మన గాన కోకిలమ్మ లతాజీ.

వానం కవిత.....
మన గాన కోకిలమ్మ లతాజీ.
మకరందములో మధురత మృదు మలయానిల కీలిత
మందాకిని గంభీరత మధుమాస మనోజ్ఞత
గమకములో గంగానది గమనపు శృంగారిత
గాఢముగా గుండెలలో ఊరించే ఆర్ద్రత
గాంధర్వ వేద నందనమున కుసుమించిన పూ లత
అచ్చముగా కచ్ఛపి పై ధ్వనియించు ధురీణత
కోకిల తను నాకిల తనకేనిల సరియను లత!
నా మది పలికేనది ప్రతిబింబము నువు బింబము !!!
Comments
Post a Comment