నా మాదిగపల్లె. .............రచన ,,ఎజ్రాశాస్త్రి, !

 నా మాదిగపల్లె. .............రచన ,,ఎజ్రాశాస్త్రి, !

.

ఆసుపత్రికి ఓమూల 

పోస్టు మార్టం గదిలా 

ఊరికి దూరంగా మాదిగ పల్లె 

చర్మం లేని దట్టెంలా ఉంది 

నాగజెముడు 

బ్రహ్మాజెముడు 

సర్కారుకంప 

రేగి 

కలివె 

తుమ్మ 

పరికి 

ఒళంతాముళతో, 

కంపల్లో రాలిపడుతున్న 

రక్తపు చుక్కలు 

తలమీద ముళకిరీటం 

ఒళంతా గాయాలమయమైన 

క్రీస్తులా ఉంది నా మాదిగపల్లె. 

బతుకు భారమై 

భుక్తికోసం 

వలస జీవనం 

సాగిస్తున్న 

వాస్కోడిగామాలు 

నా మాదిగ ప్రజలు 

ఇంటి ముందర 

రెండు ప్రయోగశాలలు 

అమ్మసున్నం 

అయ్యతంగేడు - 

అయ్య వీరబాహుడిలా 

కల్లుతాగి 

కత్తులు పదును బెడ్తుంటాడు 

కసాయి భాషనేర్వనికత్తి 

అయ్యచేతిలో 

కొవ్వొత్తిలా వెలుగుతుంది, 

చెట్టుకింద కూర్చొని చెప్పులు కుడుతుంటే 

బోధివృక్షం కింద 

బుద్ధుడులా ఉండేవాడు 

ఆరెకు,వారుకు, తోలుకు, నూలుకు మధ్య 

''మిగ్గుÑÑలాంటి మనసున్న అయ్య 

నే పాలు తాగక మారాంజేస్తె 

వాల్లయ్య పేరుతో 

నా పసితనానికి 

పెద్దరికం తలపాగా చుట్టి 

సంబరపడేవాడు 

అమ్మ తొమ్మిదినెలలు 

కడుపులో మోస్తే, 

అయ్య తన గుండెలమీద, 

బుజాల మీద మోసెవాడు. 

తడుబ్బాత1 లేని అయ్య 

నా పసి బెల్లానికి 

''శరాయిÑÑ తొడిగి 

సంబరపడేవాడు. 

తన చద్దిబువ్వలో 

నేను చిచ్చుళు పోస్తే 

చీదరింపు లేక 

కాటంరాజు తిరనాళలో 

నన్ను బుజాలకెత్తుకొని... చిందయ్యెవాడు. 

ఓ..న..మాలు రాని అయ్య 

నాకు పెదబాల శిక్ష. 

నా పలకా, బలపం, 

నేను కలగటేరు 

అయితే కల్లజూడాలని 

కలలుగనేవాడు. 

అయ్య తప్పెట దరువేస్తే 

రైలు పట్టాలుదిగి 

మాదిగ పల్లెలోకి 

పరిగెత్తినట్లుండేది. 

మా ఇంటిముందర 

కల్పవృక్షం లేకపోయినా 

చింతచెట్టుండేది 

ఊరి పచ్చి బాలింతలకు 

పత్యానికి పాతచింతకాయ పచ్చడి 

కాసిన్ని కస్తూరి మాత్రలు, 

చిటికెడు గోరోజనం అయ్యేవాడు అయ్య. 

వేురు పర్వతమా 

జాంబవతనయా 

పసిడి నదులు 

నీపాదాల గుండా 

ప్రవహిాంచేవట 

త్రేతాయుగంలో 

శ్రీరాముని రాజకీయ సలహాదారుడివై 

ద్వాపరయుగంలో 

శ్రీకృష్ణునిపై 

వీరోచితంగా పోరాడినావట 

శూరుడా ! 

యుద్ధవీరుడా ! 

అద్భుత శమంతకమా,జాతిరత్నమా 

కోహిానూర్‌ కూడా నీ ముందర వెలవెలే కదా! 

నీవు నడిచొస్తుంటే 

పొడిచొస్తున్న సూర్యుడిలా ఉంటావు! 

