అతని గుండియ వెన్నపూసో అచ్చావు నెయ్యో!"

Koutilya Choudary

రాజు మూడవ భార్య కైకయి

భరతుడని యావిడ కుమారుడు

అతని గుండియ వెన్నపూసో

అచ్చావు నెయ్యో!"

భరతుడు, రామాయణంలో కష్టాలు పడటంలో రెండో రాముడు. ఎందుకో రామాయణంలో రాముడిని అనుసరించాలనుకోటమే కాని, ఎక్కువగా ఆలోచించను ఎప్పుడూ! నేను ఎక్కువగా తపన పడ్డది, పడేది భరతుడి గురించే!

రాముడికి ఎన్ని కష్టాలొచ్చినా ఆయనపై నిందలు మోపినవాళ్ళూ, అకారణంగా ద్వేషించినవాళ్ళూ లేరనే అనుకోవచ్చు. కాని, భరతుడు మాత్రం తాను చెయ్యని తప్పుకి, అడుగడుగునా ద్వేషింపబడ్డాడు, శంకింపబడ్డాడు. ప్రజలు, మంత్రులు, భరద్వాజుడు సైతం శంకిస్తారు. రాముడు కూడా అంతగా స్వాగతించలేకపోతాడు. తన చుట్టూ బిగుసుకున్న రాజకీయ చట్రంలోంచి బైటకు రావాలనే తపన ఎంత కనిపిస్తుందో!

రామాయణంలో కరుణరసం పొంగే ఘట్టాలు, పొంగించే పాత్రలు ఎన్ని ఉన్నా, భరతుడొక్కడే దానికి తారాస్థాయి అనిపిస్తుంటుంది. ఆ పాత్రలో ఉన్న కరుణరసాన్ని ఎక్కువగా అవగతం చేసుకున్నది, దాన్ని ఆలంబనగా చేసుకుని, ఇంకాస్త రసాన్ని పండించగలిగిన వాళ్ళల్లో భాసుడు ప్రథముడైతే, విశ్వనాథ తరువాత ఉంటాడేమో! దానికి ఆ మహాకవి సుతిమెత్తటి గుండెలోంచి పైకుబికిన పై నాలుగు మాటలు చిన్న నిదర్శనం.....

రామాయణము లోని అన్ని పాత్రల హృదయాలనూ సరిగ్గా అర్థం చేసుకుని మన ముందు ఆవిష్కరించిన కవి విశ్వనాథ వారొక్కరేనేమో అనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!