Posts

Showing posts from February, 2015

నానాటి బదుకు....అన్నమయ్య కీర్తన.!

Image
అన్నమయ్య కీర్తన.! . నానాటి బదుకు (రాగం:ముఖారి ) (తాళం : ) . నానాటి బదుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము యెట్ట నెదుట గల దీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము కుడిచే దన్నము కోక చుట్టెడిది నడ మంత్రపు పని నాటకము వొడి గట్టుకొనిన వుభయ కర్మములు గడి దాటినపుడె కైవల్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము . ఈ పదములోని కోక చుట్టుకోవడము, ఒడి నింపుకోవడము వంటి పదాల వాడుక వల్ల ఇది ఎవరో స్త్రీకి భోధిస్తూ చెప్పిన హితములాగా కనిపిస్తుంది . నాటకము అంటే అన్నమయ్య గారి ఉద్దేశ్యము మాయ లేదా మిథ్య అనా?  కానీ అన్నమయ్య వైష్ణవుడు, వీరు శంకరుల సర్వం మిథ్య అనే బావామును పూర్తిగా విమర్శిస్తారు, ఇదే విషయంపై అన్నమయ్య పాటలు కూడా ఉన్నాయి, . కనుక నేను పూర్తిగా ఈ విషయములో ఓ నిర్ణయమునకు రాలేకపోతున్నాను అదే కాకుండా మిథ్య అంటే మనము జీవితాన్ని ఎలా వస్తే అలా తీసుకోవాలి, "నాటకము" అంటే "సూత్రదారి" (లేదా డైరెక్టరు) చెప్పినట్లు నటించాలి,  అనగా ఆ "

శ్రీ మాత్రే నమః

Image
ఈ పద్యం పోతనామాత్యుల వారు దేవీ ఉపాసకులనీ చెపుతుందని , ఈ పద్యం ఏ స్థితి లో నైనా మననం చేసుకుంటూశ్రీ లలితా మూల మంత్ర ఫలితం పొందవచ్చునని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు.  . శ్రీ మాత్రే నమః  . అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్. . భావము: దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

పువ్వులు కథ.!

Image
పువ్వులు కథ.! (శ్రీ రావిశాస్త్రిగారు.) . బంతినారునుంచి మొక్కలు విడదీసి పాతిన కమల రాత్రి పడిన వర్షంతో తలలు పైకెత్తి జీవంతో కలకలలాడుతున్న మొక్కలు  చూసి సంతోష పడుతుంది.ఆమె సంతోషని ఇలా వర్ణిస్తారు రావిశాస్త్రిగారు. . ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల  . అటు ఆ మొక్క దగ్గరకి పరిగెట్టింది కమల . ఇదే కమల ఈ మొక్కా అయింది . ఇదే కమల ఆ మొక్కా అయింది . నిన్న రాత్రి నీటిమబ్బూ ఈ కమలే  . నిన్న రాత్రి వానజల్లూ ఈ కమలే ఆ కమలే  . ఈ ఉదయం సూర్య రశ్మిగా మెరుస్తోంది అదే కమల . ఈ ఉదయం చల్లగాలిలా వీస్తోంది. .... . ప్రాణాన్ని పెంచి పోషించే వారికి మాత్రమే ఈ ఆనందం తెలుస్తుందంటూ రావిశాస్త్రి చేసిన  ఈ వర్ణనలో ప్రకృతికీ, మనిషికీ గల అనుబంధం, ప్రకృతిలోని సౌందర్యంతో మనిషి పొందే తాదాత్మ్యం రూపుకట్టిస్తారు.

అమ్మడు అమ్మడు అని పిలుస్తోనే .. అమ్మేశాడు.!

Image
హత విధి... మరోచంద్రమతి .. సత్యహరిచంద్రుడు.! . అమ్మడు అమ్మడు అని పిలుస్తోనే .. అమ్మేశాడు.! . మరో దగాపడిన చంద్రమతి, ..  అండదండ..ఉంటానంటు..కొండకొనకు వదిలేసాడు. . కోదండపాణి.!

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు.!

Image
నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

బాక్సా? భార్యా? (స్కెచ్ ).

Image
బాక్సా? భార్యా? (స్కెచ్ ). . (By - Sri.Virabhadra Sastri Kalanadhabhatta.) . అరోజు మహిళామండలి వార్షికోత్సవం. ఈ సారి సెలిబ్రేషన్ లో ప్రత్యేకత ఏమిటంటే, సభ్యురాండ్రతోబాటు వారి భర్తలు కూడా ఆహ్వానింపబడడం. భార్యలపోరు పడలేక చాలమంది భర్తలుకూడా హాజరవడంతో హాలు కిక్కిరిసి వుంది.  సభాప్రారంభ సూచనంగా కార్యదర్శిని అధ్యక్షురాలిని, ఇతర వక్తలను వేదికమీదకు ఆహ్వానించారు. అధ్యక్షురాలు శ్రీమతి రాధాభాయమ్మగారు వేదికమీదకు వస్తూవుంటే చప్పట్లతో హాలు మారుమ్రోగింది. ఆమె వచ్చికూర్చోగానే ఒక చిన్నపాప వచ్చి ఆమె మెడలో గులాబీల దండవేసింది.  రాధాభాయమ్మగారు లేచి సభకు నమస్కరించి మైకు దగ్గరకు వచ్చి సుతారంగా వ్రేలితో మైకును మీటి అది పనిచేస్తోందని నిర్ధారించుకొని, కళ్ళజోడు సవరించుకొని తమ వుపన్యాసం ప్రారంభించారు.  సభకు నమస్కారం. ఈరోజు సుదినం పర్వదినం సభ నేత్రానందకరంగావుంది. కారణం వేరే చెప్పనక్కరలేదనుక్కుంటాను. మన మహిళా మండలి సభ్యురాళ్లతోబాటు వారి భర్తలు కూడా రావడం ఎంతోముదావహం మరియు శ్లాఘనీయం (చివరముక్క ఆమె తప్పకుండా తమ వుపన్యాసంలో వుపయోగిస్తారు)  సరే విషయంలోకి డైరెక్ట్ గా వచ్చేస్తా. ఇక్కడకు వచ్చిన మగవ

కొన్ని పాత పాటలు.........నేదునూరి గంగాధరం,!

