Monday, October 31, 2016

గయోపాఖ్యానం "!

గయోపాఖ్యానం "!

రచన ...చిలకమర్తిలక్ష్మీ నరసిహం పంతులుగారు( నాటక రచనా ధురీణత)!

..

ఆకాలం నాటక రచనకు దారులు తీర్చింది. సామాజిక నాటకాలతోబాటు,,

పద్యనాటకాలూ పుంఖానుపుంఖంగా వెలువడుతూఉండేవి.

వాటిలో రెండుమూడు నాటకాలుమాత్రం ప్రదర్శనకు నోచుకున్నాయి.

వాటిలో అటుతిరుపతి వేంకటృకవుల" పాండవోద్యోగ విజయం! 

"ఇటు చిలక మర్తివారి " గయోపాఖ్యానం " బహుళ ప్రచారానికి నోచుకున్నాయి.

గయోపాఖ్యానమైతే కొన్నివేల ప్రదర్శనాలతో ఆంధ్రదేశమంతా మారుమ్రోగిపోయింది. అందులోంచి ఒక చక్కనిపద్యం మీకోసం!

.

సందర్భంతెలుసుకోండి: అది ద్వాపరయుగం .కృష్ణుడు మధురనుపాలిస్తునాడు. (ఇదంతా కురుపాండవ యుధ్ధానంతరం కథ) అరుణారుణ రాగరేఖలు తూర్పున వుదయించుచుండ, కృష్ణుడు యమునలో స్నానమొనరించి సూర్యునకు అర్ఘ్య ప్రదానం చేయటానికి ఉపక్రమించాడు,దోసిటనీరుబట్టి చేయిపైకెత్తాడు. అంతే ఆదోసిటనోమో తపుక్కున పడినది .యేమా యనిచూడ నది నిష్ఠీవనమని తేలినది.పట్టరానికోపమువచ్చి కృష్ణుడిటినటుజూడ, ఆకాసమున విమాన విహరణ మొనరించు గయుడు గనంబడెను. కోపమున కృష్ణుడు ఆనిష్ఠీవన దుర్వినీతుడగు గంధర్వుని దారుణముగా శపించు సందర్భములోని పద్యమిది.

.

చం: జలనిధు లింకుగాక! కులశైలములేడును గుంకుగాక! యా 

జ్వలనుడు వేడిమివ్విడచి చల్లదనంబును దాల్చుగాక! యా 

జలజ హితుండు పశ్చిమ దిశన్ ఉదయించెడుగాక! యింక నా 

ఖలు గయు నుత్తమాంగమును ఖండన జేసెదఁ జక్రధారలన్;!

.

జరగని పనులెన్ని జరిగినా సరే రేపు తెల్లవారువరకు గయుడు మరణించుట జరిగి తీరుగాక! అంటున్నాడు కృష్ణుడు. ఆయన యుగకర్త భగవానుడు ఆయనకసాధ్యమేదీ? 

అన్నియు సుసాధ్యములేగదా! మరిగయుడనగా నెంత!!జలనిధులు- సముద్రములు; యివి యెండుటా ?జరుగవపని;సప్త కులపర్వతములు కలవు 

అవిభూభారమును నోయుచుండును, అవిక్రుంగుటయు నసంభవమే! జ్వలనుడు- అగ్నిఅదిచల్లబడునా? జరుగనిపని, జరిగిన లోకముమాయమే!

యిక తూర్పున ఉదయంచే సూర్యుడు పశ్చిమంలో ఉదయించే అవకాశంపూజ్యమే!

.

ఒకవేళ , యివన్నీ జరిగినా సరే గయుని సంహారము ఆగేది కాదు.ఇదినా దృఢ నిశ్యమని కృష్ణుని శపథము! అతనచేతనున్న చక్రాయుధమట్టిది. పనిదానికి చెప్పి ప్రయోగించిన చాలును. 

శతృవెట దాగినా వెంటాడి సంహరించును. కావున గయుని వధా

నిర్వహణము కృష్ణునకు భారము కాదని దీనిభావము.

యింత హడావిడి జరిగినా తుదకు అర్జునిని ఆశ్రయించుటవలన 

గయుని వధఆగిపోయినదికదా!

అదే యీపద్యమునందలి వ్యంగ్యము. సముద్రాదు లెట్లెండవో అట్లే గయునకుగూడృమరణము రాదని కవియాంతర సూచన!

https://youtu.be/CVGNhYixsl4

మనసున మల్లెల మాలలూగెనే భావకవికి ...బాపు చిత్రం....

మనసున మల్లెల మాలలూగెనే

భావకవికి ...బాపు చిత్రం....

.


మనసున మల్లెల మాలలూగెనే

కన్నుల వెన్నెల డోలలూగెనే

ఎంత హాయి ఈ రేయి నిండెనో

ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో


కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది.


1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం పూయించిన పారిజాత కుసుమాలు పై వాక్యాలు. అంతవరకూ సాదా సీదాగా సాగుతున్న తెలుగు పాటలోకి మల్లెల జలపాతంలా చొచ్చుకు పోయింది కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వం. తెలుగు సినిమా పాటకి కొత్త వొరవడిని చూపించి, కావ్య వర్ణనా రీతిని చొప్పించిన ఘనత కృష్ణ శాస్త్రి గారి కవిత్వానిది. భావ కవిత్వ సాగరాన్ని చిన్న పాటలో చుట్టేసిన కమనీయ విశిష్ట భావనా శిల్పం ఆయన కవిత. ఎంత రాసినా కాసింత మిగిలిపోతుంది.


పైన ఉదహరించిన పాట పల్లవి మల్లీశ్వరి సినిమాలోదే! పల్లవి ఎత్తుగడే అలా ఉంటే, ఇహ చరణాలు సంగతి సరే సరి. మధురమైన ప్రేమ భావన వల్ల కలిగిన అనుభూతికి విరహాన్ని జోడించీ, ప్రణయ సౌందర్యాన్ని ప్రకృతి కౌగిలిలో చుట్టేసిన విరహ భావాలు అవి.


కొమ్మల గువ్వలు గుస గుస మనినా

రెమ్మల గాలులు ఉసురుసుననినా

అలలు కొలనులో గల గల మనినా

దవ్వున వేణువు సవ్వడి వినినా


నీవు వచ్చేవని నీ పిలుపే విని

కన్నుల నీరిడి కలయ చూచితిని

ఘడియ యేని ఇక విడిచిపోకుమా

ఎగసిన హౄదయము పగులనీకుమా


ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో

ఎంత హాయి ఈ రేయి నిండెనో


అందనంత అర్థాన్ని అలవోకగా పలికించే సరళమైన పదాలవి. వ్యాఖ్యలూ, వివరణలూ అవసరం లేని పొందికైన భావ కవిత్వం అది. అందులో బాధ ఉంది. ఆ బాధలో తెలీని సుఖం ఉంది.


మల్లీశ్వరి సినిమాలో మాటలూ, పాటలతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కృష్ణ శాస్త్రి స్పృశించని తెలుగు హృదయం ఒక్కటీ లేదు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో మల్లీశ్వరి సినిమాలో పాటలు ఓ మలయ మారుతంలా తెలుగు ప్రేక్షకుల్ని సమ్మొహితుల్ని చేసాయి.


కేవలం పాటలోనే కాదు, విడిగా చదువుకున్నా వెన్నెల రాత్రులూ, మల్లెల విరహాలూ మనముందు సాక్షాత్కరింపచేసే మత్తైన మకరందాలవి. ఎన్నిసార్లు చదివినా, కొత్త కొత్త అనుభూతులు కలిగిస్తాయి.


సాధారణంగా పాటల్లో సాహిత్యానికి ఒక స్థాయి కనిపించేలా చేసేది సంగీతం. మంచి సంగీతంతో ఏ సాహిత్యానికైనా విలువ మరింత పెరుగుతుంది. సాహిత్యం సంగీతం కంటే ఓ మెట్టు కిందనే ఉంటుంది. కానీ కృష్ణ శాస్త్రి పాట సంగీతాన్ని మించి మరో మెట్టు పైన ఉంటుంది.


ఆయన పాటల్లో ప్రత్యేకతని మల్లీశ్వరి సంగీత దర్శకులు, సాలూరి రాజేశ్వరరావు చాలా సార్లు ధృవీకరించారు. ప్రతీ పాటకీ సన్నివేశాన్ని బట్టి ఒక్కో రాగం నిర్ణయించుకుంటాడు సంగీత దర్శకుడు. సాధారణంగా సినిమాల్లో ముందుగా వరసలు కట్టిన తరువాతే పాట రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వరసకి ( ట్యూన్ ) కి సరిపడేలా పదాలు రావాల్సుంటుంది. అదీకాక పాడడానికి అనువుగా రాయాలి. కొన్ని మాటలు పాటల్లో ఇమడవు. అందువల్ల ముందు సంగీత వరుస కట్టిన తరువాతే రాయడం పరిపాటి. కానీ మల్లీశ్వరి సినిమాకి పాటలు అన్నీ ముందు రాసిన తరువాతే ట్యూన్లు కట్టారు. “ఈ పాటల్లో సాహిత్యం చదువుతుంటేనే అలవోకగా ట్యూన్లు వచ్చాయి. ఏ మాత్రం శ్రమ లేకుండా అతి సులువుగా పాటలు కట్టాను. లలిత గీతాలు రాసిన అనుభవం వల్ల కృష్ణ శాస్త్రి గారి కవిత్వం ఒక పాటలా సాగింది. ” అని రాజేశ్వరరావు అన్నారు.


మనం నిత్యం చూసే పువ్వుల్నీ ఆకుల్నీ, సెలయేళ్ళనీ, గాలుల్నీ సరళ మైన పదాలతో, సున్నితమైన భావాలతో పాట రాయడం అందరికీ రాదు. అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అంత సులభం కాదు. ఎవరికీ రానిదీ, చేతకానిదీ అతి సునాయాసంగా చెప్పే గుణం ఆయన పాటకుంది. చిత్ర గీతాల్లో భావుకతని ప్రవేశ పెట్టిన తీరుని ఎంతో మంది అనుకరించారు కానీ, ఆయన స్థాయిలో ఎవరూ రాయలేక పోయారన్నది జగమెరిగిన సత్యం.

https://www.youtube.com/watch?v=CF1v6M6m86U

కాశీ ప్రయాగ!

కాశీ ప్రయాగ!

.

సీ.కాలాడినప్పుడే కావాల్సిన పనులు 

చేసినంత సమకూరు సుభ మిలను. 

కాలాడి నప్పుడే కాశీ ప్రయాగల 

యాత్రలు చేయనూహించవలయు 

చేతనున్నప్పుడే చేయు దానములన్ని 

చేతులాడినప్పుడే చేయు పనులు 

కన్నులున్నప్పుడే కరువార తిలకించు 

కమలనాధుచరణ కమలములను. 

ఆ. చెవులు వినగలిగిన చక్కని భజనలు

చెవులకు వినిపించు జలవు మీర

పలుకు గలిగినపుడే పరమేశు నామము

పరిపరివిధములను పలుకుచుండు.

(ఇది మా అక్క Suryalakshmi Taranikanti గారి పద్యం.)

Saturday, October 29, 2016

Chengu Chenguna Gantulu Veyandi - Nammina Bantu

చెంగుచెంగున గంతులు వేయండి... జాతివన్నె బుజ్జాయిల్లారా నోరులేని తువ్వాయిల్లారా..

తెలుగు తల్లికి ముద్దుబిడ్డలు.. సంపద పెంచే జాతిరత్నములు... మా ఇలవేల్పులు మీరు లేనిదే మానవజాతికి బతుకే లేదు... అన్న వాక్యాలు అద్భుతం.
పంచభక్ష్య పరమాన్నం తెమ్మని బంతిని గూర్చుని అలగరుగా 
పట్టుపరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా 
గుప్పెడు గడ్డితో గుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ 
జాలిలేని నరపశువుల కన్న మీరే మేలనిపిస్తారూ

వేదాంతం!


వేదాంతం!

.
అక్కినేని "దేవదాసు" విడుదలయిన రోజుల్లో అప్పటికి అంతగా విఖ్యాతి గాంచని శ్రీ ఆరుద్ర, శ్రీ శ్రీశ్రీ విజయవాడలో రిక్షాలో వెడుతూ
ఆ పాటల లోని వేదాంతాన్ని గురించి చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నారు.
"కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! బహుదొడ్డ ప్రయోగం" ఆరుద్ర
" దాంట్లో పెద్ద వేదాంతం దాగుందోయ్" అన్నారు శ్రీశ్రీ ఓ దమ్ములాగుతూ
" జగమే మాయ అంటూ చాలా అర్ధం లాగారు"
"అల పైడిబొమ్మ! చాలా బాగుంది" ఇంకో దమ్ముతో శ్రీశ్రీ
"కొన్ని ప్రయోగాలు అర్ధం లేకుండా వాడారు"
" తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి బాబు!" అన్నాడు రిక్షావాడు చర్చకు పుల్ స్టాప్ పెట్టాడు.
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! అని రాయలేదుట .. కూడి (కలసి)ఎడమైతే(విడిపోతే ) పొరపాటు లేదు అని రాసేరు .. కాని ఘంటసాల వారు అలా పాడేరు... వేదాతం వారు తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి సర్దుకు పోయేరుట

Friday, October 28, 2016

నాగేంద్రుడు !

నాగేంద్రుడు !

శివకేశవుల అనుగ్రహాన్ని పొందిన నాగేంద్రుడు ... మానవాళిచే

దైవంగా భావించబడుతున్నాడు. కొన్ని శైవ క్షేత్రాల్లోను ... మరి కొన్ని వైష్ణవ క్షేత్రాల్లోను ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

కొన్ని ప్రాంతాల్లో నాగేంద్రుడు ఉపాలయంగా కాకుండా

ప్రధాన దైవంగా కూడా కనిపిస్తుంటాడు.

బాపు గారి శకుంతల..

బాపు గారి శకుంతల..

.

చెలియను మఱచిన వేళల

కలిగెడు దుఃఖము కలంచు గాదే, చెలుడా

వలపుల పలుకుల నిత్తఱి

సులభత మఱచుటయె వింత; చోద్యము సుమ్మా!

ఇలా పుల్లల పొయ్యిమీద చిలకడదుంపలు పెట్టి కాల్చుకుతింటే ఆ కిక్కే వేరు.

ఇలా పుల్లల పొయ్యిమీద చిలకడదుంపలు పెట్టి కాల్చుకుతింటే ఆ కిక్కే వేరు.

పడుచుతనం రైలు బండి.

పడుచుతనం రైలు బండి.

Thursday, October 27, 2016

నేనే సూర్య కాంతం ని! (Sahana Meenakshi అమ్మకి కృతజ్ఞలతో.) .

నేనే సూర్య కాంతం ని!

(Sahana Meenakshi అమ్మకి కృతజ్ఞలతో.)

.

నా పేరు నేను చెప్పను..చెప్పనవసరం కూడా లేదు.. 

నేను అంధ్రుల అభిమాన అత్త గారిని..

ఏ అత్త గారు అయినా కటువుగా మాటాడితే నా పేరే తలచుకుంటారు కోడళ్ళు అందరూ.. నా పేరు అచ్చమైన తెలుగు పేరు అయినా ఇంక భవిష్యత్తులో.. వేరే ఎవరు పెట్టుకోకుండా చేసిన ట్రేడ్ మార్క్ నాది.. 

ఇప్పటికీ నను మీరు టీవిలో చూస్తే ఎంతటి వారు అయినా దడ దడలాడాల్సిందే.. .. ఎవరైనా. గయ్యాళి గంప ని చూస్తే " అమ్మో ఆవిడే ..... " అని నాతో పోల్చు కోవాల్సిందే.

ఎవరినా మందర మాటలు చెబితే అమ్మో అది నేనే అని పోల్చుకోవాల్సిందే...