బండా గుండ్రాయితో ఉగ్గునూరి 

బుగ్గగిల్లి ఉగ్గుబెట్టి 

తలకు సాంబ్రాణి ధూపవేుసి 

దూలానికి జోలేసి 

ఊగే ఉయ్యాల కాదు బాల్యం 

నేను పీకి పారేసిన ముడుసు2 

చదువుల్లో నేను సొలోమానురాజు 

మా బడి మా ఊరిగుడి 

అయ్యవారు పూజారి 

నే గుడిముందర చెప్పులు 

మెట్లవద్ద యాచకుణ్ణి 

అక్షరాలు అయ్యవారి దయ 

ఐదోతరగతి పుస్తకంలో 

అంబేద్కర్‌ గుర్తొస్తుంటాడు 

ఆరో తరగతి రాగానే 

మహాకవి జాషువా 

కష్టజీవిలా కనిపిస్తాడు. 

జేెబులో రెండు ఈరగ (లివర్‌) ముక్కలు 

నాకు చాక్‌లెట్స్‌, 

కృష్ణ, కృపన్నలు 

కరపత్రాల 

కత్తులతో 

కువ్వల్లో కనికట్టతేల్చి 

జరుగుతున్న మోసాల్ని 

లెక్కల్లో చిక్కు ముళువిప్పి 

దండోరాకు నన్నొక 

తప్పెట మూయాలనిరి 

రాత్రి చర్చల చివరాకర్లో 

క్రీస్తు రెండో రాకడ కొరకు 

క్రైస్తవులంతా ఎదుర చూసినట్లు 

మాదిగ మందిమంతా 

మాదిగ నాయకుడికొరకు 

ఎదురు జూస్తుండిరంటిని 

ఎబిసిడిలు భాగవతం 

బిబిసిలో బూర ఊదబడునని 

మహానాయకుల సరసన 

మాదిగ జాతికి కుర్చీలుంటాయని 

జోష్యం జెప్పినానప్పుడు కాలజ్ఞానమై 

మీరు ఆదర్శ స్వాప్నికులు 

వెలకట్టలేని వెలుతురు దివ్వెలు 

రేపటి తరాలకు నిప్పురవ్వలు 

బాబూజీ వారసులు 

బాబాసాహోబ్‌ ఆలోచనాపదŠంలో 

పయనించే అరుంధతీ పుత్రులంటిని 

కనకగిరి నెక్కి 

కనక తప్పెటతో 

దామాషాగురించి 

కనిగిరి తాలూకాలో 

దండోరా ఏసిన మొదటోన్ని 

మా ఊరు సరస్వతికి 

నిలయం కాకపోయినా 

అరుంధతికి ఆలయం 

పోలేరమ్మకు పుట్టిల్లు 

ముత్యాలమ్మ తల్లి వేరేనా? 

మా ఇంటి ఆడపడుచు 

బక్క ఎద్దుచర్మం 

బొక్కెన తోలు 

బక్కరైతుకు చెప్పులు 

తొండానికి తోలు 

దండేనికి తునకలు. 

పసుపురోగ పాడావు 

చండ్రకోల వారులు అల్లి 

బొడ్డారులు3 మెడగంటలు 

తలకుచ్చులు. 

కరువు కాటకాలు 

పన్నుపోటు, వెన్నుపోటు 

జమాబందీలకు 

ఏలానికి, తాలానికి 

చావులకు, సంబరాలకు 

చాటింపు, దండోరాలై 

పీర్లగుండాల నడిపించి 

ప్రభలైనా 

పూలబండ్లయినా 

వెలిగేది వాళు 

ఎగిరేది వేుము. 

పాలు పెరుగు ఎరగని 

పాలేరు బ్రతుకు మాది 

వేగుచుక్క వేులుకొని 

ఏడుగాల్ల పెడ 

ఇంటిముందు కళాప 

ఎరువు బండ్లు, బరువు బండ్లు 

ఏడు బర్రెల పాడి 

చిట్టు, పొట్టు 

గాటిలో గడ్డి 

దూడ మూతికి చిక్కం 

నా ముంతలో పున్నీళు. 

