం కాలభైరవాయ నమః"


భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
కాలం అను కూలించాలంటే ఏం చేయాలి
అయితే ఇలాచేసి చూడండి.

" కాలానికి అధిపతి కాలభైరవుడు, విశ్వనాధుని మరోరూపం,
మీకు అన్ని కాలాలు, అనుకూలంగా వుండాలంటే,
తప్పక కాలభైరవుని అనుగ్రహంకావాలి.
ప్రతినిత్యం తప్పకుండా కాలభైరవుని స్మరించినచో
కాలానికి భయపడనవసరంలేదు "
సమస్త దోషనివారణ కొరకు కాలభైరవ మంత్ర జపం 5.నిముషాలు చేయండి.
నల్ల కుక్కుకు రొట్టెముక్కగాని, బిస్కట్టు గాని తిని పించండి.

మంత్రం.
'' ఓం హ్రీం భం కాలభైరవాయ నమః"

Tuesday, July 23, 2013

అమ్మలగన్నయమ్మ


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

భావం: అందరు అమ్మలకు అమ్మ, ముగ్గురు అమ్మలకూ మూలమైన అమ్మ, అమ్మలందరి కంటె గొప్పది అయిన అమ్మ, రాక్షసుల తల్లుల కడుపులకు చిచ్చుపెట్టిన అమ్మ (రాక్షసులను చంపి వారి తల్లులకు శోకం మిగిల్చిన తల్లి), తనను మనస్ఫూర్తిగా నమ్మిన దేవతల తల్లుల మనసులో నిలిచి ఉండే తల్లి, దయా గుణంలో సముద్రమంత పెద్ద మనసు గల తల్లి అయిన దుర్గాభవాని, మహత్తులు కల కవిత్వ పటుత్వ సంపదలను ప్రసాదించుగాక!

సామెతలు...

సామెతలు....సత్యవతి గారి సేకరణ.
1. అందని పండ్లకు అఱ్ఱులు చాచినట్లు.
2. అందరికి నేను లొకువ నాకు నంబి లోకువ.
3. అంగిట బెల్లం ఆత్మలో విషం.
4. అంతా వట్టిది పట్టుతెరలే.
5. అంగడి బియ్యం తంగెడి కట్టెలు.
6. అందరూ ఘనులైన హరునకు తావేది?
7. అందాల పురుషుడికి రాగి మీసాలు.
8. అందరూ ఆ బుర్రలో విత్తనాలే.
9. అంబటి మీద ఆశ మీసాల మీద మొజు.
10. అంబలి థినువేళ అమృతమబ్బినట్లు.
11. అందరూ అయ్యోరులైతే చదివేదెవరు.
12. అక్కమ్మ స్రార్ధనికి అధిశ్రావణం.
13. అక్కలు లేచేవరుకు నక్కలు కూస్తాయి
14. అగసాలిని వెలయాలిని నమ్మరదు.
15. అగ్గువ బేరం నుగ్గు నుగ్గు.
16. అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం.
17. అగ్నిలో మిడత పడ్డట్లు.
19. అడక్కుంటే జోలె అడుక్కుపోతుంది.
20. అడవి నక్కలకు కొత్వాలు ఆజ్ఞలా?
21. అడవి పులి మనుషులని ఆదరించునా?
22. అడవిలో తినేసి ఆకుతో తుడిచినట్లు.
23. అడిగింది రొట్టె, ఇచ్చింది రాయి.
24. అడుగనేరను ఊడ్చిపెట్టు అన్నట్లు.
25. అడుగు తప్పితే అరవై ఆరు గుణాలు.
26. అడుగు దాటితే అక్కర దాటుతుంది.
27. అడుగు పడగానే పిడుగు పడ్డట్టు.
28. అడేజావ్ వచ్చి బడేజావ్ అన్నదట.
29. అడుసు తొక్కనేల కాలు కడుగనేల.
30. అడిలేనిదే తలుపు గదెందుకు.
31. అద్దంలొని ముడుపు అందిరాదు.
32. అద్దం మీద ఆవగింజ పడ్డట్టు.
33. అద్దంలో ముడుపు అరచేతి స్వర్గం.
34. అద్దంలోని మూత అందిరాని మాట.
35. అమ్మ రాకాసి, ఆలి భూకాసి.
36. అమ్మి చిన్న ,కమ్మ పెద్ద.
37. అమావాస్యకు తరువాత పౌర్ణమి రాదా?
38. అమర్చినదానిలో అత్త వేలు పెట్టినట్లు.
39. అమరితే ఆడది,అమరకుంటే బొడిది.
40. అమ్మేదొకటి అసిమిలోదొకటి
41. అత్త మిత్తి తోడికోడలు కత్తి.
42. అత్త మంచి,వేము తీపి ఉండదు.
43. అత్తపేరు పెట్టి కూతురిని కొట్టినట్లు.
44. అత్త మెత్తన ,కత్తి మెత్తన ఉండవు.
45. అన్ని పేర్లకు ఆషాడం తప్పదు.
46. అన్నము చుట్టరికము, డబ్బు పగ.
47. అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది.
48. అప్పు తీర్చెవానికి పత్రంతో పనేముంది.
49. అప్పు లేకపొతే ఉప్పు గంజైన మేలు.
50. అరవ చెరుచు ,పాము కరుచు.
51. అరచేతికి పండ్లొచ్చినట్లు.
52. అరిగిన కంచు, మురిగిన చారు.
53. అరపుల గొద్దు పితుకునా?.
54. అరిక కలవదు అరక్షణం ఓపలేదు.
55. అరికాలిలో కన్ను వాచినట్లు.
56. అయితే ఆముదాలు కాకుంటే కందులు..
57. అయ్య కదురువలె,అమ్మకుదురువలె.
58. అవ్వను పట్టుకుని వసంతాలదినట్లు.
59. అసలుది లేకపొతే అహంకారమెక్కువ.
60. అసలు పసలేక దొంగని అరచినట్లు.

Monday, July 22, 2013

Waheeda Rehman's beauty not only glows,it enchants with an aura of mystery.


One of the finest Geeta Dutt songs. And Waheeda Rehman's beauty not only glows,it enchants with an aura of mystery.

వింజమూరి శివ రామారావు గారు రచించిన పాట..

ఇది మా బాబయ్య గారు వింజమూరి శివ రామారావు గారు రచించిన పాట..

కాంచన ..

.

 మనుష్యుల వయస్సు పెరిగే కొద్దీ బాహ్య సౌందర్యం తగ్గి, వారి

అతః సౌందర్యం వృధ్ధి చెందుతుంది, ఆధ్యాత్మికత వైపు అడుగులు పడతాయి''

" తేనె " వంటి తెలుగు సాహితీ వైభవ వింజామర.


Sunday, July 21, 2013

రాజై ఉండి తోటకూరా పంచేది??

  ఒకానొక అగ్రహారములో అగ్నిహోత్రావధాని అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. కూటికి నే పేదను గుణములలో పెద్దను అన్నట్లు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి మొత్తం ఒక పూరిపాక. ఆ పాకని ఆనుకొని కాస్త ఖాళీ జాగా. ఆ జాగాలో తోటకూర విపరీతంగా పండేది. ఆ బ్రాహ్మడు చాలా మంచివాడు అవడంచేసి తన ఇంటిమీదుగా పోతున్న ప్రతివారినీ ఆపి పలుకరించి తన ఖాళీజాగాలో పండిన తోటకూర కాస్త ఉచితంగా ఇచ్చి పంపేవాడు.

         అతని ఔదార్యానికి మెచ్చిన బ్రహ్మ అతనిని మరు జన్మలో మహరాజుగా పుట్టించి అతనికి పూర్వ జన్మ జ్ఞాపకం ఉండేలా మాత్రం చేసేడు, అలా జ్ఞాపకం ఉంటే తనకు మహరాజ జన్మ కలిగినందుకు గల కారణం తెలిసి మరిన్ని మంచి పనులు చేస్తాడని.

         రాజైన ఆ బ్రాహ్మణుడు ఏం చేసేడో తెలుసా, తోటకూర నలుగురికీ ఉచితంగా పంచినందునే తనకు రాజ జన్మ లభించింది కనుక తాను మరు జన్మలో చక్రవర్తి కాదలచి తన రాజ్యమంతా తోటకూర పంట వేయించి అందరికీ ఉచితంగా పంచడం మొదలెట్టేడుట.

     
   రాజై ఉండి తోటకూరా పంచేది???? మూర్ఖుడు కాకపోతే?