నేను చేసిన 300 చిత్రాల్లో చాలా వరకు ఒకే తరహా పాత్రనే చేసినా.. ఎవరికీ బోర్ కొట్టించకుండా నిత్య నూతనంగా ఉండేట్టు చేయడమే

నా నటనలో ప్రత్యేకత.... నన్ను అందరూ ఆడి పోసుకుంటున్నారు కాని.. నా మనసు నవనీతం.. ఎవరికైనా ఇంత పెట్టకుండా తినడం.. నా జీవితంలో లేదు.. సినిమా చిత్రీకరణ సమయంలో..నిజ జీవితంలో ఎందరెందరో.. నా చేతి వంట.. నా చేతి చిట్కా వైద్యం.. రుచి చూసిన వారే..నేను చేసిన గుప్త దానాలు ఎన్నో ఉన్నా నేను ఎవరికీ చెప్పుకోలేదు..

నాకు తెల్సి మనసున్న మహిళగా స్పందించాను అంతే.. 

ఒక సారి నేను నెల్లూరు కి కార్ లో ప్రయాణిస్తుండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.. నేను ప్రయాణిస్తున్న కార్ దారి మధ్యలో చెడిపోగా .. మా డ్రైవర్ అబ్బి.. రిపేర్ చేయడానికి చూస్తున్నాడు..

ఇంతలో ఒకావిడ.. తలమీద కడవ పెట్టుకుని నీళ్ళు మోసుకు వెళుతూ కార్ లో ఉన్న నన్ను చూడగానే నేను ఒక చిరు నవ్వు నవ్వాను.. 

అంతే తను నన్ను .. గుర్తు పట్టేసింది..

" ఓసీ రాక్షసీ నువ్వా ఇంకా ఎందరెందరి కొంపల్లో నిప్పులుపోస్తావే .. నీ జిమ్మిడిపోను.. అంటూ.. నా మీదకి తిట్ల దండకం మొదలు పెట్టింది.. 

ఇంతలో మా కార్ డ్రైవర్ అబ్బి తేరుకుని.. కార్ తొందరగా నడపడం వలన బ్రతుకు జీవుడా అని బయట పడ్డాను.. .. అరె ఇంతకీ నేనెవరో గుర్తు పట్టడం లేదా? గయ్యాళి తనం ని పండించడంలో ఘనాపాటిని.. 

నేనే సూర్య కాంతం ని.. మరచి పోయారా ఇవాళ నేను పుట్టిన రోజు.. ఇ

వాళ నేను నటించిన ఒక చిత్రం చూసి హాయిగా నవ్వుకోండి..

జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.)

జరీ అంచు తెల్లచీర !

(రావిశాస్త్రి గారి కధ.)

.

జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి

పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి

గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా

ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను,

ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.

.

ఇది మెరుపు లేని మబ్బు

ఇది తెరిపి లేను ముసురు 

ఇది ఎంతకీ తగ్గని ఎండ

ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి ఇది గ్రీష్మం 

ఇది శిశిరం ఇది దగ్ధం చేసే దావానలం

.

ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం ఒక్కటి ఒక్కటే సుమండీ

ఒక్క జ రీ అం చు తె ల్ల చీ ర విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ, 

పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన

ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి.

అలాగే మరి కొన్ని వ్యాక్యాలు..

ఆశ కొరిక పెద వాడి ను౦చి దనిక... రాజు.. ఆడ.. మెగ .. అ౦దరు

ఆ చితిలొ పడి కాలిపొయారు ఎ౦దరిజీవితాలను తగుల పెట్టారు పెడుతున్నారు..

.ఏ నాటిను౦చొ ఇ నాటివరకు...అ,,,,, నాకు చాలు అనుకొ౦టే అదే సుఖ౦ ...

పెద్దలు అన్నగారు తమరికి తెలియదా.....అయినా సావిత్రి బాగు౦ది....

ఇప్పటికి 50 స౦ ను౦చి పక్కనె వు౦ది.... బాలెరా ఎ౦తొ బాగున్నారు.... 

అ౦తె ,, కనులు,, మనసు ,,ఇవి వెతుకుతూనెవు౦టాయి...

ఇప్పుడు మీరు తమ్ముడు నటిగా ఆమె అ౦తె అ౦టారు.... 

అ౦తెనా అ౦టే ...కాదు ,,,ఇది సత్వ౦... లేదానన్ను తీసివెస్తారు... .

తీయరులె మీ ప్రక్కన నాకు పెద్దదిక్కు వున్నారుగా

ప్రద్యుమ్నుడి పెళ్లి ప్రయత్నాలు..అను ఒక పెళ్ళికాని ప్రసాద్ కధ.!

ప్రద్యుమ్నుడి పెళ్లి ప్రయత్నాలు..అను ఒక పెళ్ళికాని ప్రసాద్ కధ.!

(“కాబోయే పెళ్ళికొడుకు లెవరు కాబోయే మామగారితో హాస్య సంభాషణ చేయరాదు. చేసినచో పెళ్లి చేసుకొనే అవకాశం కోల్పోయెదరు.”) 

.

1967 లో ప్రద్యుమ్నుడి అగ్రజుడి వివాహం అయింది. వారి అన్నయ్య పెళ్ళిలోనే ఇద్దరు ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. (అబ్బే అమ్మాయిలు కాదు, వారి తండ్రులు). ప్రద్యుమ్నుడు మహానందపడ్డాడు. ఫరవాలేదు, తనకీ గిరాకీ ఉందని సంబరపడ్డాడు. వాళ్ళలో ఒకాయన మరీ తొందర పడి, పెళ్లి అయిన మూడో రోజునే ప్రద్యుమ్నుడి ఇంటికి మాట్లాడటానికి వచ్చేసి, ప్రద్యుమ్నుడి నాన్నగారితో మాట్లాడారు. ప్రద్యుమ్నుడి తోటి కూడా మాట్లాడారు. జోర్హాట్ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? లాంటివి అడిగారు. ఉత్సాహంగా ప్రద్యుమ్నుడు, రైలు రూటు బాగా విపులంగా చెప్పాడు.

"భీమవరం నుండి నిడదవోలు వెళ్ళవలెను. అక్కడ నుండి కలకత్తా వెళ్ళు మద్రాస్ మెయిల్ ఎక్కవలెను. సుమారు ఇరవై ఏడు గంటల తరువాత హౌరా చేరెదము. అక్కడ నాల్గైదు గంటలు విశ్రాంతి గదులలో విశ్రాంతి తీసుకొనవలెను. ఆ తరువాత సమస్తిపూర్ ఎక్స్ ప్రెస్ లో బరౌనీ చేరవలెను. బరౌనిలో ఒక నాలుగైదు గంటలు ప్లాట్ఫారం పొడుగు, వెడల్పు కొలవవలెను. ఆ తరువాత తీన్సుకియా మెయిల్ ఎక్కవలెను. ఆ తరువాత న్యూబంగైగాం లో దిగి బ్రాడ్ గేజ్ నుంచి మీటర్ గేజ్ రైలుకు మారవలెను. సుమారు 16 గంటల తరువాత మరియాని స్టేషన్ లో దిగవలెను. అక్కడనుండి బస్ లో సుమారు ఇరవై కిమీలు ప్రయాణించి జోర్హాట్ చేరవలెను. జోర్హాట్ బస్ స్టాండ్ నుండి రిక్షా ఎక్కవలెను. సుమారు ఏడు కిమీలు తరువాత మా లాబొరేటరీ కాలనీ గేటు, అక్కడ నుంచి ఇంకో అరకిమి ప్రయాణించి (రిక్షాలోనే) మా గృహమునకు చేరవలెను" అని.

ఇంత విపులంగా చెప్పిన తరువాత ఆయన అన్నారు “అంటే సుమారు మూడు నాలుగు రోజులు పడుతుందన్నమాట”. ప్రద్యుమ్నుడు మందస్మిత వదనారవిందుడై, “అవునండి రైళ్ళు లేట్ అవడం సహజమే కదా అప్పుడప్పుడు ఇంకో అర రోజు పట్టవచ్చునండి” అని చెప్పాడు. ఆయన గంభీర వదనుడై ప్రద్యుమ్నుడి కేసి తీక్షణంగా చూసి ఊరుకున్నాడు. “కలకత్తా నుంచి విమానంలో వెళ్ళవచ్చు. డకోటా విమానాలు నడుస్తాయి. కలకత్తా నుంచి గౌహతి, అక్కడనుండి జోర్హాట్ వెళ్ళతాయి. గౌహతి హాల్ట్ తో కలిపి సుమారు రెండు గంటలు మాత్రమే పడుతుంది అని కూడా చెప్పాడు ప్రద్యుమ్నుడు. ఎందుకైనా మంచిదని, విమానం టికట్టు ధర నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే, అంటే నా జీతంలో సుమారు ఐదవ వంతు మాత్రమే అని గొప్పగా కూడా చెప్పాడు. ఆయన ఇంకో చిరునవ్వు వెలిగించారు తన మొహంలో.

నాల్గైదు రోజుల తరువాత పెళ్ళిలో ముచ్చట పడ్డ రెండో ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా అదే ప్రశ్న వేశాడు. అంత విపులంగానూ ప్రద్యుమ్నుడు ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మామగారి పీఠము ఎక్కుతారు, ఇంకో నాల్గైదు నెలల్లో “ప్రద్యుమ్నుడు పెళ్లికొడుకాయెనే” అనే పాట ఇంట్లో వినిపిస్తుందని సంబర పడ్డాడు ప్రద్యుమ్నుడు.

శలవు లేనందున ప్రద్యుమ్నుడు మర్నాడే జోర్హాట్ బయల్దేరి వచ్చేశాడు. బయల్దేరే ముందు నాన్నగారు చెప్పారు ప్రద్యుమ్నుడికి “మేము వెళ్ళి చూసి వస్తాము. నచ్చితే ఫోటో పంపుతాము. వీలు చూసుకొని వస్తే ఏదో ఒకటి నిశ్చయం చేసుకోవచ్చు” అని. ప్రద్యుమ్నుడు అమితానంద హృదయారవిందుడయ్యాడని వేరే చెప్పఖ్ఖర్లేదు కదా.

జోర్హాట్ తిరిగి వచ్చిన ప్రద్యుమ్నుడి మనసు కాబోయే ఇద్దరి మామగార్ల ఇంటిలోని కాబోయే భార్యామణుల చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. నెలయింది, రెండు నెలలయ్యాయి. ఫోటో కాదు గదా ఆవిషయమై ఉత్తరం కూడా రాలేదు తండ్రి గారి వద్ద నుంచి. ఎప్పుడూ ఉత్తరాలు వ్రాయడానికి బద్ధకించే ప్రద్యుమ్నుడు, తరువాతి రెండు నెలల్లో నాలుగు ఉత్తరాలు వ్రాశాడు తండ్రికి. “ఇక్కడ నేను క్షేమం. అక్కడ మీరు డిటో అని తలుస్తాను. అన్ని విశేషములతో వెంటనే వివరంగా జవాబు వ్రాయవలెను” అంటూ. వివరంగా కాదు కదా క్లుప్తంగా కూడా ఏ విశేషము తెలియపరచ బడలేదు.

ఆత్రుత పట్టలేక ప్రద్యుమ్నుడు పెద్దక్క గారికి ఉత్తరం వ్రాసాడు, ...

వెంటనే జవాబు రాలేదు కానీ ఒక నెల తరువాత ఉత్తరం వచ్చింది అక్కగారి వద్ద నుంచి. ఆవిడ ఉ.కు. లు (ఉభయ కుశలోపరి) అన్నీ వదిలి డైరెక్టుగా రంగంలోకి వచ్చారు. “అడ్డగాడిదా, ఏబ్రాసి మొహం గాడా, బుద్ధి ఉందా నీకు అప్రాచ్యపు వెధవా. ..వాళ్లకి ఏం చెప్పావురా నువ్వు? భీమవరం నుంచి జోర్హాట్ వెళ్ళడానికి ఐదు రోజులు పడుతుందా? రైలు, కారు, బస్సు, రిక్షా, చివరికి ఒంటెద్దు బండి కూడా ఎక్కాలని చెప్పావా? ఎవడిస్తాడురా పిల్లని నీకు? కంచర గాడిదా. పెళ్ళిలో చూసిన ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. మధ్యవర్తి ద్వారా కనుక్కొన్నాడు నాన్న. అంత దూరం పిల్లని పంపటానికి వాళ్ళకి ఇష్టం లేదుట. ఎప్పుడైనా పిల్లని చూడాలనిపించినా లేక ఏ కష్టమైనా పిల్లకి వస్తే, వెళ్ళి రావడానికైనా పది రోజులు ప్రయాణాలు మా వల్ల కాదు అని చెప్పారుట మధ్యవర్తికి. అంతే కాదు ఈ వార్త శరవేగంగా విస్తరిస్తోంది. గోదావరి జిల్లాలలో మంచి కుటుంబం, ఆచార సాంప్రదాయాలు ఉన్న వాళ్లెవరు నీకు పిల్ల నిచ్చేందుకు సిద్ధంగా లేరు అని మధ్యవర్తి నొక్కి వక్కాణించాడుట. ఇప్పుడు నాన్న మధ్యవర్తిని పక్క జిల్లాలకి పంపుతున్నాడుట. నీకు పెళ్లి సంబంధాలు వెతకటానికి, ఆలస్యం అయితే వాళ్లకి కూడా ఈ వార్త చేరిపోతుందనే భయంతో. చుంచు మొహం వెధవా, ఆ నోటి దూల తగ్గించుకోరా అంటే విన్నావా? అనుభవించు.” అని ఆశీర్వదిస్తూ వ్రాశారు.

పాపం ప్రద్యుమ్నుడు హతాశుడయ్యాడు. డైరీలో వ్రాసుకున్నాడు. “కాబోయే పెళ్ళికొడుకు లెవరు కాబోయే మామగారితో హాస్య సంభాషణ చేయరాదు. చేసినచో పెళ్లి చేసుకొనే అవకాశం కోల్పోయెదరు.” ప్రద్యుమ్నుడు ధీరోదాత్తుడు కాబట్టి ధైర్యంగా సహనం వహించి “ఏడ తానున్నాదో నా శశిరేఖ, జాడ తెలిసిన చెప్పి పోవా” అని రాగం తీయకుండానే పాడుకోవడం మొదలు పెట్టాడు.

"మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం ! (శ్రీ అల్లంరాజు రంగశాయిగారు.)

"మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం !

(శ్రీ అల్లంరాజు రంగశాయిగారు.)

.

"మామా మోమౌ మామా

మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా

మే మోమ్మము మి మై మే

మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!

ఈ పద్యానికి అర్థం చూద్దామా.

మా = చంద్రుని

మా = శోభ

మోమౌ = ముఖము గల

మామా = మా యొక్క

మా = మేథ

మిమ్ము, ఒమ్ము = అనుకూలించును

మామ మామా = మామకు మామా

ఆము = గర్వమును

ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము

మిమై = మీ శరీరము

మేము ఏమే = మేము మేమే

మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము

ఇమ్ము+ఔము = అనుకూలమగుమా

.

చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును.

గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. 

సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు.

కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.

నిగమ శర్మ అక్క !

నిగమ శర్మ అక్క !

(ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.)

తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు అక్షర రూపాన్ని సంతరించుకున్నాయి. 

అలాటి పాత్రలలో నిగన శప్మ అక్కగారి పాత్ర చిరస్మరణీయం! 

.

తెనాలి రామకృష్ణుడా పాత్రను తీర్చిదిద్దిన విధానమట్టిది. 

ప్రబంధయుగంలో వెలసిన గ్రంధాలలో అపురూపమైనది పాండురంగ మాహాత్మ్యం.. 

నిగమ శర్మోపాఖ్యానము అందొక కథ.

.

