👉ఆత్మ బరువు !👈

👉ఆత్మ బరువు !👈

-

ఆత్మ కూడా దీపం వంటిదే-ఆత్మ బరువు ఎంత- అని

వినడానికి విచిత్రంగా ఉన్నా #మెక్_డగెల్ అనే డాక్టర్ కమ్ సైంటిస్ట్ విచిత్రమైన అనుమానం కలిగింది.

దానిమీద ఎన్నో పరిశోధనలు చేసి చివరకి #ఆత్మ_బరువు 🙄21 గ్రాములని డిసైడ్ అయ్యాడు. 21 గ్రాముల బరువు ఎలా వచ్చిందో… ఆయన ప్రయోగం ఏమిటో… అది ఎంత వరకు సహేతుకమో ఒకసారి చూద్దాం.

మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తి పడుకున్న బెడ్ కు బరువును కొలిచే పరికరాన్ని అమర్చాడు. పేషెంట్ మరణానికి కంటే కొన్ని సెకన్ల ముందు అతని బరువును, అలాగే మరణించిన వెంటనే అతడి బరువును కొలిచాడు. ఈ రెండు బరువుల మద్య తేడా 21 గ్రాములుగా తేలింది. తగ్గిన ఈ 21 గ్రాముల బరువు మనిషి యొక్క ఆత్మదే అని ప్రకటించాడు డగెల్.

అయితే ఈ ప్రయోగంపై చాలా మంది డాక్టర్లు, సైంటిస్ట్లు ఈప్రయోగాన్ని వ్యతిరేకించారు.మనిషి చనిపోయాక…అతడి శ్వాసక్రియ ఆగుతుందని, గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆపుతాయని, ఇంకా శరీర అతర్భాగంగా జరిగే ప్రతీక్రియ ఆగుతుందని..అందుకే చనిపోయాక మనిషి బరువులో 21 గ్రాముల తేడా వస్తుందని ఇతర డాక్టర్ల వాదన. 

జవాబులని ఈజీగా కొట్టిపారేయవచ్చు గాని ప్రశ్నలని తేలికగా తీసుకోకూడదు… ఎందుకంటే న్యూటన్ మహాశేయుడికి వచ్చిన ఒక్క ప్రశ్న ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది… అలాగే ఎన్నో ప్రశ్నలు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!