యే జిందగీ ఉసీకి హై!

హిందీ పాటల్లో ఆణిముత్యం: యే జిందగీ ఉసీకి హై

కొన్ని పాటలు కొందరు పాడితేనే రస స్ఫోరకంగా ఉంటాయి. 

ఆ పాటకోసమే ఆ గాయనీ గాయకులు పుట్టారా లేదా వారికోసమే ఆ పాట పుట్టిందా అనేంతగా పాటా గాయకులు మమేకం అయిపోయిన సందర్భాలు సినీ సంగీతంలో కో కొల్లలు. 

హిందీ చలన చిత్ర సంగీత స్వర్ణయుగంలో వచ్చిన అలాంటి అపరూపమైన పాటల్లో యే జిందగీ ఉసీకి హై పాట ఒకటి.

యే జిందగీ ఉసీకి హై

.

ప్రియుడు తప్ప ఈ ప్రపంచంలో మరేదీ తనకు అవసరం లేదని ఒక ప్రియురాలు ఏకాంతంలో రాసిచ్చిన అపురూప దఖలు పత్రం ఈ పాట. జీవితం ఇలా సాగాలని, ఇలా బతకాలని మధురోహలు పెట్టుకుని, కలలు కని, అవి భగ్నమైన వారి జీవితాలను ఈ పాట ఎంత శోకమయంగా పలకరిస్తుందో....

ఈ పాట నాటి సంగీత దర్శకుడు సి రామచంద్ర స్వరకల్పనలో ఏ మంగళప్రద ఘడియలో లతా మంగేష్కర్ గాంధర్వ గాత్రంనుంచి వెలువడిందో కానీ గత ఆరు దశాబ్దాలుగా హిందీ పాటల శ్రోతల హృదయాలను అది మలయ సమీరంగా వెంటాడుతూనే ఉంది. జీవితమే సఫలమూ రాగసుధా భరితమూ అనే తెలుగు అనార్కలి సినిమాలోని పాటకు ఇది హిందీ మాతృక. ఆ నాటి హిందీ సినిమా సంగీత దర్శకులలో ఉన్నత శిఖరాలమీద నిలిచి ఉన్న సి రామచంద్ర ఈ పాటను లత చేత పాడించాలని తలచిన క్షణం సినిమా సంగీతలోకంలో ఒక గాన రేరాణికి పట్టం కట్టింది. .

https://www.youtube.com/watch?v=Na2VxqcsvQo

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!