పరమ నిష్ఠారిష్టుడును, మహాపండితుడును, శ్రోత్రియ బ్రాహ్మ ణోత్తముని కొమరునిగాృనిగమశర్మ యుదయిచయించెను.వేదాది సర్వ విద్యలను నేర్చెను.ఉపవీతుడైన యనంతరము వివాహితుడయ్యెను. 

విధివశమున వానికి దుర్జన సాంగత్యమలవడెను. దానివలనృసర్వభ్రష్ఠుడయ్యెను. జూదమాడుట,వ్యభిచరించుట, పానము, యిత్యాది సర్వదుర్గుణముల కేలిక యయ్యెను.

.

ఈవ్యసనములకు వలసిన ధనమునకై యింటనే చౌర్యమారంభించెను. 

మాన్యములను తెగనమ్మసాగెను."భ్రష్టస్య కావాగతిః" యనురీతిగా సంచరించుచుండెను. తల్లి యిదియంతయు నెరింగియు పుత్ర వ్్యామోహమున భర్త కెరిగింపకుండెను. వారి భ్రష్టాచారములు మితిమీరిన దశలో పాపమాగృహస్థునకు పుత్ునివిషయము,యితరులవన నెరింగెను.

.

ఆబ్రాహ్మణగృహస్తునకు అంతకుమున్నె యొక కుమార్తెగలదు. 

ఆమెయే నిగమశర్మయక్క! ఆమెకంతకుముందేృ పెండ్లియయినది.

పిల్లలుకూడా. అదిగో ఆమెమాటపై నిగమ శర్మకు అమితగౌరవమట! 

.

అందువలన అతనిని సరిదిద్దుటకు ఆమెను బిలిపించినారు.

పుట్టినింటి మమకారము పెనవైచుకొన్న నాయతివ యరుదెంచి,

తమ్ముని రాకకై యెదురు చూడసాగినది. రేయంతయు జూదమాడి, తెల్లవారువేళకు దొడ్డిగుమ్మము నుండి నిగమశర్మ గృహప్రవేశమొనరించినాడు. యెందుకు వచ్చెను? చద్దియన్నమును భుజించిపోవుటకు. వానియదృష్టము రావడమేతడవు అక్క కన్నులలో బడినాడు. ఆమెప్రేమగా నతనిని చేరబిలిచి కడుపునిండుగా కుడువబెట్టి,పసిబాలుడగు తనయెడ బిడ్డను యెత్తుకొన నిచ్చి, పసికూనను యొడిలోనిడుకొని చనుగుడుపుచు, తమ్మునకిట్లు ధర్మోపదేశముచేయ నుపక్రమించినది.

.

ఇక్కడ కవి యామెనోటివెంట బలికించిన మూడుపద్యములూ ఆణిముత్యములే! వినుడు-

శా: ప్రారంభించిన వేదపాఠములకున్ ప్రత్యూహ మౌనంచునో, 

యేరా!తమ్ముడ! నన్ను జూడఁజనుదేవెన్నాళ్ళనో నుండి?, చ 

క్షూరాజీవ యుగంబు వాచె నిన్ కన్గోకున్కి, నీబావయున్ 

నీరాకల్ మది గోరు "చంద్రు పొడపున్ నీరాకరంబున్బలెన్".

.

యేరా! తమ్ముడూ!యేమిటి? వేదపాఠములకు అంతరాయమౌతుందనాయేమి,,,యింతకాలమైనా మాయింటికే రావడంలేదు?( నీపనికిమాలిన పనులేవోనాకుతెలియదనుకున్నావా? అనివ్యంగ్యం)కన్నులురెండూ నీకోసంయెదురు చూసి వచిపోయాయిరా! నేనేకాదు మీబావగారుకూడా 

.

'చంద్రునికోసం యెదురుచూచే సరోవరంలా,యెదురు చూస్తున్నారనుకో! 

యిక్కడ కవి మనయింట మామూలుగా యెలామాట్లాడుకుంటామో అలాగే రచించటం గొప్పవిషయం! యెంతైనా కవగదా చివర ఒక మెరపు నెరిపించాడు. నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపున్ నీరాకరంబున్వలెన్_- అంటూ 'నీరాక-నీరాక; 

.

ఛేకానుప్రాసము. యింక రెండవ పద్యం చూద్దాం! ఇందులో చేస్తున్న పనులకు నిగమశ్మకు మందలింపు,

శా: వీరావేశముఁదాల్చి సర్వ ధనమున్ వెచ్చింతు గాకేమి,! ము 

క్కారుంబండు నఖండ సేతువృతముల్ కాశ్మీరఖండంపు కే 

దారంబుల్ఁ దెగనమ్మగాఁజనునె? నిర్దారుండవే? వెన్క నె 

వ్వారున్ లేరె సహోదరాదులు? కులధ్వంసంబు నీకర్హమే?

.

ఈపద్యంలో తమ్మునిపైకోపం,అయ్యోవీడు పాడౌతున్నాడే అనేబాధ, సంస్కరించకపోతే యెలాగ అనేతపన, యిలాపుట్టింటి ఆడబిడ్డకు కలిగే ఆవేశ కావేశాలు అన్నీ కవిరంగరించి ముద్దగాచేశాడు. యీఆడబడుచేగాదు,పుట్టింటి బాగుగోరే యే ఆడబడుచైనా అలాగే ఆలోచిస్తుందనుకుంటావు. 

.

యేరా! వీరావేశంతో ఒళ్ళెరుగక, డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చుచేస్తునావంట? ముక్కారు పంటలు పండే మాన్యాలను తెగనమ్ముతున్నావట? నీ వెనక పెళ్ళాంఉందిరా! ఆమెకేదిదారి. నీవెనుక నున్న మాగతేమిటి?తమ్ములున్నారుకదా వారిమాటేమిటి? యీవిధంగా కుల ధ్వంసం చేయటం నీకుతగునా? అని నిగ్గదీసింది. చివరకు నాకొంపలో యిలాపుట్టావేమిరా! అంటోంది.

.

శా: ెశ్రీ లాలిత్యము, నిత్య శుధ్ధియు, గుణోత్సకంబునున్ గల్గి, యు 

ద్వేల స్ఫూర్తి దలిర్చు, తండ్రి యను నబ్ధిన్ చంద్రుడైఁ దోచినన్ 

బోలుంగాక ,భవాదృశుండితరుఁడై కన్పట్టినన్ జెల్లువే? 

" సాల గ్రామ ఖనిన్ జనించునె గదా జాత్యల్ప పాషాణముల్";

.

మాయింట చెడఁబుట్టావురా! యెంత పవిత్రమైన వంశమిది.నీవలన పాడైపోయింది. నీతండ్రి సర్వసంపదలకు నెసవైనవాడు,మహానిష్ఠాగరిష్ఠుడు, సద్గుణ శీలుడు. ెఅట్టివానికడుపున నికృష్టుడవైననీవుజన్మించుట,పరమ పవిత్రమైన సాలగ్రామ శిలలు లభించుగనిలో పనికిరాని రాయివలె పుట్టినావుగదరా! యనుచున్నది. ఈపద్యమున కవి నిగమశర్న తంట్రికి సముద్రునితో పోలికను జెప్పినాడు.

సముద్రుడు లక్ష్మిని కుమార్తెగా లాలించినవాడు,(శ్రీలాలిత్యము)జలములకు నత్యశుధ్ధిగలదుగదా(అదేనిత్యశుధ్ధత) రత్నాకరుడు సముద్రుడు అదిగుణోత్సకత.;

నిగమ శర్మతండ్రి- డబ్బున్నవాడగుట,నిష్ఠాగకిష్ఠుడగుట, సద్గుణవంతుడగుట; వీరిద్దరిలో ఉద్వేల స్ఫూర్తియుగలదు, సముద్రంపరంగా యెత్తైన కెరటాలు, ని:తండ్రిపరంగా మంచిపేరు ప్రతిష్ఠలుకలిగి ఉండుట.

.

ఈవిధంగా తండ్రి సముద్రుడైతే, మరి కొడుకేంగావాలి? ఆసముద్రున కుదయించిన చంద్రుడు కావాలిగదా! వీడు అలాకాలేదు.పనికిమాలినవాడయ్యాడు. అదే ఆమెబాధ!

చూశారా మానవ మనస్తత్వాలను మధనంచేసితీసిన కావ్య సుధారసం! ఇదిగో ఇదండీ "పాండురంగ విభుని పద గుభనం! సెలవు స్వస్తి!

పునర్వివాహం ..కుక్కతోక !

పునర్వివాహం ..కుక్కతోక !

(By - Virabhadra Sastri Kalanadhabhatta.)

.

సుమారు డబ్భై అయిదేళ్ళక్రితం పిచ్చమ్మకు ఆమె మూడో ఏటనే పెళ్ళి అయింది. పదమూడో ఏడు వచ్చేసరికి ఆమె ఐదోతనం కాస్తా బుగ్గయింది.

ఇహనేం ఆచారం ప్రకారం సకల లాంఛనాలతో ఆమెని విధవను చేసారు.

క్షమించాలి మరీ పచ్చిగా చెప్తున్నందుకు

లాంఛనాలంటే గుండుతో సహా..

ఆపైన ఆమె జీవితం వంటింటికే పరిమితం అయింది.

ఎవరకీ కనపడకూదదు. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా ఉదయం లేవగానే వారి కళ్ళా బడకూడదు.

అల్లాగే ప్రయాణం చేసేవారికి ఎదురురాకూడదు మరి అపశకునంకదా

ఒకపూటే భోజనం.

రాత్రి విధిగా వుప్పుపిండే ఆహారం.

ఏకాదశులు వుపవాసం

వంటింటి పని ఆమెదే

మడి మడి

తద్దినాలలో వంట ఆమేచెయ్యాలి

భర్తపోయిన ఏయువతినైనా వితంతువు చేసినప్పుడు కర్మ పదోరోజున ఈమెనే పిలిచేవారు ఆకార్యక్రమ నిర్వహణకు

ఆవితంతువును మంచి ముహూర్తం వచ్చేవరకూ ఎవరూ చూడరు గనుక, అంతవరకూ ఆమెను ఈమే కనిపెట్టుకొని వుండాలి

** ** **

మా తర్వాత తరం వచ్చేసరికి

యువతులులో చదువుకోవడం, సాంఘీక దురాచారాలను

ఖండిచడం వంటి అభ్యుదయ భావాలు పెరిగాయి.

.

పునర్వివాహాలకు అభ్యంతరాలు తగ్గాయి.

తర్వాత తర్వాత అసలు పునర్వివాహాలు ఒక సమస్యగానే పరిగణింపబడలేదు అదేదో మామూలు ఆచారంగా సమాజంలో కలిసిపోయింది

శాఖాంతర, కులాంతర చివరకి ఖండాంతర వివాహాలుకు కూడా ఎంతో ప్రోత్సాహం లభించింది.

కాలగమనంలో ఆచారవ్యవహారాల్లో ఎన్నో మార్పులు సంభవింవించాయి.

.

యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి పిల్లలున్న వితంతువులనుగాని,

విడాకులు పొందిన స్త్రీలను గాని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు

అయినా కొంతమంది యువకులలో సంకుచితత్వం పోలేదు. Male ego అప్పుడప్పుడు తొంగిచూస్తూవుంది

**

కొన్నాళ్ళు భర్తతో కాపురం చేసి వితంతువైన విమలను అభ్యుదయభావావేశంతో మోహన్ పెళ్ళి చేసుకున్నాడు

మొదటి రాత్రి ఆమె గదిలోకి వచ్చి సిగ్గుతో గుమ్మందగ్గర నిలబడింది

మోహన్ ఆమెకేసి చూసి “అప్పుడు కూడా ఇల్లాగే సిగ్గుపడ్డావా?" అని అడిగాడు వ్యంగ్యంగా

..

విమల చివుక్కున తలపైకెత్తి అతనికేసి అసహ్యంగా చూసింది

Wednesday, October 26, 2016

అద్వైతమూర్తి ! (కరుణశ్రీ )

అద్వైతమూర్తి !

(కరుణశ్రీ )

చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా

లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం

కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో

దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ

(బాపు గారి సుందరాంగి.)

Saturday, October 22, 2016

అచ్చ తెలుగు తిట్లు!

అచ్చ తెలుగు తిట్లు!

(జాజి శర్మ గారి ఆశీర్వచనాలతో.)

తెలుగు తిట్లకు ప్రత్యేకతలున్నాయి. 

తెలుగువారి అచ్చతెలుగు తిట్లు కొన్ని ఆగ్రహం కాక నవ్వు తెప్పుస్తుంటాయి.

కొన్ని ముద్దుగా, మురిపెంగా వుంటాయి.

శుంఠ, అప్రాచ్యుడు, మొద్దురాచ్చిప్ప, బఢవ, వెధవాయి, చవటాయి, సన్నాసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్ధాయి, అవతారం, నంగనాచి, సన్నాసి, నాలిముచ్చు, కుర్రకుంక, వెర్రిమాలోకం, చవట సన్నాసి లాంటి అచ్చ తెనుగు తిట్లు 

ప్రతి తెలుగింటా ప్రతిధ్వనిస్తుంటాయి.

.

నిజానికి అవి తిట్లు కాదు. దీవెనలే.

"నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకొంటే ఈ సన్నాసి ఎటు వెళ్ళడో?"

అని బామ్మగారు దిగులులుపడుతుంది. 

మడికటుకొన్నాను. నన్ను అంటుకోకురా భడవా." అని అమ్మమ్మ ముద్దుగా కోప్పడుతుంది. 

"మా బడుద్ధాయి ఎంత బాగా పాడతాడో" అని తాతగారు మురిసిపోతారు.

అలా!

Friday, October 21, 2016

జాజి శర్మ గారి వర్షం కురిసిన రాత్రి.!

జాజి శర్మ గారి వర్షం కురిసిన రాత్రి.!

విక్కీరావు ఆఫీసు పనిమీద ఓ పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది. రాత్రికి అక్కడే బస ఏర్పాటు

చేసుకున్నాడు.

ఆఫీసు పని చేసుకుంటూ సిగరోబీస్ అయిపోయినాయి అని గమనించి విసుక్కుని వాటికోసం

బయలుదేరాడు. బస నుండి కిలోమీటర్ నడిస్తేనే కానీ సిగరోబీస్ దొరకలేదు. అవి తీసుకుని

వస్తుంటే వర్షం మొదలయ్యింది. కాస్తంత దూరంలో గొడుగుతో ఓ వ్యక్తి వెడుతుంటే విజిల్ వేశాడు.

ఆ వ్యక్తి విజిల్ వినబడి ఆగి వెనక్కి చూశాడు. విక్కీరావుని రమ్మని సైగ చేశాడు. విక్కీరావు గొడుగులోకి

వచ్చి "థాంక్స్" అని " సారీ! విజిల్ వేశినందుకు" అన్నాడు.

" పర్వాలేదు! అలా విజిల్ వేశే నన్ను అంజలి నన్ను ఆకట్టుకున్నది " అన్నాడా వ్యక్తి

" అలాగా ! అంజలి అదృష్టవంతురాలు . మీలాంటి పరోపకారులను చేసుకున్నది"

" ఆ! ఏం అదృష్టం లెండి. అంజలిని నేను చంపేశాగా ?" అన్నాడా వ్యక్తి

" చంపేశారా " అన్నాడు విక్కీరావు కంగారుగా

" భయపడకండీ ! నేను మిమ్మల్ని చంపనులెండి. అంజలిని చంపినందుకు నన్ను ఉరి తీశారుగా "

అని గొడుగుతో మాయమయ్యడు ఆ వ్యక్తి.

( సిగరోబీస్ అంటే ఫిల్టర్ సిగరెట్లు అని మా కొలవెన్ను శ్రీన్వాస్ అని చెప్పాడు.)

అమ్మక చల్ల....జానపద గేయము!

అమ్మక చల్ల....జానపద గేయము!
.
ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల!
.
తాటిమేకలచల్ల తాగడే గొల్ల
.
నిన్న మొన్నటిచల్ల నేటిక్కి పుల్ల
.
కవ్వాన్ని తిప్పింది కమ్మన్నిచల్ల.x

ప్రతిబింబం లేక అద్దం చేసిన మాయ !