కాడెడ్లకు కొండగడ్డి 

పాడి బర్రెకు పచ్చగడ్డి 

పైటాలకు నాకు రాగిముద్ద 

మాపైగుడ్డలు బాప్తీస్మాలు 

పొందితేగాని చాకలన్నముట్టడు 

దొరలు కాళు పట్టిన చేతులు 

మా తల వెంట్రుకలేనాడు ముట్టాడుకనుక? 

పై చదువులకు 

నే పట్నం మెట్లెక్కితే 

అమ్మా కళళో నే కన్నీళౌతా 

అయ్య నా పాదాలకు చెప్పులై 

ముద్దాడతాడు. 

ఐదు రొట్టెలు 

రెండు చేపలకై కాక 

చర్మంచుట్టిన 

ఎముకలగూడు 

నడిచే అస్తిపంజరంనేను 

నిత్యం పస్తులై, నిస్తులై 

పాఠాలతో 

పొట్ట నింపుకొని 

ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణతే 

శలవు దినాలన్నీ 

నాకు పనిదినాలే 

నేను పునాది రాయి 

తీసిపారేసిన రాయి తలకు మూలరాయి 

నే చేలో మొక్క 

ఇటుకలో మట్టి 

చెప్పుకు వేుకు 

చేనుకు కంచె 

చేలో ఎరువు 

కంచెలో మంచె 

మంచె విూద వడిశల 

వడిశలలోన రాయి 

తోకలేని పిట్టలెన్నో 

తల ఊపుతూ మోకరిల్లి 

ఉభయకుశలోపరి అంటూ 

క్షేమాలను మోసుకొచ్చి 

చావుకబుర్లు తీసుకొచ్చి 

మసిబూస్తే మరణమని 

పసుపైతే పెళని 

నాతో పరిపరి చదివించుకొని 

ఏడూళకు దారినేను 

దిక్కునేను 

నేనుపట్టా పట్టుకొని 

నడిచొస్తుంటే 

జమాబందికొస్తున్న 

తహాసిల్‌దారులా 

నా మాదిగపల్లె 

''తునకల హారాలతో 

స్వాగతం పలికేది 

కరువు శిలువను మోస్తూ 

కాలాన్ని ఎల్లదీస్తూ 

పల్లేర్ల మీద బతుకుబండినీడిస్తూ 

కట్టెల మోపులు 

కలబందలు 

గోగు, గురివిందలు 

పావలో బేడో 

అర్ధణో, అణాతో 

పొట్ట పోసుకొని 

ఆకలి కలెవకాయలు 

నెమ్మిపండ్లు 

దొంగిలిన 

దోసకాయలు 

వేరుశనక్కాయాలు 

గెణుసుగడ్డలు 

అడవిగడ్డలు, పిల్లేర్లతో 

పొట్టనిండక 

పస్తులై, నిస్తులై 

పొగరాని పొయ్యిజీవితం 

నారై, నీరై, మొక్కై 

పుడమితల్లి పొత్తిళలోచేర్చి 

పంటకు జోల పాటపాడి 

వేుఘమా! వర్షమైవచ్చి 

నారైతు పంటను ముద్దాడమని 

తూర్పు, పడమటిగాలులు 

వింజామరలై వీచమని 

ఉత్తర దక్షణాదులుయ్యా లూపమని 

చిరుపొట్ట కాగానే 

వడిశలై పిట్టల్నితోలి 

చిరుగాలులూ! 

శ్రీమంతంచేయమని 

గింజకాగానే 

గాలిహాోరుల 

తుఫానులు తాకొద్దని 

ప్రకృతి నాల్గుదిక్కులమొక్కి 

పంటను రైతు ఇంటచేర్చి 

వేుమంతా చేలో 

కొయ్య కాళలా మిగిలిపోతాం 

కుప్పనూర్చి 

తూర్పారబట్టి 

గాలికి ఎగిరే తాలు గింజలం 

రాసి అడుగుమట్టి గింజలం. 

దేవుని మాన్యాలన్నీ 

దెయ్యాల పాలు 

నైవేద్యాలన్నీ బూతాలపాలు. 