Image
కొన్ని పాత పాటలు.........నేదునూరి గంగాధరం (అ)   ఏనాడు రానివారు | మరది వచ్చారు, ఇంటిలో జొన్నల్లేవు | నేనేమి సేతు సన్నబియ్యమెట్టి | జొన్నలు దెత్తు జొన్నలు ఒక జాము | జార కుమ్మేను [1] తడి పిడక పొడిపిడక | దాయలు వేసి ఏడు చిల్లులకుండ | ఎసరెట్టినాను మూడు చిల్లుల ఈడిముంత [2] | మూ తెట్టినాను దాహము వదినగారు | దాహాలనిమ్ము ఉడికీది జొన్నకూడు | మొల్లల్లు తేలె [3] ఊరు చేరున వుంటె | ఉండుము మరది వెళ్ళెతె వెళ్లండి | వేగంబుగాను, దయయుంచు నామీద | దండములు మరది _____________________________ 1. తెల్లగాదంపుట; 2. పొడుగు మెడగల మట్టి ముంత; 3. సగము ఉడికిన జొన్న కూడును మొల్లలు లేక మొల్లకాయలందురు    (ఆ)   అంతల్ల పుంతల్ల మే |నత్తకొడుకు నన్ను జూడవచ్చి | నరకాన బడును కదలాడు మెదలాడు | కఱుకోలలాగ [4] ఉలకడు పలకడు | ఉలవగింజల్లె _____________________ 4. నాగలి కఱ్ఱు (ఇ)   సోమన్న వీధులకు | సోది అడగెల్తె బతకడని చెప్పేరు | భాగ్యవంతుల్లు అప్పకి అయిదోతనము | లేదు కాబోలు ఆతనికి నా ఉసురు | అంటె కాబోలు (ఈ)   అమ్మకు బొమ్మంచు | అప్పకు కరకంచు చెల్లెలికి చ

ఇస్లియే… కాబట్టి మన మన జీవిత యుద్ధాలు మనమే చేసుకొనవలెను.

Image
ఇస్లియే… కాబట్టి మన మన జీవిత యుద్ధాలు మనమే చేసుకొనవలెను. . “ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా” . అని ఓ సినీ కవి హెచ్చరించి, ఒరేయ్ మామూలు మనిషీ! ఈ యుద్ధం నీది, నీ యుద్ధం నువ్వే చేయాలి… లే పోరాడు, పోరాటం లేకపోతే బతుకుబండి సాగదు అన్చెప్పాడు. . అదే విషయం మన గీత కూడా చెప్పింది. . ఏ గీతా? మీ పక్కింటమ్మాయి పొడవాటి చెవి లోలాకులూ.. పొట్టి జుత్తూ, ప్యాంటూ షర్టూ వేసుకుని ఎమ్మే ఇంగ్లీషు చదివి ఎలిమెంటరీ స్కూల్లో తెలుగు పాఠాలు చెబుతుందే ఆ పిల్లా? అనడక్కండి.. . ఆ గీత కాదు.. భగవద్గీతండీ (అబ్బో వీడు మళ్లీ యింకో సంస్కృత శ్లోకంతో మన్నేడిపించేస్తాడ్రా బాబో అనుకుంటున్నారా? కరక్టే ఏడవండి) . ఆత్మ సంయమ యోగంలో ఈ శ్లోకం చూడండి – “ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మవః” . అంటే, ‘నాయినా! నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు అధోగతి పాల్చేసుకోకూ.. నీకు నీవే బంధువ్వి, నీకు నీవే శత్రువు కూడానూ తెలిసిందా’ అని… అంటే శాస్త్రాలూ, దేముళ్లూ, సాములోళ్లూ, గురూగార్లూ ఎందరున్నా… చూపుడు వేల్తో అదో అదే నీ దారి అని అన్చూపు

మగ బుద్ధి.

Image
మగ బుద్ధి. . ( by పసునూరు శ్రీధర్ బాబు,) . పెదవి మీదో చుబుకం మీదో చెక్కిలి మీదో గెలాక్సీలు దాచిన కళ్ళ మీదో తిరగేసిన సంధ్యాకాశం లాంటి వీపు మీదో నయాగరా ప్రవాహాలకు నునుపెక్కిన భుజాల మీదో నెమలి పింఛాలకు జన్మనిచ్చే నడుం మీదో వీధుల్ని మార్మోగించే సంగీత సహారాల మీదో ఇంకెక్కడెక్కడో నిప్పు సెగల రెక్కలతో వాలిన చూపు ఓరకంటిపాపల్లో కలకలం కాకున్నా కాకుండా పోతుందని కాలిన రెల్లుగడ్డి పువ్వులా తుప్పల్లోకి రాలిపోతుందని మాడి మసైపోతుందని నేననుకోను- ప్రవాహంలోంచి గాల్లోకి ఎగిరిన ఒకే ఒక్క చినుకు ఏడు రంగులతో మెరిసిపోనూవచ్చు వెన్నెలతో కలిసి ముత్యమై మురిసిపోనూవచ్చు క్షణికంలోనే ధన్యమైపోనూవచ్చు-

ఊరికే…. అలా!

