గజేంద్ర మోక్షం 11.

బమ్మెర పోతన గారు భాగవతంలోని
గజేంద్ర మోక్షం కథలో లక్ష్మీ దేవి తటపటా యించడం ఆటవెలది పద్యం లో ఎతో మధురం గా అక్షర విన్యాసాలు చూపించడం బహు సుందరం ... గజేంద్రుడు మొసలికి చిక్కి వేసారి శ్రీహరి కొఱకై భక్తితో ఆర్తనాదాలు చేయుచుండ భక్తుని రక్షించుటకై వడివడిగా బయలుదేరిన విష్ణువు ననుసరించిన లక్ష్మీదేవి పరిస్థితిని వివరించే పద్యం. పతి పరుగుల ఉదంతం అడుగుదామని అడుగు ముందుకేసి అడగలేక, తడబడుతున్న అడుగులతో నోటిలో మాట అడగలేక సతమత మవుతున్న సన్నివేశం ...

అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగడు నుడువడని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!