Sunday, April 29, 2018

మను చరిత్రము 🌷

మను చరిత్రము 🌷


🌷అరుణాస్పదపుర వర్ణనము!


👉మ. వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం

బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ

హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌

బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌.


🌷ప్రవరుని సౌశీల్యాది ప్రశంస!


👉ఉ. ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా

షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ

క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా

ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై.


👉సీ. తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన,

నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు,

నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు,

వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్‌ దెలియ నడుగు,


తే. నడిగి యోజన పరిమాణ మరయు నరసి

పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు

ననుదినము తీర్థసందర్శనాభిలాష

మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి.

👉ప్రవరుని స్వగ్రామం అరుణాస్పద పురము.

అరుణాస్పద పురము వరణ నది ప్రక్కన గలదు.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


వరూధినీ నర్మగర్భ భాషణము ....

ప్రవరుఁడు వరూధుని కామనను నిరాకరించుట ..!👈


🌷ఉ. ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే


కాంతమునందు నున్న జవరాండ్ర, నెపంబిడి పల్కరించు లా


గింతయ కాక, నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు? నీ


కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె! మాట లేటికి\న్‌?


వ. అని నర్మగర్భంబుగాఁ బలికి, క్రమ్మఱ నమ్మగువ యమ్మహీసురున కిట్లనియె.


🌷సీ. చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధిఁ,


బొడమిన చెలువ తోఁబుట్టు మాకు


రహి పుట్ట జంత్రగాత్రముల ఱాల్‌ గరఁగించు,


విమలగాంధర్వంబు విద్య మాకు


ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు,


పని వెన్నతోడఁ బెట్టినది మాకు


హయమేధ రాజసూయము లనఁ బేర్వడ్డ,


సవనతంత్రంబు లుంకువలు మాకుఁ


🌷. గనకనగసీమఁ గల్ప వృక్షముల నీడఁ


బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ,


పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు


సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర!


🌷క. పేరు వరూధిని విప్రకు


మార! ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే


మా రంభా శశిరేఖ లు


దారగుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్‌.


🌷.మ. బహురత్నద్యుతి మేదురోదర దరీ భాగంబులం బొల్చు ని


మ్మిహికాహార్యమున\న్‌ జరింతు మెపుడుం బ్రేమ\న్‌, నభోవాహినీ


లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ


గ్రహణేందిందిర తుందిలంబు లివి, మత్కాంతార సంతానముల్‌.


🌷క . భూసుర! కైతవ కుసుమ శ


రాసన! మాయింటి విందవైతివి, గైకొ


మ్మా! సముదంచ న్మణిభవ


నాసీనత సేద దేఱి యాతిథ్యంబు\న్‌.

.


🌷తె . కుందనమువంటి మేను మధ్యందినాత


పోష్మహతిఁ గందె, వడ దాఁకె నొప్పులొలుకు


వదన, మస్మద్గృహంబు పావనము సేసి


బడలికలు వాసి చను మన్న బ్రాహ్మణుండు. 

.


🌷ఉ. అండజయాన! నీ వొసఁగునట్టి సపర్యలు మాకు వచ్చె, నిం


దుండఁగ రాదు, పోవలయు నూరికి, నింటికి నిప్పు, డేను రా


కుండ నొకండు వచ్చి మఱియొండునె? భక్తియ చాలు, సత్క్రియా


కాండముఁ దీర్ప, వేగ చనఁగా వలయున్‌ గరుణింపు నాపయిన్‌.

.

🌷ఉ. ఏ నిఁక నిల్లు సేరుటకు నెద్ది యుపాయము? మీ మహత్త్వము


ల్మానిని! దివ్యముల్‌; మదిఁ దలంచిన నెందును మీ కసాధ్యము


ల్గానము గానఁ దల్లి! ప్రజలన్‌ ననుఁ గూర్చు మటన్న, లేఁత న


వ్వాననసీమఁ దోఁప, ధవళాయతలోచన వాని కిట్లనున్‌.


🌷 ఉ. ఎక్కడియూరు? కాల్నిలువకింటికిఁ బోయెద నంచుఁ బల్కె దీ


వక్కట! మీకుటీరనిలయంబులకున్‌ సరిరాక పోయెనే


యిక్కడి రత్నకందరము! లిక్కడి నందన చందనోత్కరం!


బిక్కడి గాంగసైకతము! లిక్కడి యీ లవనీనికుంజముల్‌.


🌷 ఉ. నిక్కము దాఁప నేల ధరణీసురనందన! యింక నీపయిన్‌


జిక్కె మనంబు నాకు, ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో?చొక్కి 

మరందమద్యముల చూఱలఁ బాటలువాడు తేంట్ల సొం


పెక్కినయట్టి పూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో?


🌷 క. అనుటయుఁ బ్రవరుం డిట్లను


వనజేక్షణ! యిట్లు వలుక వరుసయె? వ్రతులై


దినములు గడపెడు విప్రులఁ


జనునే కామింప? మది విచారము వలదే?


🌷🌷

👉వరూథిని ఒక అప్సరస.



👉మాయాప్రవరాఖ్యుడు ఒక గంధర్వుడు.


👉 వరూథిని, మాయప్రవరాఖ్యుల కుమారుడు “ స్వరోచి “.


👉 ఇందీవరాక్షుడి (రాక్షసుడిలా మారుతాడు) కూతురు “ మనోరమ “.

.

👉 ఈ ప్రబంధం శ్రీ కృష్ణ దేవరాయలకు అంకితము.


 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

👉కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన!

👉కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన!


🤲కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం


ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం.


ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం


చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.

(కొందరు అనుకునట్లు ఈ పాట శ్రీ శ్రీ రాసింది కాదు.)


👉వివరణ!


🌷ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని


ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయికి అర్ధమయ్యేటట్లుగా


పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం.


మనం జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సుఖాలకు వెనుక


ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి వుంటుందనే జీవితసత్యాన్ని


తెలియజేస్తుంది


🌷ఈ పాట. వానికి గృహ నిర్మాణ రంగంలోని మేస్త్రీలను,


దుస్తుల్ని తయారుచేసే నేతగాళ్ళను రెండు ఉదాహరణలుగా


చెబుతాడు. చివరికి "చాకిరొకడిది సౌఖ్యమొకడిది" తెలుగుకోమని


అంటాడు.


👉కోసమెరుపు ..


🌷ఈ పాట సినిమా కోసం వ్రాసింది కాదు.ఆత్రేయ గారు నెల్లూరు


కస్తూరిదేవివిద్యాలయంలొ నటకలురీహార్సల్స చేయిస్తుండగా


ఆ విద్యాలయానికి పట్టుపావడలు,పరికిణీలతొ నాజూకుగా


రోజు జట్కాలలొ వస్తున్న అమ్మాయిల దుస్తులనుచూచి,


తను వారంరోజులుగా వేసుకుంటున్న మాచిన మరియు చిరిగిన


బట్టలతొ బేరీజు వేసుకొని ఈ పాట వ్రాసినట్లు ఆత్రేయ గారి


సతీమణి పత్రికాముఖంగా తెలిపింది.


🌷ఈపాటను మొదట సంసారం చిత్రంలొ వాడుకోవాలనుకొని


మానుకున్నారట.


🌷🌷తోడికోడళ్ళు సినిమా తీస్తున్న సమయంలొఎవరొ


ఈపాటను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మరియు


నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి ద్రుష్టికి


తీసుకువచ్చారట.సాహిత్యం బాగా నచ్చినదట,కాని మధుసూదనరావుగారు ఈ పాటతొ నిడివి ఎక్కువవుతుంది


పైగా ఆపాటకు దగ్గ సన్నివేశం మన చిత్రంలొ లేదు


వద్దుపొమ్మానడట.దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మాత్రం సాహిత్యం


చాలా బాగుంది, ఈపాట మనకు ప్లస్పాయింట్ అవుతుంది,


ఈపాటకు సన్నివేశాన్ని నేను క్రియేట్ చేస్తాను నిడివికూడా పెరగకుండా నేను చూచుకుంటాను అని వప్పించి ఆపై పాటను


రికార్డు చేయించి షూటింగు జరిపారు.

🤲🤲🤲🤲🤲🤲🤲🤲


👉పాటపల్లవి :


కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన


బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా


నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే


వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో || | | కారులో | |


👉చరణం 1 :


చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా


మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా


కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి


చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో


కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన


నిలిచి విను నీ బడాయి చాలు


తెలుసుకో ఈ నిజానిజాలు!!


👉చరణం 2 :


గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా


జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా


చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు


చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో


కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన


నిలిచి విను నీ బడాయి చాలు


తెలుసుకో ఈ నిజానిజాలు!!


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Friday, April 27, 2018

చిన్నజాలి - ప్రేమ కధ!

చిన్నజాలి - ప్రేమ కధ!


🌷🌷🌷🌷

ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం ( ప్రేమ ).


ఎప్పుడూ అతనుండే ప్రదేశాలకు వెళ్తూ అతన్నే చూస్తుండేది...


అతనికీ ఆమె అంటే ఇష్టమే..


ఒకరోజు ఆ అమ్మాయి అతనికి ఐలవ్ ‍యూ అని చెప్పి.. తన లవ్ ని


ప్రపోస్ చేసింది..


అందుకు అతను నన్ను చూడకుండా, తలచుకోకుండా


ఒక్కరోజు అంతా ఉండగలవా ? అప్పుడు నీ ప్రేమను అంగీకరిస్తాను


అని చెప్పాడు.

🌷🌷🌷

కట్ చేస్తే ...


ఆమె సరేనని ఒకరోజంతా అతని గురించి అలోచించకుండా భారంగా


గడిపేసింది...


మరుసటి రోజు ఉదయాన్నే ఆమె అతని ఇంటి దగ్గరికి వెళ్ళగానే


అక్కడ అంతా ఏడుపులు, జనాలు.. లోపలికి వెళ్ళి చూస్తే జీవం


లేకుండా ఉన్న అతని శరీరం కనపడింది..


అతనికి తెలుసు తన జీవితం ఇక మిగిలింది ఆ ఒక్కరోజే అని


అందుకనే అలా చెప్పాడు.... చివరగా ఆమెకు ఒక ఉత్తరం కూడా


రాసాడు..అందులో ఏం రాసుంది అంటే....


💔💔💔💔💔💔💔💔

.

" ప్రియ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం..


కానీ నా జీవితం ఇక ఎంతో కాలం లేదు అని నాకు తెలుసు


అందుకనే అలా చెప్పాను... నన్ను చూడకుండా,తలచుకోకుండా


ఒక రోజంతా ఉండగలిగావు కదా.. అలానే నీ జీవితం అంతా


సుఖంగా గడిపేయ్... నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి.....


నీ సంతోషమే నేను కోరుకొనేది......" అని

😥😥😥😥😥😥😥😥😥😥😥

👉నలుపులోని అందం తెలుపు లో ఎక్కడిది .

శుభోదయం!

👉నలుపులోని అందం తెలుపు లో ఎక్కడిది .


మన సంస్కృత కావ్యాల లో అందం అంటే శ్యామ వర్ణం .


గీతగోవిందం లో రాధ రంగు నీల మేఘం . ఆమె నల్లని గోపాలుడికి


తగియా జోడి గా వర్ణించబడింది .


ఇక కాళిదాసుని దాదాపు అన్ని కావ్యాలలో స్త్రీలు నల్లని వారే .


ద్రౌపతి తెలుపు కానేకాదు . భవభూతి ఉత్తర రామ చరిత లో సీతని


పాల మీగడ రంగాని వర్ణించలేదు . కంబ రామాయణం లో కూడా


సీత ని ఎర్రని బుగ్గల యువతి గా వర్ణించలేదు .


వాత్స్యయనుడి కామసూత్ర లోని వేశ్యలు కూడా నల్లని వారే .


ఈ పుస్తకం లో ఒక అంకం అంతా నలుపు అందం గురించే కేటాయించడం జరిగింది .


