జటాయు రావణ యుద్ధం.!

జటాయు రావణ యుద్ధం.!



సీతను ఎత్తుకెళ్లే తన విషయం భర్తకు ఎలా తెలుస్తుందీ అని


 సీత బాధపడుతూ ,రావణుడితో శక్తి మేరకు వాదులాడుతూ


 రామా రామా లక్ష్మణా లక్ష్మణా అని విలపిస్తూ వెడుతోంది .


రామ సామర్ధ్యం మీద విపరీతమైన విశ్వాసం సీతమ్మకు ఉంది. 


అయినా ఈ ఆపదనుండి బయట పడాలి .అన్ని వైపులకూ చూస్తోంది ,


ఎవరైనా కనిపిస్తారేమోనని .


ఇంతలో నేల మీద జడలా ముడి పడ్డ ఆయువు కల ,అరవై వేల 


సంవత్సరాల ముసలి జటాయువు కని పించాడు .


కళ్ళు పెద్దవి చేసుకొని చూసి జాటాయువే అని అతను తనమామ గారు 


దశరధుని మిత్రుడని గుర్తు చేసుకొని ‘’జటాయూ జటాయూ ‘’అని 


బిగ్గరగా అరిచింది .దిక్కు లేని తనను రావణుడు బల వంతం గా 


ఎత్తుకొని తీసుకొని పోతున్నాడని ఆ దుస్ట రావణుడితో జటాయువు 


పోరాడే సామర్ధ్యం లేని వాడని కాని ఈవార్త తన భర్త శ్రీ రాముడికి 


తెలియ జేయమని బతిమాలింది .ఆ మాటలు జటాయువు చెవిన పడి


 తల పైకెత్తి చూసి జానకిని దర్శించాడు .


వెంటనే లేచి ఒక్క సారి ఆకాశానికి యెగిరి రావణుడి ని వెంటపడి 


మంచి మాటలతో మందలించాడు .


నీతిని మన్నించాల్సిన రాజే ధర్మ మార్గం తప్పితే మిగిలిన వారి 


గతేమిటి అని ప్రశ్నించాడు పర దారాపహరణం ప్రాణాంతకం అని 


మందలించాడు .రావణుడు త సోదరుడి లాంటి వాడని ,కనుక సోదర


 భావం తో మేలు కోరి చెబుతున్నానని ,రాముడు తనకేమీ ద్రోహం 


చేయక పోయినా ఆయన భార్యా పహరణం కొరివి తో తల 


గూక్కోవటమేనని ,జనస్థానం లో శూర్పణఖ వలన ఏర్పడిన రాక్షస 


సంహారం లో రాముడి తప్పేమీ లేదని దానికి ప్రతీకారం 


తీర్చుకోవాలంటే రాముడితో పోరాడాలికాని ఈ అకృత్యం పనికి రాదనీ


 హితవు చెప్పాడు .రామాగ్ని దశ కంఠుడిని భస్మం చేస్తుందని ,


విషసర్పాన్ని మూటకట్టు కొని వెడుతున్నాడని తర్కానికి వేదాంతం


 దొరకదని రావణ బలపరాక్రమాలకు సీతమ్మ దక్కదని ,క్షణం లో 


పద్నాలుగు వేల మంది రాక్షసులని చంపిన రాముడి ముందు ఎవరూ


 ఆగలేరని ,పిరికి గా సీతా పహరణం చేయటం వినాశమని చెట్టు నుంచి 


పండుకోసి నట్లు రావణుని తల పండును క్షణం లో తుంచే స్తానని 


జటాయువు చెప్పాడు .


సామ దాన భేదాల తో పక్షి రాజు లంకాధిపతి కి బుద్ధి చెప్పాలని శత 


ప్రయత్నం చేశాడు .లాభం కని పించలేదు .


చివరికి జటాయువుకు దండోపాయమే శరణ్యమైంది .


అంత రిక్షం లో రావణ జటాయువులకు తీవ్ర యుద్ధం జరిగింది.


