స్త్రీల చీరకట్టు!

స్త్రీల చీరకట్టు!


ఆ కాలములో ఘూర్జర (గుజరాత్) ప్రాంత వనితలు నిండుగా


పైట వేసుకునేవారట.


ద్రవిడదేశపు (కేరళ) మహిళలు అసలు పయ్యెదనే


వేసుకునేవారు కారట.


తెలుగు తెరవలు పైట వేసుకునే తీరులో ఒక అందం ఉండేదట.


వారు తమ వక్షోజములు అరచాటుగా,


అనగా కనబడీ కనబడనట్లుగా పైటను ధరించేవారట...


ఇప్పటికీ పై ప్రదేశాల్లోని స్త్రీల చీరకట్టుల్లో ఈ వైవిధ్యం


అక్కడక్కడా గోచరిస్తూనే ఉన్నది.


చాటుపద్యము:


ఘనతర ఘూర్జరీయుగ క్రియ గూఢము గాక, ద్రావిడీ


స్తనగతిఁ దేట గాక, అరచాటగు ఆంధ్రవధూటి చొక్కపుం


జనుగవపోలె తేటయునుఁ జాటుదనంబును గాకయుండ చె


ప్పినదిపో కవిత్వమనిపించు, నగిం చటుగాకయుండినన్.


.

ఈ చాటువు అల్లసానిపెద్దనగారిదని కొందరు, ఎవరో


వేంకటనాథకవిదని కొందరు చెప్తారు.


కవిత్వం సైతం తెలుగురమణుల చనుగవ వలె మరీ తేటగానూ,


మరీ చాటుగానూ లేకుండా ఉంటేనే బాగుంటుంది.


కవి కొంత తాను చెప్పి, సహృదయులకు మరికొంత ఊహించుకునే


అవకాశం కల్పించాలి. మరీ తేలిపోగూడదు; మరీ మరుగున


పడిపోగూడదు.


కొంత కప్పిచెప్పడమే ధ్వని, వక్రోక్తి.


(చిత్రం -రవి వర్మ .)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!