అందం నల్లని రంగు లో ఆకృతి లో ఉందని వ్రాసారు .


(శ్యామ వర్ణం సౌన్దర్య భూతం ప్రతిమనహ్ అస్తి )


😀😀😀😀😀😀😀


Thursday, April 26, 2018

మనసుకు హత్తుకున్న విషయం !

🙏🙏🙏💐💐🙏🙏🙏


మనసుకు హత్తుకున్న విషయం !


🙏🙏🙏💐💐🙏🙏🙏


ఆ దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది. ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరికి పంపడానికి ఆమె అంగీకరించలేదు. లేకపోతే, ఈ ముసలివాళ్ళకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో పనేమిటి ?


ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు......


"చెప్పండి ,ఏం కావాలి? "అడిగాడు ప్రెసిడెంట్. 

"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాము" చెప్పాడు ముసలాయన.......


ఆయనకు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా "ఎంత ఇవ్వాలను కుంటున్నారు?" అన్నాడు......


"మా పదహారేళ్ళ కొడుకు టైఫాయిడ్ తో చనిపోయాడు. వాడి ఙ్ఞాపకార్ధం ఈ యునివర్సిటీ క్యాంపస్ లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ " చెప్పంది వృద్ధురాలు......


"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించాడు ప్రెసిడెంట్......


"ఎంత ?" చాలా మామూలు గా అడిగాడు ముసలాయన......


చెప్పాడు ప్రెసిడెంట్....


ముసలాయన ఆశ్చర్యపోయాడు.....


ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.

"అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే ఎంతవుతుంది?" కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.......


ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్........


ఆమె , భర్త వైపు తిరిగి అంది, "మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్ !" 

"సరే" అన్నాడు భర్త.....


కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో "స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.....

ఆ దంపతులిద్దరూ లేలాండ్ స్టాన్ ఫోర్డ్, జేన్ స్టాన్ ఫోర్డ్........


లేలాండ్ కాలిఫోర్నియా గవర్నర్ గాను, సెనేటర్ గానూ పని చేశారు......


ఒక్కోసారి మనం ఎదుటివాళ్ళను ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఎదుటివాళ్ళ దుస్తులను బట్టి,కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయానించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ళ స్థాయిని లెక్కగడుతుంటాం.......


రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడి ఉన్నది, ఎవరైనా సరే కావచ్చు.... వాళ్ళను మీకంటే గొప్పవాళ్ళుగా భావించకపోయినా సరే, తక్కువవాళ్ళని మాత్రం అనుకోవద్దు.......


🙏🙏🙏💐💐🙏🙏🙏

🌷🌷🌷🌷🌷🌷 మాటాలెంట్ ని గుర్తించండి 🌷🌷🌷🌷🌷

🌷🌷🌷🌷🌷🌷 మాటాలెంట్ ని గుర్తించండి 🌷🌷🌷🌷🌷


👉ఒకసారి తిరుపతి వేంకటకవులైన ..


దివాకర్ల తిరుపతి శాస్త్రిగారిని, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారిని


చూసి .. పద్యాలు రాసుకునే మీకు మీసాలెందుకయ్యా


అని అంటే..వాళ్ళిద్దరూ కలిపి అప్పటికప్పుడు


ఇలా పద్యం చెప్పారు ..

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


"దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,


మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా


రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ


మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే"


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


అంటే తెలుగులోనూ,సంస్కృతం లోనూ మాలా పద్యాలు రాసి


చెప్పగలిగేవారిని చూపించండీ మా మీసాలు తీసి మీకాళ్ళకు


మొక్కుతాం అని.


ఒక పామరుడు కూడా పద్యం పాడగలిగే స్థాయికి


వాళ్ళు పద్యాలకి ప్రచారం కల్పించారు🙏🙏


అంతేకానీ మా కులాన్నిమీరు గుర్తించండి అనలా....


మాటాలెంట్ ని గుర్తించండి అన్నారు..


అది తేడా..😊

👉సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము. 👈 (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)

👉సత్యహరిశ్చంద్రీయము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము. 👈

(బలజేపల్లి లక్ష్మి కాంత కవి .)


సీ.

కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది-

ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు


కాఁబోలు వీరు విగత జీవబాంధవు-

లడలుచుండిరి మహార్తారవములఁ


గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌-

నెమకుచుండిరి కపాలముల కొఱకు


గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి-

పలలంపు బువ్వంపు బంతి సాగెఁ


జిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ-

గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి


నెటఁబెడీలను రవములే యొసఁగుచుండు-

దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల.

.


గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల


మసనమునఁ గాల్పరే కద మనుజులార?


కాఁపు లేదనుకొంటిరేమో పదండు


దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు.


🤲

శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌


నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం


తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో


నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.

🤲


ఓహో! ఎవ్వతె వీవు?


స్రగ్ధర: పడతీఁ యేకాకివై నిర్భయమున నిటకున్‌ వచ్చి నా యాజ్ఞ లేకీ


నడిరేయిన్‌ వల్లకాట న్శవ దహన విధి న్సల్పుచున్నావుగా! ఛీ


చెడుగా చాల్లాలు పోపో చెడెదవు తగునే చేడె కీకృత్యముల్‌ నా


కడనా నీ మ్రుచ్చు వేసాల్కదలు కదలుమా కాడు నీ యబ్బ సొమ్మా!

🤲


ఏమీ! ఇంకేమీ లేదా? చూడు,


మ. దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీరెండలన్‌


మలియింపన్‌ దిశలన్‌ ద్వదీయ గళసీమన్‌ బాలసూర్యప్రభా


కలితంబై వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాఁబోలు! నే


వెలకైనం దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్‌ జెల్లదే?


🤲

అయ్యో! దైవమా! రెండవ సురజ్యేష్ఠుండగు వసిష్ఠ మహర్షి ప్రభావంబుచే 


నా పతికి దక్క నన్యులకు గోచరంబు కాని నా మంగళసూత్రం బొక్క 


చండాలుని కంటఁ బడెనా! కాదు కా దీతఁడు నా పతి హరిశ్చంద్రుడే.

 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


ఇది హరితసగోత్ర పవిత్రనృసింహ మనీషి వరపుత్త్ర బుధజనవిధేయ


లక్ష్మీకాంత నామధేయ ప్రణీతంబైన శ్రీ హరిశ్చంద్రీయనాటకంబు !


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Wednesday, April 25, 2018

👉చందమామ కధ.!

👉చందమామ కధ.!


పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు.


అతడికి విపరీత మయిన కథల పిచ్చి.తన ఆస్థానం లో వున్న


వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు.


అందరికీ విసుగై పోయింది. మంత్రి రాజుతో సంప్రదించి రాజుకు


కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం


యివ్వ బడుతుందనీ టముకు వేయించాడు.


ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు.


ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు.


అతనికి విసుగే వుండేది కాదు.ఎంత మంది వచ్చినా రాజును తృప్తి


పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం


రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు.


కొంత మంది యువకులుసగం రాజ్యం ఆశతోవచ్చారు


ఆ యనను సంతృప్తి పరచలేక మరణించారు.


ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని


పదే పదే ఈ విషయం గురించి సతాయించే వాడు.


ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని


వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు.


ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు.


ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు


పండించాడు.ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పంట పండింది.


ఆ రైతు ఒక పెద్ద గోదాము కట్టించి వంద పుట్ల జొన్నలను అందులో


వుంచాడు.దాన్నిఅన్ని పక్కలనుంచీ మూసివేసినా ఒక మూల చిన్న


కంత వుండి పోయింది.అది ఒక పిట్ట చూసింది.ఆ కంత లోనుంచి


లోపలి పోయి తనముక్కున ఒక గింజ కరుచుకొని పోయింది


మళ్ళీ వచ్చి ఒక గింజ ముక్కున కరుచుకొని పోయింది


యిది చూసి మిగతా పిట్టలు కూడా వచ్చి ఒక్కో గింజా ముక్కున


కరుచుకొని పోతూ వున్నాయి.ఒక పిట్టా ఒక గింజ,ఒకపిట్టా


ఒకగింజ అంటూ అదే మాట చెప్తూ వచ్చాడు దినాలు గడుస్తున్నా


అదే చెప్తూ వున్నాడు.రాజుకు విసుగు పుట్టింది


తరువాతి కథ చెప్పకుండా యిదేమిటి?అని విసుక్కున్నాడు.


అందుకు అతను మహారాజా!మరి అన్ని పుట్ల ధాన్యం అయిపోవాలికదా!


ఆ తరువాతే మిగతా కథ అని మరీ ఒక పిట్టా ఒక గింజ అని మొదులు


పెట్టాడు..రాజుగారికి తల బొప్పి కట్టింది.యింక చాలించు మహా ప్రభూ


అన్నాడు.అందుకు వాడు


ఎలా చాలించేది ప్రభూ!చాలిస్తే నా చావు తప్పదు కదా! అ


ని మరీ మొదులు పెట్టాడు.రాజుకు విసుగు పుట్టి


యిక మీదట కథలు చెప్పమని అడగను నీకు అర్ధ రాజ్యం యిస్తాను


దయచేసి యింక చాలించు అన్నాడు.


అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా అన్నారు బాగుంది


.యింకేప్పుడూ కథలు చెప్పమని ఎవరినీ యిబ్బంది పెట్టకండి.


అని అర్ధ రాజ్యం నాకేమీ వద్దు కొంత ధనం యిప్పించండి చాలు అన్నాడు.


అప్పుడు రాజు అతనికి జీవితానికి సరి పడా ధనం యిచ్చి


పంపించాడు.అందరూ ఈ కథల పీడ వదిలించి నందుకు


ఆ బ్రాహ్మడిని అభినందించి ఊపిరి పీల్చు కున్నారు..అప్పటి నుండీ


ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ప్రజానురంజకంగా పరిపాలించాడు.


అధికారం చేతిలో వుంది కదా!


అని ఎవరు కూడా ప్రజలను,తనక్రింది అధికారులనూ సతాయించ కూడదు.ఏ విషయం లోనైనా సరే.


మా చిన్నప్పుడు మా నాన్నను మేము కథ చెప్పమని సతాయిస్తే


ఈ కథ మొదులు పెట్టేవారు.


తరువాత ఎప్పుడో ఈ కథ చందమామ లో చదివాను.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

👉చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం 👈 (శంకరాభరణం....నేపధ్య సంగీతం)

👉చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం 👈

🤲🤲🤲🤲“శంకరాభరణం....నేపధ్య సంగీతం 🤲🤲🤲

శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.

నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం

లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి

కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం.

నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది.

బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల

తోనూ విన్పిస్తాడు .

ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత .

🌷🌷ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .🌷🌷🌷

శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పద సవ్వడిలో

మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి లజ్ఞాతకు

నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది

👉తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు

”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం

👉అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట.

👉రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం,అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .

👉అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో”మానస సంచరరే ”పాట ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి

”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం

ఔచిత్యానికి పరాకాష్ట

మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శ౦కర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .

ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .

👉ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది

ఇది మహ దేవన్ విశ్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్తాఫలం.

.

🌷జయహో జంధ్యాల🌷

👉ఆ గుర్రపు డెక్కలచప్పుడు లో కూడా ఆయన కోపం

వినపడుతోందమ్మో !

👉పురోహితుడికి నత్తి మనకి భక్తీ ఉండకూడదు (తులసి తల్లి).

👉నేను వయసులో ఉన్నప్పుడు మా ఊళ్ళో మొగాళ్ళెవరూ కాపరాలు చెయ్యలేదు ఆ రోజుల్లో (తులసి తల్లి).

👉ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమయిన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు తులసీ

👉ఆ లోకేశ్వరుడికి తప్ప లోకులకి భయపడనురా మాధవా (శంకరశాస్త్రి)

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఒక కుమారి జాలి కధ !

ఒక  కుమారి జాలి కధ !


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


పదారేళ్ల వయసులో జయలలిత ఇలానే కల కంది. 