రావణుడు బాణాలతో యుద్ధం చేస్తే పక్షిరాజు వాడి గోళ్ళతో చేశాడు


రావణుడు వేసిన పది బాణాలను జటాయువు గోళ్ళతోనే చీల్చి వేశాడు 


రధం లో చింతలో ఉన్న సీతను చూడగానే జటాయువులో పౌరుషాగ్ని 


ప్రజ్వ రిల్లింది .రావణుడు శర వర్షం కురిపించి జటాయువును గూటిలో 


ఉన్న చిన్న పిట్ట లా చేశాడు ..కాని దీనికి భయపడని జటాయువు 


రెక్కలతో రావణుని కవచాన్ని రధాన్ని ,రధాన్ని నడిపే పిశాచాలను 


ముక్కలు ముక్కలు చేశాడు .రావణుని చత్ర చామరాలు చిన్నా 


భిన్నమైనాయి .సారధి తల బద్దలై పోయింది .చివరికి రావణుడు గతి 


లేక సీతను ఒడి లో పెట్టుకొని ,కిందికి దిగాడు .పంచ భూతాలు 


జటాయువు ను ప్రశంసించాయి .జటాయువు కొంచెం అలసి నట్లు కని 


పించగా ,రావణుడు పారిపోయే ప్రయత్నం చేశాడు.అతని చేతిలో ఒక 


కత్తి మాత్రమె ఉంది .రెండవ చేతిలో సీత ఉంది .ఆ దృశ్యాన్ని చూసి 


సహించలేక జటాయువు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలని 


ప్రయత్నించాడు .మరో సారి మంచిమాటలు చెప్పి దుస్ట మార్గాన్ని 


మార్చుకోమన్నాడు .వాడు వినేట్లు లేదని గ్రాహించాడు .


రావణుడి వీపు మీద కూర్చుని రెక్కలతో జటాయువు రక్కి రక్కి 


ఉక్కిరి బిక్కిరి చేస్తాడు .ముక్కులతో అతని బాహువుల్ని చేదిస్తాడు.తెగినవి తెగినట్లు మళ్ళీ మొల కేత్తుతున్నాయి .


సీతా దేవిని నేల మీద దించి రావణుడు జటాయువు తో మల్ల యుద్ధం 


చేశాడు .ఘోర యుద్ధమే ఇద్దరిమధ్యా కొన్ని క్షణాలు జరిగాయి .పక్షి బాధ భరించలేని రావణుడు జటాయువు ను తన ఖడ్గం తో 


ఖండించాడు .జటాయువు శక్తికోల్పోయి నేల మీద పడి పోయాడు 


రావణుడు సీతను పట్టుకొని ఆకాశ మార్గం లో యెగిరి లంకకు చేరాడు ..

.


జనస్థానం లో సీత కోసం అన్వేషిస్తున్నారు రామ లక్ష్మణులు 


పర్వతాలు గుహలు ,అడవులు యక్ష కిన్నర గాంధర్వ గృహాలు 


వెతుకుతూ ,మధ్యలో ఒకరి నొకరు ఒఓదార్చు కుంటూ, కన్నీరు 


మున్నీరుగా విలపిస్తున్న అన్నను తమ్ముడు అనునయిస్తూ 


తిరుగుతున్నారు .కొంత దూరం వెళ్ళే సరికి పర్వతాకారం గా 


నెత్తురోడుతూ పడిఉన్న పక్షిరాజు జటాయువును చూశారు .ఆ పక్షి 


సీతను మింగి అలా పడి పోయి ఉంటుంది అని అనుమాన పడ్డాదు 


రాముడు బాణం ఎక్కు పెట్టి ఆ పెద్ద పక్షిమీద బాణం సం ధించటా నికి 


సిద్ధ పడ్డాడు 

..