Image
ఊరికే…. అలా! . కొన్ని రోజులు అలా గడిచిపోతాయి, ఊరికే. గుర్తులన్నీ దారినిండా అడ్డొస్తున్నా వాటి మీదుగానే నడిచొచ్చేసేంత మౌనం  అదే ధైర్యమని ముందే తెలిస్తే  ఎన్నో క్షణాలు బాధపడకపోను! ఎవరెవరో గుంపులుగుంపులుగా నవ్వుతున్న శబ్ధాలు వాటి వెనక ఎన్ని ఖాళీలో అన్నిలోతులు  విడివిడిగా అడిగితే  ఒక్కో కధ చెబుతుంది ప్రతి నవ్వు. పరిగెత్తినప్పుడు ప్రతి అంగలో ఎన్ని కాలాలు మారాయో ఆగినప్పుడే తెలిసేది...తేలకపోతేనే యాతన ఒక నీరెండలాంటి భావన అర్ధరాత్రి చెక్కిలిపై జారే కన్నీటి చుక్క తడికవితలు రాయిస్తుంది ఒక తప్పిపోయిన కల కోసం వెలితిని నింపే వేకువ కోసం గదిలైటుతో పోటీపడుతున్న వుదయం  ఎప్పుడూ పట్టించుకోలేదు ఎవరి కాంతి ఎంతని నిజం చీకటి సొత్తని తెలిసాక  వెలుతురు వెగటు పుడుతుంది ఏదో నిమిషాన నిజమే, కొన్ని రోజులు  ఊరికే అలా గడిచిపోతాయి, ఊరికే! మొండిగా..ఒట్ఠిగా నా నుండి నిన్ను వేరు చేసేలా!

వంట గది సర్దుకోవటం ఎలా?.............(నేను ఎందుకు రాసేను.)

Image
వంట గది సర్దుకోవటం ఎలా?.............(నేను  ఎందుకు రాసేను.) . వంట ఇల్లు అంటే చికాకు పడకుండా ముందుగ అన్ని ఆలోచించుకుని సర్దుకుంటే అస్సలు వంట అంత తేలిక పని ఇంకొకటి వుండదు.వంట గది ఎలా వుండాలో నాకు తెలిసినది నేను చెప్తాను. ఏదో కొన్ని సలహాలు......మరి బావుంటాయో లేదో చూడండి.ఏమి లేదండి కొంచెం ఖర్చు అవుతుంది అంతే...ఎలాగంటే డబ్బాలు అంతే ......... . 1.ముందుగ మనము ఇంట్లో నెలకు ఏమేమి సరుకులు వాడతామో ఆలోచించుకుని ఒక పేపర్ మీద రాసుకోవాలి. సుమారు పప్పులు,పిండ్లు కిలో చొప్పున వాడతాము అనుకోండి ...బయట ప్లాస్టిక్ డబ్బాలు (లోపల మనము పోసినవి పయికి కనపడుతూ వుండే లాంటివి అన్నమాట) దొరుకుతాయి కదా అవి కొనుక్కుంటే సరిపోతుంది...ఇంక మనము సర్దుకోవటమే ఆలస్యం,....ఆవాలు,జీలకర్ర లాంటివి తక్కువ వాడతాం కాబట్టి చిన్న డబ్బాలు కొనుక్కుంటే సరి.పోసుకుంటే మనమే కాదుఇంక ఎవరినా సరే తేలికగా వంట చేసుకోవచ్చు.అందరు మనల్ని ఒసేయి అది ఎక్కడ పెట్టవే ఇది ఎక్కడ పెట్టవే అనే బాధ తప్పుతుంది... . 2.వంట గదిలో సామాను ఎంత తక్కువ వుంటే అంత మంచిది.బొద్దిన్కలకి,దోమలకి,ఈగలకి వంట ఇల్లు పుట్టినిల్లు.అందుకని మనకు రోజు వాడుకునేవి మాత్రం కొన
Image
ఎవ్వరిది ఈ అందం... మనకు అనందం.!

మంచినీళ్ళ బావి.!

Image
మంచినీళ్ళ బావి.! -అరిపిరాల సత్యప్రసాద్ తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గడ గడా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి గట్టు మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా మర్చిపోయినా అక్కడే పెద్ద బాడిసె పెట్టుకొని కూర్చున్న సాంబయ్యో, గట్టు పక్కన బండపైన పులి జూదం ఆడుతున్న బసవయ్యో ఒక చురకేసేవాళ్ళు - “ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి.. నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా.. ఒక్క చేదకేమైనా నీ ఒళ్ళు అరిగిపోతుందా” అనేవాళ్ళు. ఎన్నో ఏళ్ళ క్రిందటి మాట. మా వూరిమధ్యలో శివాలయాన్ని ఆనుకోని ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉండేది. ఎప్పుడో రాజుల హయాంలో కట్టించిన ఆ బావి దాదాపు వూరు మొత్తానికి నీళ్ళు అందించేది. నాలుగు వైపులా నాలుగు గిలకలు రోజంతా కిలకిలమంటూ కళకళలాడుతుండేది. తెల్లవారుఝామున ఏ నాలుగింటికో శివాలయం పూజారి దక్షిణామూర్తిగారు బావిని నిద్రలేపి చన్నీళ్ళ స్నానం చేసి, తడిగుడ్డతో నాలుగు బిందెలు మడినీళ్ళు ప

వినుర వేమ.!