ఓ మామూలు ఆడపిల్లలా కలల రాకుమారుడు వస్తాడని, 

పెళ్లి చేసుకుంటాడని, ఓ మంచి గృహిణిగా బతకాలనీ కోరుకుంది...!


‘ఆజా సనమ్‌.. మధుర చాందినీ మె హమ్‌.. తుమ్‌ మిలే తో విరానే మే భీ ఆ జాయేగీ బహార్‌.. జూమే లగేగా ఆసమాన్‌..’ అంటూ ఇష్టంగా, తన్మయత్వంతో పాడేది. ఆ క్షణంలో... ఆ కళ్లల్లో గతం తాలూకు కలల మెరుపులు. బహుశా ఈ కల నిజమై, ఆమె కోరుకున్న మనిషితో పెళ్లి జరిగి, ఓ మంచి గృహిణిగా స్థిరపడి ఉంటే... భారత చరిత్రలో నిలిచిపోయే నాయకురాలు పుట్టేది కాదేమో!


‘ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి?’ అని అడిగితే ‘అన్‌కండిషనల్‌ లవ్‌ అనేదే నిజమైన ప్రేమ, ఎలాంటి షరతులు లేని ప్రేమ, అలాంటి ప్రేమ ఉందంటే నేను నమ్మను’ అని అంటారామె. ఎలాంటి నిజాన్నయినా చెప్పగలిగే ధైర్యం ఆమె సొంతం.


‘నారీ కాంట్రాక్టర్‌ అంటే నాకు ఇష్టం, అతన్ని చూడ్డం కోసమే మ్యాచ్‌లకి వెళ్లేదాన్ని. తర్వాత షమ్మీ కపూర్‌ మీద ఓ బలమైన ఆకర్షణ. జంగ్లీ సినిమాను ఎన్నిసార్లు చూశానో.. అన్ని పాటలు నోటికి వచ్చేవి అప్పట్లో’ అని జయలలిత చెప్పేవారు.


‘అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతుందేమో అని, ఆమె చీర చెంగుని నా చేతికిచుట్టేసుకుని పడుకునే దాన్ని.. అమ్మ నన్ను వదిలి వెళ్లక తప్పని పరిస్థితుల్లో నా చేతికి చుట్టుకున్న తన చీరని విప్పి, వేరే చీరని కట్టుకుని, ఆ చీరను మా అత్తకు కట్టించి అలాగే నా పక్కన పడుకోమని చెప్పి వెళ్లేది.. పొద్దున లేచి చూస్తే మా అమ్మ చీరలో మా అత్త నా పక్కన పడుకుని కన్పించేది..’ అని జయలలిత అన్నప్పుడు జయ కనుపాపల్లో ఆమె తల్లి ప్రతిబింబం కనిపిస్తుంది.


చిన్నప్పుడు తనకి ఎదుటివారి కోపం అంటే భయం, ఒకరితో గొడవ పడటం అంటే భయం, వాదనలంటే భయం, ఎదిరించడమంటే భయం.. అసలు పదిమందిలో ప్రముఖంగా కన్పించాలంటేనే భయం.. ఉన్న చోటు తెలీకుండా బతకాలనుకునేది. కానీ విధి ఆమె కోసం వేసుకున్న ప్రణాళిక వేరు.


జయలలిత అన్నాడీఎంకే పార్టీలో సభ్యత్వాన్ని పొందిన సందర్భంలో ఒకసారి ఇలా అన్నారు.. ‘ఈ సమాజమే నాయకుడి జన్మకు కారణమవుతుందని నమ్ముతున్నా. ప్రతి మనిషిలోనూ అన్యాయాన్ని ప్రశ్నించే ఓ స్వభావం ఉంటుంది. ప్రతిస్పందించే ఒక నిజాయతీ ఉంటుంది. వాటిని ఎవరన్నా తట్టిలేపితే నాయకుడవుతాడు’ అని పేర్కొన్నారు.


ఒక మామూలు ఆడపిల్లగా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రోడ్డుమీద కనిపించే చిన్న చిన్న ఘటనలు ఆమె మనసుని కలచివేసిన సందర్భాలెన్నో. చెన్నై మౌంట్‌రోడ్‌లో బస్టాపుల దగ్గర బిక్షాటన చేస్తున్న చిన్నపిల్లల్లి చూస్తూ తన పాటికి వెళ్లలేక, ఆగి.. తనదగ్గర దాచుకున్న డబ్బుతో వాళ్లకి పుస్తకాలు కొనిచ్చి, చదువుకోమని చెప్పిన రోజుల్లో ఆమె అనుకొని ఉండదు.. తాను ఓ రాష్ట్రాన్ని శాసించే శక్తిగా ఎదుగుతానని!


ఆమెలో ఇతరులకి సేవ చేయాలనే తపన చిన్నప్పుడే మొలకెత్తిందని చెప్పడానికి ఇలాంటి ఆధారాలెన్నో. అయితే అది రాజకీయంగా ఎలా రూపాంతరం చెందింది అనేది తరచి చూస్తే దానికి కూడా ఆమెలో దాగి ఉన్న ప్రశ్నించే స్వభావాన్ని తట్టిలేపిన ఘటనలే కారణమని చెప్పొచ్చు.


లైమ్‌లైట్‌లో ఉండడానికి ఇష్టపడని ఒక సాధారణ అమ్మాయి.. అమ్మ ఆదేశానుసారం నటిగా కొత్త జీవితం ప్రారంభించింది. అమ్మచాటు బిడ్డగా నటిగా ఎదుగుతున్నప్పుడు, అమ్మ చనిపోవడంతో ఒంటరిగా జీవితంతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఎమ్జీఆర్‌ ఆమెకు అండగా నిలిచారు. ఆయనకి చేదోడు వాదోడుగా ఉండటం కోసం పార్టీలో చేరారు జయ. ఎంతో నమ్మకంగా పనిచేశారు. అయితే అసెంబ్లీలో కరుణానిధి అవమానించడమే ఆమె రాజకీయ జీవితంలో మలుపు అని అందరూ అనుకుంటారు కానీ.. అది నిజం కాదు....


ఎమ్జీఆర్‌ చనిపోయినప్పుడు అంతిమ యాత్రలో జయలలిత పాల్గొనడానికి వస్తుంటే ఆమెని కిందికి దింపేశారు.. నీ అవసరం లేదంటూ. అంతవరకూ ఆమెకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఆమెకి ఆ సమయంలో ఉన్న ఆలోచనంతా, తనెంతో గౌరవించిన ఎమ్జీఆర్‌కి చివరి దాకా వెంట ఉండాలి అన్న వేదన తప్ప వేరే ఏ ఆలోచనా లేని నిష్కల్మషమైన అభిమానం ఆమెది. అంతిమ యాత్రలో పాల్గొనలేని పరిస్థితులకు ఆమె ముందు బాధపడింది. ఆ తర్వాత ప్రశ్నించడం మొదలుపెట్టింది.


ఫలితంగా అన్నాడీఎంకేలో రెండు శాఖలు ఏర్పడ్డాయి. కోడిపుంజుని తన శాఖకి గుర్తుగా ఆమె ఎంచుకుంది. నిజానికి ఆమె జీవితంలో ఒంటరి పోరాటం అప్పట్నుంచే ప్రారంభమైంది. ఆమె వేసిన ఒక్క ఒంటరి అడుగు వెనక వందల వేల లక్షల అడుగులు తోడుగా పడ్డాయి అతి తక్కువ కాలంలో. ఆ తర్వాత ఆమె ఎంత శక్తిమంతంగా పనిచేసిందంటే.. చివరికి‘నువ్వు అవసరం లేదు’ అన్న వాళ్లే ‘ఈ పార్టీకి రెండు శాఖలు అవసరం లేదు, పార్టీకి నువ్వే అవసరం’ అని శరణు కోరి, పార్టీ గుర్తు రెండాకుల్ని, పార్టీ వారసత్వాన్ని కూడా ఆమె పరం చేశారు.


ఆ రోజు ఆమెని అంతియ యాత్ర నుంచి పంపేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలీదు.. కానీ ఆమెలో నిద్రిస్తున్న పులినీ, ప్రశ్నించే స్వభావాన్ని తట్టిలేపి నాయకురాలిని చేసింది ఆ ఘటన!


ఎలాంటి ఉద్వేగమైనా.. అది కోపం కానివ్వండి, సంతోషం కానివ్వండి.. వెంటనే వ్యక్తం చేసే సహజసిద్ధమైన స్త్రీత్వం ఆమె సొంతం ఒకప్పుడు....


సినీ నటి సూర్యకాంతం షూటింగ్‌లకి ఏదో ఒక ఫుడ్‌ ఐటమ్‌ ఇంట్లో చేసుకొని వచ్చే వారు. అయితే ఆమె వండే పులిహోర అంటే జయకి చాలా ఇష్టం. ఒకరోజు షూటింగ్‌లో సూర్యకాంతం పులిహోర తీసుకొచ్చారు. పొద్దున షూటింగ్‌ మొదలైనప్పట్నుంచీ జయ కళ్లన్నీ ఆ పులిహోర మీదే. ఎప్పుడెప్పుడు బ్రేక్‌ ఇస్తారా.. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. బ్రేక్‌ రానే వచ్చింది వెంటనే పులిహోర బాక్స్‌ తెరిచి ఆవురావురుమని తింటుంటే ఎక్కిళ్లు వచ్చాయి. వెంటనే నీళ్లిచ్చి ప్రేమగా తడ్తున్న సూర్యకాంతం వైపు జయ ప్రేమగా చూసింది. ‘ఆ సమయంలో ఆమెలో అమ్మ కనిపించింది’ అని ఓ ఇంటర్వ్యూలో జయ చెప్పారు....


సూర్యకాంతం చనిపోయినప్పుడు ఆ రోజు ఉదయం కుటుంబసభ్యులు ఆమె చుట్టూ ఉన్నారు. ఉన్నట్టుండి ఓ వార్త.. ‘ముఖ్యమంత్రి వస్తున్నారు’అంటూ! క్షణాల్లో అక్కడికి సీఎం జయలలిత చేరుకున్నారు. సూర్యకాంతం చూపించిన మాతృప్రేమని మర్చిపోకుండా, పదిలంగా గుండెల్లో దాచుకుని, ఆమె ఇక లేరు అన్న వార్త తెలియగానే.. ఉన్న పనులన్నీ పక్కనపెట్టి ఆమె భౌతికకాయం వద్ద మౌనంగా, బాధగా గడిపిన జయలలితను ఏమని వర్ణించాలి? జయ మాటల్లోనే చెప్పాలంటే.. ‘నా మనసుని కదిలించిన సంఘటనలను, మనషులనూ నేనెప్పటికీ మర్చిపోను. నాలో ఒకరి పట్ల ఉన్న ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, కృతజ్ఞత కానీ పోతాయి అంటే అది నా తుదిశ్వాసతోనే!’.


ఒకానొక సమయంలో జయని చో ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చోకి ఒంట్లో బాలేదంటే, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి ‘యు విల్‌ కమ్‌ అవుటాఫ్‌ దిస్‌ వెరీసూన్‌’ అని అన్నారు. అదే నిజమైతే నాకు మరింత షాక్‌ అని చో బలహీనమైన స్వరంతో జోక్‌ వేశారు. జయ మాత్రం.. అలా అనకండి. మీకేం కాదు. అని ధైర్యంగా చెప్పారు. ఆ మాట ఏదో మాటవరసకి అన్నది కాదు. ఆమె మొహమాటం కోసం మనుషుల్ని చూడటం, మాట్లాడం చేయరని ప్రతీతి.


