తెలుగు రావటం అంటే ఏమిటి??

తెలుగు రావటం అంటే ఏమిటి??

.

.తెలుగు రావటం అంటే ఏమిటి?? అనే ప్రశ్న వచ్చింది.

ఇంత చిన్నగా అడిగితే ప్రశ్న అర్ధంకాదు వివరిస్తాను చూడండి.

..

తెలుగులో మాట్లాడటం రావటమా(వాడుక భాష)? అంటే భందుమిత్రులతోబాటుతెలుగువారితో మాట్లాడ గలిగేంత రావటం.

తెలుగు నుడికారపు మెదటి సందువరకు వచ్చి ఆగిపోతారు 

ఈ తరహా వాళ్ళు.

లేక

తెలుగు చదవటం రాయటం మెదలుగునవి రావటమా …?? వీరికి మాట్లాడటంతో కలిపి,పేపర్లు చదవటం, బస్సుల పేర్లు,సినిమా పోష్టర్ల పేర్లు చదవటానికి,తల్లి దంద్రులకు బందువలకు లేఖలు లేక వేగులు రాయటానికి సరిపడా వస్తుంది(సంసృతాంద్రము అంతగారాదు పరిసరాల బట్టి కొద్ది కొద్దిగా వస్తుంది.)

లేక

తెలుగు సాహిత్యం అంటే మక్కువ,తెలుగు కవితలు బాణీలు, కధలు వగయిరా వగయిరా…. ? వీరికి తెలుగు పుస్తకాలు చదవాలన్ని ఆశక్తి,తెలుగు సాహిత్యంలో ఉన్న పాతకొత్తవింత దోరణులు స్పృసించగల సత్త మరియు అలాంటి తపన ఉంటుంది…కొంత మంది ఒక అదుగు ముందుకేసి హైకులు,కవితలు,కవితలు లాంటివి రాస్తూ కొద్దిగా సాహితీ అభిమానం చూపిస్తుంటారు.

లేక

శ్రీశ్రీశ్రీ పండితారద్యుల పాపయ్య శాస్త్రీ , సహస్రఘనాపాటి అన్నా రేంజిలో 

ఉండాలా ??

వీరు తెలుగుసాహితీ సంఘంలో ఒకపట్టాన దిట్టలు ( మన కొత్తపాళీ గారు, తాడేపల్లిగారు ,రానారే గారు, కస్తూరిగారు… ఇంకా ఇలాంటీ సాహితీసముద్రపుత్రులు వృత్తి ప్రవృత్తి ఒకటిగా … అదీ తెలుగుగా కలిగినవారుకూడా వస్తారు…

..

మరి చెప్పండి ఇప్పుడు,ఏంటి అస్సలు తెలుగు రావటం అంటే??

.

ఓరి బుడతడా..!!! మరి నువ్వు ఏకోవకు వస్తావు అని అడగాలి అనుకుంటున్నారా…. అంతో కొంత చివరినుంచో రెండోరకం తరగతిలోకి వచ్చాను మొన్నీమద్య….

అదీ మరి… ఇప్పుడు చెప్పండి… తెలుగు రావటం అంటే ఏమిటి…??

.

మద్యతరగతి అని ఒక తరగతి ఉంటుంది,

వారికి తెలిసిందే లోకం వారికి తెలిసిందే న్యాయం,చెబితేకోపం చెప్పకపోయినకోపం,వారికి తెలిసిందే సాహిత్యం,మళ్ళ ఎమన్న అందామన్నా చిక్కే…. వీరు సాహిత్యంలో హిట్లర్ రకం అన్నమాట అంటే తెలివయిన వారుకాని మూర్ఖోన్ముఖులు వీరలా రావటం కూడా తెలుగు రావటం…. ఇలా అవ్వలా ???

సదరు పెద్దలు… సమాదనాలు ఇస్తారు అని ఆశిస్తూ….

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!