ఇది మన దేశం లో ఎంతో మంది నిరుపేద అగ్రవర్ణాల పరిస్థితి!

ఇది మన దేశం లో ఎంతో మంది నిరుపేద అగ్రవర్ణాల పరిస్థితి!


ఉండేది పేరుకే అగ్రహారం.


కాని రెండు పూటలు కడుపు నింపుకోవటానికే చాల కష్టపడుతుంది


మా అగ్రవర్ణం..


వేదాలు చదివాను అవి నేడు నా ఆకలి మంటలను చల్లార్చలేక


నా వంక జాలి చూస్తున్నాయ్..


మను వాదం పేరు తో నన్ను ఈ దేశానికి శత్రువుని చేసిన


ఓ దళిత సోదరుడా, రా..


వచ్చి రెండు రోజులు గ మా పొయ్యలో పడుకున్న


పిల్లిని అదిలించు, ఈరోజుకుడా ఆకలితో నిద్రించలెను..


చదువుకుందామంటే ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలకి


నా జంద్యం అడ్డొస్తుంది..


ఇక ఉద్యోగాలకి నేను ఎలా పనికోస్తాను చెప్పండి..


చిన్నప్పుడు నా తల్లి చీర చినుగులోంచి చూసాను


నా భారత మాతను, ఎంతో వైభవోపేతంగా వెలుగుతుంది


ఆ తల్లి తేజస్సు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు


ఆ తల్లి ని గట్టిగ అడగాలని అనిపిస్తుంది


అమ్మ.. నేను నీ బిడ్డనే కదా నిన్ను దూషిస్తున్న వారిని


అందలమేక్కిస్తున్నావు, నిన్ను పూజించిన ఈ పూజారికి దక్షిణ


విదిలిస్తున్నావు.. ఇది నీకు న్యాయమా??


నువ్వు నన్ను గుర్తించిన గుర్తించకపోయినా నేను మాత్రం


నీ పాదలను వదలను..


భారత మాత కి జై


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!