ఆమె కనుచూపు మేరలో కన్పించే వాటినన్నింటినీ మనస్ఫూర్తిగా చూస్తారు. ఒకరోజు ఆమె పోయస్‌ గార్డెన్‌లోకి రాగానే.. తన సెక్యూరిటీని పిలిచి గార్డెన్‌కి రావటం కోసం తిరిగే మలుపులో ఓ కొట్టు ఉంటుంది, అక్కడ రోజూ ఓ ముసలాయన ఉంటాడు. రెండ్రోజుల్నించి చూస్తున్నా. కొట్టు మూసేసి ఉంది. అతనికి ఏమైందో కనుక్కోండి అని ఆదేశించారు. రెండు నిమిషాల్లోనే వార్తను మోసుకొచ్చారు సిబ్బంది. ముసలాయనకి జ్వరం, లేవలేకుండా ఉన్నాడు అని. వెంటనే ఆయన తరఫు వాళ్లని తీసుకురండని చెప్పడం.. వాళ్లకి వైద్యం కోసం డబ్బు ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి.


ఆమెలోని గాంభీర్యానికి!


కరుణానిధి వల్ల ఆమె రెండు ప్రధానమైన అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకటి, 1989లో అసెంబ్లీలో జరిగిన అవమానం, రెండోది కరుణానిధి అధికారంలోకి వచ్చాక ఆమెపై కేసులు పెట్టి జైలుకి పంపడం. ఈ రెండు అవమానాల మధ్య ఆమె చేసిన ప్రయాణంలో ఆమె వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించారు. జైలుకి వెళ్లినప్పుడు ఆమె ప్రతిస్పందించిన తీరులో ఉన్న గాంభీర్యం ఎంతటివారికైనా మతిపోగొడ్తుంది.


ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ‘జైలులో అడుగుపెట్టిన ఆ రోజుని నేను మరిచిపపోలేను. జీపులో ఎక్కుతున్నప్పుడే మానసికంగా ఏం ఎదురైనా స్వీకరించాలని సిద్ధపడే ఎక్కాను. చాలాకాలం మూతపడి ఉన్న పాత బిల్డింగ్‌ని నా కోసం గౌరవనీయులైన కరుణానిధి ప్రత్యేకంగా తెరిపించారు. లోపల దుమ్ము, ధూళి, ఎలుకలు, పందికొక్కులు, తేళ్లు, జెర్రులు.. ఒక చిన్న జువాలజీ క్లాస్‌ తీసుకోవచ్చు అక్కడ. కటిక నేలమీద పడుకున్నాను. నెల్రోజులు గడిపాను. ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. రాలేదంటే నేను రానివ్వలేదని కాదు అర్థం. నిజంగానే రాలేదు. ఇలా నేను మారడానికి ఒకటే కారణం. మనల్ని అవతలి వారు వ్యక్తిగతంగా గాయపరిచినప్పుడు మనం బాధ పడతాం. ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే.. మన ముందు ఉన్న పరిస్థితిని మనం అంగీకరించకపోవడం వల్లే. నేను జైల్లో బాధపడితే చూడాలని అనుకున్నారు. సిబ్బందిని అడిగారట ఆమె ఏడుస్తోందా? అని. లేదు సార్‌ ఆమె ఏడవలేదు అని అంటే వాళ్లు నిరాశ చెందారని విన్నాను. నిజానికి వారి నిరాశ నన్ను ఆనందపరిచింది’ అని ఆమె చెప్పారు.


సవాలుని స్వీకరించడం ఇష్టం!


బాధపెట్టిన వాళ్లకి.. ఈమె జోలికి ఎందుకు వెళ్లామా అని బాధపడేలా బుద్ధిచెప్పడం ఇష్టం.. భయపడని, మడమతిప్పని, కార్యదక్షత ఇష్టం.. ‘ఉన్నై నాన్‌ సందిత్తేన్‌ నీ ఆయిరత్తిల్‌ ఒరువన్‌’ అనే ఎమ్జీఆర్‌ పాట ఇష్టం.. సూర్యకాంతం అమ్మ వండే పులిహోర అంటే ఇష్టం.. ఈ ప్రపంచమంతా తన బంధువర్గమే అన్న భావన ఇష్టం.. ముదురు ఆకుపచ్చ రంగు ఇష్టం. మాటలు కాదు చేతల్లో అనుకున్నది చేసి చూపడం ఇష్టం.. వీటన్నింటితోపాటు ఆమెకి తన ఆరోగ్యం తన వ్యక్తిగత విషయంగా ఉంచడమే ఇష్టం.


‘మన కోసం మనం బతకాలనుకున్నప్పుడు ఒకలా ఉంటాం. ఇతరుల కోసం మనం జీవించాలి అనుకున్నప్పుడు మనకే తెలియకుండా ఒక అనూహ్యమైన పరిణతిని పొందుతాం. మనం వూహించని విధంగా రూపాంతరం చెందుతాం. నేను ఇలా అవుతానని ముందే వూహించి ఉంటే బహుశా భయపడి వుండేదాన్నేమో. పార్టీలో చేరడమే మానుకునే దాన్నేమో. పార్టీలో చేరేనాటికి నేను మామూలు ఆడపిల్లని మరి. భయస్తురాల్ని కూడా. ఒక మామూలు అమ్మయి నుంచీ.. ఇలా మారటం నా డెస్టినీ’ అని అన్నారామె.


ఆమ్మ లేని తమిళనాడు!


పెద్దదిక్కు పోయిన కుటుంబంలా.. మొదలె తెగిన చెట్టులా.. పునాదులు కూలిన కోటలా.. తల్లిలేని పిల్లల్లా.. అనాథలా.. అయోమయంగా.. భవిష్యత్తు లేనట్టుగా.. ప్రశ్నలా.. ఆమె అభిమానులు తల్లడిల్లుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎటువంటి వారసత్వం లేకుండా.. ఒంటరిగా, పోరాడి, ఎదిరించి, గెలిచి నిలిచిన స్త్రీ శక్తి.. జె. జయలలిత..!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Monday, April 23, 2018

అందెలు గజ్జెలు !

అందెలు గజ్జెలు !

🤲🤲🤲🤲

-

అందెలు గజ్జెలు మ్రోయగ


చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా


నందుని సతి యా గోపిక


ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా...!!


👉తాత్పర్యం :


ఓ శ్రీకృష్ణా....!! పసితనంలో నీ కాళ్ళకు అలంకరించిన అందెలు,


గజ్జెలు చప్పుడయ్యేటట్లు గంతులు వేస్తూ వేడుకగా నందుని భార్య


అయిన యశోద ముందర ముద్దులొలికేటట్లు నీవు ఆడుచుంటివి


కదా...!! అని ఈ పద్యం యొక్క భావం.-


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పద్యం:

అందెలు పాదములందున


సుందరముగ నుంచినావు సొంపలరంగా


మందరధర ముని సన్నుత


నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా!


👉తాత్పర్యం:


పాదములందు ముద్దులొలుకునట్లుగా అందమైన అందెలను


ధరించి ఉన్నావు.మంధర పర్వతమును కూర్మావతారములో


మోసినట్టి కృష్ణా మునులచేత నుతులను గైకొనువాడా!


నందుని ప్రియపుత్రుడా!నిన్నే నమ్మితిని.నీవే నాకు దిక్కు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు.

శుభరాత్రి!

-

సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు.


సౌందర్యాన్ని గుర్తించి, దానికి శిరసువంచి నమస్కరించి,


ఆనందించగల సంస్కారం అలవరచుకుంటే తప్ప వచ్చేది కాదు.


అదే రసికత. రసికత అంటే Sensual Pleasure కాదు.


దురదృష్టవశాత్తూ దానికి ఆ అర్థం రూఢి అయిపోయింది .


సౌందర్యం మనలో ప్రేమ కలిగించడమేమిటి? అని అనుకోవచ్చు.


సౌందర్యం అన్నివేళలా మదనవికారాన్నే కలిగించనక్కరలేదు.


ఒక ఆశ్చర్యం, ఒక విభ్రమం, ఒక ప్రశాంతత,


ఒక అనిర్వచనీయమైన వాక్యసముదాయం


ఏదైనా కలిగించవచ్చు.

కేవలం ఊహే అయినప్పటికీ, బహుశా అటువంటి స్థితికి


లోనయ్యేడేమో కాళిదాసు (సినిమాలో చూపించినట్టు)


“మాణిక్య వీణాం…”


అన్న శ్లోకం చదివే సందర్భంలో

.

మాణిక్య వీణా ముఫలాలయంతీం


మదాలసాం మంజుల వాగ్విలాసాం


మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం


మాతంగకన్యాం మనసా స్మరామి


చతుర్భుజే చంద్రకళావతంసే


కుచోన్నతే కుంకుమరాగశోణే


పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే


నమస్తే! జగదేకమాతః జగదేకమాతః ...ఆ...


మాతా...! మరకతశ్యామా! మాతంగీ మధుశాలినీ!


కుర్యాత్కటాక్షం కల్యాణీ! కదంబ వనవాసినీ...!


జయ మాతంగతనయే...!


జయ నీలోత్పలద్యుతే!


జయ సంగీతరసికే!


జయ లీలాశుకప్రియే...!


జై జననీ!


సుధాసముద్రాంత ఋద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ


మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియే...!


కృత్తివాసప్రియే...!


సాదరారబ్ధ సంగీతసంభావనా సంభ్రమాలోల నీప స్రగాబద్ధ


చూళీ సనాథత్రికే!


సానుమత్పుత్రికే...! 

శేఖరీభూతశీతాంశురేఖా మయూఖావళీబద్ధ


సుస్నిగ్ధ నీలాలకశ్రేణి శృంగారితే!


లోకసంభావితే...!

కామలీలా ధనుస్సన్నిభభ్రూలతా పుష్ప


సందేహ కృచ్ఛారు గోరోచనా పంకకేళీ - లలామాభిరామే...


! సురామే! రమే...!


సర్వయంత్రాత్మికే!


సర్వతంత్రాత్మికే!


సర్వమంత్రాత్మికే!


సర్వముద్రాత్మికే!


సర్వశక్త్యాత్మికే!


సర్వచక్రాత్మికే!


సర్వవర్ణాత్మికే!


సర్వరూపే!


జగన్మాతృకే!


హే జగన్మాతృకే!


పాహి మాం పాహి మాం, పాహి పాహి!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Sunday, April 22, 2018

👉ప్రపంచం ..తెలివి ..నీతి.!

👉ప్రపంచం ..తెలివి ..నీతి.!


👉“ఈ ప్రపంచంలో తెలివైనవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు


.వదిలెయ్యకపోతే మేధావో, టీచరూ అవుతాడు.


👉బలమైనవాడు నీతిని వదిలేస్తే రాజకీయ నాయకుడు అవుతాడు.


వదిలెయ్యకపోతే శ్రామికుడు అవుతాడు.”


👉మనుష్యులు రెండు రకాలు.

తెలివైన వాళ్ళు. 

తెలివితక్కువ వాళ్ళు.


👉మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు. 

బలంలేని వాళ్ళు.


👉తెలివిగానీ, బలముగానీ లేనివాళ్ళు 

సామాన్యులవుతారు.


👉బలం వున్నవాడు 

నీతిని వదిలేస్తే 

పొలిటీషియన్ అవుతాడు.


👉తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే

కాపిటలిస్ట్ అవుతాడు.


👉తెలివైనవాడు నీతిని వదిలెయ్యకపోతే 

టీచరో, మేధావో అయి సంతృప్తి చెందుతాడు.


👉బలమైనవాడు నీతిని వదిలెయ్యకపోతే

శ్రామికుడై శక్తి ధారపోస్తాడు.


🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

Saturday, April 21, 2018

👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈


👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈


శ్రీ లలితా సహస్రనామం అత్యంత శక్తిమంతమైనదిగా ...


మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది.


'బ్రహ్మాండపురాణం' లో ఉత్తరభాగంలో లలితా సహస్రనామావళి


విశిష్టత కనిపిస్తుంది. 

దీనిని మొదటిసారిగా హయగ్రీవ స్వామి ... అగస్త్య మహర్షికి


బోధించాడు. ఆనాటి నుంచి కూడా లలితా సహస్రనామం తనని


విశ్వసించిన వారిని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వస్తోంది.