జానెడు కొమ్ములు తిరిగిన 

మెడబలసిన దున్నపోతును సైతం 

ఏటుకునరికి 

పొలినై బలినైన 

ఊడ్చడానికి 

ఏడ్చడానికి సెంటుభూమిలేదు. 

జీవితాన్ని తెగిన చెప్పులా ఈడుస్తున్నా 

వేసక్టమీ అంటే అయ్యకు ఉరి 

సారా కోసం సావుకైన సిద్దం 

కుచేలుడు సంతానాన్ని 

కలరా కబలిస్తున్నా 

అతిసారా అంతమొందించినా 

మసూచి మట్టుబెడుతున్నా 

పోలియో అంగవైకల్యమైనా 

వ్యాధినిరోధక టీకాలంటే 

చెట్టు 

పుట్ట 

గాదే 

గరిసెలై 

ఏడూళు ఏకమై 

ఏడుపులు 

పెడబొబ్బలు. 

పల్లె రాబందులకు విందు 

తమలపాకులు తుంచారని 

తలకాయలు తెంచారు 

అరటిగెలనరికారని 

అరికాళునరికారు. 

గొర్రెల్లోబడ్డా తోడేళా 

వేుకల్లోబడ్డా చిరుతల్లా 

నాలుగెద్దుల కదŠలో పులిలా 

విభజించి పాలించే 

తెల్లదొరలకు తీసిపోరు 

రైతుల పెళంటే 

చెప్పులు పువ్వుల్లా 

పాదాలకింద పోస్తాడు అయ్య 

గజ్జల గుత్తైపోయి 

చిందులు శివాలై 

చిట్లిన తప్పెటలా 

గోడకిందవాలి పోతాడు 

పండగంటే 

వడ్లగింజలో 

బియ్యపుగింజ! 

సంవత్సరానికో ప్రసాదం!! 

ఈ వసంతాని కోసం 

నా పల్లె ప్రజలు వలస పకక్షుల్లో 

కలిసిపోయింది. 

జబ్బుకు 

జాడ్యానికి 

జిల్లేడు పసరు నస్యం 

కళల్లో కలికం 

సొంటి 

వొంటేలువైద్యం 

కషాయం 

పాషాణం 

లంకణానికో పత్యం 

వరిబువ్వగంజి 

టీగ్లాసులే కాదు 

మందుగ్లాసులు 

ఊరిని పల్లెను రెండుగా 

చీలుస్తాయి 

కొంపలు నిప్పంటుకుంటే 

కులం వాగులో 

విద్యుత్‌లా ప్రవహిాస్తుంది 

దాహానికి దోసెళతో 

దేబిరించాల్సిందే 

బూడిదలో ఉచ్చ 

బుడ్డోడిమంత్రం 

కొండ నాలుక పెరిగిందని 

చిమట కాకర్లబోతే 

ఉన్న నాలుక ఊడిపోయే 

తేలు మంత్రం 

భూతాలకు తంత్రం 

చేతబడి 

చిల్లంగి 

బాణామతి 

అమాయకత్వం 

ఆసరాగ పెట్టుబడి 

ముగ్గులేసి 

నిగ్గుతేల్చి 

మాదిగోడికి పాతాళం. 

రైతు పంటచేతికొస్తే 

నేను మగదŠ సామ్రాజ్య 

యువరాజునే మరి 

గంగిరెద్దుల ఆట, నిప్పుల్లో నడుస్తున్న 

కణకతపెట్లు, కర్రసాములు 

మల్లయుద్దాలు 

వీధినాటకంలో నేనెప్పుడూ 

వీర బాహున్నే 

మాదిగ మాష్టీలు 

ముష్టియుద్దాలు 

మల్లయోధులై 

సాముగరిడీలై 

యుద్ధవీరులైన మాదిగసేన! 

నాపేట కోట ప్రాకారం 

అల్లంత దూరాన 

నాడెక్కలి సుందరి 

చెలికత్తెలతో 

తన సౌందర్య సుమాల 

సువాసనలతో నన్నా కర్షించి 

ఆహ్వానం పలుకుతుంది. 

