కృష్ణ శతకము--17

మడుగుకు జని కాళీయని
పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా! (
కృష్ణ శతకము)

కృష్ణా!మహాభయంకరుడయి జనులను భాదించు కాళీయుడను పాము నివసించు సరస్సునకు పోయి ఆ సర్పపు పడగలపై నాట్యశాస్త్ర విధానము ప్రకారము ఎంతో విలాసముగా నాట్యమాడి దానిని హతమార్చిన పాదములను నా మనస్సులో స్మరింతును.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.