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

ఈ పర్వం యతులకు అతిముఖ్యమైనది. వారీనాడు మహా భారతం మొదలైన సంహితా గ్రంథాలకు రచయిత అయిన వ్యాసుని పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారు.
పూజా విధానం

కొత్త అంగవస్త్రం భూమి మీద పరుస్తారు. దాని మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మ కాయలు ఉంచుతారు. ఇది శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకొంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తలా ఒక పిడికెడు తీసుకుకెళ్లి తమ తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం లక్ష్మీ చిహ్నం. శుభసందర్భాల్లో బియ్యం యథాశక్తిని రాసి పోసి లక్ష్మిని ఆహ్వానించటం హిందూ సాంప్రదాయం. నిమ్మపళ్లు కానుకగా ఇచ్చుపళ్లు.అవి కార్యసిద్ధిని సూచిస్తాయి. బియ్యం, నిమ్మపళ్లు ఉంచడం లక్ష్మీ కటాక్షం కోసమే. దక్షిణాదిని కుంభకోణంలో, శృంగేరిలో శంకర పీఠాలు ఉన్నాయి. వ్యాస పూర్ణిమ అక్కడ ఎంతో వైభవంతో జరుపబడుతుంది. ఆ పర్వసందర్భంలో అక్కడికి వేల కొలది తైర్థికులు వస్తారు. వ్యాసపూర్ణిమ గురుపూజా రోజుగా పాంచజన్యం పత్రిక (28.7.34) ఇట్లా అంటూ ఉంది.
''ఇందులో వ్యాసపదం గురుపరము. ఇప్పుడు ప్రతి చోటా తమతమ గురువుల నారాధించుకొని తరింప వలయునని శాస్త్రాదేశం. స్వస్వరూపాను సంధానమున కన్న భిన్నమగు అన్యారాధనను తెలియని యతిశేఖరులచే ఈ నాగాచార్య పీఠార్చనల నాచరింపవలసినగా శాస్త్ర మాదేశించినది. గుర్వారాశనం విశేష ప్రయోజనకారియు, అనుల్లంఘ్యమనియు చెప్పుటకు రెండు ప్రబల ప్రమాణ ములు కలవు. యస్యదేవే పరాభక్తి: యధా దేవేయతాథా గురౌ' అని శ్వేతాశ్వతరోపనిషతు నందు పేర్కొన్నారు. ఇందు వేదమాత, ఈశ్వరారాధన తోటి తుల్య గౌరవం, సమాన ప్రాధాన్యతను ఇస్తుంది. గురుపూజకు, కాని స్మృతికర్తలింకొక మెట్టెక్కుడధిష్టింప చూశారు. గురువును ''దైవేఋష్టే గురుస్తాతా,
గురౌ ఋష్టేనకశ్చన'' యని దైవానుగ్రహమునకు గురువనుగ్రహం అనివార్యం. గనుక సాధనమపేక్షించి వ్యాస పూర్ణిమలో వ్యాస పదమాధికారిక పదపరముగాని వ్యక్తి పరం కాదనునదొకటి, ఆనాడొ నర్చు గురు పీఠార్చనలలో ఇప్పుడు దేశమందములు లోనున్న యతి కర్తృక పూజ మాత్రములు ఉప లక్షకములు మాత్రమే. ఆనాడు సర్వులు సర్వవిధములు తమ తమ గుర్వర్చనజేసి గురుభక్తిని వెల్లడించి పెంపొందింప జేశారు. ఎంతో మంది ఋషులు ఉండగా ఒక్కవ్యాసుని పేరున ఈ పూజ జరుప బడుటకు ఏమిటి కారణం! ఈ పూజలో ప్రత్యేక పూజలు అందే ఆదిశంకరులు వ్యాసభగవానుని అపరావతారమని చెబుతారు. కాగా ఇది వ్యాస పూజకు ఉద్దిష్టమైనది. వ్యాస పూజ అనగా ఆదిశంకరుల పూజ. సన్యాసులందరూ ఆది శంకరులు తమ గురువుని ఎంచుకుంటారు. నేడు సన్యాసులందరూ వ్యాసుని రూపంలో తమ గురువును కొలుస్తున్నారన్నమాట అందుచేత ఇది వ్యాస పూజారోజు. శంకరాచార్యుల వారి జయంతికి వేరే ఒక రోజు ఉద్దిష్టమై ఉన్నది. కాగా దీనిని గురుపూజా దినోత్సవగా భావింపవలసి ఉంది.
మహాషాఢ వ్యాస పూజ

ఈ రోజు అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాస మహర్షిని పూజించాలి.
శ్లో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం

సూత్ర భాష్యకృతౌ వందే భగవంతా పున:పున:
అని పూజించిన బ్రహ్మత్వసిద్ధి లభిస్తుందంటారు.
వైష్ణవ పురాణమును ఆషాఢ పూర్ణిమకు దానమిస్తే విష్ణు లోకం కలుగును. వ్యాస భగవానుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకు పోయినపుడు అవి ఒకదానితో ఒకటి కలిసి పోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి చక్క పరచాడు. చిక్కుపడిన వేదములను విభాగించిన విద్యావేత్తయేకాక అతడు శస్త్ర చికిత్సావేది కూడ. గాంధారి ఈసుపూని దిగజార్చుకొన్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి ఆపిండంలో నూట ఒక్క శిశువులు ఉండడం గుర్తించి ఆ విధంగా ఆ పిండాన్ని నేర్పుతో విభాగించి నేతి కుండలో నిక్షిప్త మొనర్చి పోషించేటట్లు చేసిన వైద్యవరుడు, వైద్యవిద్యానిధి, మేధానిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించడానికి ఉద్దిష్టమైన పర్వమిది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ రుద్ర సావర్ణి మన్వంతరాది రోజు. రుద్ర పావర్ణి పన్నెండో మనువు. అతడు రుద్రపుత్రుడు ఈ మన్వంతరంలో ఋతధాముడు ఇంద్రుడు, తపస్వి, సుతపస్వి మున్నగువారు సప్తర్షులు.
వైష్ణవ పురాణమును ఆషాఢ పూర్ణిమకు దానమిస్తే విష్ణు లోకం కలుగును. వ్యాస భగవానుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకు పోయినపుడు అవి ఒకదానితో ఒకటి కలిసి పోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి చక్క పరచాడు. చిక్కుపడిన వేదములను విభాగించిన విద్యావేత్తయేకాక అతడు శస్త్ర చికిత్సావేది కూడ. గాంధారి ఈసుపూని దిగజార్చుకొన్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి ఆపిండంలో నూట ఒక్క శిశువులు ఉండడం గుర్తించి ఆ విధంగా ఆ పిండాన్ని నేర్పుతో విభాగించి నేతి కుండలో నిక్షిప్త మొనర్చి పోషించేటట్లు చేసిన వైద్యవరుడు, వైద్యవిద్యానిధి, మేధానిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించడానికి ఉద్దిష్టమైన పర్వమిది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ రుద్ర సావర్ణి మన్వంతరాది రోజు. రుద్ర పావర్ణి పన్నెండో మనువు. అతడు రుద్రపుత్రుడు ఈ మన్వంతరంలో ఋతధాముడు ఇంద్రుడు, తపస్వి, సుతపస్వి మున్నగువారు సప్తర్షులు.

Saturday, July 20, 2013

"శనైశ్చరుడు"

చిన్న వివరణ...శని - గ్రహం - దేవుడు కాదు...వేదాలలో గ్రహాలకి ఈశ్వరత్వం లేదు. కాబట్టీ, ' శనీశ్వరుడు ' అని ఉఛ్చరించడం సరికాదు. "శనైశ్చరుడు" అనేది సరియైన నామము. "శనైః-శనైః-చరహః" - "మెల్లగా మెల్లగా కదిలేవాడు" - "శనైశ్చరుడు". శని వికలాంగుడు..రావణుడు, రెండు కాళ్ళను నరికివేయడం వల్ల శని తన కాళ్ళు కోల్పోయాడు. అందువల్ల మెల్లగ కదులుతాడు. ఇంద్రజిత్తు జన్మించే సమయంలో, రావణుదు తన ఆదేశంతో, అన్ని గ్రహాలను ఉత్తమమైన స్థానాలలో ఉంచాడు. అలా ఉండీ ఉండీ, సరిగ్గా ఇంద్రజిత్తు జన్మించే సమయంలో, శని తన రెండు కాళ్ళనూ ముందరి స్థానంలోకి చాపాడు..దానితో ఇంద్రజిత్తు జన్మించిన సమయంలో శని స్థానం దోష భూయిష్టంగా మారింది..దానికి ఆగ్రహించిన రావణుదు, కోపంతో శని రెండు కాళ్ళనూ అప్పటికప్పుడు నరికేశాడు..ఎంతో ప్రతిభావంతుడైన ఇంద్రజిత్తు, శని స్థానం దోషం కావడం వల్లన, అధర్మాన్ని ఆశ్రయించి ఉండడం వల్లనా, యుద్ధంలో అకాల మరణం పొందిన విషయం మన అందరికీ తెలిసినదే...

