అంద చందాల రాణీ ఆ చిన్నది .......
హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు
నాలోన కలిగించింది
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి "మరచి"
మమత లేవేవో చెలరేగే ఇది ఏమిటి "మమత"
తలచుకొనగానే ఏదో ఆనందమూ "తలచు"
వలపు జనియించగా
ప్రణయ గీతాలు
నాచేత పాడించింది
సోగకనులార చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగురించె ఇంపారగా "సోగ"
నడిచిపోయింది ఎంతో నాజూకుగా "నడిచి"
విడిచి మనజాలను విరహతాపాలు
మొహాలు రగిలించింది
నిన్న కనిపించింది
నన్ను మురిపించింది
అంద చందాల రాణీ ఆ చిన్నది ...
http://www.youtube.com/
Comments
Post a Comment