Image
ఆ.  వెతలు తీర్చువాడు వేదాంత వేద్యుండు  రతుల నేలువాడు రమణుడగును  సతిని బెనగువాడు సంసారయోగిరా!  విశ్వదాభిరామ వినుర వేమ.! . ఆ.  వృక్షములకు మంచి | వ్రేళ్ళురెమ్మచిగుళ్ళు  మత్స్యముల కందంబు | ముక్కు చెవులు  పక్షుల కందంబు | పల్కులొక టేనయా  విశ్వదాభిరామ వినుర వేమ.! . అ. వెండి బంగారంబు కొండలై యుండగా  దేవుడేల పోయె తిరిపె మెత్త  అతడంత వాడైతె అదుగు పో......నెరా  విశ్వదాభిరామ వినుర వేమ.! . x

విశ్వదాభిరామ వినుర వేమ.

Image
శుభోదయం.!. వూరు వాతిన భావి వుదకమని తెలియక  పాప తీర్థముకేల భ్రమసినారు  పాప తీర్థము వలన ఫలమేమి గందురు  విశ్వదాభిరామ వినుర వేమ. (దామెర్ల రామారావు గారి చిత్రం.)

కరుణ శ్రీ !

Image
కరుణ శ్రీ ! . ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము అకట! దయలేని వారు మీ యాడువారు... . గుండె తడి లేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా పేద నెత్తురులను కంపు దేహాలపై గుమాయింపు కొరకు పులుముకొందురు హంత! మీ కొలము వారు.... . అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్ ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై... . మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా!

గజేంద్ర మోక్షము..... పోతన.

Image
 గజేంద్ర మోక్షము..... పోతన. . శా. భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్ హేమక్ష్మాధర దేహముం జకిత వన్యేభేంద్ర సందోహముం గామక్రోథనగేహమున్ గరటి రక్తస్రావగాహంబు ని స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్ || . . మేరుపర్వతము వంటి శరీరము కలదియు, ఏనుగులను భయపెట్టినదియు, కామక్రోధములను కలిగియున్నదియు, గజేంద్రుని యొక్క రక్తమునందు స్నానము చేసినదియు,  ఏనుగును గెలవవలెనను గట్టి పట్టుదలతో నున్నదియు,  దప్పికను వీడి, విజయమును కాంక్షించుచున్నదియు నగు మొసలి యొక్క శిరస్సును శ్రీహరి వదలిన సుదర్శన చక్రము భయంకరముగా పోయి  అవలీలగా ద్రుంచి వేసి, ఆ మకరి ప్రాణములను హరించెను.
Image
శుభోదయం.! . ఎవరో వస్తారు...ఏదో కొంటారు...అని ఎదురు చూపులు. .  ఈ మన్యం బ్రతుకులు మారేనా...

రామాయణంలో వాలి వధ.....

Image
రామాయణంలో వాలి వధ..... శ్రీరాముడు  వాలిని  చంపటం  గురించి  కొందరు  తప్పుగా  మాట్లాడతారు. వాలి  మరణించేముందు  అడిగిన   సందేహాలకు    రాములవారే    సమాధానాలు  చెప్పి  వాలి  సంశయాలను    తీర్చారట. అందులో  కొన్ని  విషయాలు....   వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.   నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స   అనవసరం.   ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.   ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధ

మహా శివ రాత్రి –శత రుద్రీయం.!

Image
    మహా శివ రాత్రి –శత రుద్రీయం.!    మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో పదకొండు అనువాకాలు ఉన్నాయి .ఈ ఇరవై  రెండు అనువాకాలను కలిపి ‘’రుద్రాధ్యాయం ‘’అంటారు .దీనికే మరో పేరు ‘’శత రుద్రీయం ‘’.అంటే అపరిమిత శివ రూపాలు అని అర్ధం . .     శత రుద్రీయం అమృతత్వ సాధనం అని ‘’జాబాల శ్రుతి’’ చెప్పింది .’’నమశ్శివాయ శివ తరాయచ ‘’లో పంచాక్షరి మంత్రం ఉంది .శివ అంటే అవాజ్మానస గోచమయిన సత్య ,జ్ఞాన ,ఆనంద లక్షణం ఉన్న పర బ్రాహ్మయే. కనుక శివ అంటే అమృత భావన .అంటే శ్రీ విద్యా పరం కూడా .  నమకం లో మొదటి  అనువాకం ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః’’-నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం నమః ‘’అనే మంత్రం తో ప్రారంభ మవ్తుంది .క్రోధం నశిస్తే శాంతి లభిస్తుంది .శాంతి ఉంటె  అన్నీ ఉన్నట్లే .అందుకే జగత్ ను  పరి పాలించే ,మహా విష్ణువు  ‘’శాంతా కారం భుజగ శయనం  ,పద్మ నాభం సురేశం-విశ్వాకారం  గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం ‘’అనీ ,లయ కారకుడైన మహా

నా మాదిగపల్లె. .............రచన ,,ఎజ్రాశాస్త్రి, !

Image
 నా మాదిగపల్లె. .............రచన ,,ఎజ్రాశాస్త్రి, ! . ఆసుపత్రికి ఓమూల  పోస్టు మార్టం గదిలా  ఊరికి దూరంగా మాదిగ పల్లె  చర్మం లేని దట్టెంలా ఉంది  నాగజెముడు  బ్రహ్మాజెముడు  సర్కారుకంప  రేగి  కలివె  తుమ్మ  పరికి  ఒళంతాముళతో,  కంపల్లో రాలిపడుతున్న  రక్తపు చుక్కలు  తలమీద ముళకిరీటం  ఒళంతా గాయాలమయమైన  క్రీస్తులా ఉంది నా మాదిగపల్లె.  బతుకు భారమై  భుక్తికోసం  వలస జీవనం  సాగిస్తున్న  వాస్కోడిగామాలు  నా మాదిగ ప్రజలు  ఇంటి ముందర  రెండు ప్రయోగశాలలు  అమ్మసున్నం  అయ్యతంగేడు -  అయ్య వీరబాహుడిలా  కల్లుతాగి  కత్తులు పదును బెడ్తుంటాడు  కసాయి భాషనేర్వనికత్తి  అయ్యచేతిలో  కొవ్వొత్తిలా వెలుగుతుంది,  చెట్టుకింద కూర్చొని చెప్పులు కుడుతుంటే  బోధివృక్షం కింద  బుద్ధుడులా ఉండేవాడు  ఆరెకు,వారుకు, తోలుకు, నూలుకు మధ్య  ''మిగ్గుÑÑలాంటి మనసున్న అయ్య  నే పాలు తాగక మారాంజేస్తె  వాల్లయ్య పేరుతో  నా పసితనానికి  పెద్దరికం తలపాగా చుట్టి  సంబరపడేవాడు  అమ్మ తొమ్మిదినెలలు  కడుపులో మోస్తే,  అయ్య తన గుండెలమీద,  బుజాల మీద

