తెలుగు సంస్కృతి-తెలుగు వాగ్గేయకారులు! (కీర్తి శేషులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు .)

తెలుగు సంస్కృతి-తెలుగు వాగ్గేయకారులు!


(కీర్తి శేషులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు .)


మొదటినుండి సంగీత కళలో తెలుగువా రెక్కువగా పరిశ్రమించుట,


కళా కేంద్రములగు విజయనగరము, తంజావూరు, మధుర, పుదుక్కోట మొదలగు


రాజాస్థానములలో తెలుగు వాగ్గేయకారులు చొరవతో ప్రవేశించి నెలకొని


తమ రచనలు వ్యాప్తికి తెచ్చుట కర్ణాటక సంగీత కళలో తెలుగుభాష కొక


సాంప్రదాయికమైన ప్రబల స్థానము నిచ్చినవి.


ఇందుచేత తమిళ, కన్నడ, మలయాళ భాషవారును


తెలుగు ప్రయత్న పూర్వకముగా నేర్చుకొని దానిలోనే కీర్తన,


వర్ణాది రచనను సాగించ వలసిన యవస్థకు పాల్పడినారు.


అట్టి రచనలలో ఎన్నో తెలుగువారి పరిహాసమునకు గురియైనవి.


పట్టణం సుబ్రహ్మణ్యయ్య, రామనాడు శ్రీనివాసయ్యంగారు మొదలగు


తెలుగు బయకారు లెందరో తెలుగురాని తమిళులే,


కాలక్రమమున ఈ సంప్రదాయము తెలుగువారి కనావశ్యకమైన


అహంకారమును, ఇతరులకు అనర్థకరమైన అసూయాభిమానములను


గలిగించినది.


తెలుగు పాటలు పాడరాదని మొండిపట్టు పట్టువరకు


తమిళ, కర్ణాటకు లనేకులందు దాని ఫలము వ్యాపించినది.


ఇంకను ఇతర భాషలనే వాడరాదని కూడ ఈ దృష్టి సుతి మించినది;


కాని సంగీతము విశ్వజనీనమై భాషల యెల్లలను మీరి వ్యాపించు


నాదకళ గనుక పై యల్ప భావములు ఎక్కువగా వ్యాపింపలేవు;


త్వరలో నశించి విశ్వమంగళమును సాధింపగలవు.

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!