కుందేలు మారింది రెండు రైళ్ళు..(ఆరుద్ర కవిత)

తాబేలూ కుందేలూ వేసేయి వందమైళ్ళ పందెం
తాబేలే గెలిచింది తెలుసునా ఆ చందం?
తాబేలు నడిచింది వంద మైళ్ళు
కుందేలు మారింది రెండు రైళ్ళు..(ఆరుద్ర కవిత)

పాండవ ఉద్యోగ విజయాలు


పాండవ ఉద్యోగ విజయాలు

అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుని సహాయమర్ధించుటకు వచ్చుట
అర్జునుడు:

దృపదుని పంపునన్ జనె పురోహితు డా ధృతరాష్ట్ర సూతి బల్
కపటి; వినండు; సంధి జెడగా గమకించెడు గాని; తప్పదా-
లపు బని; సర్వమున్ గడప లావు గలండు యశోద పట్టి; యా
రిపు జన కాలు తోడుత వహించెద, సర్వము నిర్వహించెదన్

అదిగో, ద్వారక! యాలమంద లవిగో! నందందు దోరాడు, న
య్యదియే కోట, యదే యగడ్త, యవెరథ్యల్, వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడ యదిగో! నాలానదంతావళా
భ్యుదయంబై వర మందిరాంతర తురంగోచ్చండమై పర్వెడున్.

జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పం
క్తుల కెవ్వాని పదాబ్జ పీఠి కడు నిగ్గుల్ గూర్చు దత్సన్నిధి
స్థలి గూర్చుండి భవంబు పావనముగా దైవార గావించి నా
తొలి జన్మంబున గూడు పాపముల నాందోళింపగా జేసెదన్.
కృష్ణుడు (అర్జునునితో):

ఎక్కడనుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో
భాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
జక్కగ నున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్
దక్కక నిల్చి శాంతుగతి దాను జరించునె తెల్పు మర్జునా!
కృష్ణుడు (దుర్యోధనునితో):

బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్


కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ యయ్యె, మాకు న
వ్వారికి గూడ నెక్కుడగు బంధు సముద్రుడ వీవు గాన, నీ
చేరిక మాకు నిర్వురకు సేమము గూర్చెడిదౌట, సాయమున్
గోరగ నేగుదెంచితిమి గోపకులైక-శిరో విభూషణా !
కృష్ణుడు (దుర్యోధనునితో):

ముందుగ వచ్చి తీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్,
బందుగులన్న యంశ మది పాయక నిల్చె సహాయ మిర్వురన్
జెందుట పాడి, మీకు నయి చేసెద సైన్య విభాగ మందు మీ
కున్ దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు మున్నుగన్.

అన్ని యెడలను నాకు దీటైన వారు
గోపకులు పదివేవు రకుంఠ బలులు
గలరు నారాయణాఖ్య జెన్నలరువారు,
వార లొకవైపు నేనొక్క వైపు మరియు.

యుద్ధ మొనరింత్రు వార ల
బద్ధ మ్మెందులకు ? నేను బరమాప్తుడనై
యుద్ధమ్ము త్రోవ బోవక
బుద్ధికి దోచిన సహాయమును బొనరింతున్.
దుర్యోధనుడు (స్వగతం):

ఆయుధము పట్టడట! యని
సేయండట! "కంచి గరుడ సేవ" యితనిచే
నేయుపకృతి యుద్ధార్థికి
నేయెడ నగు! నిట్టి వాని నెవ్వండు గొనున్.
కృష్ణుడు (అర్జునునితో):

ఆయుధమున్ ధరింప నని కగ్గముగా నొకపట్ల నూరకే
సాయము సేయువాడ, బెలుచన్ నను బిమ్మట నెగ్గు లాడినన్
దోయిలి యొగ్గుదున్, నిజము, తొల్త వచించితి గోరికొమ్ము నీ
కేయది యిష్టమో, కడమ యీతని పాలగు బాండునందనా.
అర్జునుడు (కృష్ణునితో):

నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-
ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నా
స్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పు గాక, నీ
వెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా !

రథము నందెన్ని చిత్రంపు బ్రతిమ లుండ
వందు శివుడును విష్ణువు నజుడు నెల్ల
దేవతలు నుండవచ్చు, నా ఠీవి గృష్ణు
డర్జున స్యందన విభూష యగును గాక !
కృష్ణుడు (అర్జునునితో):

"ఆలము సేయ నే" నని యదార్థము బల్కితి జుమ్మి, యిట్టి గో
పాలుని నన్ను గోరితివి, భండన పండితులగ్నితేజు లు-
త్తాల ధనుర్ధరుల్, బహుశతప్రమితుల్ యదుసింహు లందఱిన్
బాలుగ గైకొనెన్ గురునృపాలుడు, బాలుడవైతి వక్కటా !
అర్జునుడు (కృష్ణునితో):

"ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ! యాల జాతికిన్
దిన్నది పుష్టి" నీ వరుగుదెంచి రథంబున నున్న జాలు, నే
సున్నము జేసెదన్ రిపుల చూపఱు లద్భుత మంద, సర్వ లో-
కోన్నత! నాకు బేరొసగు, మూరక చూచుచునుండు మచ్యుతా !
కృష్ణుడు (అర్జునునితో):

ఊరక చూచుచుండు మను టొప్పితి గాని భవద్ రథస్థు నన్
బారగ జూచి నీ రిపులు పక్కున నవ్వి యనాదరింతు రా
శూరకులంబు మెచ్చ రిపుసూదనతాభర మూను నీకు నే
సారధినై, యికన్ విజయసారధి నామమునన్ జరించెదన్
అర్జునుడు (కృష్ణునితో):

సారధి యంట! వేదముల సారము శౌరి, తదంఘ్రి భక్తి చె
న్నారెడు క్రీడి తా రధికుడౌనట! చిందము విల్లు దేరునున్
వారువముల్ మొదల్ దివిజవర్గ మొసంగిన వంట ! యస్త్ర వి-
స్తార గురుల్ శివాదులట, సంగరమం దెవడాగ జాలెడిన్.
కృష్ణుడు (అర్జునునితో):

వచ్చెడి వాడు గాడతడు వారికి మీకును గూడ దోడు, వి-
వ్వచ్చుడ, యమ్మహామహుని భావము మున్నె యెఱింగినాడ, నా
సచ్చరితుండు మీకు దగ సంధి పొసంగిన సంతసించు, నా
యిచ్చయు నట్టిదే, మన నరేంద్రుని యిచ్చయు గూడ నట్టిదే.
రాయబారనునకు ముందు కృష్ణుడు పాండవులతో సంభాషించుట
ధర్మరాజు (కృష్ణునితో):

ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేఱ కెల్ల చు-
ట్టాలును రూపుమాయ కకటా ! యిల దక్కునె ! దక్క నిత్తురే ?
చాలును రాజ్యభాగము, ప్రజల్ సుఖియించిన నాకు జాలు, నే
జాలక  కాదు సూవె ! తిన జాలను నెత్తురు కూడు మాధవా !
కృష్ణుడు (ధర్మరాజుతో):

మాయదురోదరంబున నమాయికునిన్ నిను గెల్చి కాంతకున్
జేయగ రాని యంత పని జేసి యరణ్యములోని కంపియున్
హాయిగ నుండనీక బలులై పలునెగ్గులు పన్నుచున్న యా
దాయలు చత్తు రంచు దయ దాల్చెద వెంతటి ధర్మరాజవో ?
భీముడు:

అనుపమ విక్రమ క్రమ సహాయుల కంతటి పాండు రాజనం
దనులకు నొక్క కూళ భరణం బిడు చాడ్పున నూళులైదు ని
చ్చునట ! కటా ! యటుల్ బ్రదుక జూచుట రాచ కొలంబు వారికిన్
ఘనతయె ? మంత్ర రుద్ధ భుజగంబ నిసీ ! యిపుడేమి చేయుదున్
కృష్ణుడు (భీమునితో):

నిదుర వోచుంటివో ! లేక బెదరి పల్కు
చుంటివో ? కాక నీవు తొల్లింటి భీమ
సేనుడవె కావొ ! యెన్న డీ చెవులు వినని,
కనులు చూడని శాంతంబు గానవచ్చె.

"కురుపతి పెందొడల్ విఱుగ గొట్టెద ఱొమ్ము పగిల్చి వెచ్చ నె-
త్తురు కడుపార గ్రోలి యని దున్మెద దుష్టుని దుస్ససేను భీ
కర గదచేత" నంచును బ్రగల్భము లాడితి-వల్ల కొల్వులో
మరల నిదేల యీ పిఱికి మానిసి పల్కులు మృష్ట భోజనా !
భీముడు (కృష్ణునితో):

బకునిం జంపితి, రూపు మాపితి హిడింబా సోదరున్, దుష్ట కీ-
చకులం దున్మితి మొన్న నూర్గుర, జరాసంధుం్ దురాసంధు నే
నొకడం జంపితి నాకు భీమునకు వేఱొక్కండు తోడేల ! యె
న్నక నన్నీగతి బోరికిం బెదరు చున్నాడం చనం బాడియే ?
ధర్మరాజు (భీమునితో):

తాతయు నొజ్జయున్ గురులు దక్కిన జోదులు చూచుచుండగా
బాతకు లీడ బోక మన భార్యను బట్టి పరాభవింప నా
నాతికి మానరక్షణ మొనర్చిన యట్టి మహోపకారి ని
న్నీతడు శౌర్యహీనుడని యీరసిమాడిన లోపమున్నదే.

