యోరుగల్లు,..

ఖండకావ్యము: తెలుగు వెలుగు

కృతికర్త: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

ఖండిక: ఆంధ్రరాజధానులు 


శ్రీయుగంధరమంత్రి శేఖరశేముషీశ్రీరమ్యమైనది యోరుగల్లు,

కాకతీరుద్రుని కైలాససదనమై యొప్పారు శైలాగ్రమోరుగల్లు,

ఉభయకవిసుహృత్తునుజ్జ్వలకవితాసి నొఱపుజేసినఱాయి యోరుగల్లు, 

మందారమకరందమాధుర్యమును జీర్ణమొనరించుకొనుభూమి యోరుగల్లు,


పాదుసాహులకును పైకత్తిగానాగి

గుండెతల్లడంబు గూర్చె పెల్లు,

చెప్పగిప్పరాని శ్రీలకు పుట్టిల్లు,

వీరరసముగల్లదోరుగల్లు!!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!