అరుంధతీదేవి కథ .!

Image
అరుంధతీదేవి కథ పురాణ ప్రసిద్ధమైనదని  చెప్పుతారు. . అయితే, పురాణాల్లో ముఖ్యంగా శ్రీదేవీ భాగవతం, శివపురాణం, భాగవతం, భారతం తదితర పురాణేతిహాసాల్లో వసిష్ఠుని గురించి చెప్పే కథా సందర్భంలో ఆయన ధర్మపత్నిగా అరుంధతీదేవి ప్రస్తావన వస్తుంది.. . అరుంధతీదేవి ఒక అనార్య యువతి. వసిష్ఠుడు ఆర్య జాతీయుడు. వేదవనంలో తపస్సు చేసుకొంటున్న వసిష్ఠుడికి ఒకనాడు మధురమైన గీతం వినిపిస్తుంది. ఆ గీతం అతని మనసుని ఆకర్షిస్తుంది. పాడిందెవరని చుట్టూ పరికించి చూస్తాడు. సంధ్య అనే అమ్మాయి పాడిందా పాట. ఆమె అరుంధతీదేవికి సోదరి. ఆ పాట ద్వారా సంధ్యని, ఆమె ద్వారా అరుంధతీదేవినీ వసిష్ఠుడు కలుసుకొని, అప్రయత్నంగా సరస్సులో పడిపోయిన అరుంధతీదేవిని రక్షించడం ద్వారా అరుంధతీదేవి నివాసం ఉండే ఆశ్రమానికి చేరతాడు. ఇద్దరి మనసులు ఏకమవుతాయి.. . అరుంధతీదేవి - వసిష్ఠుల ప్రణయం విషయం వసిష్ఠుడిని చిన్ననాటి నుండీ పెంచి పోషించిన ప్రాచీనుడికి తెలుస్తుంది. మొదట ప్రాచీనుడు ఆ ఇద్దరినీ చూసి పార్వతీ పరమేశ్వరులేమో అని భావిస్తాడు. తాము వసిష్ఠుడు - అరుంధతులమని వసిష్ఠుడు ప్రాచీనుడికి వివరిస్తాడు. అరుంధతీదేవి గురించి చెప్తాడు. ఆమె ఒక తాపస కన్య అనీ, ఈ

“నమిలి మింగిన నా యెంకి”

Image
నండూరి వారి .“నమిలి మింగిన నా యెంకి” . ఎంకి నాయుడుబావల ప్రణయానికి, ప్రేమకు పరాకాష్ఠ . సాటేలా? నీకు మాటేలా? సిన్నతనమేలా? సిగ్గేలా? ఆ సీమ యీ సీమ అందచందాలు తిన్నంగ నిను సూసె దిద్దుకుంటారు …………….. యెంకొక్క దేవతై యెలిసెనంటారు – యింటింట పెడతారు యెంకి నీ పేరు .......యెంకితో తీర్తానికెళ్ళాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటే ……………… కోనేటిలో తానమాడాలి! గుడిసుట్టు ముమ్మారు తిరగాలి! కోపాలు తాపాలు మానాలి! యిద్దరము పిల్లోణ్ణి యీశుడికి సూపాలి!

ఇది సుమతి శతకం లోనిది ..Any Doubt...

Image
ఇది సుమతి శతకం లోనిది ..Any Doubt... . గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ! . తాత్పర్యం: . స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు , పూజిస్తారు.  సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని  హీనంగా మాట్లాడతారు...

నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన.!

Image
నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన.! రచన: డా. కె. శ్రీనివాసశాస్త్రి. . కలలో యెంకి “కతలు సెపుతున్నాది”, నాయుడుబావ “ఊ” కొడుతున్నాడు. వులికులికి పడుకొన్నా కూడా. ఎంకి యింకా ఎలా వుంది? రెక్కలతో పైకెగిరి సుక్కల్లే దిగుతాది కొత్త నవ్వుల కులుకు కొత్త మెరుపుల తళుకు స్వప్నం ఒక తీరని కోరిక (unfulfilled desire లేక wishful thinking ). ఆ తీరని కోరికలో ఒక తీరిన కోరిక, రెండింటిని కలిపి తీసికొంటే యిక్కడ వ్యక్తమయిన దానిని ఒక రకమైన wishful longing గా గ్రహించవచ్చు. వాస్తవములో అసంభవమయినది స్వప్నంలో జరుగుతోంది. (“సుక్కల్లే దిగుతాది”). స్వప్నంలో జరిగినదాన్ని ఎరుకలో లేక ఊహలో పెట్టుకొని వాస్తవంలోకి వస్తే ఒక రకమైన అస్పష్టమైన దిగులు కలగవచ్చు. దానిని Englishలో Wishful Longing గా పేర్కొంటారు. ఇది హిందీలో “చాయా వాద్” అనబడే కవితలో వ్యక్తం చేయబడింది. జైశంకర్ ప్రసాద్ వంటి కవులు యిలాంటి కవిత్వం వ్రాసారు. గేయం చివరలో నండూరి గొప్ప మలుపు, మెరుపు,మెరుగు యిస్తారు : తెలివి రానీయకే కల కరిగి పోతాది… ఒక్క నేనే నీకు పెక్కు నీవులు నాకు! లేపకే… మనలో చాలా మందికి కలిగే అనుభవం మొదటి రెండు

ఎంకి శివమెత్తి “తానాలు” చేసింది. !

