గజేంద్ర మోక్షము..... పోతన.

 గజేంద్ర మోక్షము..... పోతన.

.

శా. భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్

హేమక్ష్మాధర దేహముం జకిత వన్యేభేంద్ర సందోహముం

గామక్రోథనగేహమున్ గరటి రక్తస్రావగాహంబు ని

స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్ ||

.

.

మేరుపర్వతము వంటి శరీరము కలదియు,

ఏనుగులను భయపెట్టినదియు, కామక్రోధములను కలిగియున్నదియు,

గజేంద్రుని యొక్క రక్తమునందు స్నానము చేసినదియు, 

ఏనుగును గెలవవలెనను గట్టి పట్టుదలతో నున్నదియు, 

దప్పికను వీడి, విజయమును కాంక్షించుచున్నదియు నగు మొసలి యొక్క శిరస్సును

శ్రీహరి వదలిన సుదర్శన చక్రము భయంకరముగా పోయి 

అవలీలగా ద్రుంచి వేసి, ఆ మకరి ప్రాణములను హరించెను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!