చదువు ‘కొనే’ కాలం 😍!

చదువు ‘కొనే’ కాలం 😍!


😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊


చదువు ‘కునే’ కాలం అయినా చదువు ‘కొనే’ కాలం అయినా


అది ప్రతీ మనిషి జీవితం లో ఒక క్లిష్టమైన కాలం. 

మా కాలం లో ఒక 2 – 3 శాతం కొనే వాళ్ళున్నా మిగతా వాళ్ళంతా కునే వాళ్ళే.


కొనే వాళ్ళు కూడా మరీ విచ్చలవిడిగా కొనే వాళ్ళు కాదు.


రహస్యం గా పకడ్బందిగా అనుమానం రాకుండా కొనుక్కునే వారు.


చదువు అనేది ఒక జబ్బు, అది పిల్లల తల్లి తండ్రులకి వస్తుంది


ఈ జబ్బు కూడా విచిత్రమైనది. పిల్లలు కనిపిస్తే ఎక్కువయేది


. "అల్లా అడ్డగాడిద లా తిరగక పొతే చదువుకో కూడదా" అని కేకలేసేవారు,


కనిపిస్తే . అవసరమైతే తప్ప వారి ముఖ్యం గా తండ్రి కంట పడకుండా తిరిగేవారు.


పిల్లలు వజ్రాలు, వాళ్ళని సాన బెట్టితే ప్రకాశించేస్తారు.


వూళ్ళో కరంటు లేకపోయినా సమస్య ఉండదు అన్న అభిప్రాయం వాళ్ళది.


ఈ సాన పెట్టడానికి బడిలో ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేసేవారు.


సాన పెట్టడం లో వారు సాధారణం గా సామ, దండోపాయాలనే ఉపయోగించేవారు.


వారికి దాన, బేధ ఉపాయాలు ఆట్టే తెలియవు.


సాన పెట్టడానికి గురువులు తమ తమ ఆయుధాలను


పరమ పవిత్రం గా పూజించేవారు.


ఒకరు తమ చేతులనే నమ్ముకుంటే, కొందరు బెత్తాలను, మరి కొందరు డస్టర్ ను


ఉపయోగించే వారు. వాటి ప్రయోగాలను వివిధ రీతులలో చేసేవారు.


ఒక్కొక్కరిది ఒక్కొక్క పధ్ధతి. వారి ఆయుధ ప్రయోగాలనుంచి తప్పించుకోవడం


ఒక యుద్ధ కళ. అనుభవ రాహిత్యం వల్ల పిల్లలు ఓడిపోయేవారు. జయం


ఎప్పుడూ మాస్టారు గారిదే అయ్యేది.


ఇంటిలో తల్లితండ్రులు యధావిధి తోడ్పాటు అందించే వారు.


కానీ తల్లి తండ్రులు నాలుగు ఉపాయాలూ వాడేవారు.


చదువు కోక పొతే ఎందుకూ పనికి రావు,


మంచి ఉద్యోగం చెయ్యాలంటే బాగా చదువు కోవాలి,


పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఐస్ క్రీం కానీ మరొకటి కానీ ఇస్తాం,


చంద్రం గాడికి 70 మార్కులు వచ్చేయి,


వెధవా సిగ్గులేదా నీకు 42 వచ్చా యేమిటి,

చచ్చు వెధవా చదువంటే ఇంత అశ్రద్ద ఎందుకురా,


సరిగ్గా చదువుతావా లేదా అంటూ కఱ్ఱ పుచ్చుకోవడం.


తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి ఎందుకు ఆర్జన చేయమంటారో


నాకు ఎప్పటికీ అర్ధం కాదు. నాలుగున్నర, ఐదు ఏళ్లు రాగానే బడిలో వేసేస్తారు


విద్యార్జన చేయమని. పడుతూ లేస్తూ, తన్నుతూ పునాదులు గట్టి పరుచుకుంటూ


ఏదో విధం గా చదువు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేసి ధనార్జన చేయమంటారు.


ఉద్యోగం చేస్తుండగానో, కొండొకొచో ముందుగానో కూడా ప్రేమార్జన చేసుకోమని


పెళ్లి చేసేస్తారు. ఆ తరువాత సంతానార్జన చేయమంటారు.


మధ్యలో సిగ్గు, శరము ఆర్జించ మంటారు.


పెళ్ళైన తరువాత ముఖ్యం గా మగవారు, అవి వదిలేస్తారు ట.


సిగ్గు శరము లేకుండా పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతాడు అని అంటారు.


మంచివాడు, బుద్ధిమంతుడు అనే పేరు ఆర్జన చేయడం,


చివరగా “హే భగవాన్ నేను బతికి ఎవరికి లాభం” అంటూ భక్తార్జన.


ఇలా జీవితమంతా ఏదో ఒకటి ఆర్జిస్తూనే గడచి పోతుంది.


వీటన్నిటికి మూలం విద్యార్జన.🙄😮😥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!