కోరమీసాలు మెలివేసి 

కిర్రుచెప్పులు కాల్లతొడిగి 

నెత్తికి సమురుబూసి 

నా నిలువెత్తు మూర్తి మత్వానికి 

మాల కొండన్న 

నూరు నెంబరు నూలుపంచ 

ఖద్దరులాల్చి ఆరుమూరల కండువాతో, 

వెనకాముందు సైన్యాలున్నట్లు 

అశ్వాలు 

ఐరావతాలు 

కదులుతున్నట్లు నేనుకదులుతుంటే 

అంతఃపుర సుందరాంగులు 

లేలేత లేగదూడల కొవ్వుల పువ్వులతో 

వసనెయ్యి4 ప్రమిదల తో 

నాకు ఆహ్వానం పలికినట్లుండేది 

నేను నాప్రియురాలు 

మందహాసంతో 

ఆ నులక మంచవేు పట్టుపరుపు 

పందిరిమంచం 

ఆపై మా ప్రణయ గాధలెన్నో? 

నా జీవితపురాణం 

నాలుకమీద లిఖించుకున్న 'ఆసాదిÑÑ 

వల్లిస్తూ 

జంబూద్వీపము 

జాంబవ పురాణం 

యజ్ఞ జ్వాలలనుండి 

ఉద్భవించిన అరుంధతిని 

వశిష్టుడు వలచి 

కులపెద్దల ఆజ్ఞతో 

పరిణయమాడి 

ఆకాశంలో నక్షత్రమై 

స్త్రీ జాతికి ఆదర్శవంతమై 

నూతన దంపతులకు 

దర్శన మొసంగుచు 

వెలుగొందుతున్న మాదిగ 

మహా పతివ్రత చరిత్రలివి. 

కొమ్ము లూదుతూ 

జయ జయ ధ్వనులతో 

కీర్తిస్తున్న కొమ్ములవారు 

నా ఆస్తాన పూజారి 

వశిష్టుడి వేునమామ 

నాజాతిగురువు మాదిగ దాసరి 

జంధ్యాలతో 

ఇంద్రలోకము నుండి 

దిగివచ్చిన దేవేంద్రుడిలా 

లక్ష్మణుడికి ప్రాణంప్రసాదించిన 

సంజీవినిలా 

పెళి పేరంటాలకు 

మంత్రోచ్ఛరణలతో 

ఉద్భవించిన ఓంకారానికి 

కారణ భూతుడిలా 

కాలాన్ని తాళపత్రగ్రందŠంజేసి 

చేతబట్టి 

చావు - 

రేవుల 

క్రతువులోనర్చి 

అగ్నిహాోత్రుడు మాదిగదాసరి. 

నేను సూర్యరదŠమెక్కి 

కోట్లపగ్గాలు చేతబట్టి 

తూర్పుతీరం నుండి 

విజయ దుంధుభి మోగిస్తున్న 

విజయ సారధినేను. 

వందకోట్లు పాదాలు కందకుండా 

కాలు కింద మోపకుండా 

నాచర్మంతో చెప్పులు కుట్టినవాడను 

మకుటములేని మహారాజులా 

వెలగుతున్నవాడను. 

నూరు కోట్ల భారతీయులను 

పాలితులుగా జేసుకొని 

రారాజు, మహారాజు కాగలవాడను. 

బాటా, కరోనా, లోటస్‌, లిబర్టీ 

నాతోలు ముక్కలు, 

నాతోటకలుపు, మొక్కలు 

చెప్పు నాజాతి జండా 

డప్పు నా ఎజండా 

చర్మం నా తంత్రి 

జన సముద్రంలో 

బాప్తీస్మం పొందిన వాడిని 

మృత్యువుని జయించినవాడిని 

కల్పవృక్షం నావంట చెఱకు, 

కామధేనువు నాకూరాకు 

అమృతం నా మధుపానం 

మృత్యుంజయుడనై లేచిన వాడిని 

నేను మాదిగోణ్ణి 

నాకిక మరణంలేదు 

నీలివేుఘాల పతాకం చేతబట్టి 

లక్షల డప్పుల సింహా నాదంతో 

ఐరావతాన్ని అధిరోహిాంచి 

నేను రాజ్యంవైపు నడుస్తా.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!