జూదరియై కళత్రమును శోకము పాలొనరించి తల్లి దా
యాదుల యింట నుండగ మహాటవి వాలయి తమ్ము-గుఱ్ఱలం
గాదిలి పెండ్లమున్ వెతల గ్రాంచిన యీబరి యుండ మాని యిం-
దేదియు లేని భీముపయి కేగెద వేల గదా ప్రహారమా !
కృష్ణుడు (భీమునితో):

భీకరమై యగాధమయి భీష్మ గురు ప్రముఖోపలా-కులం
బౌ కురురాట్చమూజలధి కడ్డముగా జనగా భవచ్చమూ
నౌకను ద్రిప్పగా దగిన నావికు డెవ్వడు ! నీవు లేక యీ
శోకము తీఱునే ద్రుపద సూతికి నిక్కము వాయునందనా !
ద్రౌపది (కృష్ణునితో):
(థెసె థ్రీ ఫ్రొం భారతము)

***  వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి నందు బాండు భూ
వరునకు గోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్.

***  నీవు సుభద్ర కంటె గడు నెయ్యము గారవముందలిర్ప సం-
భావన-సేయుదిట్టినను బంకజనాభ ! యొకండు రాజసూ
యావబృధంబు నందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీ
యేవురు జూడగా సభకు నీడ్చె-గులాంగన నిట్లొనర్తురే .

***  ఇవి దుస్ససేను వ్రేళ్ళం
దవిలి సగము ద్రెవ్వి పోయి దక్కినయవి కౌ
రవులకడ దీరు మాటల
యవసరమున దలప వలయు నచ్యుత వీనిన్
భీముడు (ధృతరాష్ట్రునికి చెప్పమని):

దొర యొక్కండన నేటి మాట ? బలవంతుం డెవ్వడో వాని దీ
ధర, పోరన్ జయమో పరాజయమొ రాదా ? గెల్చి రాజన్యులం
దరు మెచ్చన్ ధర యేలు కొంద మటు కాదా ? చచ్చి స్వర్గంబునం
దిరుగన్ వచ్చును మంచి క్షత్రియుల కింతే యొండు లే దెచ్చటన్

ఆలములోన నీ సుతుల నందఱి నొక్క గదా భుజంగికిన్
బాలొనరించి వచ్చిన నృపాలురు చూడగ నిచ్చువాడ నే
నూళులు తిండికిన్ బ్రతికి యుండిన మీకును "దాసి" వంచు బాం-
చాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతీ వధూతికిన్ .
కృష్ణుడు (ధర్మరాజుతో):

నాల్గు పయోధులో యనగ నాలుగు దిక్కరులో యనంగ నీ
నల్గురు తమ్ములున్ బ్రమథ నాథ సమానులు, యుద్ధ రంగ మం-
దల్గిన నెవ్వడోప-గలడయ్య ! భవత్పరిభావ వహ్నికిన్
గల్గిన వృద్ధి యింక రిపు కాంతల బాష్పము లార్ప జూడుమా .

ఐనను బోయి రావలయు హస్తిన, కచ్చటి సంధిమాట యె
ట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ
మానసమందు గల్గు ననుమానము దీర్పగ వచ్చు దత్సమా-
ధానము మీ విధానమును తాతయు నొజ్జయు విందురెల్లరున్ .
ధర్మరాజు (కృష్ణునితో):

సంధి యొనర్చి మా భరత సంతతి నిల్పుము, లేద యేని గ
ర్వాంధుల ధార్త రాష్ట్రుల సహాయులతో దునిపింపు మో జగ
ద్బాంధవ ! రెండు కర్జముల భారము బెట్టితిమయ్య ! నీ భుజ
స్కంధమునందు, దారసిలు గావుత మాకు యశంబొ, రాజ్యమో .
కృష్ణుడు కౌరవ సభలో చేసిన రాయబారం
కృష్ణుడు:

తమ్ముని కొడుకులు సగపా-
లిమ్మనిరటు లిష్ట పడవదేనియు నైదూ
ళ్ళిమ్మని రైదుగురకు ధ-
ర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్

తనయుల వినిచెదవో నీ
తనయులతో నేమి యని స్వతంత్రించెదవో
చనుమొక రీతిని లేదే-
నని యగు వంశ క్షయంబు నగు కురునాధా

పతితులు కారు నీ ఎడల భక్తులు శుంఠలు కారు విద్యలన్
చతురులు మంచివారు నృప సంతతికిన్ తల లోని నాల్కల-
చ్యుతునికి గూర్చువారు రణ సూరులు పాండవులట్టివారలీ
గతి నతి దీనులై యడుగగా నిక నేటికి సంశయింపగన్?

జండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేణినిం గూర్చి నే
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొ
క్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మానాథ సంధింపగాన్ !!

చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్
తొల్లి గతించె నేడు నను దూతగ వంపిరి సంధి సేయ నీ
పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ సంధి సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా !!

అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే
యలిగిన నాడు సాగరము లన్నియునేకము కాక పోవు క
ర్ణులు పది వేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్

సంతోషంబున సంధి సేయుదురె వస్త్రంబూడ్చుచొ ద్రౌపదీ-
కాంతన్ జూసిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంతన్ నీ సహ జన్ము రొమ్ము రుధిరంబుం ద్రావు నాడేని ని-
శ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించు నాడేనియున్

Friday, July 19, 2013

(నారాయణ శతకము - పోతన)

ధర సింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్ భృత్యులై,
పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండ మాకారమై,
సిరి భార్యామణియై, విరించి కొడుకై, శ్రీగంగ సత్పుత్రియై
వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!

(నారాయణ శతకము - పోతన)

Thursday, July 18, 2013

వేంకటేశ్వరుడు

 వేంకటేశ్వరుడు
నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. పండితులను అడిగాను కాని దాటేశారు సరైన సమాధానం చెప్పలేదు. కొంచెం పెద్దలు నా సందేహాన్ని తీర్చగలరు. ఏమంటే ఆదిశంకరులు ఆశేతు హిమాచల పర్యంతం పర్యటించి అనేక మఠాలను నెలకొల్పి హైందవమతాన్ని జాగ్రుతం చేసారు. బాగుంది. చాలా బాగుంది. అయితే ఆయన కొండకోనలలో జనులు చొరరాని కీకారణ్యంగా వున్న తిరుమల గిరిపై వెలసిన వెంకన్నగారి హుండీకి లక్ష్మీ యంత్రాన్ని ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాన్ని ఎందుకు స్థాపించారు తన శైవ మఠాలను వదిలేసి. ఎవరికైనా తన మఠాలపైనే దృష్టి వుంటుంది కదా. శంకర మఠాలను వదిలేసి వైష్ణవ క్షేత్రంలోనే ఎందుకు యంత్రాలను ప్రతిష్టించారు అని. శంకరులవారికి శివకేశవ బేధం లేదు అని చెప్పచ్చు. కేవలం వైష్ణవ క్షేత్రం అభివృద్ధిని కాంక్షించే చేసారంటారా....... పెద్దలెవరైన సరైన వివరణ ఇస్తే బాగుంటుంది.

VVS = ఈ ప్రశ్నలోని విషయాలు సామాన్యంగా అందరికీవచ్చే సంశయాలే. మనందరి పరిజ్ఞానం - పెద్దలు చెప్పినా, ప్రవచనాలు విన్నా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం వెదకినా వచ్చినదే. పురాణ వాఙ్మయము చదివి ప్రమాణములతో చెప్పగలవారు చాలా తక్కువ. మన మొదటి అపోహ శంకరాచార్యుడు శైవుడు, ఆయన వైష్ణవుడు కాడు అనేది. శంకరాచార్యుని చిత్రించే విధానం శైవునిలా విబూతిధారణతో కనుపిస్తుంది. ఈ శైవ, వైష్ణవభేదాలు శంకరుల తరువాత వచ్చినవి. రామానుజ పూర్ణప్రజ్ఞ (మధ్వ) దర్శనాలనే వైష్ణవదర్శనాలంటారు.......

vvs గారి వ్రాతకు జతగా నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయ సంకల్పించినాను.

నిజానికి వెం+కట అన్న ఈ రెండు శబ్దాలు సంస్కృత శబ్దములు కాదని విన్నాను. వీనికి సంస్కృత శబ్దమైన ఈశ్వర కలిపి వెంకటేశ్వర ఐనదని పండితుల మాట. ఇక నిజానిజాలకొస్తే వైష్ణవులు ఎవరైతే విష్ణువే పరబ్రహ్మ స్వరుపుడనుకోటారో వారు ఈశ్వర శబ్దము నుచ్చరించరు. అందుకే వెంకటాచల పతి
యని శ్రీనివాస యని నామంతరముల నెర్పరచుకొని పిలుచుకొంటారు .

