మహా భారత యుద్ధంలో ...ఉప పాండవులు.!


మహా భారత యుద్ధంలో ...ఉప పాండవులు.!


త్రేతాయుగపు కాలంనాటి హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్షను


పరీక్షించాలని విశ్వామిత్రుడు అతనిరాజ్యము, భార్య, పిల్లలు కట్టు


బట్టలతో సహా వదిలి పొమ్మని ఆదేశిస్తాడు...


ఈక్రమంలో రాణిపై చేయికూడా చేసుకుంటాడు... ఆ సమయంలో పరమ


వీరులయిన అయిదుగురు సైనికులు/రక్షకభటులువిశ్వామిత్రుని చర్యకు


మండిపడి అతనిచర్యలను ఖండిస్తారు... దీనికి ఆగ్రహం


చెందినవిశ్వామిత్రుడు మీకు ఈ జన్మలో మోక్షం రాకపోవుకాక అని


శపిస్తాడు... ...


భీతిల్లిన ఆ రక్షకభటులుమునివర్యుని శాంతింపజేసి శాపానికి విరుగుడు


ప్రసాదించమని వేడుకుంటారు.. శాంతించినవిశ్వామిత్రుడు మీరు


వచ్చేజన్మలో ఏ బంధాలు ఏర్పడక ముందే చనిపోవుదురు,


తర్వాతి జన్మలోపాండవుల పుత్రులుగా జన్మించి ఏ తప్పు


చేయనప్పటికీ అశ్వథ్థామ చేతిలో నిద్రించే సమయంలోమరణించి


మోక్షం పొందుతారు అని అభయమిస్తాడు...


(వారిని చంపిన అశ్వథ్థామ రహస్యం తల్లిఅయిన ఉత్తర గర్భంలో


ఉన్న పరిక్షిత్తుకు (అభిమన్యుని కుమారునికి) తెలుస్తుంది...


ఈ విషయంతెలుసుకున్న అశ్వథ్థామ ఆ గర్భస్థ శిశువును


హతమార్చాలని కూడా చూస్తాడట... కానీ శ్రీకృష్ణుడుకాపాడతాడని


ఇంకొక కథ ఉంది) ఆ విధంగా పుట్టిన వారే ఉప పాండవులు....

.

“ధర్మరాజు కు పాంచాలియందు ప్రతివింధ్యుడు,భీమునికి శ్రుతసోముడు,


అర్జునునకు శ్రుత కీర్తి,నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత


సేనుడు కలిగారు.


వీరు కాక ధర్మరాజుకు స్వయంవరంలో భార్యయైన దేవిక అనే ఆమెకు


యౌధేయుడు కలిగాడు. భీమునికి జలంధర అనే ఆమెయందు


సర్వగుడు కలిగాడు. అర్జునునకు సుభద్రయందు అభిమన్యుడు


కలిగాడు. నకులునకు చేది రాజపుత్రి కరేణుమతికి నిరమిత్రుడు


కలిగాడు. సహదేవునికి స్వయంవరం మూలంగా లభించిన భార్య


విజయకు సుహోత్రుడు కలిగాడు.భీమునకు హిడింబ వలన


ఘటోత్కచుడు కలిగాడు. వీళ్ళు మొత్తం పదకొండు మంది.”


1.ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,


2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు


3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి


4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు


5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు


6.ధర్మరాజు+దేవిక=యౌధేయుడు.


7.భీముడు+జలంధర=సర్వగుడు


8.భీముడు+హిడింబ= ఘటోత్కచుడు


9.అర్జునుడు+సుభద్ర=అభిమన్యుడు.


10.నకులుడు+కరేణుమతి=నిరమిత్రుడు.


11.సహదేవుడు+విజయ=సుహోత్రుడు.


వీరిలో భీమునికి హిడింబ వలన కలిగిన ఘటోత్కచుడే పెద్దవాడు.


పాంచాలి వలన కలిగిన వారు కాక, మిగిలినవారంతా యుద్ధం లో


మరణించారు. ఉపపాండవులలో మిగిలిన, పాంచాలి పుత్రులు


ఐదిగురిని పాండవులుగా భ్రమించి, అశ్వద్ధామ నిదరపోతుండగా


చంపేశాడు. ఇదీ ఉపపాండవుల చరిత్ర. ఇక అభిమన్యునికి ఉత్తర కు


జన్మించినవాడు పరీక్షిత్తు.


వీరుకాక అర్జునునికి ఉలూపి, చిత్రాంగద అనే ఇద్దరు భార్యలున్నారు.


ఇందులో చిత్రాంగద కుమారుడు భభ్రువాహనుడు, ఇతను మణి


పురాజ్యాధిపతి, తాత గారి రాజ్యానికి వారసుడయ్యాడు,అందుకు ఉప


పాండవులలో చేర్చలేదు. ఇతను భారత యుద్ధం తరవాత బతికి


ఉన్నవాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!