అందువల్లనే చాలామంది నిత్యం అమ్మవారి లలితా సహస్రనామావళిని


చదువుతూ వుంటారు.చాలామంది లలితను చదవడం వలన ఒకే


విధమైన ఫలితం ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులోని ప్రతి పంక్తి


ఒక్కో దోషాన్ని నశింపజేసి ... ఒక్కో పుణ్య ఫలాన్ని అందిస్తుంది.


ఆరోగ్యం .. సంపద .. సంతానం .. ఇలా ఏది కావాలనుకుంటే అది


పొందడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి.


ఆ పద్ధతులను పాటిస్తూ లలిత చదవడం వలన ఆశించిన ప్రయోజనం


నెరవేరుతుంది.


లలితాదేవిని నిత్యం సహస్ర నామాలతో ఆరాధిస్తూ .. అర్చిస్తూ


వుండటం వలన ఆ తల్లి అనుక్షణం కాపాడుతూ వుంటుంది ..


కరుణిస్తూ వుంటుంది.


👉అంబా శాంభవి చంద్రమౌళిరబలాzపర్ణా ఉమా పార్వతీ


కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ


సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా


చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||👈


ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

👉లోకానికి శుభ సందేశం... గీతోపదేశం.👈



👉లోకానికి శుభ సందేశం... గీతోపదేశం.👈


💥💥💥💥💥💥జ్యోతిర్మయం💥💥💥💥💥💥


సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన భగవద్గీత


పంచమవేదంగా, భారతామృత సర్వస్వం గా వినుతికెక్కింది.


శ్రీకృష్ణస్వామి అర్జునుణ్ణి ఒక కారణంగా పెట్టుకుని లోకానికి


అంతటికీ చేసిన గీతో పదేశం మానవులందరి దైనందిన జీవితాన్ని


సంస్క రించడానికి ఉద్దేశించినది.


భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదు. అది అభిమత గ్రంథం.


చదవా లనే జిజ్ఞాస కలవారందరికీ ఒక కరదీపిక.


అధర్మాన్ని తుంచడానికీ, ధర్మాన్ని స్థాపించడానికీ ఉద్యుక్తుడు


కావలసిన క్షణంలో అర్జునుడు కర్తవ్యతా విమూఢు డైనప్పుడు


పరమాత్ముడు బోధించినదే గీత.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అగ్రహారం !


అగ్రహారం !


🌷🌷🌷🌷

అగ్రహారం అనే పదం చాలా గ్రామనామాలకు ఉత్తరపదంగా ఉంటుంది.


బ్రాహ్మణులకు వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, వారి విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు


దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.


అలాంటి గ్రామాలను అగ్రహారమని పిలుస్తారు. అగ్రహారం అనే పదం


అనుబంధంగా ఉండే గ్రామాలు ఈ కింది విధంగా ఉన్నాయి


👉పురుష నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న


పూర్వపదం పురుషనామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి.


ఆ సందర్భంలో ఎవరి పేరున ఐతే అగ్రహరం నామం ఏర్పడిందో వారికే


ఆ అగ్రహారం దానంగా లభించిందని ప్రతీతులు ఉండడం కద్దు.


🙏ఉదాహరణలు: లింగరాజు అగ్రహారం, శంకర అగ్రహారం,


సూరన అగ్రహారం, లింగన అగ్రహారం.


👉కుటుంబ నామసూచి: అగ్రహారం అన్న పదానికి ముందున్న


పూర్వపదం కుటుంబ నామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి.


గ్రామనామం ఏర్పడిన కుటుంబీకులు అగ్రహారాన్ని అనుభవించేందుకు


దానం లభించినవారయ్యే అవకాశాలు ఎక్కువ.


🙏ఉదాహరణలు: వేదంవారి అగ్రహారం, మధ్వపతివారి అగ్రహారం.


👉కులసూచి: కొన్ని అగ్రహారాలకు పూర్వపదంగా కులాల పేర్లు



ఉన్నాయి.

🌷ఉదాహరణలు: గొల్ల అగ్రహారం


👉గ్రామనామ సూచి: కొన్ని గ్రామనామాల్లో అగ్రహారం అనే పదానికి


పూర్వపదంగా గ్రామనామాలు ఉన్నాయి. ఊరిపేరులో పూర్వపదంగా


ఉన్న గ్రామనామం పక్కన కొత్తగా అగ్రహారం ఏర్పడడమూ, ఆ గ్రామం


దగ్గరి/యొక్క అగ్రహరం అన్నట్టుగా సూచించేందుకు ఇలాంటి పేర్లు


ఏర్పడుతూంటాయి. ఉదాహరణకు బొమ్మవరం అగ్రహారం అనే


గ్రామనామంలోని బొమ్మవరం అనే పదం పూర్వపదంగా ఉంది.


బొమ్మవరం గ్రామానికి చేరి ఉన్న ప్రదేశాన్ని జమీందారు/రాజు ఒక


పండితునికి దానం చెయ్యగా అక్కడ ఏర్పడిన అగ్రహారానికి


బొమ్మవరం అగ్రహారం అనే పేరు వచ్చిందని చెప్తారు.


🌷ఉదాహరణ: బొమ్మవరం అగ్రహారం, రామాపురం అగ్రహారం.


👉స్థలనామ సూచి: అగ్రహారానికి పూర్వపదం స్థలనామాన్ని


సూచిస్తూండేలా ఏర్పడిన గ్రామనామాలు ఉన్నాయి.


🌷ఉదాహరణ: అత్తితోట అగ్రహారం, నడిమిగడ్డ అగ్రహారం.


🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲


Friday, April 20, 2018

ఒక ఇల్లాలి ఘోష.!🤲 (కరుణ శ్రీ కి క్షమాపణలతో )

ఒక ఇల్లాలి ఘోష.!🤲

(కరుణ శ్రీ కి క్షమాపణలతో )

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఉత్పల మాల.

"నేను కిచెన్ను సింకు కడ నిల్చి చివాలున గిన్నె తీసి చే

యానెడునంతలోన అవియన్నియు జాలి గ నోళ్ళు తెర్చి మా

మై లానము శుద్ధి చేయమని మంచిగ యన్నవి కృంగి పోతి నా

మానసమందెదో తళుకు మనది అంట్ల పురాణ కావ్యమై.!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

.

సింక్ లో అంట్ల గిన్నెలు ,ఇంకెప్పుడు వస్తావు ?

అని జాలిగా పిలుస్తున్నాయి ,

అంతే మనకి ఇలాంటి పిలుపులే ..,

పిల్లలు ఇల్లు వదిలాక, అంట్లు ,గిన్నెలు ,తపాళాలు

ఇవే చప్పుడు చేస్తున్నాయి ...

😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫

పగలే వెన్నెలా. జగమే ఊయలా -

పగలే వెన్నెలా. జగమే ఊయలా -


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


.పగలే వెన్నెలా. జగమే ఊయలా - కదిలే ఊహలకే కన్నులుంటే'


సినారె గారి అద్భుత కవిత్వం.🙏🙏🙏


చిన్నప్పటి నుంచీ నా మనస్సులో ముద్రించుకు పోయిన పాట ఇది.


పూజాఫలం సినిమాలో జమున అందమైన కళ్ళతో అభినయం...

..

ఊహ తెలి సే రోజుల్లో, ఓ ఎండాకాలం వెన్నెల రాత్రి


మా అత్తయ్యకూతురు ఈ పాట పాడగా విన్నాను,


అప్పటి నుంచీ ఈ పాట ఎక్కడ విన్నా, ఆగి పూర్తగా వినాల్సిందే.


అంతగా కట్టివేసిందీ పాట నన్ను.


ఓ మిత్రుడు అన్నట్లు కొన్ని పాటలు కళ్లు మూసుకొని వినాలి.


కొన్ని చెవులు మూసుకొని వినాలి.


ఈ పాట ఖచ్చితంగా కళ్లు మూసుకునే వినాలి.


మిమ్మల్ని ఎక్కడో వెన్నెల నిండిన ప్రశాంత తీరాలకి తీసుకెళ్లి


వదులుతుంది. దేవుడు మనకిచ్చిన వరాల్లో వెన్నెల ఒకటని


నా స్వచ్చమైన అభిప్రాయం. వెన్నెలని అనుభవించని జీవితం


అమావాస్యే.


వెన్నెలకు వసంత కాలం తోడయిందనుకోండి పెసరట్టు ఉప్మా


చందమే.


'అక్టోబర్ నెలా, మార్చి నెలా - ఈ రెండు నెలలూ, సంవత్సరం


మొత్తానికి వరాల్లా అనిపిస్తాయి, 

మిగిలిన కాలమంతా ముసురు, ఎండ, ఉక్క, చలి. అయినా భరిస్తాం.


మార్చి వస్తుంది. వసంతం వస్తుంది అక్టోబర్ వస్తుంది. శరత్తు వస్తుంది.


అన్న చిరు ఆశతో తక్కిన కాలాలను స్థిమితంగా భరించగలగడమే


కదా సాధనా.' ఎంత నిజం! మార్చి నెలలో కనీసం ఒక్క నిండు


పున్నమి వెన్నెల రాత్రన్నా మీరు ఆరు బయట పడుకుని, మంచి


వెన్నెల పాటల్ని వినకపోతే మీ ఖర్మ. పిండారబోసినట్లు వెన్నెల,


చల్లటి గాలి, కమ్మని సంగీతం,


ఇంతకంటే ఏం కావాలండి బాబూ మనసుని ఆనందంతో నింపడానికి.


కొంతమంది రసిక రాజులు ఇంకొంచెం ముందుకు వెళ్లి -


'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో...' అంటూ వెన్నెల రాత్రుల్లో


చల్లటి గాలిని వేడెక్కించడానికి ఇంకో మార్గం కనిపెట్టారు.


ఆయనెవరో కవి కాబట్టి సరిపోయింది గాని. నాలాంటి మర్యాదస్తుడు,


ఏకపత్నీ వ్రతుడు అలా ఊహించకూడని (పత్రికాముఖంగా ) వదిలేస్తున్నాను.


అసలా మాటకొస్తే, చాలా మంది కవుల హృదయాల్లో మరులు గోల్పేది వెన్నెలే.

.

బాల గంగాధర్ తిలక్ అయితే ఏకంగా,


'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అని


కమిట్ అయిపోయాడు.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Thursday, April 19, 2018

బాగు కోరేదే భాగవతం!

-

బాగు కోరేదే భాగవతం!


🙏🙏🙏🙏🙏🙏


శ్రీకృష్ణపరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును


యావత్తూ భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు


కాబట్టి ఎక్కడభాగవత కథా శ్రవణం జరుగుతుందో అదే


పుణ్యతీర్థమని.వెయ్యి అశ్వమేధయాగాలు, వంద వాజపేయ


యాగముల ఫలితం భాగవత కధా శ్రవణములో 16 వ వంతు


సరితూగనిదనీ, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మా్తమ్రుననే


శ్రీ మహావిషూ్ణవు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని


ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది.


ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపదిదేవికి అక్షయ వలువలు


ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వసా్తల్రను ఎందుకని


అపహరించాడుబాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు


ద్వారకాధీశుడైన తరువాతశమంతకమణిని అపహరించాలని


ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడనికి విశేష ప్రయత్నం చేసి


శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు


ఎందుకని శిశుపాలుడు, కంసుడు,జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేకమంది


దుష్టరాజులతో స్వయంగా యుధ్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు


పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకొన్నప్పటికీ మహాభారత సంగ్రామంలో


యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడ చేపట్టుకోనని ఎందుకు అన్నాడు.


గోపికలతో రాసకడ్రలు సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు


జారుడుగా, బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ


యాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడనికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు,


మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులచే ఏవిధంగా ఆమోదింపబడ్డాడు


శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవులను కాచాడు. ఆటలాడాడు, పాటలూ పాడాడు చి


లిపి చేష్టలు చేసి కొంటెవాడనీ అనిపించుకొన్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు.


పెద్దవాడై దొరగా రాజ్యపాలనా చేశాడు.