శుభోదయం.!

.

ప్రతిబింబం లేక అద్దం చేసిన మాయ !

అద్దం కొత్తగా వచ్చిన రోజులు. పోలంనుంచి వస్తున్న సుబ్బయ్యకు దారిలో ఓ అద్దంముక్క దొరికింది. అందులో ఉన్నది ఎవరో ఆయన గుర్తుపట్టలేదు. చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు. ఆ అద్దం ముక్కను ఇంట్లో ఓచోట దాచిపెట్టి రోజు ఆయనకు అవి ఇవి కబుర్లు చెబుతుండేవాడు. 

సుబ్బయ్య ధోరణితో భార్యకు అనుమానం వచ్చింది. ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తిసిచూస్తే ఏముంది? అందులో 30 ఏళ్ళ అందమైన స్త్రీ కనిపించింది. అంతే! భర్తకు ఎవరితోనో సంబంధముందని ఆవిడ లబోదిబోమంది పక్కింటి పార్వతమ్మను పిలిచి- ఆయనేలాంటి పనిచేశారో చూడు అని కన్నీరు పెట్టుకుంది.

ఏది చూద్దామని పార్వతమ్మ అద్దం చేతిలోకి తీసుకొని- ఏయ్ పిచ్చిమొహమా.... ఇంత ముసలావిడతో మీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే.... ఎవరైనా వింటే నవ్విపోతారు అంది.

(పొన్నాడ మూర్తి గారి చిత్రం.@Pvr Murty )

చిన్నారి ధర్మ సందేహం!

చిన్నారి ధర్మ సందేహం!

.

ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది

*చిన్నారి: అమ్మా! నాన్నా! మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?* 

* అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు.

*చిన్నారి: మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?*

*నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా?

*చిన్నారి: మీ ఎటియం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?*

*నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు.

చిన్నారి : అలా అయితే నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు?

నెను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ?

ఈ సారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి, పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు.

*నేటి జీవన విధానం ఇది.*

మారుతున్న కాలంలో 

డబ్బు మోజులో పడి తిండిని మానేస్తున్నాము,

డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము.

డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము.

డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము.

డబ్బు మోజులో పడి చివరికి మానవ సంబందాల్ని కూడ పక్కన పెడుతున్నాము.

ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఎముందో

బ్రతకడం కోసం డబ్బు కావాలి కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.

#WhatsApp


Thursday, October 20, 2016

"కరటక్", "దమనక్" లు.

శుభోదయం.!


"కరటక్", "దమనక్" లు.....ఇద్దరికీ చచ్చు తెలివితేటలూ ఎక్కువ !!

వీళ్లు, విజయ వాడ లో, రైలు ఎక్కారు!!...అమరావతి వెళ్ళడానికి!!

అన్ని కమ్పార్ట్మెంటు లూ జనం తో కిక్కిరిసి వున్నాయి!

వీళ్ళకి సీటు దొరక లేదు!!!

అంతలో "కరటక్" గాడు తన బేగ్ లోంచి ఒక రబ్బర్ పాము తీసి , "పాము...పాము!!" అని అరుస్తూ కమ్పాట్మెంట్ లో పడేసాడు!!

ప్రయాణికులు అన్దరూ భయపడి, ఆ బోగీ ని ఖాళీ చేసి దిగిపోయారు!!

"కరటక్", "దమనక్" లు , ఇద్దరూ వాళ్ల అమాయకత్వానికీ, తమ తెలివి తెటలకీ మురిసి పొతూ, హాయిగా కాళ్లు జాపి బెర్త్ ల మీద పడుకున్నారు !!

మరునాడు చాలా బద్ధకం గా లేచారు!!

రైలు ఒక స్టేషన్ లో ఆగి వుంది !!!

"కరటక్", "దమనక్" లు, డోరు తీసి, ఒక టీ అమ్మేవాడిని పిలిచి, టీ తాగుతూ అడిగారు, "ఇది ఎ టేశను బాబూ??" అని

"విజీ వాడ అండి" అన్నాడు వాడు!!

"అదేమిటీ?! ట్రైన్ అమరావతి వైపు కాదా వెళ్లాలి ...ఇక్కడ ఎందు కుంది??!!ఇది అమరావతి ట్రైను కాదా??"అని ఖంగారు పడుతూ అడిగారు "కరటక్", "దమనక్" లు!!

"అది నిన్ననే వెళ్లి పోయింది ....ఈ బోగీ లో పాము వుందని, 

రైల్ నుండి దీనిని వేరు చేసి ఇక్కడ వుంచేసారు ....చెకింగు కోసం !!" 

అన్నాడు "చాయ్ వాలా"

.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

శివోహం !!
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ |..
.
ఓ శంభో.!నా ఆత్మయే నీవు;
నాలో బుద్ధిగా పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి);
నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు);
నా ఈ శరీరమే మీ గృహము; ఈ శరీరముద్వారా నేను అనుభవించెడి
విషయ భోగములన్నియూ నేను మీకు ఆచరించుచున్నట్టి పూజయే;
నా నిద్రే సమాధి స్థితి; నా పాదములద్వారా నేను చేస్తున్న సంచారమంతా
మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే; నే పలుకుచున్న మాటలన్నీ మీ స్తోత్రములే;
నేను చేయుచున్నట్టి కర్మలన్నీ, ఓ శంభో, మీయొక్క ఆరాధనయే!
(మనం చేయు ప్రతి పని లోను సదా శివుని పూజ ఉన్నది అని అర్ధం.)

Wednesday, October 19, 2016

నేనెల ఉ౦టున్నానో

@ మా అమ్మ @
నేనెల ఉ౦టున్నానో
ఇప్పుడు అద్ద౦ చెప్తు౦ది
ఒకప్పుడు ఎలా ఉ౦డే వాడినో
మా అమ్మ క౦డ్లు చెపుతున్నాయి

x

@ మా అమ్మ @

@ మా అమ్మ @

ఆకలిప్పుడు

నా కడుపుకు తెలుస్తు౦ది

ఒకప్పుడు అది

మా అమ్మ గు౦డెకు తెలిసేది

ఏల ప్రేమింతును? ---- దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

ఏల ప్రేమింతును? ---- దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

.. 

మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల?

పరుల తనయించుటకొ? తన బాగు కొరకొ

గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?

శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'!

శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'!

(మనకు .. మరచి పోలేని సుగంధలు ఇచ్చి మాయమయిన మహానటి సావిత్రి )

,

అనుకున్నాను

అధర సౌందర్యం చూచి 

ఆడంబరం ఆహార్యం చూచి 

నీ బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటే అని

హరివిల్లు రంగుల్ని 

వలువలుగా చుట్టుకున్న నువ్వు 

మరు నిముషంలో 

మటుమాయం ఔతావని

అయితే అన్నన్నా !!.. 

నీ భాగ్య మేమని వర్ణించను 

ఎన్ని లావణ్యాల్ని స్పృశిస్తావో 

ఎన్ని మాలిన్యాలు నిర్ములిస్తావో

ఎన్ని కాంతి కేరింతలని మోసుకోస్తావో 

ఎంతహాయి వెల్లువని తరలించు కోస్తావో

అరిగి పోయి కరిగిపోయి తరిగిపోయి 

నివురై ఆవిరై కనుమరుగై పోతావు

ఒక్క క్షణమైతే నేమి 

వెన్నెల ముద్దగా వెలిగి 

ఒక్క నిముసమైతే నేమి 

వన్నెల వాకిళ్ళు కలయ తిరిగి 

వేయి వసంతాల సోయగాన్ని

సొంతం చేసికొన్న సౌగంధికావనమా !

నీ జీవన రాగానికి జేజేలు 

నీ అసమాన త్యాగానికి జోహారు

వ్యర్ధులుగా గిరాటేస్తున్న ఈ వృధ్ధులెవరు? .

వ్యర్ధులుగా గిరాటేస్తున్న ఈ వృధ్ధులెవరు?

.

ఒకనాడు నీ పుట్టక కోసమే తపించి, తపస్సులు చేసిన దశరధులు.

కంట్లో కను పాపలా..కడుపులో కాచుకున్న కౌసల్యలు..కదూ?

మరి నేడు వీరిగమ్యం....వృద్ధాశ్రమము!

(R Damayanthi R Damayanthi ..గారికి కృతజ్ఞలతో.)

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు!

వడ్డాది పాపయ్య గారి వినాయకుడు!

వడ్డాది పాపయ్య గారి వర్ణ చిత్రాల కోసం చందమామ కవర్ పేజిలు చూస్తోండగా

ఈ బొమ్మ కనిపించింది. విఘ్నేశ్వరుడు ధారావాహిక కోసం వేసిన ఈ బొమ్మ చాలా చిత్రం గా అనిపించింది..!

పైబొమ్మ - లోభ గుప్తుడనే వ్యాపారి తన స్నేహితుడైన సత్యగుప్తుడిని మోసం చెయ్యబోతే విఘ్నేశ్వరుడు ఎలా అతనికి శాస్తి చేసాడో తెలిపే కథకి చిత్ర రూపం. క్రింద బొమ్మ - కలహ కంఠి అనే ఒక గయ్యాళి అత్త విఘ్నేశ్వరుని భక్తురాలైన తనకోడలిని రాచిరంపాన పెట్టినా చివరకు ఆమెకే విధంగా శాస్తి జరిగిందో చెప్పే కథ కు ఇది బొమ్మ గా వేసారు మన వపా !! 

అయితే కవర్ పేజీ పైన వేసే వపాగారి రెగ్యులర్ శైలికి భిన్నం గా ఇది కార్టూన్ వేసినట్టుగా అనిపించింది..కథ యొక్క సాంఘిక / జానపద నేపథ్యం

వల్లనేమో మరి..??!! 

సాధారణంగా కవర్ పేజి మీద ఒకటే బొమ్మ వుంటుంది కానీ ఇది రెండుబొమ్మల తో, చుట్టూ గోల్డ్ కలర్ ఫ్రేం తో చిత్రంగా అనిపించింది. 

పైగా ఇవి రెండూ కూడా ఒకే సంచిక లోవి కాదు..1

982 జూన్ , జులై లలో పడిన రెండు కథల బొమ్మలు

ఇవి..మరి అలా ఎందుకు వేసారో!! **** పోన్లెండి..దానిగురించి వదిలేసి.

.వపా గారి ఇంకో బొమ్మ: వినాయకుడు ఎన్ని భంగిమల్లో ఉన్నాడో గమనించండి.. చివరగా సత్రాజిత్తు శ్యమంతక మణి నీ, సత్యభామనూ శ్రీ కృష్ణునికి సమర్పిస్తున్న దృశ్యం... 

ప్రసన్నవదనం తో వినాయకుడు ఆశీర్వదించడం..సత్యభామా పాణి గ్రహణం.. విజయ ఫల పరిష్వంగం తో ఉప్పొంగిన కృష్ణుని వక్షస్థలం...జాంబవంతుని ఆశ్చర్యం..జాంబవతి అమాయకత్వం.. నిశితంగా చూసేకొద్దీ క్రొంగొత్త విషయాలు కనిపిస్తూనే వుంటాయి...ఆ మణి యొక్క ధగ ధగలు, సత్యభామ దండ వంకీ, మిగిలిన అలంకరణ..ఆహా !! అద్భుతం ..!! 

అనిపించక మానదు కదూ...

(సేకరణ ..Radheshyam Rudravajhala)

అక్షర పద్యవిన్య ాసాలు.... శ్రీ ఆచార్య తిరుమల.

అక్షర పద్యవిన్య ాసాలు.... శ్రీ ఆచార్య తిరుమల. 

.

హల్లుతో వాక్యాలు, పద్యాలు ఎలా రాసారో చూద్దాం.

‘క’ గుణింతంతో.. “

కాకీక కాకికి కోక కాక కేకికా?”- 

కాకి ఈక – కాకికి – కోక కాక – కేకికా (నెమలికా)?” అని దీనర్ధం. 

.

అలాగే న గుణింతంతో ఓ పద్యం:

నానా నన నా నున్న న

నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై

నానీ నను నానా నను

నానూన యనంగ నొంటి యక్షరమయ్యెన్!!

శబ్దం ద్వారా అర్థం!

శబ్దం ద్వారా అర్థం!

ప్రసిద్ధమైన అల్లసాని పెద్దన పద్యం:

.

అట జని కాంచె భూమిసురుడంబర-చుంబి శిరస్సరజ్ఝరీ-

పటల ముహుర్ముహుర్-లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన-

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్, 

కటక కరేణు దీర్ఘ కరకంపిత సాలము శీత శైలమున్

.


బయటకు గట్టిగా చదిబినచో శబ్దం ద్వారా అర్థం గోచరించును....

అదే ఈ పద్యం ఒక్క ప్రచేకత...

వెయ్యి పడగలు ...ఒక సమీక్ష ! .

వెయ్యి పడగలు ...ఒక సమీక్ష !

.

(శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు,!)

.

'ఈ విద్య దేనికి పనికివచ్చును? ఒక్క తుపాకిముందు నిది యెందుకును పనికిరాదు. ఒకవేళ పనికివచ్చినను చేసెడిదేమి? దేశమున కింకనే విద్యయు అక్కరలేదు.'

'ప్రతి విద్యకును నాల్గు దశలు! అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణము లని.

అవి నాల్గు కలిసినచోటే విద్యకు సంపూర్ణమైన స్థితికలదు. 

నేనొకటి చదువుకుని అది ఇతరులకు చెప్పి దాని నాచరించి యితరుల చేత దాని నాచరింపచేయుట అనునవి నాల్గుదశలు. తనకర్థము కాని దాని నాచరించుటయు, అర్థమైనదాని నాచరించకుండుటయు మన శాస్త్రాలలోనే లేదు.'

'విద్య యనగానేమి? అక్షరములు నేర్పుటయు, 

వంకర దస్తూరి వ్రాయించుటయునా?

ప్రతివానికిని సంగీతజ్ఞానము, లయజ్ఞానము కూడ సునిశితమై యుండుట విద్యావిధానములో ప్రధానమైన విషయము. మన పూర్వులు చదువనగా హృదయపరిపాకము కలిగించునది యని యనుకొనిరిగాని కేవలం చదువుట, వ్రాయుట మాత్రమే చదువనుకొనలేదు.

పూర్వము విద్యయే యుండినది,లేనిదిప్పుడు..

.'

వెన్ను మీద ఛళ్ళున చరిచినట్టున్న ఈ వాక్యాలు విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు 'నవలలోవి.

ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాళిక పాత్ర పోషించిన రచనలు- 

కన్యాశుల్కం, గణపతి, కోనంగి, వేయిపడగలు వంటివి 

తెలుగు జాతి ప్రాచీన ఆధునిక విద్యలపట్ల గొప్ప సంఘర్షణకు లోనైన కాలంలో

వచ్చిన రచనలు.

భారతదేశం ఆధునీకరణ చెందుతున్న యుగసంధిలో తలెత్తిన ఆ ప్రశ్నలకీ, ఒక శతాబ్ద కాలం తర్వాత మనమంతా ఎదుర్కొంటున్న ప్రశ్నలకీ మధ్య ఎంతో సారూప్యం ఉంది.

ఈ విద్య ఒక్క తుపాకి ముందు పనిచెయ్యదని విశ్వనాథ ఏ విద్య గురించి మాట్లాడేడో, ఆ విద్య ఇప్పటికీ అలానే ఉంది. విద్య అంటే బలవంతుడి భాష బలవంతంగా నేర్చుకోవడమని ( Education is learning the language of the dominant) ఇప్పటి విద్యావేత్తలు వాపోతున్నారు. విశ్వనాథ ఆవేదన సహేతుకమేననని మనకి ఒప్పుకోక తప్పట్లేదు.