మహా పండితులు కోట వెంకటా చలం గారు సహేతుకముగా సాదికారకముగా జగద్గురు ఆది శంకరుల కాలము బి. సి. 509--477 అని నిరుపించినారు. అట్టి ఆది శంకరులు వారు జీవించిన కాలములోనే ధనకర్షణ జనాకర్షణ యంత్రములు వేసియుంటారు . అసలా యంత్రాలు వారు వేసినారా లేదా అంటే అతి ప్రాచీనమైన ధనాకర్షణ యంత్రము స్వామి కొప్పెరను 10 లేక 15 సం.ల క్రితం పునరుద్దరించు నపుడు భూమి యడుగున దొరికింది . అంటే ఆ యంత్రముల పురాతనత్వము మీకు ఎరుకపడి వుంటుంది . శంకరులు సకల దేవతా స్తోత్రములు వ్రాసినా ప్రత్యేకించి వేంకటేశ్వరుని గూర్చి వ్రాయలేదు. కారణం ఆయన శివ కేశవ అభేది గనుక. ఆ విగ్రహమును గూర్చి యా అపర శంకరులకేరుక కనుక.
ఇక భగవద్రామానుజులు (1017–1137)
భగవద్రామానుజులవారు దాదాపు 120 సం. బ్రతికినారు.ఎన్నొ ఉత్థాన పతనాలను అనుభవించినారు. రామానుజులవారు వైష్ణవము నకు ప్రాచుర్యము సంతరింప జేయు వరకు ఆ మూర్తి వెంకటేశ్వరుని గానే ఆరాధింప బడుచుండినది . రామనుజులవారి గురువు యాదవ ప్రకాశ యతి(అద్వైతి),రామానుజుల తెలివితేటలపై మాత్సర్యము వహించుటచే కాలాంతరమున రామానుజులవారు శ్రీ యమునాచార్యుల(అలవందార్ )వారి శిష్యులై విశిష్టాద్వైతియై అద్వైతము పై ఆగ్రహమేమైనా పెంచుకొన్నారేమో వారి కాలములో వాగ్స్పర్ధ లేకాక వైష్ణవ మతాన్తరీకరణములు దేవాలయ మూల విగ్రహ నామాన్తరీకరణములు జరిగినట్లు పెద్దల వల్ల విన్నాను .

ఏది ఏమైనా వారికి పూర్వము ఆ విగ్రహాన్ని 6 నెలలు శైవాగమ విధానము గాను 6 నెలలు వైష్ణవాగమ విధానము గానూ పూజించేవారు .
వారి కాలములో చంద్రగిరి రాజులు వైష్ణవులైనందువల్ల వారి మాట పై గురుత్వము చేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శ్ర్రీనివాస విగ్రహం గా మార్చినట్లు తెలియ వచ్చుచున్నది .

ఇందుకు అనేక కారణాలున్నాయి . అవి తరువాత పోస్ట్ లో తెలియబరచుతాను. నేను విన్న చదివిన ఆధారాలపైనే ఈ మాటలు వ్రాస్తున్నాను .జిజ్ఞ్యాసువులు నన్ను తప్పుగా తలవారని తలుస్తాను.

Cheruku Ramamohanrao

Vinjamuri sisters..

Vinjamuri sisters..
VINJAMURI ANASUYA & SEETAMAMBA[ daughters of VINJAMURI VENKATARATNAMAMBA] at a young age after recording the YENKI PATALU for Chennapuri musical records[ yes! that was what Madras was called then]
Thier father is Late Vinjamuri Lakshmi narasimha panthulu was a great writter & telugu pandit..he wrote Anarkali drama,...He got Padmasree award in 1967...

Wednesday, July 17, 2013

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చాల అర్ధవంతమైనకవిత!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి  చాల అర్ధవంతమైనకవిత!

(విధాత తలపున  అనే ఈ పాట 1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రంలో సుప్రసిద్ధమైనది. ) 

.

విరించినై = నేనే బ్రహ్మని

విరచించితిని = రచించితిని

ఈ కవనం = ఈ కవిత్వం

విపంచినై = వీణనై

వినిపించితిని = వినిపిస్తున్నా

ఈ గీతం =ఈ పాట


.


బ్రహ్మ యొక్క ఆలోచనలలో ఎప్పుడో పుట్టిన స్రుష్టి మూల వేదం - " ఓం " 

.

మన ప్రాణ నాడులకు మొట్టమొదట ప్రాణం ఇచ్హినదే ఈ " ఓం " 

.

కళ్ళ కొలనులో ప్రతిభింబించిన స్రుష్టి రూపం ఈ "ఓం " 

.

గుండే వంటి పర్వత శ్రేణులలో ప్రతిధ్వనించిన బ్రహ్మ యొక్క వీణా గానం సరస సంగీతమైనటువంటిది, మంచి నదీ ప్రవాహము వంటిది, మొత్తం సామవేదం సారంశము అయినటువంటిది 

ఈ నేను పాడిన పాట నెనే బ్రహ్మనై రాసినది ఈ పాట/పద్యం/కవిత వీణనై వినిపిస్తున్నా ఈ పాట

తూర్పు (దిక్కు) అనే వీణపై, సూర్య కిరణాలు అనే తీగెలను మీటుతూ

మెల్కొన్న పక్షులు అకాశపు వేదికపై, పలికిన కిల కిల రావాలు

స్వర ప్రపంచానికి మొదలు ఇంకా విశ్వం అనే దానికి వివరణ.

పుట్టే ప్రతి శిశివు పలికే జీవన రాగపు అలలే ఈ ఓం

చైతన్యం పొందిన హ్రుదయం మౄదంగం వలే ద్వనిస్తే

 ఆ శబ్దం ఓం

ఎప్పటి రాగమో మొట్టమొదటి తాళమై

అనంతమయిన జీవన నదిలా సాగిన ఈ సృష్టి విలాశమే - ఓం


నా ఉచ్చ్వాసం- కవిత్వం

నా నిశ్వాసం - పాట

.

పూర్తి పాట .


విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! 

ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! 

కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం 

ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం 


సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది 

నే పాడిన జీవన గీతం ఈ గీతం 


విరించినై విరచించితిని ఈ కవనం 

విపంచినై వినిపించితిని ఈ గీతం 


ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన 

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన 

జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన 

పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా 

విశ్వ కావ్యమునకిది భాష్యముగా 


విరించినై 


జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం 

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం 

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా 

సాగిన సృష్టి విలాసమునే 


విరించినై 


నా వుచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం ||2||

సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది 

నే పాడిన జీవన గీతం ఈ గీతం 

Meaning for each charanam in Telugu :

బ్రహ్మ యొక్క ఆలోచనలలో ఎప్పుడో పుట్టిన స్రుష్టి మూల వేదం - " ఓం  " 

మన ప్రాణ నాడులకు మొట్టమొదట ప్రాణం ఇచ్హినదే ఈ " ఓం " 


కళ్ళ కొలనులో ప్రతిభింబించిన స్రుష్టి రూపం ఈ "ఓం "

గుండే వంటి పర్వత శ్రేణులలో ప్రతిధ్వనించిన బ్రహ్మ యొక్క వీణా గానం  


సరస సంగీతమైనటువంటిది, 

మంచి నదీ ప్రవాహము వంటిది,

మొత్తం సామవేదం సారంశము  అయినటువంటిది 

ఈ నేను పాడిన పాట 


నెనే బ్రహ్మనై రాసినది ఈ పాట/పద్యం/కవిత 

వీణనై వినిపిస్తున్నా ఈ పాట 


తూర్పు (దిక్కు) అనే వీణపై, సూర్య కిరణాలు అనే తీగెలను మీటుతూ 

మెల్కొన్న పక్షులు అకాశపు వేదికపై, పలికిన కిల కిల రావాలు  

స్వర ప్రపంచానికి మొదలు ఇంకా విశ్వం అనే దానికి వివరణ.


పుట్టే ప్రతి శిశివు పలికే జీవన రాగపు అలలే ఈ ఓం 

చైతన్యం పొందిన హ్రుదయం మౄదంగం వలే ద్వనిస్తే ఆ శబ్దం ఓం 

ఎప్పటి రాగమో మొట్టమొదటి తాళమై 

అనంతమయిన జీవన నదిలా సాగిన ఈ సృష్టి విలాశమే - ఓం   

నా ఉచ్చ్వాసం- కవిత్వం

నా నిశ్వాసం - పాట 

Meaning in English:

From the thoughts of Sri Brahma (The creator - GOD) the origin of vedas was born which was Oam / Aum

The first anthem which enables our senses is Aum


The representation of god (Viswaroopa)  reflected in the ponds of eye

The reverberation of the gods songs around the mountains of Heart.

The essence of samaveda is the song Im singing for you.


Becoming brahma Im writing this song,

I made you listen to this song becoming veena


East being the veena and rays of son being the strings of it 

becoming the sounds of woken up birds on the stage of blue skies..

the rhythm of cute birds sounds has become the initiator of the universe.

this makes the meaning of universal song which is the meaning of its acts.


The waves of living sounds that will speak out of every infant that is born..

The sounds of a heart that are like Mrudanga's sounds when the heart is responding to an emotion (chetana)

By making those earliest tunes on the adi tala as the eternal life saga..

