వంట గది సర్దుకోవటం ఎలా?.............(నేను ఎందుకు రాసేను.)

వంట గది సర్దుకోవటం ఎలా?.............(నేను  ఎందుకు రాసేను.)

.

వంట ఇల్లు అంటే చికాకు పడకుండా ముందుగ అన్ని ఆలోచించుకుని సర్దుకుంటే అస్సలు వంట అంత తేలిక పని ఇంకొకటి వుండదు.వంట గది ఎలా వుండాలో నాకు తెలిసినది నేను చెప్తాను. ఏదో కొన్ని సలహాలు......మరి బావుంటాయో లేదో చూడండి.ఏమి లేదండి కొంచెం ఖర్చు అవుతుంది అంతే...ఎలాగంటే డబ్బాలు అంతే .........

.

1.ముందుగ మనము ఇంట్లో నెలకు ఏమేమి సరుకులు వాడతామో ఆలోచించుకుని ఒక పేపర్ మీద రాసుకోవాలి. సుమారు పప్పులు,పిండ్లు కిలో చొప్పున వాడతాము అనుకోండి ...బయట ప్లాస్టిక్ డబ్బాలు (లోపల మనము పోసినవి పయికి కనపడుతూ వుండే లాంటివి అన్నమాట) దొరుకుతాయి కదా అవి కొనుక్కుంటే సరిపోతుంది...ఇంక మనము సర్దుకోవటమే ఆలస్యం,....ఆవాలు,జీలకర్ర లాంటివి తక్కువ వాడతాం కాబట్టి చిన్న డబ్బాలు కొనుక్కుంటే సరి.పోసుకుంటే మనమే కాదుఇంక ఎవరినా సరే తేలికగా వంట చేసుకోవచ్చు.అందరు మనల్ని ఒసేయి అది ఎక్కడ పెట్టవే ఇది ఎక్కడ పెట్టవే అనే బాధ తప్పుతుంది...

.

2.వంట గదిలో సామాను ఎంత తక్కువ వుంటే అంత మంచిది.బొద్దిన్కలకి,దోమలకి,ఈగలకి వంట ఇల్లు పుట్టినిల్లు.అందుకని మనకు రోజు వాడుకునేవి మాత్రం కొనుక్కుంటే సరి.అంతగా ఎవరన్నా చుట్టాలు వస్తే బయట పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాసులు,వగైరా వుందనే వున్నై.

౩.వంటగదిలో గోడకు పెట్టుక్నేస్టాండ్స్ వుంటాయి అది తెచ్చుకుని గోడకు పెట్టుకుంటే సగం సామాను దానిలో పెట్టుకోవచ్చు .కంచాలు,గరిటెలు,గ్లాసులు ,వగయిరా అన్ని అందులో పెట్టుకోవచ్చు.బావుంది కదా ...అప్పుడు ఎక్కువ అలమారాలు కూడా అవసరం లేదు .పని తేలిక అయిపోతుంది...గిన్నేన్లు కదగాగానే సర్దుకోవటానికి కూడా తేలిక అయిపోతుంది....కొంతమంది ఐతే అలమరాలే రకరకాలుగా పెట్టుకుంటున్నారు...వాటిని ఐతే మనము ముందు పట్టుకుని లాగగానే సర్రుమని ముందుకు వచేస్తై చక కాక వాటిల్లో సర్దుకోవచ్చు...అంత సంపాదన లేని వాళ్లు యెట్లా పెట్టించుకుంటారు..చెప్పండి.అందుకే స్తన్ద్తో సరిపెట్టుకుందాం...లేదు అంటే అలాంటివి కూడా పెట్టిచ్చుకోవచు...కాని వాటితో బొద్దింకల గొడవ ఎక్కువ అనుకుంట.ఏమోలెండి....

.

౩ .ఇంకాగిన్నెలు కదగాగానే నీళ్లు పోవటానికి గిన్నెల బుట్టలు వుంటై బయట.. అది ఐతే సుబ్రంగ నీళ్లు అన్ని పోయాక మనము సర్దుకోవచ్చు.

౫.సరే మరి ఐతే ఇంక వంట సంగతికి వస్తే ఒక కుక్కర్ ,,,నోన్స్తిక్ మూకుదుల సెట్ ఐతే బావుంటుంది.చక్కగా తక్కువ నూనె తో వండుకోవచ్చు.మాడదు,రుచికరంగా వస్తాయి...కడుగుకోవటం తేలిక.

.

4.ఇంక మరి మనము వండేటప్పుడు మనకు ఎక్కువగా నూనె,తాలింపు గింజలు,ఉప్పు,కారం,పసుపు కావాలి కదా.అందువలన అవి అందుబాటులో పెట్టుకోవాలి.మరియు నూనె,నెయ్యి చిన్న గిన్నెలో పోసుకుని ఆ రెండు కలిపి ఒక ప్లేట్ లో పెట్టుకుంటే కింద అంత నూనె అంటదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!