గురజాడ, గాంధీ,విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.

అలాగని విశ్వనాథ భావాలన్నీ ఆరోగ్యకరమైనవీ,ఆమోదయోగ్యమైనవీ అని కాదు. ఆయన వేయిపడగలు నవలలో తాత్త్వికంగా ఎంత అస్పష్టతకు గురయ్యాడో . కాని ఇప్పుడు మనం చూడవలసింది, చర్చించవలసింది ఆ భావాల కన్నా కూడా ఆ భావాల వెనక ఉన్న స్వతంత్రతా ప్రవృత్తి గురించీ, తాను మానసికంగా colonize కావడానికి ఇష్టపడని ఒక జీవుడి ఇష్టం గురించీను.

Tuesday, October 18, 2016


పండితుడు–పాలమ్మి!!

(విలువ: సత్యము;అంతర్గత విలువ:శ్రధ్ధ)

-

ఒకప్పుడు ఒక గ్రామంలో బాగా చదువుకున్న ఒక పండితుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక పాలమ్మి ఈ పండితుడి ఇంటికి వచ్చి తెల్లవారుఝామునే పాలు పోసివెళ్ళేది. ఒకరోజు ఆమె పాలు పొయ్యటానికి పండితుడి ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చింది. అందువల్ల పండితుడికి చాలా కోపం వచ్చి ఆమెను ఆలస్యమునకు కారణం అడిగాడు. నది దాటటానికి పడవవాడు రావటం ఆలస్యం కావటంవలన తను రావటానికి ఆలస్యం అయిందని ఆమె చెప్పింది. పడవవాడి సహాయం లేకుండానే నదిని దాటవచ్చునని పండితుడు పాలమ్మికి చెప్పాడు. హరి నామమును స్మరిస్తూ నదిని సులువుగా దాటవచ్చునని పడవ అవసరంలేదని పండితుడు ఆమెతో అన్నాడు. హరినామస్మరణతో సంసారమనే సాగరమునే సులువుగా దాటగలిగినప్పుడు చిన నదిని దాటటంలో కష్టం ఏముందని పండితుడు అన్నడు. పండితుడి మాటలను పాలమ్మి చాలా శ్రద్ధగా ఆలకించింది.

మరునాటి ఉదయం పాలమ్మి రోజూ కంటే త్వరగా పండితుడి ఇంటికి పాలు పొయ్యటానికి వెళ్ళింది. అంతత్వరగా ఎలా రాగలిగావని పండితుడు మళ్ళీ అడిగాడు. క్రిందటిరోజు పండితుడు చెప్పిన ప్రకారమే పడవవాడి కోసం ఎదురు చూడకుండా హరినామమును స్మరించుకుంటూ నదిని దాటి వచ్చేశానని పాలమ్మి చెప్పింది. పండితుడు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయాడు. ఆమె ఏదో కట్టుకథ అల్లి చెప్పుతున్నదని అతను భావించాడు. పాలమ్మి పండితుడిని నది దగ్గరికి తీసుకెళ్ళి, హరినమాన్ని స్మరిస్తూ ఆమె నదిలో నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. పండితుడిని కూడా అలాగే నామస్మరణ చేస్తూ నది దాటి రమ్మని చెప్పింది. నదిలోకి దిగుతూనే పండితుడు ఎక్కడ తన బట్టలు తడిసిపోతాయోనని భయపడసాగాడు. అతని ధ్యాస అంతా దేవుడి మీద కంటే తన బట్టల పైనే ఉన్నది. తన మాటల మీద తనకే నమ్మకం లేకపోయింది ఆ పండితుడికి. అతనికి విశ్వాసం లోపించింది.

నీతి: కేవలం శాస్త్రములు చదివినంత మాత్రమున సరిపోదు. విశ్వాసము, భక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. తమ మాటలపై తమకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకి చెప్పాలి. ఇతరులకి బోధించిన విషయములందు ముందుగా చేప్పేవారికి తమ మాటలయందు నమ్మకం, విశ్వాసం ఉండాలి.

ధూళిపాళ సీతారామ శాస్త్రి !

ధూళిపాళ సీతారామ శాస్త్రి !

.

ధూళిపాళ, ఈ పేరు వినగానే మనకి సాధారణంగా ఒక కామన్ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది ఆ పాత్రతో సహా..

“అని గట్టిగా అనరాదు,వేరొకరు వినరాదు,

అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్థుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం,

ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది, ఎదిరి బలాన్నీ, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది.

వేయేల కురుసార్వభౌముడు మాననీయుడూ,మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో,ఆపైన కొంచపు వంచన పనులన్నిటికీ అయిన వాడ్ని అమ్మ తమ్ముడ్నీ నేనున్నానుగా…

ముల్లుని ముల్లుతోటే తియ్యాలి,వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి,

కనుక హిత పురోహిత ధృత్య వాక్య సామంత దండనాయక వారవనితా జనతా నృత్య నాట్య కళావినోదమనోహరంబగు పరివారంబుతో,చతురంగ బలసమేతులై, శతసోదర సమన్వితులై శ్రీ శ్రీ శ్రీ గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థానికి వెళ్ళవలసిందే,రాజసూయాన్నిసందర్సించవల్సిందే”

అంటూ రెండు అరచేతుల మధ్యా పాచికల్ని రాపాడి, పితుహూ అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ, ఎడమ చేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ, ఐమూలగా మొహం పెట్టి ఎడమ కనుబొమ్మ విల్లులా వంచుతూ,కనీ కనిపించని ప్రతీకారేఛ్చతో మిళితమయిన క్రూరమైన నవ్వుతో “శకుని” గుర్తొస్తాడు…

సి.ఎస్.ఆర్, లింగమూర్తి వంటివారు పోషించి మెప్పించిన ఆ పాత్ర ప్రత్యేకతను ధూళిపాళ తనదైన శైలిలో,తనకి మాత్రమే సొంతమయిన హావ భావ నటనా వైదుష్యంతో దానికి జీవం పోశారు.ఒక విధంగా ధూళిపాళ అంటేనే శకుని అనేంతలా,ఆయన తరవాత మరెవ్వరినీ ఆ పాత్రలోఊహించుకోలేని విధంగా..

ఎంత క్లిష్ట మయిన పద సమాసమయినా,పెద్ద సంభాషణ అయినా ఇదెంతలే అన్నంత సులువుగా చెప్పి దానికి సరిపడినంత భావాన్ని ఒలికించడమే ఆయన ప్రత్యేకత.బహుశా పూర్వాశ్రమంలోని నాటకానుభవం(ఆయన తన 14వ ఏటినుండే నాటకాలు వేయడం మొదలుపెట్టారు, చాలామందిలాగే ఈయనా స్త్రీ పాత్రతోటే)అంతా ఈ పునాది దిట్టానికి కారణం కావచ్చు.ఈ ప్రత్యేకత వల్లే రామారావు తన సొంత బేనరులో స్వీయ దర్శకత్వంలో తీసిన మొదటి చిత్రం “శ్రీకృష్ణపాండవీయం”లో ఈయనకి అంతటి ప్రభనిచ్చే పాత్రనిచ్చి గౌరవించారు.అందుకే “అయినవాడ్ని అమ్మ తముడ్ని నేనుండగా నీకు దిగులెందుకని రారాజు”కిచ్చిన మాట నిలపెట్టారు ఆ పాత్రకి జీవం పోసి. ఒక విధంగా ఆలోచిస్తే పౌరాణిక పాత్రల్లో దాదాపుగా అన్ని పాత్రలని(నాయక,ప్రతినాయక)వేసి మెప్పించి తెలుగు వారికి ఆరాధ్యుడయిన ఎన్.టి.ఆర్ వేయసాహసించని పాత్ర ఇదొక్కటేనేమో?

1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకు వెళ్లినప్పుడు ఆ పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి వీరి అభినయానికి ఆకర్షితులై సినిమాల్లో నటించమని సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం చేయడంతో “భీష్మ” (1962) చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం అయ్యారు దుర్యోధన పాత్రతో. ఆ సినిమాలో భీష్ముడిగా ఎన్.టి.ఆర్ నటించారు.

ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు.

వాపీకూప తటాక నిధి నిక్షేపాదులన్నీ సమభోజ్యంగానూ పంచగా మిగిలినవి బడి,గుడి.ఇవి ఎవరికి ఇష్టమయితే వారి ఖాతా లో జమ చేద్దామని అంటూ (ప్రేమనగర్) దివాన్ జీ లా చూసినా,

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా,నీ కోవెలా ఈ ఇల్లు కొలువైవుందువుగానీ,కొలువై వుందువుగానీ రావమ్మా మహాలక్ష్మీ…రావమ్మా…రావమ్మా… కృష్ణార్పణం… అంటూ హరిదాసుడయినా(ఉండమ్మ బొట్టుపెడతా) ఆయనకి ఆయనే సాటి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా తనదైన ముద్ర వేయడమే అయన ప్రత్యేకత.

ఆయన ఎంత పెద్దనటుడయి చిత్రసీమలో స్థిరపడ్డా ఎప్పుడూ నాటక రంగాన్ని వీడలేదు,వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పౌరాణికాన్ని వేస్తూ సేవ చేసారు.అందులో భాగంగానే “శ్రీకృష్ణరాయబారం” నాటకాన్ని వందసార్లకు తక్కువ కాకుండా ప్రదర్శించి తన వంతుగా “దుర్యోధన పాత్రతో” ప్రేక్షకుల్ని మెప్పించారు.

నాటక, సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ నాటక అకాడమీ వారి నాటక కళాప్రపూర్ణ

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ ఆత్మగౌరవ పురస్కారం

తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు వెలుగులు ఉగాది పురస్కారం అందజేశారు.

బాంధవ్యాలు చిత్రంలో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది.

అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ వారు సైతం 2007 ప్రతిభా పురస్కారానికి ధూళిపాళను ఎంపిక చేసింది.

తమిళ పత్రికలు సైతం ఆయనను ‘నడిప్పిళ్‌పులి నడత్తళ్‌పసువు’ అని అభివర్ణించారు. అంటే… నటనలో పులి…నడతలో (నిజజీవితంలో) గోవు ని అర్ధం

ఇంకా సాంస్కృతిక సంఘాల సత్కారాలు ఎన్నో లభించాయి.

ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ప్రశ్న,ఎలా బ్రతికామన్నది?ఎంత మంది మనం పోయిన తర్వాత మనని ఎలా గుర్తు పెట్టుకుంటారన్నది,అందుకు మనం ఏమి చేశామన్నదాని మీద అధారపడి ఉంటుంది.అది మంచయినా చెడ్డయినా సరే.

అలాంటి ఆలోచనే ప్రాతిపదికగా నటరాజ సేవలో తరించిన ధూళిపాళ తనువు చాలించే పది సంవత్సరాల ముందు సినీ జీవితానికి స్వస్తి చెప్పి తనకున్న సంపదను త్యజించి ఆధ్యాత్మిక జీవితానికి తెర తీశారు. మానవ జన్మ విశిష్టత, మోక్షసాధన అవసరాన్ని తెలుసుకుని తరిచాలని భావించి మానవసేవే మాధవసేవ లక్ష్యంగా ఆయన సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని, 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు. గుంటూర్ మారుతీ నగర్ లో మారుతి గుడి నిర్మించి, రామాయణం, సుందరాకాండలను తెలుగు లోకి తిరిగి వ్రాశారు . ధూళిపాళ ట్రస్టును ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు, ధూళిపాళ కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నారు/. హించారు.మూడున్నర దశాబ్దాల పాటు కళామతల్లికి సేవలందించి, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేందుకు తన శేషజీవా/వితాన్ని అంకితం చేసిన ధన్యజీవి ధూళిపాళ. ధూళిపాళ కొద్దికాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి 2007 ఏప్రిల్ 13 న మరణించారు.

ఆయన నటించిన సినిమాలు మచ్చుకు కొన్ని:

మాయాబజార్ (1957) ,,మహామంత్రి తిమ్మరుసు (1962), నర్తనశాల (1963), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) (గయుడు), బొబ్బిలి యుద్ధం (1964) (నరసరాయలు), మైరావణ (1964), వీరాభిమన్యు (1965) (ధర్మ రాజు), శ్రీకృష్ణ పాండవీయం (1966) (శకుని), పూల రంగడు (1967), అగ్గిమీద గుగ్గిలం (1968), బాంధవ్యాలు (1968), ఆత్మీయులు (1969), బాలరాజు కథ (1970), రెండు కుటుంబాల కథ (1970), కలెక్టర్ జానకి (1972) (జానకి తండ్రి), బాల భారతం (1972) (శకుని), మంచి మనుషులు (1974), గుణవంతుడు (1975), శ్రీ రామాంజనేయ యుద్ధం (1975), సీతా కళ్యాణం (1976) (వశిష్టుడు), దాన వీర శూర కర్ణ (1977) (శకుని), ఉండమ్మా బొట్టు పెడతా…

ధూళిపాళగా పిలవబడే ఈయన పూర్తి పేరు ధూళిపాళ సీతారామ శాస్త్రి. ఈయన గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1921 సెప్టెంబర్ 24 న జన్మించారు. చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి.

–పప్పు శ్రీనివాస రావు గారికి కృతజ్ఞలతో.

అట్లా తద్దోయ్ ...ఆరట్లో ముద్ద పప్పోయి.. ముడుఅట్ట్లోయి

అట్లా తద్దోయ్ ...ఆరట్లో ముద్ద పప్పోయి.. ముడుఅట్ట్లోయి

అని ఆడపిల్లలు... 

అట్లా తద్దోయ్..ఆడపిల్లలోయి..అనిపల్లెరుకాయలు వారికంటే లేచే 

అల్లరి మగపిల్లలు... అక్కలువెంటమేము ఎంతో సరదాగాఉండేది.

విశాలి పేరి గారి చక్కని స్కెచ్ మీకోసం..

.

కరివేపాకు, ఇంగువ పోపు లేకుండా కూరలు రుచించవు కదా! ఇలాగే వేస్తూ ఉంటే ఎదురింటి 'కెలీ ' ఇంటి చుట్టూరా రూమ్ స్ప్రే కొట్టేసేది. మా వంటిల్లు ఆవిడ హాలు పక్క పక్కనే. నేను వండుతుంటే అగర్బత్తిలాంటిది వెలిగించి ఇంటి ముందు పెట్టేది. "సమ్ స్టింకీ స్మెల్ " అనేది ఇంగువ పోపు వేస్తే.. సూర్యేకాంతం లా " అప్రాచ్యపు దానా ఇది ఇంగువే " అనాలనిపించేది. వారాంతరాలలో ఆవిడ వండే బీఫ్, పోర్కు భరించలేక మేము తలుపులు ముసుకునే వాళ్ళమే కానీ ఏమి అనలేకపోయాము.

ఒకసారి అట్లతద్దికి తెల్లవారుఝామునే లేచి నేను ఉట్టివెన్న ముద్ద తింటుంటే ఆ 'కెలీ ' కాలం ప్రతికూలించి అదే టైం కి లేచింది. లేచింది ఊరుకోకా మా కిచెన్ లో లైట్ వెలుగుతోందని బయటకు వచ్చి కిటికీలోంచి చిన్నగా చూసింది. ఆవిడ చూడడం నేనూ చూశా, కానీ ఆ టైం లో పలకరింపులు ఎందుకనీ చూడనట్టే ఉన్నా. అంతే.. 'కీలుగుర్రం ' సినిమాలో అర్ధరాత్రి చిన్నరాణి లేచి ఏనుగులశాలలో తింటోంటే చిన్నప్పుడు మనము భయపడినట్టు భయపడింది. అంతే ఆ రోజు నుంచి అగర్బత్తులు లేవు, రూమ్ స్ప్రేలు కొట్టడాలు లేవు.