That ever going natural process ..


My Inhalation is the poem..

My Exhalation is the song..

https://www.youtube.com/watch?v=vaLtLiiQu5g&lc=z13ptx2bbsvicv4fy22vf1tx5tnix5rje04

Tuesday, July 16, 2013

ముళ్ళ పూడి రమణ గారి బాల్యం ...


రమణ గారి బాల్యం ఆయన మాటల్లోనే…
“మా ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి దగ్గర. గోదావరి ఒడ్డున. రామపాదాల రేవులో మొదటి మేడ మా ఇల్లు. పక్కనే కొండమీద జనార్ధనస్వామి కోవెల, కొండ కింద శివాలయమూ ఉన్నా వాటి కన్నా మా ఇల్లే కోలాహలంగా ఉండేది. గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు సావిట్లో జై హరనాథ జై కుసుమ కుమారి జై – భజనలూ. నట్టింట్లో దె య్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజ లూ, బైరాగులూ – పెరటి వసారాలో చుట్టాలూ – వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ – పెరట్లో బావి అవతల పడవ వాళ్ళకి మా అమ్మమ్మ పెట్టే భోజనాలూ – బువ్వలు తిని దుంగళ్ళూ – కొట్టేవాళ్ళు. మేడ వరండాలో హిందీ పాఠశాల – రాజమండ్రి నుంచి గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్ళకీ మైతోహూం తూతో హై అంటూ చెప్పే హిందీ పాఠాలూ, పూనకాలూ, శాంతులూ, తర్పణాలూ – పూజగది పక్కన భజగోవిందం పాడుకుంటూ మా నాన్నగారు.
ఆఫీసు వేళ వంటవక ఏవిటీ జనం – ఇది ఇల్లా సంత బజారా అని ఆయన ఎప్పుడేనా ఒక్కొక్కసారి చుట్టాల మీద విసుక్కుంటే అంతవరకూ అందరికీ అన్నీ అందిస్తూ సందడిగా తిరిగే మా అమ్మకి కోపమొచ్చి, ఫిట్లొచ్చి నేలకి ఒరిగి పడిపోయేది. ఆవిడ చేతిలో ఉప్పూ తాళం చేతులు పెడితే లేచేది. మళ్ళీ మామూలే… అందుకే మా నాన్నగారు ఆదివారాలు కూడా ఆఫీసుకెళిపోయేవారు. ఒకసారి ఆసుపత్రికెళిపోయారు. అక్కడి నుంచి ఎక్కడికో వెళిపోయారు. ఇంకరారు అని చెప్పారు. మా అమ్మమ్మ పడవెక్కి భద్రాచలం వెళ్ళిపోయింది. అప్పుడు మా ఇల్లు చీకటయిపోయింది. దేవుళ్ళు, చుట్టాలూ, బాబాలు, బైరాగులూ, భజనవాళ్ళు, ఎవరూ కనబళ్ళేదు. అందరూ పారిపోయారు. నాకు భయం వేసింది.
దుర్గాబాయమ్మ గారి స్కూలావిడ రాజమండ్రి నుంచి వచ్చి భయపడవద్దని మా అమ్మకి చెప్పారు. మెడ్రాసు వెళ్ళిపొమ్మని చెప్పారు. మా అమ్మా నేనూ మా తమ్ముడూ మెడ్రాసొచ్చేశాం. మా బావ ఇంట్లో దిగాం. మెడ్రాసులో దుర్గాబాయమ్మ గారు పెద్ద సభ పెట్టారు. ఆంధ్రమహిళ సభ. “నువ్వు ధవళేశ్వరంలో నా దగ్గర హిందీ నేర్చుకున్నావు గదా. ఇక్కడ మన మహిళా సభలో వాళ్ళకి నీకొచ్చిన హిందీ నేర్పించు. నెలకిరవై రూపాయలు ఇస్తారు” అన్నారు. నెలకిరవై చాలదని తెలుసు. ఇంకో పనేదన్నా చేసి ఇంకో ఇరవై గడించు – అని చెప్పారు.
రెండు వందలు ఖర్చుపెట్టిన మేడలోంచి, రెండు రూపాయల అద్దెకి, ఒక మెట్ల కింద గది లాంటి దాంట్లో దిగాం. చిన్నప్పణ్ణించీ మా అమ్మనీ, చుట్టాలనీ తిట్టిపోసే , ఇన్నాళ్ళూ దూరంగా ఉన్న మా చిన్నమ్మమ్మ ఇప్పుడు సాయం వచ్చింది – ఒక చిన్న రేకుపెట్టె, తలగడా పట్టుకుని. ఆ రేకు పెట్టెకు రెండు తాళాలు వేసేది. అందులో పది లక్షల రూపాయలు దాచుకుందని మా అమ్మకీ, నాకూ తెలుసు. కాని ఆవిడ – నా మొహం దమ్మిడీ లేదు పిచ్చి కుంకల్లారా అనేది.
మెట్ల మీద సామానులు సర్ది మెట్ల దారిమీదే పడుకునే వాళ్ళం. నలుగురం పడుకుంటే ఈ గోడ నించి ఆ గోడకి సరిగ్గా సరిపోయేది. అమ్మమ్మ కాశీ మజిలీ కథలు చెప్పేది. పొద్దున్న లేవగానే వీధరుగు మీద కూచుంటే ఆవిడ మెట్ల మీద – అన్నం, కూరా, చారూ, టిఫినూ వండిపెట్టేది. ఈ అమ్మమ్మ పెట్లో బోల్డు డబ్బుంది. ఇక భయం లేదు అనుకున్నాం. కాని లేదంటుంది గదా. మరి నెలకి ఇంకా పది రూపాయలు కావాలి.
ఓ రోజున కొట్టుమీద బియ్యం, చింతపండు, ఉప్పు తో బాటు ఓ కాణీకి కుట్టుడాకులు కొన్నాం. కాణీకి మూడు ఇచ్చాడు. కాని మేం నలుగురం. మా అమ్మమ్మ, అమ్మా తమ్ముడూ నేనూను. కాణీకి నాలుగిస్తావా అంది మా అమ్మ. నేను కొనేది కాణీకి అయిదు. మీకు నాలుగిస్తే నాకేం మిగిలేనూ, అన్నాడు కొట్టువాడు. అయితే కాణీకి అయిదాకులు నేను కుట్టిస్తా కొంటావా అంది మా అమ్మ. సరిదా అన్నాడు వాడు. ఆకు నువ్వే ఇవ్వాలి అంది మా అమ్మ. అయితే – కాణీకి ఎనిమిదాకులు ఇవ్వాలి. కుట్టుకూలే మీకు – అన్నాడు వాడు. సందెడేసి ఆకులూ చీపురూ పట్టుకుని సంతోషంగా ఇంటి కొచ్చాం. నెలకో అయిదు రూపాయలు వస్తాయి అంది మా అమ్మమ్మ లెక్కలు వేస్తూ… రాత్రి పన్నెండు దాకా ఇద్దరూ ఆకులు కుట్టాము.
కొన్ని రోజులు పోయాక కొట్టువాడు బేరం మార్చాడు. మీకు నిండా లాభంగా ఉంది. కాణీకి పదాకులు ఇవ్వండి అన్నాడు. మా అమ్మ ఇవ్వలేను నాయనా అంది. అయితే ఇంకోళ్ళకిస్తాను. నిండా మంది ఉన్నారు – అన్నాడు వాడు – ఇచ్చుకో అంది మా అమ్మ. నిండా కష్టపడతావు అన్నాడు. పరవాలేదు అని వచ్చేశాం. మా అమ్మ భయపడలేదు. ఇదిగాపోతే ఇంకోటి అంది. నేనూ అదే నేర్చుకున్నాను. తరువాత జీవితంలో పత్రికలో పని చేస్తూ ఉద్యోగం వదిలేశాను. సినిమాలో ఇద్దరు గొప్ప డైరెక్టర్లతో తేడా వస్తే ఒక్కసారి ఆరు సినిమాలు వదిలేశాను. ఇంతలో మా ఇంటి దగ్గరే స్టార్‌ టాకీసు పక్కనే మిలిట్రీ వాళ్ళు సిపాయిల కోసం బట్టలు కుట్టే మిల్లు పెట్టారు. గేట్లో చాలా మంది ఉన్నారు. వెళ్ళి చూశాం. అక్కడ పాంటులకీ, కోట్లకీ, కాజాలు కుట్టి గుండీలు పెట్టాలి. కాజాకి అణా ఇస్తారట.
