తెలుగుతనానికే అందం ముళ్ళపూడి వెంకటరమణ గారి తెలుగు బాష. !

తెలుగుతనానికే అందం ముళ్ళపూడి వెంకటరమణ గారి తెలుగు బాష. 

బుడుగు, రాధ, గోపాలం,బామ్మ, పంచవటి కాలనీ,.........మధ్య తరగతి సౌందర్యాన్ని తన కళ్ళతో.... బాపు కుంచెతో ఆవిష్కరించిన వాడు,

ఏడుపదులు దాటిన వయసులో హైస్కూలు కుర్రాడిలా కోతికొమ్మచ్చి ఆడుతున్నవాడు,ఎంత ఎదిగినా మధ్యతరగతిలో ఒదిగిన వాడు.... 

“రాధతో రోజులు గోపాలానికి కవిత్వం నేర్పాయి. 

పెరుగుమీద తొరక కోసం రాధ పెట్టే రభస అతనికి హృదయమంతటితోనూ నవ్వడం నేర్పింది. 

కోన తేలిన రాధమ్మ నాసిక అతనికి దేముడి శిల్పచాతురిని బోధపరిచింది.

రాధమ్మ నిద్రించినపుడు ఆమె నయనాలు అందానికి అర్ధాలు చెప్పాయి.

రాధమ్మ చూపులు అతనికి ఏంచెప్పేవో చెప్పడం అతని తరం కాదు. 

రాధమ్మ తరం కాదు.”

---- * శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు, రాధాగోపాలం కథలు*

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!