రాముడిని చూడగానే జటాయువుకు ప్రాణం లేచి వచ్చింది .శ్రీ రాముడికి 


సీత జాడ వివరించి ప్రాణాలు వదలాలని బతుకుతున్నాడు ప్రాణాలు 


ఉగ్గ బట్టి .ముక్తసరిగా రావణుడు సీతా దేవి తో బాటు ,తన ప్రాణాలనూ 


అపహరించాడని చెప్పాడు .అన్నదమ్ములిద్దరూ దగ్గర లేని సమయం 


చూసి రావణుడు వచ్చి బలాత్కారం గా సీతను ఎత్తుకు పోయాడని 


అమ్మను కాపాడటానికి తాను ఆ దుస్ట రాక్షసుడితో పోరాడాను 


అన్నాడు .వాడి రధాన్ని ముక్కలు ముక్కలు చేశానని ,ఆ ముక్కలే 


ఇక్కడ పడి ఉన్నాయని చూపించాడు .తన రెక్కలు ముక్కలు చేసి 


సీతను ఎత్తుకొని పారిపోయాడని చెప్పాడు .రావణుడి చేతిలో చని 


పోయిన తనను ఇంక చంపక్కర్లేదని అన్నాడు .రాముడు తన తొందర 


పాటుకు పశ్చాత్తాప పడి ,జటాయువును కౌగలించుకొని బిగ్గర గా 


ఏడుస్తాడు .లక్ష్మణుడు కూడా చాలా దుఖిస్తాడు .రాజ్యం పోయింది 


భార్య శత్రువు చేత చిక్కింది చివరికి తన భార్యను కాపాడే ప్రయత్నం 


లో శత్రువు తో పోరాడిన పక్షిని కూడా తాను రక్షించలేక పోతున్నానని 


రాముడు విచారించాడు .తన లాంటి దురదృష్ట వంతుడు ఈ ప్రపంచం 


లో బతక కూడదని ,తన దౌర్భాగ్యం అగ్నిని కూడా దహింప జేస్తుందని 


ఆవేదన పడ్డాడు .తన శోకాగ్ని ని చల్లార్చేందుకు మహా సముద్రం 


కూడా చాలదని వాపోయాడు .తన దురదృష్టం తనకు తమ్ముడికి 


భార్యకే కాక ఈ పక్షికి కూడా అంటింది అని ఆవేదన చెందాడు .

.


జటాయువు ‘’విగతాయువు ‘’అయి పోయాడని చింతించిన రామ 


లక్ష్మణులు మరిన్ని వివరాలు చెప్పమని జటాయువును అర్ధించారు .


సీతను మాయతో రావణుడు దక్షిణ దిక్కుకు తీసుకొని వెళ్ళాడని ,


రావణుడు సీతను తీసుకు వెళ్ళిన ముహూర్తం ‘’వింద ముహూర్తం ‘’అని , 


ఆ ముహూర్తం లో పోయిన వస్తువు తిరిగి యజమానికి దక్కుతుందని ,


ఎరను కరచుకొన్న చేపలాగా రావణుడు ఆత్మ నాశనం చెందుతాడని ,


త్వరలోనే రావణ ప్రాణాలను రాముడు అపహరించి సీతమ్మను 


తెచ్చుకొంటాడని దిగులు అక్కరలేదని ,రావణుడు విశ్రస వసువు 


కుమారుడైన కుబేరుని సోదరుడని చెప్పాడు .ఇంకా చెప్పమని 


అడుగుతూ నే ఉన్నాడు ఇంతలో జటాయువు ప్రాణ వాయువులు 


అనంత వాయువులలో కలిసి పోయాయి .


జటాయు మరణానికి రామ లక్ష్మణులు శోకించారు .అనేక 


సంవత్సరాలు దండకారణ్యంలో గడిపిన జటాయువు చిరాయువుగా 


ఉండాల్సిన వాడు తన కోసం తనువు చాలించాడని రాముడు 


లక్ష్మణుడికి చెప్పి శోక సాగరం లో మునిగి పోయాడు .పశు 


పక్ష్యాదులలో కూడా సాధువులు పుణ్యాత్ములు ,ధర్మాత్ములు 


ఉంటారని ,సీత కని పించక పోవటం అనే బాధ కంటే తనకోసం 


జటాయువు ప్రాణాలు అర్పించటం మరీ బాధ గా ఉందని చెప్పాడు .


తన తండ్రి దశరధ మహా రాజుకు దహన సంస్కారాలు చేయ లేక 


పోయిన రాముడు తండ్రిలాంటి వాడు తండ్రికి ప్రాణ మిత్రుడు అయిన 


జటాయువుకు దహన సంస్కారాలు చేసి ఋణం తీర్చుకొంటానన్నాడు .


లక్ష్మణుడు చేత చితి పేర్పించి శాస్త్రీయం గా జటాయువు కు అంతిమ 


సంస్కారాలు నిర్వహించాడు .యజ్న యాగాదులు చేసి యుద్ధం లో వె


నుదీయ కుండా పోరాడి భూదానం చేసిన పుణ్యాత్ములు వెళ్ళే అక్షయ 


పుణ్య లోకాలకు తన మాట మీద జటాయువు తరలి వెళ్లాలని శ్రీ 


రాముడు శాసించాడు .దానికి అనువైన మంత్రాన్ని జపించాడు .


కనుక పశు పక్ష్యాదులు కూడా ధర్మాన్ని తప్పక ఆచరించి తమ 


విద్యుక్త ధర్మాన్ని నెర వేరుస్తాయని జటాయువు కద ద్వారా మహర్షి 


వాల్మీకి ఎరుక పరచాడు .మనిషి కూడా తన వంతు ధర్మాన్ని నేర 


వేర్చాలని శ్రీ రాముని పాత్రద్వారా జటాయువు కు రాముడు పితృ 


సంస్కారాలు చేసి ఋణం తీర్చుకోన్నాడని తెలియ జేస్తాడు


.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!