చిత్ర కవిత్వం ఒక చిరుపరిచయం..

చిత్ర కవిత్వం ఒక చిరుపరిచయం..

.బహుశః మనకున్న తొలి చిత్రకవి శాపానుగ్రహ సమర్థుడై కవిరాక్షసుడిగాపేరు తెచ్చుకున్న వేములవాడ భీమకవి. ఇతను నన్నయ కాలానికి కొంచెం ముందు వాడై ఉండొచ్చు.ఇతని ఒక పద్యంహయమది సీత; పోతవసుధాధిపు డారయ రావణుండు; నిశ్చయముగ నేను రాఘవుడ; సహ్యజ వారిధి; మారు డంజనాప్రియతనయుండు; లచ్చన విభీషణు; డా గుడిమెట్ట లంక; నాజయమును పోతరక్కసుని చావును ఏడవ నాడు చూడుడీ!తనకు సన్మానం చెయ్యకపోగా తనెక్కి వెళ్ళిన గుర్రాన్ని కూడా లాగేసుకున్న ఈ పోతరాజెవరో మనకు తెలీదు గాని అంతటి కోపం లోనూ చాలా చక్కటి పద్యం చెప్పి మరీ తిట్టేడు కవిరాక్షసుడు. ఈ పద్యం “హ” తో మొదలు పెట్టి తిట్టటం వల్ల అతను “హతు”డయ్యాడని కొందరు ఛందోవిశేషజ్ఞులు వివరిస్తారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!