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి... ఆ దేశం లో అదేమి చిత్రమో కానీ చందమామ చాలా దగ్గరగా కనపడుతాడు... స్కూల్ కి వచ్చే పిల్లాడిలా త్వరగా వచ్చేస్తాడు. ఈ దేశంలో కాలేజీ కుర్రాడిలా ఎప్పుడూ లేటే! దానికి తోడు స్నానం చేశాక నక్షత్రాలు లెక్కపెట్టే వరకు మాట్లాడకూడదట! నాలాంటి వాళ్ళకి అదెంత పెద్ద కష్టమో! అందుకే నక్షత్రాలు వచ్చాకే స్నానం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యిపోతుంది!

చిన్నప్పుడు 'ఉట్టివెన్న ముద్ద " అంటే అదేదో రంగురంగుల వెన్నల ముద్ద... కొత్త కొత్త రుచులతో ఉంటుందన్న అపోహతో ఆ రుచి ఎలా ఉంటుందో అన్న కుతూహలంతో తెల్లవారుఝామునే లేచి కొన్నేళ్ళ పాటు తిన్నా.. ఎన్నేళ్ళు తిన్నా అదే గోంగూర పచ్చడి, అదే ఉల్లిపాయల పులుసు, అదే కందిపొడి!

గోరింటాకు ఎవరిది ఎంత బాగా పండిందో చూసుకొని ఆనందించేవాళ్ళము. మా మామ్మ, అమ్మమ్మ, చినమామ్మ మాతో పాటుగా ఉట్టివెన్న ముద్ద తినేవారు... అలా చేస్తే కడుపు చలవని!! మా మామ్మ ఉయ్యాలలూగాలని ముందు రోజే మావిడి చెట్టుకి ఉయ్యాల కట్టించేది. మా అమ్మమ్మ మాత్రం ఆటలు గీటలూ లేవు కూర్చొని చదువుకో అనేది. ఇక అట్లు మా చినమామ్మ దొంతర్ల కొద్ది కాల్చేది. పల్చగా, తెల్లగా అచ్చు చందమామలా ఉండేవి. దానిలోకి తిమ్మనం, దోసకాయ చింతకాయ పచ్చడి. తిమ్మనానికి బియ్యం రోట్లో రుబ్బేవారు. కొబ్బరి వేస్తే భలే ఉండేది. కానీ కొబ్బరి వేస్తే మరునాటికి పాడైపోతుందని వేసేవారు కాదు. నోము నోచిన వాళ్ళు మరునాడు కొన్ని పాచి అట్లు తినాలనే వారు. ఉపవాసం, పైగా వర్షాకాలమూ.. చంద్రుడు ఓ పట్టాన వచ్చేవాడు కాదు, వచ్చినా మబ్బులు ఉండేవి. అందరూ తినేసేవారు, ఈ నోము నోచుకునేవారు మాత్రం ఓ పక్కన నీరసానికి పడుకుంటే చంద్రుడు వచ్చాడని ఎవరో చెబితే అప్పుడు చంద్రున్ని చూసి ఆ నైవేద్యం పెట్టిన చిన్న చిన్న అట్లు తినేవారు.

ఆ ఉయ్యాలలూ, ఆ అరుపులు, ఆ అట్ల దొంతరలు, ఆ హడావిడిలు ఇప్పుడు లేవు.. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ తాజాగానే ఉంటాయి!!

Monday, October 17, 2016

ఉత్తమా యిల్లాలు......బాపిరాజు గారి ఎంకి.!

ఉత్తమా యిల్లాలు......బాపిరాజు గారి ఎంకి.!

ఉత్తమా యిల్లాలి నోయీ

నన్నుసురుపెడితే దోస మోయీ

నిదరలో నిను సూసి సెదిరెనేమో మనసు

పొరుగు వోరంత నా సరస కురికారంట ఉత్తమా యిల్లాలి నోయీ ...

ఏలనే నవ్వంట ఏడుపేలే యంట

పదిమంది ఆయింత పగలబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ...

గాలెంట వోయమ్మ దూళెంట వోయమ్మ

యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట ఉత్తమా యిల్లాలి నోయీ ...

యీబూది వొకతెట్టె యీపిం కొకతె తట్టె

నీలు సిలికే దొకతె నిలిపి సూసే దొకతె ఉత్తమా యిల్లాలి నోయీ ...

సాటునుండే యెంకి సబకు రాజేశావ

పదిమంది నోళ్ళల్లొ పడమంట రాశావ ఉత్తమా యిల్లాలి నోయీ ...

ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి.!

ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి.
ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు:
రాసోరింటికైనా
రంగు తెచ్చే పిల్ల.
పదమూ పాడిందంటె
కతలు సెప్పిందంటె
కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి
అంటూ ఎంకిని సృష్టించారు నండూరి వారు

x

ఓహో యాత్రికుడా ఓ హోయాత్రికుడా,,,

ఓహో యాత్రికుడా ఓ హోయాత్రికుడా

ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా

ఉదయారుణ కాంతిబింబ సదనము దేశ పయనిన్తువోహూ

ఉదయపూర్న మృదుల గాన సుధలు చల్లి మధుపధాన

శీతల హేమంతకాల శిధిలజీర్ణ పర్ణశాల

వదలి కదలి వచ్చితి వోహో //ఓఓ హోయాత్రికుడా //

ఆంధకార పూర్ణదిశా బంధనమ్ము సడలించుక

సింధువాహతురంగ మశ్చందనమ్ము గదలించుక

సింధుఫారపూర్వదిషా సుందర తీరమ్ము చేరునో యాత్రికుడా // ఓహో యాత్రికుడా //

శీతల హెమంతకాల శిధిలజీర్న పర్ణశాల

వదలికదలివచ్చితివోహోయాత్రికుడా //ఓహో యాత్రికుడా //

ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా

ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా

చైత్రమాస కుసుమలతా పచ్చతోరణమ్ము లూగ

చిత్ర చిత్ర కలవిహంగ గాత్ర నిస్వనమ్ము రేగ

మిత్రవరా నేడు నీ పవిత్రయాత్ర సాగింతు వొహో

ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా//యాత్రికుడా//

(ఈ పాటరచయిత మరియు గాయకులు శ్రీ సాలూరి

రా జెశ్వర్ రావు గారు ..విడియో రూపంలో సమర్పణ నాది.) 

అల్లసాని వారి అవసరాలు......కావ్యరచనా ప్రరోచనా సామగ్రి !!.

అల్లసాని వారి అవసరాలు......కావ్యరచనా ప్రరోచనా సామగ్రి !!.

.

ఆశువుగా కవిత్వం చెప్పడం ఆషామాషీ కాదు, 

అందుకు

ఏమేం కావాలో సెలవిస్తున్నాడు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ఇవన్నీ ఉంటేగాని కృతి కూర్చడం వల్లకాదని ప్రభువు కృష్ణదేవరాయలకే విన్నవిస్తాడు.

భంగపాటుకు ఆస్కారం లేని ఏకాంతపు స్థలమట, ఆత్మకింపయిన భోజనమట, 

ఆ పై ప్రియరమణి తాంబూలం తెచ్చివ్వాలట, 

మేను వాల్చడానికో ఊయల మంచమట... అంతటితో చాలదు, 

తప్పొప్పులు ఎత్తిచూపగల రసజ్ఞులట, 

తానేమి చెబుతున్నానో ఊహించగల ఉత్తములగు లేఖకులు-పాఠకులు...

ఇవన్నీ సమకూరితే కాని, ఊరకే కావ్యాలు రచించమంటే అయ్యే పని కాదని స్పష్టం చేస్తాడు ఈ కవివరేణ్యుడు. 

ఇదే పెద్దన ఇంకో సందర్భంలో ఆశుకవిత్వమంటే ఏంటో పేరిణి శివతాండవమాడినట్టు ఆడి, తన తడాఖా చూపించాడు.

"కృతి వినిర్మింపు మొకటి మాకు శిరీషృ సుధామయోక్తుల పెద్దనార్య! "- 

అనిరాయలవారు పెద్దన్న గారి నడిగినారట. దానికి సమాధానంగా రాయలకు 

పెద్దన్న చెప్పిన సమాధాన మేమిటో వినండి!

.

చ: నిరుప హతి స్థలంబు; రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

ప్పుర విడె ; మాత్మకింపయిన భోజన ; మూయెల మంచ; మొప్పు,త

ప్పరయు రసజ్ఙు ; లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్;

దొరకినగాక , యూరక కృతుల్ రచియింపు మటన్న, శక్యమే !!

.

భావం:- 

1 నిరుపహతి స్థలంబు

2 రమణీప్రయ దూతిక యిచ్చే కర్పూర తాంబూలం

3చక్కనిభోజనం

4 సేదతీరేందుకుఊయలమంచం 

5 గుణ ,దోషములను చెప్పగల పండితులు

6 కవిమనస్సులోని భావాన్నికనిపెట్టగల వ్రాయస కారులు.,

పాఠకులు దొరకిన తప్ప కృతినిర్మింపు మనిన యసాధ్యము; అనిభావం!

అవును కమ్మని కవిత్వంకావాలంటే, అదిరావాలంటే యివన్నీ చాలాఅవసరమే! ఇందులో ఊయలమంచము వంటి ఒకటో అరో లేకున్నా యిబ్బంది ఉండదేమో!

కవికి ప్రశాంతమైన వాతావరణం చాలాఅవసరం. చుట్టూఉన్నప్రకృతి యతనిలోనియూహలకు దోహదం చేసేదిలా ఉండాలి. సూణాపణందగ్గర కూర్చోబెట్టి కవిని కవిత్వం చెప్పమంటే ఆకంపేగాని, యింపైన కవిత్వం యెలావస్తుంది? కాబట్టి నిరుపహతి స్ధలంబు అవసరమే!

అందమైన ఆడపిల్ల అందించే కర్పూర తాంబూలం మరొకటి. 

ఆపిల్ల అందమైనదైతే చాలదు.ప్రియ కావాలి యెవరికి?కవిగారికి.

ఆయన అల్ల సాని గలవారుగదా! అప్పుడు కవిత్వం ఉరకలుపెడుతూ విజంభిస్తుంది. ప్రబంధయుగం కవులు.వారికావ్యలు శృంగారకేళికలు.కాబట్టి వారు అవసరమే వారికి.

ఆత్మకింపయిన భోజనము. కడుపునిండాతింటే కవికి కళ్యాణమయ కవిత్వం చెప్పే మనఃపరిణతికలుగుతుంది. కడుపు మాడుతూఉంటే, కమ్మనికవిత్వం వస్తుందా?కలికవిత్వమో, ఆకలికవిత్వమో వస్తుంది.కదా!

ఊయలమంచము-

రాయలనాటికవులు భోగపరాయణులు ఆనాటి యీఊయలమంచములకు "తూఁగుటుయ్యెలలు". అనిపేరు.సుఖంగామెక్కి యీమంచమెక్కి కునుకు తీస్తూఉండటం వారికి అలవాటు. ఆయలవాటుకు సూచనమిది. యిదియవసరమోకాదో పాఠకులేనిర్ణయింతురుగాక!

ఒప్ప తప్పరయు రసజ్ఙులు, యిది చాలగొప్పవిషయము. చక్కనిపరిష్కర్తలుఉండాలి.వారు 'రసజ్ఙుసగుట' గమనింపదగినయంశము.రాగద్వేషములకు లోనుగాక ,కేవల దోషైకదృక్కుమాత్రమేగాక, గుణభాక్కు లయిఉండవలెను.అప్పుడాకావ్యం కమనీయంగా రూపొందగలదుగదా!

ఇక చివరిది. ఊహతెలిసి వ్రాసే లేఖకులు. లేఖకుడు సరయైనవాడుకాకుంటే, కవితివంకాస్తా కపిత్వం కిందమారిపోతుంది. వ్యాసునకు గణపతివలెను,తిక్కనకు గురు నాధునివలెను వ్రాయసకారులు ఉండాలి. అప్పుడు కవియభిప్రయాలు అద్దంలోనీడలా ప్రతిబింబిస్తాయి.

అలాగే రసహృదయంతో చదివే పాఠకుడు కూడా అవసరమే!లేకపోతే కవిశ్రమకు తగిన ఫలితం లభించదు.

ఇదిగో యేవంవిధ సౌకర్యాలను సమకూర్చి అప్పుడు కావ్యంగురించి అడగాలి.యేమీ లేకుండా కన్మనికృతుకావాలంటే, ఊరక వస్తాయా? అన్నాడు పెద్దన నిజమేమో

Sunday, October 16, 2016

ఒట్టు! నాకనిపిస్తోంది.

ఒట్టు! నాకనిపిస్తోంది...

ఒట్టు! నాకనిపిస్తోంది ....


నన్నయ్య ఒక్కసారి అమ్మయ్య అనుకున్నట్టు ....


పెద్దన తంబులంలో 'తెలుగు వక్క పలుకులు' వేసుకున్నట్టు....


శ్రీనాథుడు కనకాభిషేకం చేసొచ్చి తెలుగుతల్లి పాదాలు ముట్టుకున్నట్టు ....


శ్రీ శ్రీ ఘాటుగా రెండు దమ్ములు లాగినట్టు ....


చలం గడ్డాన్ని సవరించుకున్నట్టు .....


ఇహ... విశ్వనాథా! మన భాషకి ఒహల్లిచేదేమిటి హోదా! అని గర్జించినట్టు ....


ఒక సనాతన పరిమళం ఆవరించి తెలుగు నేల పులకరించినట్టు....


ఈ సంతోష సంబ్రమంలో నా కళ్ళు చేమరినట్టు....


ప్రాంతీయ భేదాలు మరచి తెలుగోల్లంతా కలసికట్టుగా చెయ్యెత్తి జై కోట్టినట్టు ....


ఒట్టు! నాకనిపిస్తోంది....


- ఇట్లు మీ తనికెళ్ళ భరణి


ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.

నండూరి వారు “ఎంకి”ని సృష్టించి

అరవై ఏండ్లు ఫైననిండాయి.

.

అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు

ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.

నిండు జవ్వని-నిండు యవ్వని

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి

మెళ్ళో పూసల పేరు

తల్లో పువుల సేరు

కళ్ళెత్తితే సాలు:

రసోరింటికైనా

రంగు తెచ్చే పిల్ల.

పదమూ పాడిందంటె

కతలూ సెప్పిందంటె

కలకాలముండాలి.

అంసల్లె, బొమ్మల్లే

అందాల బరిణల్లే

సుక్కల్లె నా యెంకి

అంటూ ”ఎంకి”ని సృష్టించారు నండూరి వారు.

Saturday, October 15, 2016

మనిషి-జంతువు*!

మనిషి-జంతువు*!