రాజనీతిని పాటించాడు. రాజకీయ వ్యవహారాలనూ నడిపించాడు రాయబారం చేశాడు


రధాన్ని నడిపాడు రాసకడ్రలు సలిపాడు గురుసేవలు చేశాడు ఎంగిళ్ళు తిన్నాడు విషాన్ని


హరించాడు బ్రాహ్మణుల పాదాలు కడిగాడుమహారాజులచే పాదపూజలందుకున్నాడు


శత్రువులను సం హరించాడు


చివరకు క్షవర కర్మ కూడ (రుక్మికి గడ్డాలు, మీసాలు జుట్టు గొరిగాడు) చేశాడు


ఆర్తులను ఆదరించి సేదతీర్చాడు ఆపదలోఉన్నవారిని బంధువుగా ఆదుకొన్నాడు


సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు


నిందలను మోసాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటినన్నిటినీ


ఎదుర్కొన్నాడు.


సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినుతికెక్కాడు ఆనందరూపుడై ఆబాలగోపాలాన్నీ


అలరించాడు మధుర మూర్తియై ప్రేమామృతాన్ని వెదజల్లాడు ఙ్ఞాన స్వరూపుడై


ఙ్ఞానకాంతులను విరజిమ్మాడు శాంతికాముడై ధర్మ స్థాపనకు ఉద్యమించాడు ఇలా


బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీ కృష్ణుని దివ్యమైన లీలలను, బోధలను


మహాత్మా్యన్ని స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ్ణతత్వంలో రమించే


సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే


భాగవతం చదవాలి భాగవత గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజూ పఠించాలి ఎంతగా పఠిస్తే,


అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి.


భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే


ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది భగవంతునిచే ఆదుకోబడిన


ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచలంచల విశ్వాసం ఉంచటం ఎంత


అవసరమో తెలుస్తుంది భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం


ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది ఎన్ని రూపాలలో,


ఎంతమందిని, ఎన్నిరకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం


చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు


సూచిస్తున్నారు..

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, April 18, 2018


👉బాపూబొమ్మాయణంలో ఆవకాయ .👈


ఆలూమగల అనురాగానికి ఆనవాలు ఆవకాయ అంటాడు బాపు.


గోరంత ఆవకాయముద్దపెట్టించి కొండంత దాంపత్యమమకారం


చూపుతాడు. ఇంటికి వచ్చిన అల్లుడికి మినపసున్ని,


కూతురు కోసం ఆవకాయ పుట్టింటివారు ఇస్తారని కూడా అనేశాడు.


తండ్రి కూతురు అనురాగానికి, భార్యాభర్తలప్రేమకు వారథి


ఆవకాయనేట. కూతురు కలిపిన ఆవకాయన్నం అలనాడు


అమ్మపెట్టిన గోరుముద్దలు ఒకటే అని ఒక తండ్రి భావన.


కూతురు అల్లుడు సఖ్యతకు ఆవకాయకలిపి అన్నం ముద్దలే


తార్కాణంగా అత్తమామలు తెలుసుకుంటారు.


తెలుగు వారి జీవితాల్లో పెనవేసుకుపోయిన ఆవకాయను


తన సినిమాల నుంచీ దూరం చేయని నిరంకుశుడు బాపు.


ఆవకాయ, నెయ్యితో హాస్యం పుట్టించవచ్చని అల్లూరామలింగయ్య


ద్వారా 8PMకి నిరూపిస్తాడు. ఆవకాయలోనే ఆయుధం


కూడా ఉందని కళ్లలోకి చల్లి నిరూపించేస్తారు మనఊరిపాండవులు.


అందాల రాముడికైనా భక్తశబరి వంటి బామ్మగారు


తరవాణిలోకి ఆవకాయబద్దవేయలేకపోయానని బాధపడిపోయి


అడగలేదేంరా రాముడూ అని నొచ్చుకుంటుంది.


నాన్న తిండిపెట్టద్దని శాసిస్తే జొన్నకూడు తో వెళ్లిన చెల్లి


ఆవకాయతోనే అన్నకు తూర్పు వెళ్లే రైలు చూపిస్తుంది.


ఒకటేమిటి రెండేమిటి. ఆవకాయలేనిదే బాపూ సినిమా లేదు,


తెలుగుతనమే లేదు. బాపూ బొమ్మకు లావణ్యరహస్యం ఆవకాయే.


🙏


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


Tuesday, April 17, 2018

గాయని ఎస్.పి. జానకి!

-

గాయని ఎస్.పి. జానకి!

-

జానకి గొంతు ఓ గంగా ప్రవాహం.


వయసుతో నిమిత్తం లేని ఆమె స్వరం ఓ కోయిలగానం. ఆమె పలుకు


ఓ ప్రకృతి పులకింపు.


రూపంలొ 74 ఏళ్ళు కనిపిస్తాయేమోగానీ,ఆమె స్వరం మాత్రం 54ఏళ్ళుగా


నిరంతరం వింటున్నా చైత్రమాసపు కోయిలగానం ఆమె స్వరం.


సాధన సంగీతానికి ఆయువు పట్టయితే ఎస్ .జానకి ఆ సాధనకే


ఓ ఉదాహరణ.


కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ


నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం


మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో


తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన గాయనిగా, సంగీత


దర్శకురాలిగా 30వేల పాటలకు పైగా ఆలపించి సరికొత్త రికార్డు


సృష్టించారు.


నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి


తన 19వ ఏటనే గాయనిగా అవతారమెత్తారు.


మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం


ఆరంభించిన జానకి.. తెలుగులో హిట్ అయిన ఎన్నో చిత్రాలకు


పాటలు పాడారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన


జానకి.. తమిళం, తెలుగు సినిమాల కోసం తానే స్వయంగా పాటలు


రాశారు.


ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు’ అనే


తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన


కెరియర్ ప్రారంభించారు.


రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.’ అందులో


ఘంటశాల గారితో కలిసి గానం చేసిన ఆ పాట కూడా శోక గీతమే


‘నీ యాసా ఆడియాసా, చేజారే మణిపూసా…


హిందీ, సిన్హాలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర,


జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్


రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి.


జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్,


ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ


గాయకులతో పనిచేశారు.


“సప్తపది ” చిత్రం అనగానే ఎస్.జానకి..గళంలో వైవిధ్యభరితమైన


పాటలు.. గుర్తొస్తాయి. జానకమ్మని.. విశ్వనాథ్ గారు…. ఎంతో


ప్రశంసించారట. సినిమా పాటకి..ఎస్.జానకి.గళం.. “కామధేనువు”


లాంటిదని.. ఏం కావాలంటే ఆ భావం ఒలికిన్చగల.. అత్యున్నత


గాయని అన్న ప్రశంస తో..పాటు.. విశ్వనాథ్ గారు దర్శకత్వం


వహించిన..ప్రతి చిత్రంలోనూ.. ఆమెతో.. పాటకి..పట్టం కట్టించారు.


ఎస్.జానకి అంటే సంగీత జానకిగా మారిన వైనం చూస్తే ఆమె


తొలిసారిగా 1957లో ఓ తమిళ చిత్రానికి తొలిపాట పాడిన


సంవత్సరమే 6భాషల్లొ 100పాటలకు పైగా పాడినా, ఆమె


జీవితకాలంలో 15 భాషల్లో 15వేల పాటలు పాడినా,సినీపరిశ్రమలో


6తరాల కథానాయికలకు తన స్వరాన్ని అందించినా,


”భారత కోయిల"గా బిరుదు సాధించినా,ఈమె ప్రయాణంలో 


ఎన్నో రాష్ట్రీయ,జాతీయఅవార్డులను కైవశం చేసుకొన్నా,


ఇసుమంతైనా కూడా విరామమెరుగకనేటికీ సంగీత ప్రపంచంలో


 ఓ విధ్యార్ధియై వినయం ప్రదర్శిస్తూ సాధననుకొనసాగించడమే 


ఎస్.జానకి విజయానికి కారణం.


అందుకే ఆమెజీవితం నేటియువ సంగీత కళాకారులకు 


ఎంతో ఆదర్శం.

-


Monday, April 16, 2018

మా అమ్మ పాత ట్రంకు పెట్ట!

మా అమ్మ పాత ట్రంకు పెట్ట!


💟💟💟💟💟💟💟💟


చిన్నప్పటి సంగతే అయినా నిత్య నూతనమే!


మా అమ్మ పెద్ద పెట్టె అంటేమా అందరికీ ఎంతిష్టమో!


ముదురు పసుపు రంగు మీద పూల పూల డిజైన్తో పడవంత పెట్టె!


దానికి సదా మండ్ర గప్పంతతాళం కప్ప!


తాళం చెవి ఉనికి మా అమ్మ మంగళ సూత్రాల మధ్యలోనే!


ఏం ఉంటాయో అందులో, ఎంత రహస్యమో!


ఎన్ని ఆలోచనలో! బంగారు నగలా! ఉన్న


రెండు తులాల పుస్తెల తాడూ, తులం నల్ల పూసల చేరూ,


ఎప్పుడూ మెడలోనే గా


పట్టు చీరలా ఎప్పుడూ కట్టడం చూడలేదే?


నోట్ల కట్టలా ! కాదేమో! ఇరవయ్యో


తారీకునించే ఒకటో తేదీ కోసం


ఎదురు చూపులు చూసేది కదూ!


మరేంటబ్బా! ఎప్పుడైనా ఆవిడ తెరవడం


చూస్తే ఎగబడి, ఎగిరెగిరీ తొంగి తొంగి


మరీ చూసేవాళ్లం!


గుమ్మడి పండు లా ఉండే వెండి కుంకం


భరిణ, పన్నీరు బుడ్డీ పట్టు రుమాలు,


కొత్త జాకెట్టు బట్టలు ! పెట్టె తీసేసరికి


గుప్పు గుప్పున కర్పూరం‌ వాసన!


' కలరా ఉండలే' ఆరిందా లా చిన్న చెల్లి


కామెంట్స్! ఇంతలోనే అమ్మ పెట్టె వేసేసేది


పెద్దవాళ్లం అయి, అమ్మా, నీకొ మంచి పెట్టె కొనీదా?


అంటే, ఊఁహూఁ ఒప్పుకోదే


" నా విజయభండారు ముందు మీ ఆల్ఫాలు, సఫారీ లు దిగదుడుపే"


ఒక్క మాట లో తేల్చి పారేసింది


ఎవరి పాటికి వాళ్లం‌ అయినా ఏమూలో


సందేహం, ఏదో ఉంది అమ్మ పెట్టెలో!


ఏమిటబ్బా! చెప్పదే! ఇప్పుడూ తెరిస్తే


చూస్తాం. అయినా బోధపడదు!


ఊహించని షాక్! పూజ కోసం పూలు కోస్తూ


అలా పడిపోయిన అమ్మ శాశ్వతంగా దూరం అయింది!


ఏడ్పులూ, మొత్తుకోళ్లూ మధ్య జరగాల్సినవి‌ అన్నీ జరిగి పోయేయి!


పదకొండు రోజుల తంతులూ ముగిసి,


మా పెట్టె లు మేం సద్దుకుంటూ ఉంటే,

కొడుకులాగ అమ్మ సంతానాన్ని సాకి కడ దాకా అమ్మకి


తోడుగా ఉండిపోయినపెద్దక్క అందరినీ పిలిచి


అమ్మ పాత పెట్టె తెరిచింది. చిన్నప్పటి లాగే మూగేం!


తొంగి తొంగి చూసేం! 

మీదన ఉన్నవన్నీ తెలిసినవే! 

కిందన పరిచిన పేపర్ తీస్తేఅక్కడ ఉన్నాయి ,


పాతబడీ, నల్లబడ్డరెండు పొడుగు పసుపు దారాల


తో పేనిన తాళ్లు! రహస్యం తెలిసి పోయింది!


పదునాల్గేళ్ల వయసులో ఆవిడ

పెళ్లిలో ఈ పసుపు దారాలతోనే మా నాన్న

ఆమె మెడలో తాళి కట్టేరు! బంగారు గొలుసు లోకి తాళి బొట్టు ఎప్పుడు మార్చిందో, ఈ పసుపు దారాలని ఇంత కాలం ఇంత భద్రంగా దాచుకుంది!