మా అమ్మ నేనూ అక్కడి పెద్దాయనతో హిందీలో మాట్లాడాం. సందెడు బట్టలూ, గుండీలూ, దారాలూ, సూదులూ ఇచ్చారు. రాత్రి పన్నెండు దాకా కాజాలు కుట్టాం. మా అమ్మ వెళ్ళి దుర్గాబాయి గారికి చెప్పింది. రెండు పనులు తప్ప ఇంక దేనీకీ భయపడక్కర్లేదు, సిగ్గు పడక్కర్లేదు అన్నారావిడ. మా అమ్మని భేష్‌ అని మెచ్చుకున్నారు. దేనికీ ఎవరికీ భయపడకు ఇలా స్వత్రంత్యం గానే బతకడం నేర్చుకో అన్నారు. అన్నట్లు – కొత్తగా హాండ్‌మేడ్‌ పేపర్‌ సెక్షన్‌ పెట్టాం. చేతులతో కాగితం తయారు చేసే కుటీర పరిశ్రమ. వారం రోజుల్లో నేర్చుకోవచ్చు – తిండి ఒక్కటే కాదు – పిల్లల్ని చదివించాలి గదా – ఇంకో విద్య చేతిలో ఉంటే మంచిది – అని కూడా చెప్పారు. నేర్చుకుంది మా అమ్మ. అంతలో ఒక వేసం కాలం వచ్చింది. హిందీ నేర్చుకునే ఇల్లాళ్ళంతా ఊటీలకీ, సొంత ఊళ్ళకీ, పెళ్ళిళ్ళకీ వెళ్ళి పోయారు. అప్పుడు ఈ విద్య అంది వచ్చింది.
ఏలూరులో వెంకట్రామా అండ్‌ కో యజమాని ఈదర వెంకట్రావు పంతులు గారు – కొన్ని పుస్తకాలు ఖద్దరు పుస్తకాల్లో (హాండ్‌ మేడ్‌ పేపర్‌పై) వేస్తారని తెలిసింది. దుర్గాబాయి గారి సహాయంతో ఏలూరికి పది మైళ్ళ దూరంలో – చాటపర్రు గ్రామంలో మా అమ్మ హాండ్‌ మేడ్‌ పేపర్‌ ఇండ్రస్టీ పెట్టి యజమానురాలైపోయింది. ఏలూరులో ఇంటద్దే కూరానారా ప్రియం అని చాటపర్రులో పెట్టింది. పల్లెటూళ్లో అద్దెకి ఇళ్ళుండవంటారు గాని మాకు నాలుగ్గదుల ఇల్లు – పాక దొరికింది. నెలకి రూపాయిన్నర అద్దె. అంటే ఆ ఇంటి వాళ్ళు వాళ్ళబ్బాయికి పట్నంలో ఉజ్జోగం అయితే అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి మేము కాపలా ఉన్నట్టూ ఉంటుంది. అద్దె కూడా వచ్చినట్టూ ఉంటుంది వాళ్ళకి. అద్దె ఒకటే కాదు. దోసకాయలూ చవకే. అవొక్కటే చవగ్గానూ, ఊరికేనూ దొరికేవి. అందుకని మా అమ్మమ్మ దోసకాయ కూరా – దోసకాయ పచ్చడీ – దోస వరుగులూ – దోసావకాయ – కాల్చిన దోసకాయ పచ్చడీ – దోసగింజెల వడియాలూ ఇన్ని రకాలు చేసి పెట్టేది.
రోజూ దోసకాయేనా అని గునిస్తే – చక్రవర్తీ రోజూ అన్నమే తింటున్నాం గదా అనేది మా అమ్మమ్మ. దానిక్కూడా రకం మార్చాలంటే గోధుమన్నం, జొన్నన్నం చేస్తాను అంది. వద్దులే దోసకాయే బాగుంది అన్నాను.
*** *** ***
చాటపర్రులో వ్యాపారం గిట్టుబాటు కాలేదు. ఒక పెద్ద రేకు టబ్బులో నానేసిన గుజ్జును కర్రతో ఝూడించి కొట్టడం – అది పలచని గంజిలా వచ్చేది. దానిని, జల్లెడతో పేపరు తెట్టులా తీయడం – పూతరేకుల్లా తీసి ఆరవేయడం ఆరాక గాజు పేపరు వెయిట్లతో రుద్ది రుద్ది గ్లేజు చెయ్యడం – దాన్ని మిషనులో వేసి అంచులు కట్‌ చేయడం బలే సరదాగా ఉండేది. వింత చూడ్డానికి వచ్చే వాళ్ళు కూడా ఓ చెయ్యి వేసేవారు. వారానికి మూడు రీములు తీస్తే ఆ కట్టలు కూడా మెడ్రాసులో విస్తళ్ళ కట్టల్లాగానే నేనూ మా అమ్మా దొడ్డమ్మా ఏలూరు నడిచి వెళ్ళి వెంకట్రామా ప్రెస్సులో ఇచ్చేవాళ్ళం. మూడు మూళ్ళు తొమ్మిది విచ్చు రూపాయలు ఇచ్చేవారు. వచ్చే వారం పద్దెనిమిది – ఆ తరువాత వంద, వెయ్యి వచ్చేస్తాయని లెక్కలు చెప్పుకుంటూ ఝూమ్మని తిరిగి వచ్చేవాళ్ళం.
దార్లో తేళ్ళూ, మండ్రగబ్బలూ కుడుతూ ఉండేవి. నాకు తేలు మంత్రం వచ్చును. ఒకసారి సూర్యగ్రహణం అప్పుడు మెడ్రాసు సముద్రం బీచిలో మా అమ్మమ్మ నేర్పింది. మంత్రం ఎన్ని సార్లు వేసినా ఆ నెప్పి తగ్గేది కాదు. నేను భూతాల వాడిలా ఒక మొక్క పీకి దాంతో వాళ్ళని కొడుతూ – దిగిందా నెప్పి దిగిందా అంటూ మంత్రం మళ్ళీ మళ్ళీ చదివేవాడిని – తగ్గలేదంటే కోపం ఏడుపూ వచ్చేవి. అప్పుడు ఒరే నీది తేలు మంత్రం కదా – కుట్టింది మండ్రగబ్బేమోలే – పద ఇంటికి వెళ్తే అమ్మమ్మ మందేస్తుంది – అంటూ నాలుగడుగుల దూరం నన్నెత్తుకుని నడిచే వారు – (తేలు నన్ను కుట్టకుండా).
కొన్నాళ్ళు జరిగాక పద్దెనిమిది రూపాయలు కూడా రావడం మానేశాయి. ఖద్దరు పుస్తకాలు బాగా అమ్మటం లేదుట. ఓ పక్క నేను – మెడ్రాస్‌ వాడినిక్కడుండనని గోల. మా తమ్ముడు, మా బావ గారింట్లో మెడ్రాసులో ఉన్నాడు. స్కూళ్ళు తెరిచే నెల. చెడి చెన్నపట్నం చేరమన్నారు. పదండి అక్కడికే పోదాం – అంది మా అమ్మమ్మ. మళ్ళీ మెడ్రాసులో మహిళా సభకొచ్చేసాం. మహిళా సభలో పని చేసే వాళ్ళందరికీ సాయంత్రం అరటి దొప్పలలో చక్రపొంగలి, ఉప్మా ఇలాంటివి టిఫిను పెట్టేవాళ్ళు. అది మా అమ్మ నా చేతికిచ్చి కూచోబెట్టి తింటూ ఉండు. ఇప్పుడే వస్తాను అని పాఠాలకి వెళ్ళిపోయింది.
ఒకసారి ఒక బోయి వచ్చి (అక్కడ పనివాడిని బోయీ బోయీ అని పిల్చేవారు) నా చేతిలో పొట్లాం లాక్కున్నాడు. నువ్వు నంబరువా నీకెవరిచ్చారని – అంతలో మా అమ్మ వచ్చి అది నాదే బాబూ – వాడు మా అబ్బాయి అంది. కొంచెం దగ్గర్లో కూర్చున్న కృష్ణవేణమ్మ గారు (దుర్గాబాయి తల్లి) ఇది చూసి వాడిని కేకలు పెట్టింది. ఇంకోకటి కూడా పట్రా – రేపణ్ణించి ఆ అబ్బాయిక్కూడా ఇవ్వాలి అంది. మహిళా సభ వాళ్ళు వీపీ హాల్లో దశావతారాలు డ్రామా వేసినప్పుడు నా చేత మత్స్యావతారం వేషం కట్టించారు. ట్రాములో తీసుకెళ్ళి టిఫిను పెట్టి మా అమ్మకి రూపాయిచ్చారు.