"మనిషి". "మాట్లాడే బుద్ధజీవి" అని మనిషిని జంతుశాస్త్రం అభివర్ణిస్తుంది.
మన సంస్కృతి జంతువులకు అసమాన ప్రాధాన్యం ఇచ్చింది.
దేవతల పక్కన ఏదో ఒక జంతువుంటుంది.
శివపూజకు ముందుగా నందికి నమస్కరించాల్సిందే!
ఏనుగు మొర ఆలకించి మహావిష్ణవు ఉన్న పళాన బయలుదేరాడు. ఆ తొందరలో తన వాహనమైన గరుత్మంతుణ్ని సైతం అధిరోహించలేదని పోతన వర్ణించాడు. అయినా ఆయన వెనుకే వచ్చాడు గరుత్మంతుడు.
.
సత్యకాముడి గురువు హరిద్ర మహర్షి. ఆయన నాలుగు వందల గోవుల్ని ఇచ్చి, మేపుకొని రమ్మని సత్యకాముణ్ని పంపాడు. అవి వెయ్యి గోవులుగా అభివృద్ధి చెందాయి. తిరిగి వస్తున్నప్పుడు మందలోని వృషభం సత్యకాముడికి ఉపదేశం చేసింది. రెండో రోజు అగ్ని, మూడో రోజు హంస. నాలుగోరోజు "మద్గు" అనే నీటిపక్షి ఉపదేశించాయి. వాటి వల్ల సత్యకాముడు తేజస్వి అయ్యాడు.
.
ఏది సాధించాలన్నా దీక్ష వుండాలి. మన దీక్షలకు ఆదర్శం పశుపక్ష్యాదులే!
దీక్షవల్ల అజ్ఞానం అనే పొర తొలగిపోతుంది.
కోడి దీక్షతో గుడ్డును పొదుగుతుంది. గుడ్డును పగలగొట్టుకొని పిల్ల బయటకు వస్తుంది. దీన్ని కుక్కుటదీక్ష అంటారు.
గురువు అనుగ్రహించే ఈ దీక్షవల్ల శిష్యుడు అజ్ఞానమనే అండాన్ని చేధించుకొని
జ్ఞానం పొందుతున్నాడు.
ఇంకోటి మత్స్యదీక్ష చేపలు గుడ్లను పొదగవు.చూస్తూ వుంటాయి.
ఆ గుడ్లు పిల్లలు అవుతాయి. గురువు అనుగ్రహంతో చూడటమే నయనదీక్ష.
ఇదే మత్స్య దీక్ష.
తాబేలు ఇసుకలో గుడ్లు పెట్టి నీళ్ళలోకి పోతుంది. దూరంగా పోయినా, దాని ధ్యాస గుడ్లపైనే! ఇదే కమఠ దీక్ష. గురువు స్మరణమాత్రం చేత శిష్యుల్ని జ్ఞానులుగా చేస్తాడు. ఇలాంటి విశ్వాసాలు, గాథలు మన సంప్రదాయం జంతువులకు ఇచ్చిన విలువను చాటుతున్నాయి.
కాళిదాస మహాకవి మనుషులకు జంతువులపై ఉండాల్సిన ప్రేమను
"శాకుంతలం" నాటకంలో మనోజ్ఞంగా సూచించాడు. ముని వాటికల్లో స్వేచ్ఛగా సంచరించే జింకలను, వాటిని ప్రేమతో పెంచే ముని కుటుంబాలను ఆయన వర్ణించాడు. తపోవనాల్లో పులులు, జింకలు ఒకే చెట్టునీడన విశ్రాంతి తీసుకునే దృశ్యం సాధుప్రవృత్తి పవిత్రతను వేనోళ్ళ చాటుతుంది.
మునుల కష్టసుఖాలకు అక్కడ జంతువులు సైతం ప్రతి స్పందిస్తాయి.
శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతోందని తెలిసి, లేళ్లు తాము మేస్తున్న
గడ్డపరకల్ని నోటిలోనుంచి జారవిడుస్తాయి.
"తండ్రీ! ఈ నిండు గర్భిణి లేడి ప్రసవించిన తరువాత నాకు వర్తమానం పంపించు" అని కణ్యమహర్షిని కోరుతుంది శకుంతల.

x

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై పాడే నా హృఉదయం

శుభోదయం!

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పరవశమై పాడే నా హృఉదయం 

.

అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి

యెరుగని వింతలు యదుటే నిలిచి వెలుగే వికసించే

ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం ...(శ్రీ శ్రీ )

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" ! .

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" !

.

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.

ఉలుకు పలుకు లేని రాతి ప్రతిమల రమణీమణుల ప్రబంధ నాయికా ప్రపంచంలో మాట పాట నేర్చిన వలపుల వయ్యారి వరూధిని. అవయవాలే తప్ప ఆత్మలు లేని కావ్య నాయికా లోకంలో ఇష్టాలు, కోరికలు, కోపాలు, తాపాలు, ప్రణయాలు, విహారాల అనుభూతులు విరబూసిన విరి మంజరి సజీవ సుందరి వరూధిని. ఆమె ప్రవహించే ఒక యౌవన ఝరి, దహించే ఒక ప్రణయ జ్వాల, మిరుమిట్లు కొలిపే ఒక సౌందర్య హేల, ఒక విరహ రాగం, ఒక వంచిత గీతం, ఒక విషాద గానం. ఆంధ్ర కవితా పితా మహుడు అల్లసాని అంతరంగంలో వికసించిన ఒక అపురూప భావనా మల్లిక.

తెలుగు పంచ మహా కావ్యాలలో ప్రథమ ప్రబంధం మను చరిత్ర. మార్కండ ేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసికొని తన అద్భుత కవితా ప్రావీణ్యంతో ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు పెద్దన. ఒక వరణా తరంగిణిని, ఒక అరుణాస్పద పురాన్ని, ఒక ప్రవరుని ఒక వరూధినిని, ఒక స్వరోచిని, ఒక మనోరమను సృష్టించి పాఠకుల హృదయాలలో ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు.

‘అట చని కాంచి’నదేమిటి?

పెద్దన హిమాలయాలను చూడనేలేదు. అల్లసాని పెద్దన కోకటం లేదా పెద్దనపాడు గ్రామాలకు చెందినవాడు. అందువల్ల సమీపంలోని ఇడుపులపాయ, గండి ప్రాంతాల్లోని కొండల్ని, లోయల్ని చూసి హిమాలయాలు ఇంతకన్నా పెద్దగా ఎత్తుగా ఉంటాయని ఊహించి వ్రాశాడు. పద్యంలో వర్ణించిన సెలయేర్లు, నెమళ్ళు వంటివన్నీ వర్షాకాలంలో ఇక్కడ అత్యంత సహజమైన విషయాలు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నెమళ్ళు, ఏనుగులు చాలా ఎక్కువ. ఆ తర్వాతి పద్యాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తాయి.

వెయ్యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ఒకే కవి వ్రాసిన నాలుగు వరుస పద్యాలు చెప్పమంటే చాలా తటపటాయించాల్సిందే! తిక్కన, శ్రీనాథుడు వంటి మహాకవుల గొప్ప పద్యాలు కూడా అలా వరుసగా లేవు. ఒక్క నన్నయ్యకు మాత్రమే ఆ గౌరవం దక్కుతుంది. నన్నయ్య వ్రాసిన ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలోని ఉదంకోపాఖ్యానంలోని నాలుగు నాగస్తుతి పద్యాలు శబ్దార్థ సంధానంలో అపురూపమైనవి. ఉదంకుడు నాగరాజులైన అనంతుడు, వాసుకి, ఐరావతులు, తక్షకుడులను నలుగురిని నాలుగు పద్యాల్లో స్తుతించే సందర్భం! నిజాయితీగా చెప్పాలంటే నాగజాతి ప్రముఖులను స్తుతించే ఈ విధానం ‘నాగప్ప నాగన్న నాగరాజా... మా కష్టమంత బాపు తండ్రి నాగరాజా...!’ అనే జానపదుని హృదయ స్పందనే! అయితే నన్నయ్య నడిపిన చంపకోత్పల వృత్తాలు సాహిత్యంలో ఒక ఒరవడిని సృష్టించాయి.

ఏ సహృదయుణ్ణి అయినా రసప్లావితుణ్ణి చేస్తాయి. ‘సర సర’ మనే సర్పాల చలనాన్ని, ‘బుస్సు బుస్సు’మనే శబ్దాల్ని అవే శబ్దాలతో అర్థాన్ని కూడా సాధించి పాముల పద్యాల్ని వ్రాయడం నన్నయ్య పద్యశిల్పంలోని ప్రత్యేకత. ఊష్మాక్షరాలైన శ, ష, స, హలతో ఖ్ఛిఝజీ గౌఠ్ఛీజూట ఖ్ఛిఝజీ ఇౌట్ఛౌ్టట అయిన అంతస్థాలతో (య ర ల వ) నాలుగు పద్యాలూ బుస్సు బుస్సుమని నాలుగు పాములై కొన తోక మీద నిలబెడతాయి. శబ్దార్థాలు ఆది దంపతులవంటివన్న కాళిదాసు మాటను సార్థకం చేశాయి (వాగర్థావివ... రఘువంశం మొదటి శ్లోకం). అసాధారణమైన ఈ ధారణ ఎంతో ప్రయత్నించినప్పటికీ తమకు సాధ్యం కాలేదని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి చెప్పారు. నన్నయ్యలోని నిసర్గ ప్రతిభకు నమస్కరించారు. ఎందుకంటే శబ్దాలంకార రచన అక్షర రమ్యత కాదు కదా!

నన్నయ్య తరువాత దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పోతన ఈ శబ్దార్థ సమన్వయాన్ని అందుకున్నాడు. ‘మందార మకరంద మాధుర్యా’న్ని తెలుగుజాతికి అందించారు. పోతన తర్వాత 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన్న ఈ శబ్దార్థ సమన్వయాన్ని సాధించాడు. ఈగొప్ప శైలీ సృజనే అతన్ని ఆంధ్రకవితా పితామహుణ్ణి చేసింది.

మను చరిత్ర కావ్య ప్రపంచంలో అడుగు పెట్టిన వారందరికీ- సిద్ధుని రాక, ప్రవరునికి పాద లేపం ఇవ్వడం, ఆ లేపన ప్రభావంతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళడం, మధ్యాహ్నం కావడం, పాద లేపనం కరిగిపోవడం, అతిలోక లావణ్యవతి వరూధినిని చూడడం, వరూధినీ ప్రవరుల సంవాదం, వరూధిని మనసు విప్పి తన కోర్కెను వెల్లడించడం, ప్రవరుడు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం, అగ్ని దేవుని ప్రార్ధించి అతడు తన నగరానికి వెళ్ళిపోవడం, మాయా ప్రవరుడు మాయ మాటలతో మరూధినిని నమ్మించి ఆమెతో సంగమించడం, స్వరోచి జననం- ఈ ఘట్టాలన్నీ పాఠక హృదయాలపై గాడమైన ముద్ర వేస్తాయి. మానవుల్లోని ప్రవృత్తి మార్గానికీ, నివృత్తి మార్గానికీ మధ్య పోరాటమే మను చరిత్ర కథా వస్తువు. భోగలాలసతకు, ఇంద్రియ నిగ్రహానికీ జరిగిన సంగ్రామమే ఈ ఇతివృత్తం.

సమర్ధుడైన రాయల పాలనలో సకాలంలో కురిసే వర్షాలతో, కరవు కాటకాలు లేక, చీకు చింత లేక సుఖమయ జీవితాన్ని గడిపారు ఆ నాటి ప్రజలు. ఆనాడు వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మారంటే ప్రజలెంత సంపన్నులో అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు భోగ లాలసులై తృతీయ పురుషార్ధ సాధననే జీవన పరమార్ధమని భావించారు. అలాటి ప్రజలకు ధర్మకార్య నిర్వహణలోని గొప్పతనాన్ని, నియమబద్ధ జీవితంలోని ప్రశాంతతను, ఇంద్రియ నిగ్రహంలోని ధార్మికతను, మానవ జీవన తాత్త్వికతను వివరించి చెప్పడమే పెద్దన కవితా రహస్యం.

పెద్దన పండితుడు, కవితా మర్మజ్ఞుడు, ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు. వీటన్నిం టినీ మించిన రసికుడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు పెద్దనను ఒక కావ్యం రాయమని అడిగినపుడు- కావ్యం రాయాలంటే రమణీయ స్థలం, తన మనసులో ఊహ తెలుసుకోగలిగే లేఖక పాఠకులు, ఉయ్యాల మంచం, నచ్చిన భోజనం- వీటితో బాటు పరిమళించే కర్పూర తాంబూలమం దించే అందమైన అమ్మాయి కావాలని చెప్పిన రసిక హృదయుడు పెద్దన.

మామూలుగా ప్రబంధాలలో అష్ఠాదశ వర్ణనలుంటాయి. నాయికా నాయకుల వర్ణన, నగర వర్ణన, ఋతు వర్ణన, వేట వర్ణన, చంద్ర వర్ణణ- ఇలా ఎన్నో వర్ణనలుంటాయి. ఈ వర్ణనల మధ్య చక్కని కథా కథన చాతుర్యంతో ప్రాణం తొణికిసలాడే పాత్రల హృదయాంతర్గత అనుభూతులను పనస తొనలు ఒలిచి పెట్టినట్టు పాఠకుల అరచేతుల్లో అందంగా అమర్చి పెట్టాడు పెద్దన.ప్రబంధాల్లో గానీ, పురాణేతిహాసాల్లో గానీ, వాస్తవ ప్రపంచంలో గానీ ఇష్టానై్ననా, ప్రేమనైనా, స్నేహానై్ననా, మోహానై్ననా, ఏ భావానై్ననా ముందుగా ప్రకటించేది పురుషులే. పురుషాధిక్య ప్రపంచంలో స్ర్తీల కెప్పుడు స్వీయాభిరుచులు, అభిప్రాయాలు ఉండవు. ప్రేమలోనైనా, పెళ్ళిలోనైనా మగవారి భావాలకే ప్రాధాన్యం, ఎక్కడో రాజుల్లో, స్వయంవరాల్లో తప్ప.

అక్కడైనా పరాక్రమమో, సాహసమో ఏదో ఒకటి శుల్కంగా నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడో రుక్మిణి వంటి వారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు- తాము వరించిన వారిని చేపట్టిన భాగ్యశాలురను.

అందుకే ఏ ప్రబంధంలోనైనా నాయికలకు కాళ్ళు, చేతులు ఉంటాయి గానీ తన ఇష్టాలను చెప్పే నోరుండదు. కను విందు చేసే అవయవాలుంటాయి గానీ కనిపించని మనసుండదు. అందుకే ప్రబంధ పాత్రలన్నీ చలనం లేని కొయ్య బొమ్మలు, ప్రాణం లేని మట్టి ముద్దలు. కానీ మూస పోసిన ప్రబంధాలకు విరుద్ధంగా పెద్దన మను చరిత్రలో పాత్రలకు రంగు, రూపం, జీవం, జవం, భావం, రాగం అద్ది తన కలం కుంచెతో ఎప్పటికీ వెలిసి పోని చిత్రాలుగా ప్రాణం పోశాడు.

మను చరిత్ర ప్రబంధ నాయకుడు ధర్మకర్మ దీక్షా పరతంత్రుడైతే, నాయిక పల్లవించే ప్రణయ రాగ రాగిణి. ఆధునిక కాలంలో తొలి చూపులోనే ప్రేమ పరిమళించినట్టు అలేఖ్య తనూ విలాసుడు, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి ప్రవరుని సమ్మోహన రూపాన్ని చూసిన వెంటనే వరూధిని మనసు పారేసుకుంటుంది.

తీర్థయాత్రా ప్రేమికుడైన ప్రవరుడు పాదలేపనం మహిమతో హిమాలయాలకు వెళ్ళడం మను చరిత్రలో కీలక ఘట్టం. అతడెంత నిష్టాగరిష్ఠుడైనప్పటికీ వెండి కొండల సౌందర్య వైభవానికి పరవశించి జగము మరచి తనువు మరచి పోవడమే కావ్యంలో రసవద్ఘట్టం.

పాదలేపనం కరగి పోవడంతో అతడు తన ఊరికి వెళ్ళలేక పోతాడు. ఆ ప్రాంతాల్లో ఎవరైనా కనబడతారేమోనని, తన ఊరికి దారి చెబుతారేమోనని అటు, ఇటు తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న ప్రవరుణ్ణి చూడగానే అతని అందానికి వరూధిని కళ్ళు పెద్దవవుతాయి ఆశ్చర్యంతో. ఆమెను చూసిన ప్రవరుడు- ఓ భీత హరితేక్షణ! నీవెవరివి? ఈ వన భూముల్లో ఒక్క దానివే విహరిస్తున్నావు. నన్ను ప్రవరుడంటారు. ఈ పర్వతానికి వచ్చి దారి తప్పాను. మా ఊరికి దారి చెప్పు- నీకు పుణ్యం ఉంటుందని అడుగుతాడు. అప్పుడు వరూధిని- ఇంతింత పెద్ద పెద్ద కళ్ళున్నాయి గదా నీకు ‘మా ఊరికి దారేది?’ అని అడుగుతున్నావు. ఏకాంతంగా ఉన్న నాలాటి యువతులతో ఏదో విధంగా మాటలాడాలని కోరికే గానీ నీవొచ్చిన దారి నీకు తెలియదా? కొంచెం కూడా భయం లేకుండా అడగడానికి మేమింత చులకనయ్యామా?- అని డబాయిస్తుంది.

