నవ్వడం అనేది సహజంగా రావాలి-!

నవ్వడం అనేది సహజంగా రావాలి-,

.

ఎన్నో దు:ఖాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు వున్నట్లే

కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులవుతూ వుంటాయి.

.

అదే మానవ జీవితం- ఈ ప్రపంచం రచనల్లో హాస్యం సన్నగిల్లిపోయింది. హాస్యరస ప్రధానమైన కథ పత్రికలో కనిపించటమే అరుదైపోయింది – కనిపించినా అందులో హాస్యం పల్చగా వార్చినా గంజిలా వుంటోంది. ఇంక సినిమాల్లో హాస్యపు సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ అవస్థ పడుపోతున్నారు-, 

.

మన సినిమాల్లో, అంటే ఇప్పుడొస్తున్న సినిమాల్లో హాస్యం అంటే స్త్రీల సెక్స్‌ మీద అల్లిన చౌకబారు సన్నివేశాలు తప్ప మరేం కనిపించడం లేదు. హాస్యమంటే దొంగతనంగా చేసే శృంగారం అని నిర్ధారించారు. భార్య కళ్ళు గప్పి మరొకామెతో వెకిలి చేష్టలు చేయడం -, 

.

ఇద్దరు పెళ్ళాలు, ఒక మొగుడు- వాళ్ళ మధ్య కోట్లాలు, ఆడవాళ్ళ చేత అసహ్యాకరమైన అభినయం చేయించి అదే హాస్యంగా చెలామణి చేస్తున్నారు-, ఇది పాతిక, ముఫ్ఫై సంవత్సరాలుగా తెలుగు సినిమాకి పట్టిన దుస్ధితి, మన జీవితాల్లో – జీవనంలో సున్నితంగా, తమాషాగా జరిగే హాస్య సన్నివేశాల్ని పట్టుకోవడంలో సినిమా రచయితలు పూర్తిగా విఫలమవుతున్నారు. బహిర్భూమికెళ్ళే సీన్లు, బాత్‌రూందగ్గర క్యూలు చూపించి జిగుత్స కలిగిస్తున్నారు. ఒకప్పుడు సన్నివేశాల్లో, సంభాషణల్లో అద్భుతమైన హాస్యం మన సినిమాల్లో వుండేది అదీకాక, హాస్యంని పాటల్లో పెట్టి కడుపుబ్బ నవ్వించిన సందర్భాలు మనకెన్నో వున్నాయి. 

.

ఆరుద్ర, కొసరాజు, కొడకండ్ల అప్పలాచార్యలాంటి వారు ఎంతో చక్కని హాస్యం పాటలు రాశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే, ఆ పాటల్లోని మాటలు వింటుంటే, ఆ ట్యూన్స్‌, ఆ పాడినవారి కంఠాలలోని మెలకువలు ఆస్వాదిస్తుంటే ఎంతో సరదాగా, మనసుకి ఉల్లాసంగా వుంటుంది. 

.

కులగోత్రాలు సినిమాలో ‘అయ్యయ్యో జేబుల్లో డబ్బుల పోయేనే’ కృష్ణార్జున యుద్ధంలో’- అంచెలంచెలస్వర్గం, ‘భార్యాభర్తలు’ సినిమాలో చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి’ చదువుకున్న అమ్మాయిలులో ‘ఏమిటీ అవతారం – ఎందుకీ సింగారం’- ఓ పంచవన్నెల చిలకా’ అనే పాట అప్పుచేసి పప్పుకూడు సినిమాలో – పాటలన్నీ చెప్పాలంటే కుదిరేపనికాదుగానీ చివరిగా ఒక్క పాట తల్చుకోకతప్పని అత్యంత అద్భుతమైన పాట, వినరా సూరమ్మ కూతురి మొగడా’ అనే పాట’, ఇది ‘ఇల్లు-ఇల్లాలు’ అనే సినిమాలో అప్పలాచార్య రాశారు. మహదేవన్‌ కూర్చిన సంగీతానికి ఎస్‌.జానకి రాజబాబు (నటుడు) ప్రాణం పోశారు. ఎంత చమత్కారం- ఎంత హాస్యం! ఎప్పుడూ సీరియస్‌గా కనుబొమ్మలు ముడిచి, బ్రహ్మమూతి పెట్టుకుని నవ్వనుగాక నవ్వను అని భీష్మించుక్కూర్చున్నవారు సహితం ఈ పాట వింటే నవ్వక తప్పదు. ఆ పాటలోరాని అందమైన హాస్యపు జల్లుకి పెదవులపై చిరునవ్వులు చిందకపోతే ప్రాణాలమీద ఒట్టు

..

ఇలాంటి పాటల్నీ, సంగీతాన్ని, మాటల్నీ, నటుల్నీ, సన్నివేశాల్నీ మనం మళ్ళీ మళ్ళీ రూపొందించుకోలేక పోతున్నామే అనిపించినప్పుడు ఎవరికైనా బాధ కలగక మానదు.

మన సినిమాల్లోని కొన్ని హాస్యం పాటలు..

.

వినవేబాల, నా ప్రేమగోల, చింతలు రెండు చింతలు, కాశీకి పోయాను రామాహరి, అందమైన బావా-ఆవుపాలకోవా, కనకమా- నా మాట వినుమా, ఇండియాకు రాజధాని ఢిల్లీ, సరదా సరదా సిగరెట్టు , సుందరి నీ వంటి దివ్వస్వరూపం, ఓహోహో మామయ్యా,..

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!