" అమ్మ బంగారం ఇత్తడి సామాను


ఎవరికేది కావాలో తీసుకొండే" అక్క


అంటుంటే, వెక్కుతూ అందరం


ఏక రాగంతో ఒకేసారి అన్నాం


" అక్కా,అమ్మ విజయభండారు పెట్టె నేను తీసుకోనా? "


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


( చిన్నతనం లో మా అమ్మ పెట్టె తీస్తే మేం ఇలాగే ఉద్వేగం చెందేవాళ్ళం.కవితలో కొన్ని మాత్రమే నా అనుభవాలు


ఈ ఫొటోలో పెట్టె నెట్ సహాయం తో తెచ్చుకున్నదే!


❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

సీతమ్మ విలాపం-త్రిజటస్వప్నం !

సీతమ్మ విలాపం-త్రిజటస్వప్నం !

-

సీతమ్మ ’ దైన్య చిత్తయై హనుమంతుడు కూర్చుని ఉన్న


అశోకవృక్షం కిందికి పోయి రాముణ్ణి తలచుకుంటూ దు:ఖిస్తూ నిలబడింది. 

తన దుర్గతినంతా తలచుకొంటూ రోదించింది. అయ్యో! నాగుండె ఎంత


గట్టిది! అది ఎందుకు పగిలిపోదు? అని నేలమీద పడిపోయి పొర్లుతూ


ఆడు గుర్రపు పిల్లలాగా ఆమె ఆక్రందించింది.


అక్కడున్న క్రూరచిత్తులైన ఆ రాక్షసాంగనల్తో ’నన్ను చంపండి,


చీల్చండి, చిత్రవధ చేయండి. ఇక ఈ దు:ఖాన్ని నేను భరించలేను.


సహించలేను’ అని అంగ లార్చింది. అయ్యో రాముడు ఎంత


దివ్యపరాక్రముడు! జనస్థానంలో రాక్షసుడనేవాడు లేకుండా చేశాడే,


ఆయనెందుకు నన్ను రక్షించడంలేదు? అని సీత కుమిలి కుమిలి


ఆక్రోశించింది.


త్రిజటా స్వప్నం


రాక్షసులంతా ఆమెను హృదయవిదారకంగా భయపెడుతూ బెదిరిస్తూ


ఉండగా ఆ రాక్షససమూహంలోనే వృద్దురాలు, త్రిజట అనే ఒక రాక్షసి


’సీతాదేవిని అట్లా భయపెట్టవద్దనీ, అది వాళ్ళకు చెరుపుచేస్తుందనీ


లంకకు చేటు మూఢే కాలం అచిరకాలంలోనే సంభవించనున్నదనీ,


తనకు రాత్రి ఒక కల వచ్చిందనీ, ఆ కల సీతాదేవికి సమస్త్శుభాలు


చేకూర్చనున్నదనీ, రావణుడికి భయంకరమైన వినాశాన్ని


సూచిస్తున్నదనీ, తనకు వచ్చిన కల స్వరూపస్వభావాలు


రాక్షసాంగనలు కళ్ళకు తట్టినట్లుగా చెప్పింది.


నాలుగు దంతాలు గల గొప్ప తెల్లటి ఏనుగుపై కూర్చుండి సీతాదేవి


సర్వాలంకార భూషితురాలై, మంగళకరమైన స్వరూపంతో, పరమ


సంతోషంతో వెళుతూ ఉండటం చూశాననీ, ఆమె సూర్యమండలాన్నీ,


చంద్ర మండలాన్నీ చేతులతో తాకుతూ సర్వదేవతాగణాలు


సంతోషంగా స్తోత్రాలు చేస్తూ ఉండగా ఆ ఏనుగు మీద వెళ్ళుతూ ఉండడం


చూశాననీ, చెప్పింది త్రిజట. ఏనుగు దంతాలలో నిర్మితమైన


వేయిహంసలు మోసుకు వచ్చిన ఒక దివ్యమైన శిబికలో


రామలక్ష్మణులు రావడం, శ్వేతపర్వతం మీద సర్వాలంకారశీభితయైన


సీతాదేవిని పల్లకిలో రాముడు తీసుకొని పోవడం తాను కలలో


చూశానని త్రిజట చెప్పింది.


ఇక రావణుడు గాడిదపై వంటినిండా నూనె కారుతుండగా, మద్యంతో


కైపు ఎక్కి దక్షిణం వైపు వెళుతుండటం తాను కలగన్నట్లు త్రిజట


చెప్పింది. ఇంకా ఆ గాడిద మీద నుంచి రావణుడు విభ్రాంతుడై నేలమీద


పడిపోవటం, మళ్ళీ గాడిదలు పూన్చిన రథంపై నల్లని బట్టలు ధరిచి


దక్షిణదిశగా వెళ్ళడం చూసినట్లు త్రిజట చెప్పింది. ఎర్రటిచీర


కట్టుకున్న నల్లని స్త్రీ రావణుణ్ణి నేలమీద పడవేసి దక్షిణదిశకు లాగుకొని


పోతున్నట్లు చూశానని చెప్పింది.


రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తూ వరాహాన్నీ, ఒంటెనూ, మొసలినీ


ఎక్కి దక్షిణదిశకు పోవడం తనకు కనపడిదని త్రిజట చెప్పింది.


తెల్లటి పుష్పహారాలతో, తెల్లటి వస్త్రాలతో, తెల్లటి గంధంతో,


విభీషణుడు ఏనుగునెక్కి ఊరేగడం తాను చూసినట్లు చెప్పింది.


రాక్షసులంతా హాహాకారాలు చేస్తూ యుద్ధంలో మరణించినట్లు తాను


కలలో చూశానని చెప్పింది. విభీషణుడికి శ్వేతచ్ఛత్రమూ,


వింజామరలతో రాజలాంఛనగౌరవం కలిగినట్లు తాను చూశానని


చెప్పింది.


సీతను క్రూరంగా భయపెట్టవద్దనీ, హింసించవద్దనీ త్రిజట ఆమె చుట్టూ


గుమిగూడిన భయంకర రాక్షసాంగనలకు హితవు బోధించింది.


త్రిజట చెపుతున్న ఈ మాటలన్నీ అశోకవృక్షమీద కూచుని ఉన్న


హనుమంతుడు విన్నాడు.

Sunday, April 15, 2018

జయ జయ దేవ హరే ! (జయదేవ-గీత గోవిందం)

జయ జయ దేవ హరే !

(జయదేవ-గీత గోవిందం) 

.

శ్రిత కమలాకుచ మండలా.......


ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల....


జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే.... 


||జయ జయ|| 

దినమణి మండల మండనా......


భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా


||జయ జయ||


కాళియ విష ధర గంజనా..........జన రంజన........


ఈ యదుకుల నళిన దినేశా 


||జయ జయ||

మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......


ఈ సురకుల కేళి నిదానా 


||జయ జయ||


అమల కమల దళ లోచనా........


భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా 


||జయ జయ||


జనక సుతా కృత భూషణా........


జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా 


||జయ జయ||


అభినవ జలధర సుందరా.........


ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర చకోరా 


||జయ జయ||


తవ చరణే ప్రణతావయా...........


ఇతి భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ 


||జయ జయ||


శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం.....


ఈ మంగళ ఉజ్వల గీతం 


||జయ జయ||


అర్ధ్ధం :


లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను,


మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము....



ప్రచండ సూర్యునివలే ప్రకాశిస్తూ,ఆలోచనలను ఖండిస్తూ,మునుల 


హృదయాలలో హంసవలె విహరించే హరీ నీకు జయము జయము


కాళియుని విషాన్ని హరించి,జనరంజకుడవై,యదుకుల రత్నమై వెలిగే 


హరీ నీకు జయము జయము....


మధు-ముర రాక్షసులను వధించి,గరుత్మంతుని 


అధిరోహించి,దేవలోకాన్ని రక్షించిన హరీ నీకు జయము జయము....


కలువరేకుల వంటి కన్నులతో,భవమోచన కలిగించే,


త్రిభువన నాధుడవైన హరీ నీకు జయము జయము....


జానకి దేవిని చేపట్టి,అధర్మాన్ని జయించి,రావణుడిని 


వధించిన హరీ నీకు జయము జయము...


నీలమేఘ శ్యాముడవై,మంధర పర్వతాన్ని మోసి, చంద్రుని వలె 


అందమైన ముఖారవిందాన్ని కలిగిన హరీ నీకు జయము జయము...


నీ చరణారవిందాలకి ప్రణమిల్లుతూ,నీ కరుణా కటాక్ష వీక్షణాలు 


కోరుతూ...జయదేవుడు నీకై వ్రాసిన,మంగళకరమైన గీతం ఈ గీతం....



హరీ నీకు జయము జయము...శ్రీ హరీ నీకు జయము జయము..


..

ఆరుద్ర - కూనలమ్మ పదాలు!

ఆరుద్ర - కూనలమ్మ పదాలు!

‘ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన

“కూనలమ్మ పదాలు”, అనే చిన్ని చిన్ని మాటల ఈటెల

"ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి.

కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు

సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను

కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర.

ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల

అంత్యప్రాసలే !

కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన

ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. 

.

కొన్ని కూనలమ్మ పదాలు

.

సర్వజనులకు శాంతి

స్వస్తి, సంపద, శ్రాంతి

నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ !

.

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంతృప్తి

చేయనిమ్ము సమాప్తి

ఓ కూనలమ్మ !

.

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

సకల సౌఖ్యప్రథమ్ము

ఓ కూనలమ్మ !

.

సగము కమ్యూనిస్ట్

సగము కాపిటలిస్ట్

ఎందుకొచ్చిన రొస్టు

ఓ కూనలమ్మ !

.

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ !

.

తమిళం గురించి -

తమలములు నములు

దవళతో మాట్లాలు

తానెవచ్చును తమిళు

ఓ కూనలమ్మా!

.

శ్రీశ్రీ గురించి -

రెండు శ్రీల ధరించి

రెండు పెగ్సు బిగించి

వెలుగు శబ్ద విరించి

ఓ కూనలమ్మ !

.

కృష్ణశాస్త్రి గురించి -

కొంతమందిది నవత

కొంతమందిది యువత

కృష్ణశాస్త్రిది కవిత

ఓ కూనలమ్మ !

.

బాపు గురించి -

కొంటెబొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయలలూపు

ఓ కూనలమ్మా!

... 

మహాకవి శ్రీశ్రీ మాటల్లో కూనలమ్మ పదాల

ఆరుద్ర గురించి.

.

కూనలమ్మ పదాలు

వేనవేలు పదాలు

ఆరుద్రదే వ్రాలు

.

కూనలమ్మ పదాలు

లోకానికి సవాలు

ఆరుద్రదే వ్రాలు

.

కూనలమ్మ పదాలు

కోరుకున్న వరాలు

ఆరుద్ర సరదాలు

.

ఆరుద్ర ఇంటింటి పజ్యీయం

వానాకాలంలో వేడి మిరప బజ్జీయం

ఇవి చదివితే వేదన మటుమాయం

మీరు నవ్వుల్లో మునగడం ఖాయం

దిగులు తరిమేందుకు ఆరుద్ర చేస్తారు సాయం

దిగులుదసలే భారీకాయం

తరమడానికి వీరిని తోడు తెచ్చుకోవడం నయం

ఎంతైనా ఒంటరి పోరు కాదు సమర్థనీయం

నాన్సెన్సుతో దోస్తీ అభిలషణీయం

చదవలేదు నేను బిల్హణీయం

చదవలేదు ప్రతాపరుద్రీయం

తెలియదు నాకు రాజకీయం 

తెలిసందల్లా ఆరుద్రీయం

ఇంటింటి 'పజ్యాల' హార్మోనియం.

(సేకరణ -వింజమూరి వెంకట అప్పారావు.)

కరిమింగిన వెలగపండు !

కరిమింగిన వెలగపండు !