Image
  ఎంకి శివమెత్తి “తానాలు” చేసింది. ! . ఆ అందాన్ని, ఆ చందాన్ని, ఆ ఆనందాన్ని తనకి తను తిలకిస్తూ, వాటిని అనుభవిస్తూ, పాట పాడుకొంటాడు, పాడుతాడు నాయుడు బావ.: . నీలలో మునిగింది తేలింది వెలుగుతో మబ్బు సెందురుడల్లె మనిసిలో మనసల్లె . శృంగారం, ప్రణయం పొంగుగా ప్రవహిస్తయ్. . (నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు .)

అల్లసాని పెద్దన‌.!

Image
అల్లసాని పెద్దన‌.! . అల్లసానిపెద్దన‌ క్రీ.శ.౧౫(15)- క్రీ.శ.౧౬(16) శతాబ్దముల‌ మధ్యజీవి౦చినగొప్పతెలుగుకవి.శ్రీకృష్ణదేవరాయలుఆస్థానములోని అష్టదిగ్గజాలలో ప్రముఖుడు.ఆయనస్వస్థలముఅన౦తపుర౦జిల్లాలోనిసో౦దేవపల్లి.తరువాత,కృష్ణదేవరాయలుఇచ్చినఅగ్రహారము నేటికడపజిల్లాలోని పెద్దనపాడుకు మకాముమార్చినాడు.దొరికినకొన్ని ఆధారాలప్రకారము అతని జన్మ‌స్థలము శ్రీశైల౦దగ్గరి డోర్నాల కూడాకావచ్చని మరియొక అభిప్రాయము.పెద్దన్నతనరచనలను శ్రీకృష్ణదేవరాయలకుఅ౦కితముచేసాడు.కవిగానేకాక మ౦త్రిగకూడాసలహాలిచ్చి పెద్దనామాత్యునిగ పేరుబడసినాడు. పెద్దనతెలుగులోరచి౦చినస్వారోచిషమనుస౦భవ౦లేకమనుచరిత్రఅనుప్రబ౦ధ‌మునకుముగ్దుడైన‌శ్రీకృష్ణదేవరాయలు,ఆ౦ధ్రకవితాపితామహుడు అనుబిరుదుప్రదాన౦చేసాడు.ఇది౧౪(14)మనువులలోరె౦డవవాడైనస్వారోచిషమనువుపుట్టుకకుస౦బ౦ది౦చినకథ.మార్క౦డేయపురాణము లోచిన్నకథగవున్నదానినిమారనకవి౧౫౦(150)పద్యముల‌లోతెలుగులోరచి౦చగా,పెద్దనఅదేకకథను౬౦౦(600)పద్యములతో౬(6)ఆశ్వాశ‌ము లుగ విస్తరి౦చాడు.వరూధిని,ప్రవరాఖ్యులుఈకథలోనివారే.పెద్దన‌మనుచరిత్రప్రబ౦ధము అ౦కితముచేసినపుడు రాయలవారు పెద్దన యడగల స్నేహగౌరవభావసూచనగ పెద్దన కూర్చున్న ఆసనము స్వయముగ యెత

ఆ చక్కని తల్లికి తోకేను లేదే ?

Image
ఆ చక్కని తల్లికి తోకేను లేదే ? . చిన్న కోతి పిల్ల ఒకటి వచ్చి శ్రీ రాముని అడిగే . జానకి అందరి కంటే అందరి కన్నా చక్కని అంటారు. . ఆ తల్లి ని చూడాలని మా కోతులు అన్ని కోరాయి. . శ్ర్రీ రాముడు చిన్న నవ్వు నవ్వి అటులే చూచి రండి అనియె.. . సీత వచ్చి సభలో గల కోతులు అన్నిటికి కనపడే . కోతులు అన్ని పల్లికిలిమ్చెను ..ఆ చక్కని తల్లికి తోకేను లేదే ? . ఈ కోతి ప్రశ్నకు జవాబు చెబుతారా.మరి.!

“ పరిహాసము లేని ప్రసంగం”

Image
“ పరిహాసము లేని ప్రసంగం”  . వాసనలేని పువ్వు , బుధవర్గములేని పురంబు,భక్తి వి  శ్వాసము లేని భార్య, గుణవంతుడుకాని కుమారుడున్, సద  భ్యాసము లేని విద్య, పరిహాసము లేని ప్రసంగవాక్యమున్  గ్రాసము లేని కొల్వు – కోరగానివి పెమ్మయ సింగధీమణీ!” . పైపద్యం ‘సింగధీమణీ’ అనేశతకం నుండి గ్రహించబడినది. పనికి రాని వాటిని గూర్చి అద్భుతంగా వివరించిన శతకం యిది. తప్పక అందరు చదవతగ్గది. పైపద్యంలోని భావం సులభ గ్రాహ్యం కనుక వివరించటంలేదు. పై పద్యంలో “ పరిహాసము లేని ప్రసంగం” కొరగానిది అంటే పనికి రాదు అంటాడు కవి. మనం నవ్వుతూ, ఎదుటివారిని నవ్వించడం ఒక కళ. మనం మాటాడితే ఎదుటి వారు ‘ఇంకా,ఇంకా వినాలి’ అనేటట్టు ఉండాలి.  అందుకే మాటాడేటప్పుడు కొన్ని ‘పద్ధతులు’ ( టెక్నిక్స్) పాటించాలని పెద్దలు చెప్పారు. స్పష్టంగా నవ్వు ముఖంతో మాటాడాలి. ( వదనం ప్రసాద సదనం) దీర్ఘాలు తీస్తూ మాటాడకూడడు.  తల ఆడిస్తూ,తల వంచి మాటాడ కూడదు. ( శిరః కంపీ, అవనత వదనం)  ఎదుటి వారి ముఖంలోకి చూస్తూ మాటాడాలి. నంగిరిగా, (అస్పష్టంగా) వణుకుతున్నట్లు మాటాడ కూడదు.  ఎదుటి వారిలో విసుగు కనపడినా, ( అంటే బోర్ ఫీల్ అయినా) వినే ఉత్సాహం లేకున

