సూక్తి : జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసి

సూక్తి : 

జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసి

.

మూల శ్లోకము : 

అపి స్వర్ణమయీ లంకా - న మే లక్ష్మణ! రోచతే!

"జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ".

.

భావము : 

లక్ష్మణా! లంకా నగరం స్వర్ణమయమై శోభించినా, నన్నాకర్షించుట లేదు. అది మన మాతృభూమి కాదు. "జనని, జన్మభూమి స్వర్గము కంటె ప్రియమైనవి కదా!".

.

మూలము : 

ఈ శ్లోకం వాల్మీకి రామాయణములోనిది. రావణ సంహారం తరువాత విభీషణునకు పట్టాభిషేకం జరిగింది. విభీషణుడు రామ, లక్ష్మణులకు లంకానగరాన్ని చూపుతాడు. సువర్ణ కాంతులతో శోభించు లంకా నగర వైభవాన్ని చూచి లక్ష్మణుడు ఆశ్చర్య పడతాడు. అపుడు శ్రీరాముని మాటలివి. దేశభక్తిని వర్ణించినపుడు తఱచుగా ఈ సూక్తి ఉదాహరించ బడుతుంది.

.

(శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారు ( మొబైల్ నంబరు : 98498 09565 ) కూర్చిన "రోజుకోసూక్తి" గ్రంధం నుండి శ్రీ చల్లా రామలింగశర్మ గారిసేకరణ.))

.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!