*** *** ***
మా ఇంటి దగ్గరే స్టార్‌ టాకీసు ఉండేది. ఇప్పుడూ ఉంది. అమ్మా సినిమాకెళ్దాం అంటే కాజాలు కుట్టడం ఆపి తీసుకెళ్ళేది. గేటు దగ్గర నుంచుంటే సినిమాలో పాటలూ, మాటలూ, ఏడుపులూ అన్నీ వినిపించేవి. రతన్‌, దహేజ్‌ లాంటి సినిమాలన్నీ ఇలాగే వినే వాళ్ళం. ఎప్పుడేనా నేను కొంచెం గేటు దాటి తొంగి చూస్తే కొంచెం సినిమా బొమ్మ కనబడేది. గేటు వాడికి మేము అలవాటయిపోయి – ఓ సారి ఇంటర్వెల్‌ తర్వాత లోనికి వదలి తలుపు ఇవతల నుంచి చూడనిచ్చాడు. నాకప్పటికే రాజమండ్రిలో చూసిన అబు తేర సివా కోను మొరా కిష్ణ కనయ్యా – సునో సునో బనుకే రాణీ పాటలు వచ్చును. గేటువాడు సెబాస్‌ అనేవాడు.
యుద్ధం అయిపోగానే మాకు మిలిట్రీ కాజాల ఉద్యోగం పోయింది. అప్పుడు మా అమ్మమ్మ భయపడింది. కాని అమ్మ భయం లేదని చెప్పింది. రాయపేట కేసరి కుటీరంలో గృహలక్ష్మి ప్రెస్సు ఉంది. అందులో మా అమ్మకి కంపోజిటర్‌ ఉద్యోగం ఇచ్చారు. దగ్గర్లోనే కేసరి గారు స్కూలు కూడా పెట్టారు. నన్నక్కడే చేర్చింది. ఇద్దరం పొద్దున్నే ప్రెస్సుకి వెళ్ళేవాళ్ళం. పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా నిలబడి కంపోజింగ్‌ చేసేది మా అమ్మ. నేను తొమ్మిది గంటలకు స్కూలుకు వెడితే నాకు రెండు ఇడ్డెనలు కొనిపెట్టి మిగిలిన పచ్చడి తను తినేది. సాయంత్రం నాలుగున్నరకి వెళితే ప్రెస్సు వాళ్ళు ఏదేనా పెట్టేవాళ్ళు. మేమిద్దరం తినేవాడిని. ఏడు అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ ట్రిప్లికేను వెళ్ళేవాళ్ళం. ట్రాము డబ్బులు పెట్టి మషాళా దోసె కొనుక్కుని పొట్లం మా అమ్మ చేతిలో పెట్టుకుని తింటూ ఇట్టే వెళ్ళిపోయేవాళ్ళం. దోసెలో బంగాళాదుంప కూర కోసం మా వేళ్ళు పోట్లాడుకునేవి – నువ్వంటే నువ్వని – ఒరే పూర్వ జన్మలో మనం క్లాస్‌మేట్సులుగా పుట్టి ఉంటామురా అంది మా అమ్మ ఓసారి. దారిలో జాంబజారులో బంగాళదుంపలు, ఉల్లిపాయలు కొనుక్కుని వెళ్ళేవాళ్ళం. చితికిన ఉల్లిపాయలు చూట్టానికి అసయ్యంగా ఉంటాయి గాని రుబ్బి వడియాలు పెడితే ఎండకి పురుగులన్నీ ఛస్తాయి – వడియాలు బాగుండేవి – తీరా ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ బంగాళ దుంపలు రేపు – పొద్దుటి తోటకూర – అలాగే ఉండిపోయిందనేది. ఇవాళే బంగాళ దుంపలు రేపే తోటకూర అన్నా వినేది కాదు. అప్పటికి నేను ఫోర్తు ఫాం. ఇంగ్లీషులో అరిచినా వినేది కాదు.
అప్పుడు నేను ్రపైవేట్లుకూడా చెప్తున్నాను. పొద్దున్నే ఏడు నుంచి తొమ్మిది దాకా రెండిళ్ళు – సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది దాకా రెండిళ్ళు – నెలకి మా అమ్మకి అయిదు రూపాయలూ, నాకు రెండేసీ.
చూస్తుండగా గొప్పవాళ్ళం అయిపోతున్నాం. కాని మా అమ్మకి రోజంతా ప్రెస్సులో నిలబడి – తర్వాత నడిచి కాళ్ళు నెప్పెట్టేవి. నేను అమ్మమ్మకి నడుము తొక్కి అమ్మకి కాళ్ళు పట్టేవాడిని. ‘చక్రవర్తీ నీకేం ఖర్మ పట్టిందిరా’ అని మా అమ్మమ్మ ఏడిచేది. ధవళేశ్వరంలో చిన్నప్పుడు నన్ను బుడుగూ అనీ చక్రవర్తీ అని పిలిచేవారు. నాకప్పుడు ఇద్దరు సేవకులుండే వారుట కూడాను. అందుకని నేను పడుకోగానే వాళ్ళు నా అరికాళ్ళకు కొబ్బరి నూనె రాసి తోమేవాళ్ళు. బలేగా ‘మొగలాయీ’ గా ఉండేది.
ఇలా ఉండగా నిడమర్తి వారింట్లో ఒక తరుడు ఫారం అమ్మాయికి ‘రుక్మిణీ కళ్యాణం’ ప్రైవేటు చెప్పమన్నారు. ఆ నిడమర్తి వారింట్లో బామ్మగారు – నన్ను నించోబెట్టి రెండు పద్యాలిచ్చి అర్థాలు చెప్పమంది. చెప్పాక ‘పాసయ్యావురా – రేపణ్ణించి రా’ అంది. ‘ఇలా నిక్కర్లేసుకు రాకూడదు. ఇది ఆడపిల్లా – అంచేత పొడుగు లాగేసుకు రావాలీ’ అంది. జీతం అయిదు రూపాయలంది.
ఆ రాత్రి మా అమ్మమ్మా, అమ్మా నాకు పొడుగు లాగూ కుట్టేశారు. ఎమ్మెస్‌ 55 అనే సైను గుడ్డ కొన్నారు. నన్ను నేల మీద వెల్లకిలా పడుకోబెట్టారు. బొగ్గుతో నా నడుంనించి కాళ్ళ దాకా, కాళ్ళ నించి మళ్ళీ నడుం దాకా గీతలు గీశారు. దాని ప్రకారం గుడ్డ మీద గీసి కత్తిరించారు. చెరో వేపునీ కూచుని రాత్రి పన్నెండు గంటల కల్లా కుట్టేసి బొందు కట్టారు. ఇంక మనం కాజాలు మానేసి లాగూల షాపు పెట్టేద్దాం అన్నారు. కాని లాగూ సరిగ్గా రాలేదు. అందరి లాగుల్లా కాకుండా కాళ్ళ మధ్య ఆర్చిలా వచ్చింది. తొడుక్కుని నడిస్తే పడబోయాను. వాళ్ళకే నవ్వొచ్చింది. రేపొక్కరోజూ ఇలా వెళ్ళు. సాయంత్రానికి మిషను వాడికిచ్చి కుట్టిస్తాను అని చెప్పింది మా అమ్మ.
అప్పుడు సిగరెట్టు కాల్చాను ఒక ఫ్రెండు చెప్పితే – ఓసారి కొన్నప్పుడు కొట్టువాడు తిట్టాడు. మా నాన్నకి అని చెప్పాను. ఓసారి రోడ్డు పక్కన నుంచుని కాలుస్తుంటే చూసి ఒకాయన నోట్లో సిగరెట్టు పీకి విసిరేసి వెళ్ళిపోయాడు. అప్పణ్ణించి గంటకి అణన్నర చొప్పున సైకిలు అద్దెకు తీసుకుని అందుమీద తిరిగేవాణ్ణి సిగరెట్టు కాలుస్తూ.
నా కీర్తి ట్రిప్లికేను నుంచి రాయపేట, మైలాపూరు, అడయారు దాకా వ్యాపించింది. అంటే సిగరెట్లది కాదు, ప్రైవేట్లది. టంగుటూరి, నిడమర్తి, గోవిందరాజుల, కాశీనాథుని వంటి పెద్ద పెద్ద ఇళ్ళల్లో ్రపైవేటు చెప్పాను. ఇంకా బెస్టేమిటంటే మా తెలుగు మాస్టారు జనార్ధన శర్మ గారు నన్ను వాళ్ళింటికి రమ్మని వాళ్ళమ్మాయికి ప్రైవేటు చెప్పించారు. క్లాసులో కూడా ఒరే కుర్ర మాస్టారూ అని పిలిచేవారు. నాకు సిగ్గు వేసేది. ఆయన కూడా వద్దని చెప్పినా వినకుండా రెండ్రూపాయల జీతం మా అమ్మ చేతికిచ్చే వారు. మా అమ్మ కూడా వద్దంటే మనందరం టీచర్లమేనమ్మా ఫరవాలేదు అని చెప్పేవారు.
ఇలా నా కథంతా ప్రైవేటు మాస్టారు ధోరణిలోనే సాగింది. రచయితగా వార్తలు, కథలు, సినిమా డైలాగులు రాసి ఇంకోళ్ళకి చెప్పి వినోదమందించే సేవా భాగ్యం దొరికింది. ప్రవృత్తే వృత్తిగా లభించడం – దొరకునా ఇటువంటి సేవా? ఇన్ని ఏళ్ళు వచ్చినా ఇంకా 16 ఏళ్ళ పొగరే కాలరెత్తుకుని ఉంటుంది. నా బాల్డ్‌ హెడ్డూ తెల్ల జుత్తూ చూసి ఎవరైనా నమస్కారం పెడితే – నా వెనక్కి చూసి తప్పుకుంటాను. పెద్దవారెవరో నా వెనుక ఉన్నారనుకుని.
నవతర౦డాట్కామ్ను౦డి