ఏలే ఏలే మరదాలా.!

Image
ఏలే ఏలే మరదాలా.! . బావా మరదళ్ళ సరస సల్లాపాల యుగళ గీతం!  . అచ్చ తెలుగు పదాల అందమైన పొందికలో జానపదుల గుండెల్ని పరవశింపచేసే రీతిలో  రచన చేసిన అన్నమయ్య భావుకతకు జోహార్లు అర్పించవలసిందే. . . ఏలే ఏలే మరదలా చాలు చాలు చాలును చాలు నీతోడి సరసాలు బావ గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా చీటికి మాటికి చెనకేవు వట్టి బూటకాలు మాని పోవే బావ అందిందె నన్ను అదిలించి వేసేవు మందమేలపు మరదలా సందుకో తిరిగేవు సటకారి ఓ బావ పొందుకాదిక పోవే బావా చొక్కపు గిలిగింత చూపుల నన్ను మక్కువ సేసిన మరదలా  గక్కున నను వేంకటపతి కూడితి దక్కించుకొంటివి తగువైతి బావ.!
Image
సరదా కబూర్లు..  శ్రీహర్షుడు...............‘నైషధం’ .(ఇడ్డెన్లూ.)! లేక...అశేష శేముషీ మోష మాష మశ్నామి మారిషా.! . . సంసృత కవి శ్రీహర్షుడు తెలుసుగా, ఆయన రాజుగారి కోరికమీద ‘నైషధం’ అనే కావ్యం రాసినాడంట. ఆ కావ్యం ఫస్టుకాపీ హర్షుడి తల్లి మామల్లదేవి చదివిందట. మహామహా పండితులకే అర్థంగానట్టు కొరకరాని కొయ్యలా ఉందా కావ్యం. ఆవిడ కూడా మంచి విదుషీమణి. ఆ కావ్యం అట్టానే రాజుకినిపించినాడంటే కొడుక్కి పేరు రాదనుకుని ‘ఒరే నాయనా, చదివేకి బాగా కష్టంగా ఉందిది, మళ్లోసారి రాయి నాయనా’ అందట.  తల్లిమాట మీద మళ్లీ మొదట్నుంచీ మొదలుబెట్టి రెండోసారి రాసేశాడట హర్షుడు. మొదటిదాని మీద ఆ రెండో కాపీ సుమారుగానే ఉన్నా అదీ ఓ మాదిరి కష్టంగానే ఉండటంతో ఇట్ట లాబం లేదన్జెప్పి హర్షుడికి రోజూ మినుములు తినబెట్టడానికి పూనుకుందటా మహాతల్లి. ఇడ్డెన్లూ(ఇవి అప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు, కొంత సొంత పైత్యం కలిపేస్తున్నా), గారెలూ, దిబ్బరొట్టెలూ మినప సున్నుండలూ... ఈ రకంగా ముప్పొద్దులా మినుముల వంటకాలే.  ఆర్నెల్ల తర్వాత... . ఒకరోజు హర్షుడు వంటింట్లో కూర్చుని మినపరొట్టి తింటుండగా ఆయన మేనమామ వచ్చి ‘కిమశ్నాసి’(అంటే...

పుస్తకం నేత్ర భూషణం .!

Image
పుస్తకం నేత్ర భూషణం .! . (మిత్రుడు...మందపాటి సత్యం. గారి రచన.) . మన చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, కారం కాని కారం ఏమిటి.. అంటే మమకారం, ప్రాకారం, ఆకారం అని.. అలానా? ఏమిటి ఆ పుస్తకం కాని పుస్తకం? . దాని పేరు ముఖ పుస్తకం. . ఎంతోమంది వారి జన్మ నక్షత్రాల నించి, జాతకంతోసహా, వారి రోజువారీ జీవితంలో జరిగే వన్నీ, ముఖ పుస్తకం పేజీల్లో పెట్టి ప్రపంచానికి చాటి చెబుతుంటారే.. ఆ పుస్తకం.ముఖపుస్తకం. ఇది వచ్చాక ఎంతో మంచితోపాటు, కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ముందుగా, మంచి విషయాలు చెప్పుకుందాం. నేను 1960లలోచదువుకునేటప్పుడుస్నేహితులైనమా గుంటూరుహిందుకాలేజీమిత్రులు, కాకినాడగవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ మిత్రులు, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మిత్రులు – మళ్ళీ దగ్గరయారు. అలాగే 1970లలో పదేళ్ళు నేను తిరువనంతపురంలో పనిచేసినప్పుటి మిత్రులతో, మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది. ఆనాటి, ఈనాటి కబుర్లు, ఫొటోలు ఒకళ్ళవి ఒకళ్ళు చూసుకుంటూ ఎంతో ఆనందిస్తున్నాం. . అలాగే సాహిత్యం. ఎంతోమంది నా అభిమానులు, నా రచనల మీద వారి అభిప్రాయాలు, స్పందనా పంచుకుంటుంటే సంతోషంగా వుంటుంది. నా పుస్తకాలూ
Image
మన రమణగారి జోకు..! . ఒక అడవిలో ముగ్గురు మునిపుంగవులు దీర్ఘ తపస్సు చేసుకుంటున్నారుట.  ఒక గుర్రం వారి పక్కనించీ చకచకా పరుగెడుతుంది.  ఆ గుర్రం అలా వెళ్ళిన ఆరు నెలలకి, ఒక ముని అంటాడు, “తెల్ల గుర్రం ఇలా పరుగెత్తింది” అని.  అది విన్న ఇంకో సంవత్సరానికి, రెండో ముని అంటాడు, “అది తెల్ల గుర్రం కాదు. నల్ల గుర్రం” అని.  అది జరిగిన ఇంకో రెండు సంవత్సరాలకి, మూడో ముని కోపంతో లేచి, “మీరు చీటికీ మాటికీ ఇలా వాదించుకుంటుంటే, నా తపస్సు ఎలా చేసుకునేది” అని అక్కడనించీ వెళ్ళిపోతాడు.  అదీ మన రమణగారి జోకు.