ఆ తర్వాత వరూధిని తన వంశ ప్రఖ్యాతిని గురించి చెబుతుంది. రంభ మొదలైనవాళ్ళంతా తన చెలికత్తెలని, వాళ్ళంతా ఎప్పుడూ హిమాలయ పరిసర ప్రాంతాల్లోనే విహరిస్తారని చెప్తూ, మిట్టమధ్యాహ్నం ఎండకు బంగారం లాంటి నీ శరీరం కందిపోయింది. మా ఇంటికి వచ్చి బడలిక తీరేంతవరకు విశ్రాంతి తీసుకొనమని బతిమాలుతుంది. అప్పుడు ప్రవరుడు ‘ఇక్కడ నేనుండడానికి వీలు పడదు. మధ్యాహ్నిక కార్యక్రమాలు తీర్చడానికి ఇంటికి వెళ్ళి తీరాలి. దయ చేసి మాయింటికి వెళ్ళే దారి చెప్పి ఉపకారం చేయమని అడుగుతాడు. ఎక్కడి మనిషివయ్యా నీవు? మాటి మాటికి ఇల్లో, ఇల్లో అని కలవరిస్తున్నావు. ఇక్కడున్న ఈ రత్నాల భవనాలు, చందన వనాలు, గంగానది ఇసుక తిన్నెలు, పొదరిళ్ళు అన్నీ మీ కుటీరాలకు సాటి రావా? అని అంటూ- ఆ మాటల్లో అంతరార్ధము గ్రహించలేని అమాయకుడని వ్యాచ్యంగా తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతుంది.

‘నిక్కము దాపనేల ధరణీ సర నందన యింక నీపయిన్‌/ జిక్కె మనంబు నాకు నను జిత్తజు బారికి నప్పగించెదో/ చొక్కి మరంద మద్యముల చూఱల బాటల పాడు తేంట్ల సొం/ పెక్కిన యట్టి పూవు బొదరిండ్లను గౌగిట గారవించెదో’ అంటుంది. తెలుగు సాహిత్యంలో వందల కొద్దీ ప్రబంధాలున్నాయి. ఎందరో కవులు కసిదీరా తమ కావ్యనాయకల శరీరాలను వర్ణించారు. కానీ ఏ కవీ కూడా అమెకొక మనసుందని చెప్పలేదు. తన నాయిక నోట ‘మనసు’ అనే మూడక్షరాల పద ప్రయోగం చేసినవాడు పెద్దన ఒక్కడే. అలా తన కావ్యనాయిక చేత ‘మనసు’ అనే ముత్యమంత మాటను తొలిగా ప్రయోగించిన పెద్దన కవీంద్రులకు శతకోటి వందనాలు!

వరూధిని ఇలా తన అభిప్రాయాన్ని ఏ డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పినా, నిశ్చల మనస్కుడైన ప్రవరుడు - తల్లీ! వ్రతులై రోజుల్ని గడిపే విప్రులను కామించవచ్చునా? నా తల్లిదండ్రులు వృద్ధులు. ఆకలికి ఆగలేరు. నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. దేవ కాంతలు మీకు అసాధ్యాలు లేవు గదా! నేనిల్లు చేరే ఉపాయం చెప్పమంటాడు.‘ఓ ప్రవరుడా! ఓ మానవుడు తన జీవితంలో అనుభవించ దగిన సకల సామగ్రి ఇక్కడే ఉన్నాయి. భోగివై నన్ననుభవించు.

వెన్నలాగా కరగిపోయే స్ర్తీల పరిష్వంగం లో సుఖ పడే అదృష్టం ఎప్పుడు వస్తుంది’ అని ప్రలోభపెడుతుంది. అయినా ప్రవరుడు నిశ్చల మనస్కుడై ‘బ్రాహ్మణుడు ఇంద్రియ వశుడవకూడదు. అలా ఐతే బ్రహ్మానందాది రాజ్యంనుంచి భ్రష్ఠుడౌతాడు’ అని తన మాటమీదే నిలబడతాడు. అప్పుడు వరూధిని ‘చిమ్మీలో ఉన్న దీపంలా ఇంద్రియాలన్నీ ఏ విషయంలో సుఖ పారవశ్య స్థితి పొందుతాయో అదే బ్రహ్మానందమని విజ్ఞులు చెప్పలేదా’? అని ఆనందానికి తన నిర్వచనం చెప్తే, ప్రవరుడు ‘వ్రతులైన భూసురులను కామించవచ్చా! తక్షణం నేనింటికి వెళ్ళాలి’ అని అదే మాట మీద పట్టుదలగా నున్నప్పుడు- ‘నీ యవ్వనమంతా కర్మలు చేసినట్లైతే భోగాలనుభవించేదెప్పుడు? ఎన్ని క్రతువులు చేసినా మా పరిష్వంగ సుఖం అందుకోవడానికే గదా! గంధర్వాంగనల పొందు అందరికీ లభించదు. స శరీర స్వర్గ సుఖాలు కోరి వరిస్తుంటే వ్రతాలు చేసి ఇంద్రియాలను బాధ పెట్టడం న్యాయమా’? అని వాదిస్తుది.

‘నీవు చెప్పిన విషయం కాముకునికి వర్తిస్తుంది. బ్రహ్మ జ్ఞానికి కాదు. మాకు అరణులు, దర్భలు, అగ్ని- ఇవే ఇష్టం. ఈ తుచ్ఛ సుఖాలన్నీ మీసాల మీద తేనెలే’ అని తన నిరాసక్తతను వెల్లడిస్తాడు.

ఎన్ని రకాల మాటల ఆయుధాలను ప్రయోగించినా తాను ఓడిపోయే సరికి ఉక్రోషంతో వరూధిని ప్రవరుని పరిష్వంగించి ముద్దు పెట్టుకోబోగా ప్రవరుడామె భుజాలను పట్టి తోసేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక రోషంతో ‘చేసితి జన్నముల్‌ తపము చేసితి నంటి దయా విహీనతన్‌/ జేసిన పుణ్యముల్‌ ఫలము సెందునె? పుణ్యము లెన్నియేనియున్‌/ జేసిన వాని పద్ధతియె చేకుఱు భూత దయార్ద్ర బుద్ధికో/ భూసుర వర్య యింత తల పొయవు నీ చదువేల చెప్పుమా’? అని బాధపడుతూ ఎన్నో మాటలంటుంది.

ఆ తర్వాత ప్రవరుడు అగ్ని దేవుణ్ణి ఆరాధించి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఎన్ని విధాలుగా వాదించినా తన కోరిక నెరవేరలేదని ఆమె దుఃఖగీతిక అవుతుంది. అంతకు ముందు వరూధిని తిరస్కారానికి గురైన గంధర్వుడు ప్రవరుని వేషం ధరించి అక్కడే తిరుగుతుంటాడు. ఎప్పటినుంచో కోరుకున్న వరం దక్కినట్టు వరూధిని సంతోషంతో అతని చెంతకు చేరుతుంది. ఒక షరతు పెట్టి గంధర్వుడు ఆమె కోరికకు ఒప్పుకుంటాడు. ప్రవరుడు అంగీకరించాలే గానీ దేనికైనా సిద్ధమే గదా ఆమె. కానీ ఆ సందర్భంలో మాయా ప్రవరుడు వరూధినితో- ‘నీ పరిష్వంగంలో పొందే పారవశ్యాన్ని తిరస్కరించడానికి నేనేమైనా సన్యాసినా? కానీ ఎందుకో ఆ విషయంలో నాకు కోరిక లేదు. ఒక అనాశ్వాసితమైన దుఃఖం ఆ సుఖాన్ని దుర్భరం చేస్తుంది’ అని అంటాడు. తాను వలచిన స్ర్తీని మరొకరి రూపం ధరించి మోసం చేసినవాడు ఇలా అనడమే గొప్ప ఆశ్చర్యం. మాయా ప్రవరునితో కొన్ని ప్రవర లక్షణాలు, ప్రవరునిలో కొన్ని మాయా ప్రవర లక్షణాలు సృష్టించాడు కవి.

మొదట హిమాలయానికి వచ్చిన ప్రవరుడు ఆ వైపు వచ్చిన తాంబూల పరిమళ సమ్మిళిత వాయువును బట్టి ఇక్కడెవరో జనమున్నారని అనుకుంటాడు. అది మామూలు తాంబూలం కాదు. కస్తూరి ఒక వంతు, కర్పూరం రెండింతలు ఉన్న తాంబూలం. అలాంటి తాంబూలాన్ని స్ర్తీలు మాత్రమే వేసుకుంటారు. ప్రవరుడు కేవలం నైష్టికుడైతే ఈ విషయం తెలియదు. నిత్యం తాంబూల సేవానురక్తులకే ఈ విషయం తెలుస్తుంది. ప్రవరుడు కేవలం నైష్టికుడే కాదని, అతని అంతరంగం లోలోపలి పొరల్లో ఒకింత రసికత ఉందని ఈ పద్యం వలన తెలుస్తుంది.

ఈ వరూధిని కేవలం మను చరిత్రకే, ఒక పుస్తకానికే పరిమితం కాదు. ఈ వంచిత కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. వాస్తవ ప్రపంచంలో ప్రవరుల కన్నా మాయా ప్రవరులు కూడా ఎక్కువే. పెళ్ళి చూపుల్లో వరుడు సకల సద్గుణవంతుడు అని చెప్తారు. కానీ, పెళ్ళయిన మర్నాడే అతని విశ్వ రూపం ప్రదర్శితమవుతుంది. పాపం! వరూధిని, సుర గరుడ గంధర్వులే మోహించిన సౌందర్యవతి ఐనా కోరుకున్నవాణ్ణి వరునిగా పొందలేకపోగా అతనిచే ఘోర తిరస్కారానికి, అవమానానికి గురైన ఒక పరాభవ గీతిక. మాయా గంధర్వుని చేతిలో మోసపోయిన ఒక అమాయక ప్రాణి. పెద్దన కేవలం కవే గాదు. చేయి తిరిగిన చిత్రకారుడు కూడా. కను రెప్పలు కూడా ఆర్పలేని ఎన్నో రంగుల చిత్రాలను చిత్రించాడు తన ప్రబంధంలో. దానిలో వరూధిని చిత్రాలే ఎక్కువ.

అల్లసాని పెద్దన ఊరేగుతోంటే విద్యానగర ప్రభువు శ్రీకృష్ణ దేవరాయలు...పల్లకీ మోసాడు లాంఛనంగా... అల్లసాని వారి పాదాలు కడిగీ - స్వయంగా గండ పెండేరం తొడిగాడు!

ఈ పద్యం తెలియని తెలుగు వాడు ఉండడనడంలో అతిశయోక్తి లేదేమో...

అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర్ఝజరీ

పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్.........

Friday, October 14, 2016

*సందేహం* !

*సందేహం* !

.

అనుకున్న ప్రకారం శేషు, భవాని పార్క్ లో కలుసుకున్నారు.

"నేను రాత్రంతా మన గురించి ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాను భవానీ..." అన్నాడు శేషు.

"ఏమిటది...? త్వరగా చెప్పు...?? అంది భవాని.

"మనిద్దరం కలసి కొన్ని రోజులు ఎక్కడైనా గడుపుతాం. ఒక వేళ అప్పుడు మనకు సరిపడదనీ, పొరబాటు చేశామనీ అనుకుంటే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు..." అన్నాడు శేషు ఆవేశంగా.

"ఆలోచన బాగానే వుంది కాని ఆ తర్వాత పొరబాటును ఎవరు పెంచుకుంటారు?" అనుమానంగా అడిగింది భవాని.

పాడకే నారాణి పాడకే పాట!... (అడివి బాపిరాజు).

పాడకే నారాణి పాడకే పాట!... (అడివి బాపిరాజు).
.
పాడకే నారాణి పాడకే పాట
పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే!
రాగమాలాపించి వాగులా ప్రవహించి
సుడిచుట్టు గీతాల సురిగి పోనీయకే ॥పాడకే॥
కల్హార ముకుళములు కదలినవి పెదవులూ
ప్రణయపద మంత్రాల బంధించె జీవనము! ॥పాడకే॥
శ్రుతిలేని నా మదికి చతుర గీతాలేల
గతిరాని పాదాల కతుల నృత్యమ్మటే! ॥పాడకే॥

x

ప్రపంచం లో అందగత్తెలు,గాళ్ళు నల్లవారేనండీ..

ప్రపంచం లో అందగత్తెలు,గాళ్ళు నల్లవారేనండీ.. 

.

ఉదాః విష్ణుమూర్తి, పార్వతీమాత, రాముడు, కృష్ణుడు,

. ద్రౌపది,క్లయోపాట్రా,...........చాలామంది.. 

.

తెల్లవాళ్ళు మనకంటించిన జాఢ్యాలలో ఇదొకటి. 

నలుపు నారాయణుడు మెచ్పు.... 

.

అలాగని నేను నలుపు కాదు సుమండీ..

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌!

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌!

.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు!

మాతః సమస్త జగతాం మధుకైటభారే:

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌

శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో

శ్రీ దేవతాగృహభుజాతంర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌

లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో

సంసారసాగర సముత్తరణైక సేతో

వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌

.

సుప్రభాత శ్లోకాల సారాంశం

కౌసల్యా కుమారా! పురుషోత్తమా! రామా! తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన కర్తవ్యములు ఆచరింపవలసి ఉన్నది. ఓ గోవిందా! గరుడ ధ్వజా! లక్ష్మీవల్లభా ! లెమ్ము. ముల్లోకములకును శుభములు కలిగింపుము. జగన్మాతా! విష్ణు వక్షస్థలముననుండుదానా! కమలాయతాక్షీ! ఆశ్రితుల కోరికలను నెరవేర్చు తల్లీ! వేంకటరమణుని రాణీ! సరస్వతి, పార్వతి, శచీదేవి నిన్ను పూజించుచుందురు. దయానిధీ! నీకు సుప్రభాతమగు గాక.

సప్తర్షులు నీ పాదములను పూజించుటకు సిద్ధముగానున్నారు. ఓ వేంకటాచలపతీ! శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. లేత చిగురులు, పూల సువాసనలతో మలయమారుతము వీచుచున్నది. పెంపుడు చిలుకలు విలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము.

నారదుడు నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక. తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించబూనుచున్నవి. గొల్లపడుచులు పెరుగు చిలుకుచున్న సవ్వడులు నలుదిక్కుల నిండినవి. శ్రీమాన్! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకబంధువుడవు. శ్రీనివాసా! దయాసముద్రుడవు. లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించినవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

బ్రహ్మాది దేవతలు పుష్కరిణిలో స్నానముచేసి ద్వారము కడ కాచుకొనియున్నారు. నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషబాధ్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. అష్టదిక్పాలకులు నీ సేవకై కాచుకొనియున్నారు. గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

స్వామీ! నీ పాదధూళిచే పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయాగుణనిధివి. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. నీవు పద్మనాభుడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. చక్రధారివి. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణాగతుల పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

మన్మధుని తలదన్నే సుందరాకారా! కాంతాకుచపద్మముల చుట్టూ పరిభ్రమించే చూపుగలవాడా. నీవు కీర్తిమంతుడవు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. భక్తులు పరిమళభరితములైన పవిత్రగంగా జలమును బంగారు కలశముల నింపి తెచ్చి నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీవేంకటేశా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. బ్రహ్మాది దేవతలు, మహర్షులు, సత్పురుషులు, యోగులును నీ పూజకై మంగళ సామగ్రితో నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక. శ్రీవల్లభా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంత వేద్యుడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.