"సిరి దా వచ్చిన వచ్చును


సలలితముగ నారికేళ సలిలము భంగిన్


సిరి దాఁ బోయిన బోవును


కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

.


తాత్పర్యం:


సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి


నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది.


అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన


వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.


ఓ సుమతీ !


సంపద యొక్క రాకడ పోకడ రెండూ కూడ అద్ఫుతంగానే ఉంటాయి


కొబ్బరి కాయలోకి నీరు ఎలా వచ్చాయో ఆ విధంగానే డబ్బు రావడం


మొదలు పెడితే తెలియకుండానే కుప్పలు తెప్పలు గా


వచ్చిపడుతుంది. ఆ సమయం లో తెలివైన వాడు విచక్షణ తో జాగ్రత్త


పడి దాచుకుంటాడు.


అలాగే డబ్బు పోవడం మొదలు పెడితే ఏనుగు మ్రింగిన వెలగ పండు


లోని గుజ్జు లాగ మాయమై పోతుంది. కాబట్టి బుద్ధిమంతుడు సరైన


సమయం లో జాగ్రత్త పడి పొదుపు చేయాలి.


‘ కరి మ్రింగిన వెలగపండు’ అనగా ‘ఏనుగు తిన్న వెలగ పండు’ అని,


ఏనుగు యొక్క గొప్పదైన జీర్ణశక్తి వలన అది మ్రింగిన వెలగ పండు


అలాగే ఉండి దాని లోని గుజ్జు మాయ మౌతుందని తెలుగు


కవులు వ్రాశారు . 

.

కాని సంస్కృతం లో ‘గజ భుక్త కపిత్థవత్ ’ అని గలదు.


దీనికి “గజ క్రిమి రూపేణ ” అని వ్యాఖ్య.


కంటికి కనపడని క్రిమి వెలగ కాయ లోనికి ప్రవేశించి


గుజ్జు నంతటిని నల్లగా మార్చి వేస్తుందని ,


‘కరి అనగా నలుపు ’అని, “ కరి మ్రింగిన ”అంటే


“నల్లగా మారిన ” అని అర్థం చెపుతున్నారు.


ఆంధ్రుల సాంఘీక చరత్ర లో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు


ఈ విషయాన్ని చర్చించారు.


సుచిత్రా సేన్!

సుచిత్రా సేన్!

.

సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను


తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు.


దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా


ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది.


ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్,


తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది.


వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా


ఆదరించారు.


ఏ కళాకారులకైనా ఆ కళను అనుభవించే రసికులు


ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది?

.

ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే


ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది,


కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును.


ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి


ఆనందించవచ్చును.

Saturday, April 14, 2018

👉కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం!👈


👉కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం!👈


ఒకాయన ఉత్కళ దేశం లో వున్న జగన్నాథుని దర్శించాడట.


అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్య పోయాడట.


ఎందుకు? సామాన్యంగా అన్ని దేవాలయాల్లో విగ్రహాలు రాతితోగానీ లోహాలతో


గానీ చేయబడి వుంటాయి.


ఆ దారుమూర్తిని చూసిన ఆదికవి మదిలో


ఒక చమత్కార శ్లోకం మెరిసింది.

🙏


శ్లో."ఏకా భార్యా ప్రకృతి రచలా, చంచలాచ ద్వితీయా


పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః


శేషశ్శయ్యా ప్యుదధి శయనం, వాహనం పన్నగారిః


స్మారం స్మారం స్వగృహ చరితం దారు భూతొ మురారి !


🙏🙏🙏🙏


అదేమంటే శ్రీ మహా విష్ణువు తన కుటుంబం లోని వారి ప్రవర్తనలు చూసి తట్టుకోలేక


కొయ్యబారి పోయాడట.


విష్ణుమూర్తికి యిద్దరు భార్యలు ఒకావిడ ఒకరు కదలకుండా వుండే


ప్రకృతి (భూదేవి)ఇంకొకావిడేమో ఒకచోట ఉండకుండా మనుష్యులను


మారుస్తూ తిరుగుతూ వుంటుందిట.


కొడుకు చూద్దామా అంటే ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ వుంటాడు


.అందర్నీ బాధిస్తూ వుంటాడు. వాడేమైనా బలంగా వున్నాడా అంటే వాడికి శరీరమే


లేదు. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామా అంటే తాను నడుము వాల్చేది ఒ


క పెద్ద పాము మీద మెత్తగా వుంటుంది కానీ ఎంతసేపూ బుసలు కొడుతూ వుంటుంది.


ఒక తలా ఏమన్నా వెయ్యితలలాయే ఒకటి తర్వాత ఒకదానితో బుసలు కొడుతూంటాడు.


అది ఉండేది సముద్ర మధ్య లో అన్నీ అలలే హోరున శబ్దం ఒక అల అటువైపునుండి


కొడితే ఇంకొకటి యిటువైపునుంచి కొడుతుంది.


పోనీ వాహనమై ఎక్కి బయటికి పోదామా అంటే అది కూడా ఒక గ్రద్ద,


పైన ఎగురుతూ పోతూవుంటే కింద పాము కనబడితే చాలు


తన యజమాని పని మర్చిపోయి గబుక్కున క్రిందికి దిగి ఆ పామును


కాళ్లతో పట్టుకొని తినేదాకా కదలడు.


ఇవన్నీ తలుచుకొని తలుచుకొని విష్ణువు కొయ్యబారి పోయాడట.

.

కవుల మనసులో ఏది మెరిస్తే అది చమత్కారంగా చెప్పేస్తారు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


చదువు ‘కొనే’ కాలం 😍!

చదువు ‘కొనే’ కాలం 😍!


😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊


చదువు ‘కునే’ కాలం అయినా చదువు ‘కొనే’ కాలం అయినా


అది ప్రతీ మనిషి జీవితం లో ఒక క్లిష్టమైన కాలం. 

మా కాలం లో ఒక 2 – 3 శాతం కొనే వాళ్ళున్నా మిగతా వాళ్ళంతా కునే వాళ్ళే.


కొనే వాళ్ళు కూడా మరీ విచ్చలవిడిగా కొనే వాళ్ళు కాదు.


రహస్యం గా పకడ్బందిగా అనుమానం రాకుండా కొనుక్కునే వారు.


చదువు అనేది ఒక జబ్బు, అది పిల్లల తల్లి తండ్రులకి వస్తుంది


ఈ జబ్బు కూడా విచిత్రమైనది. పిల్లలు కనిపిస్తే ఎక్కువయేది


. "అల్లా అడ్డగాడిద లా తిరగక పొతే చదువుకో కూడదా" అని కేకలేసేవారు,


కనిపిస్తే . అవసరమైతే తప్ప వారి ముఖ్యం గా తండ్రి కంట పడకుండా తిరిగేవారు.


పిల్లలు వజ్రాలు, వాళ్ళని సాన బెట్టితే ప్రకాశించేస్తారు.


వూళ్ళో కరంటు లేకపోయినా సమస్య ఉండదు అన్న అభిప్రాయం వాళ్ళది.


ఈ సాన పెట్టడానికి బడిలో ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేసేవారు.


సాన పెట్టడం లో వారు సాధారణం గా సామ, దండోపాయాలనే ఉపయోగించేవారు.


వారికి దాన, బేధ ఉపాయాలు ఆట్టే తెలియవు.


సాన పెట్టడానికి గురువులు తమ తమ ఆయుధాలను


పరమ పవిత్రం గా పూజించేవారు.


ఒకరు తమ చేతులనే నమ్ముకుంటే, కొందరు బెత్తాలను, మరి కొందరు డస్టర్ ను


ఉపయోగించే వారు. వాటి ప్రయోగాలను వివిధ రీతులలో చేసేవారు.


ఒక్కొక్కరిది ఒక్కొక్క పధ్ధతి. వారి ఆయుధ ప్రయోగాలనుంచి తప్పించుకోవడం


ఒక యుద్ధ కళ. అనుభవ రాహిత్యం వల్ల పిల్లలు ఓడిపోయేవారు. జయం


ఎప్పుడూ మాస్టారు గారిదే అయ్యేది.


ఇంటిలో తల్లితండ్రులు యధావిధి తోడ్పాటు అందించే వారు.


కానీ తల్లి తండ్రులు నాలుగు ఉపాయాలూ వాడేవారు.


చదువు కోక పొతే ఎందుకూ పనికి రావు,


మంచి ఉద్యోగం చెయ్యాలంటే బాగా చదువు కోవాలి,


పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఐస్ క్రీం కానీ మరొకటి కానీ ఇస్తాం,


చంద్రం గాడికి 70 మార్కులు వచ్చేయి,


వెధవా సిగ్గులేదా నీకు 42 వచ్చా యేమిటి,

చచ్చు వెధవా చదువంటే ఇంత అశ్రద్ద ఎందుకురా,


సరిగ్గా చదువుతావా లేదా అంటూ కఱ్ఱ పుచ్చుకోవడం.


తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి ఎందుకు ఆర్జన చేయమంటారో


నాకు ఎప్పటికీ అర్ధం కాదు. నాలుగున్నర, ఐదు ఏళ్లు రాగానే బడిలో వేసేస్తారు


విద్యార్జన చేయమని. పడుతూ లేస్తూ, తన్నుతూ పునాదులు గట్టి పరుచుకుంటూ


ఏదో విధం గా చదువు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేసి ధనార్జన చేయమంటారు.


ఉద్యోగం చేస్తుండగానో, కొండొకొచో ముందుగానో కూడా ప్రేమార్జన చేసుకోమని


పెళ్లి చేసేస్తారు. ఆ తరువాత సంతానార్జన చేయమంటారు.


మధ్యలో సిగ్గు, శరము ఆర్జించ మంటారు.


పెళ్ళైన తరువాత ముఖ్యం గా మగవారు, అవి వదిలేస్తారు ట.


సిగ్గు శరము లేకుండా పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతాడు అని అంటారు.


మంచివాడు, బుద్ధిమంతుడు అనే పేరు ఆర్జన చేయడం,


చివరగా “హే భగవాన్ నేను బతికి ఎవరికి లాభం” అంటూ భక్తార్జన.


ఇలా జీవితమంతా ఏదో ఒకటి ఆర్జిస్తూనే గడచి పోతుంది.


వీటన్నిటికి మూలం విద్యార్జన.🙄😮😥

కొత్తగా పెళ్ళైన జంట.🌷 😍😍😍😍😍😍😍

కొత్తగా పెళ్ళైన జంట.🌷

😍😍😍😍😍😍😍


కొత్త పెళ్ళాము వండు

గొడ్డు కారము మెండు

తీపి యను హజ్బెండు

వో కూన లమ్మా 👈


(ఆరుద్ర కూనలమ్మ పదం, ఇంటర్నెట్ సేకరణ)


(కార్టూన్ బాపురమణల పేజి నుంచి)

విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది.

విష్ణు సహస్రనామం -సూత స్పటికం !

(టేప్ రికార్డర్ )


విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది.

భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు

అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా,

కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన

విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య

చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ

చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి

వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో

అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు

సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు

ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో

కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో

సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు.

ఎవరూ వ్రాసుకోలేదు.

అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా

విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి"

అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే

అవుతుంది" అని చెప్పాడు.

"అదెలా" అని అందరూ అడిగారు.

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం

వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని

ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి

తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ

స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే)

వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట

అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి

కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస




విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది.


భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు 


అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా,


 కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన


 విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య 


చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ


 చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి


 వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో 


అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు 


సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు 


ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో 


కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో 


సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. 


ఎవరూ వ్రాసుకోలేదు.


అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా 


విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" 


అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే 


అవుతుంది" అని చెప్పాడు.


"అదెలా" అని అందరూ అడిగారు.


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం


 వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని 


ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి 


తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ 


స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) 


వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట 


అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి 


కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస 


మహర్షి వ్రాసిపెట్టాడు.


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం


 ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు 


సెలవిచ్చారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం


శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।