ఇది ఒక మహా సంగ్రామం.

Image
ఇది ఒక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు అసమర్థులకు చోటు లేదు.! . .""ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో -  వీళ్ళల్లో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు? ఏ వాసన చూట్టంవల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? . ఈ యుద్ధాలు, ఈ నాశనాలూ, బాధలు, తాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా? అంతా సుఖంగా బతుకుతారుగా! వాళ్ళీ విధంగా ఆలోచించరు. . జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. . ఇది ఒక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు అసమర్థులకు చోటు లేదు."

నవ్వడం అనేది సహజంగా రావాలి-!

Image
నవ్వడం అనేది సహజంగా రావాలి-, . ఎన్నో దు:ఖాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు వున్నట్లే కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులవుతూ వుంటాయి. . అదే మానవ జీవితం- ఈ ప్రపంచం రచనల్లో హాస్యం సన్నగిల్లిపోయింది. హాస్యరస ప్రధానమైన కథ పత్రికలో కనిపించటమే అరుదైపోయింది – కనిపించినా అందులో హాస్యం పల్చగా వార్చినా గంజిలా వుంటోంది. ఇంక సినిమాల్లో హాస్యపు సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ అవస్థ పడుపోతున్నారు-,  . మన సినిమాల్లో, అంటే ఇప్పుడొస్తున్న సినిమాల్లో హాస్యం అంటే స్త్రీల సెక్స్‌ మీద అల్లిన చౌకబారు సన్నివేశాలు తప్ప మరేం కనిపించడం లేదు. హాస్యమంటే దొంగతనంగా చేసే శృంగారం అని నిర్ధారించారు. భార్య కళ్ళు గప్పి మరొకామెతో వెకిలి చేష్టలు చేయడం -,  . ఇద్దరు పెళ్ళాలు, ఒక మొగుడు- వాళ్ళ మధ్య కోట్లాలు, ఆడవాళ్ళ చేత అసహ్యాకరమైన అభినయం చేయించి అదే హాస్యంగా చెలామణి చేస్తున్నారు-, ఇది పాతిక, ముఫ్ఫై సంవత్సరాలుగా తెలుగు సినిమాకి పట్టిన దుస్ధితి, మన జీవితాల్లో – జీవనంలో సున్నితంగా, తమాషాగా జరిగే హాస్య సన్నివేశాల్ని పట్టుకో

సాహిత్య చిరంజీవులు....

Image
సాహిత్య చిరంజీవులు.... . గురజాడ అప్పారావు గారి ..కన్యాశుల్కం.. నాటకం లో ప్రేమ రాహిత్యం.! . (గురజాడ జయంతికి ప్రభుత్వం వేసిన సోవనీర్ లో అచ్చైన వ్యాసం) “అన్నీ సంబంధాలూ ఆర్ధిక సంబంధాలే” అన్నాడు మార్క్స్. అయితే మానవ స్వభావాన్ని విస్తృతంగా అన్నీ కొణాలనుండి చర్చించిన గురజాడ ఈ విషయాన్ని మార్క్స్ ని చదువు కోకుండానే తన రచన “కన్యా శుల్కం” లో సోదాహరణగా పాత్రల ద్వారా చూపించాడు. ఈ నాటకం లోని పాత్రలు పీనాసి ఆశబోతు అయిన లుబ్ధవధానులు, ఎక్కువ డబ్బుల కోసం పిల్లని అమ్ముకుందామన్న ఆశ కలిగిన అగ్నిహోత్రావధానులు, వీళ్ళందరినీ బురిడి కొట్టించే రామప్పంతులు, తల తన్నే వాడైన గిరీశం ఈ నాలుగు పాత్రలూ అంతా ధనాశా పరులే. గిరీశానికి విధవా వివాహం చేసుకుని కీర్తి కూడా సంపాదించాలన్న కీర్తి కాముకత కూడా ఉంది.  . ఇక కధా పరంగా పరిశీలిస్తే ఈ నాటకం లో ఏ పాత్రా స్వలాభాపేక్ష లేనిదే ఏ పనీ చేయదు. ఏ పని చేసినా అందులో స్వార్ధం తప్ప ప్రేమ ఉండదు. గమనించి చూడండి లుబ్ధావధానులుకి చవగ్గా పెళ్లి కూతురు కావాలి. ఇంట్లో యుక్త వయసు విధవ కూతురు ఉందని కూడా చూడడు. అతని పెళ్లి గోల తోనే సరి పోతుంది. .  అంత కంటే ఘనుడు అగ్ని హోత