శ్రీనాధుని’ చాటువులు.!

శ్రీనాధుని’ చాటువులుగా చెప్పబడే కొన్ని పద్యాలు శ్రీనాధుని పేరుతో ఎవరో రచించారని విమర్శకుల అభిప్రాయం.!

.

వాటిలో ---

.

“కవిసార్వభౌముడు”గా పేరుగాంచిన శ్రీనాధునికి కూడా కష్టాలు తప్పలేదు. అని ఈ చాటు పద్యం తెల్పుతుంది. మంచి ఆరు రుచులతో కూడిన భోజనము తినే శ్రీనాధ కవికి, పలనాడు వెళ్లి నపుడు ఒకరి ఇంట రాత్రి పెట్టిన భోజనము ఎంతఅరుచిగా (చెడ్డగా) ఉన్నదో చెపుతూ ఇలాంటి భోజనము శత్రువుకైనా వద్దు దైవమా! అని బాధ పడతాడు. మరి ఆ భోజనం ఎలాఉంది అంటే -----

.

“ మూతిని ముట్టగా వెరతు- ముద్దకు ముద్దకు కూటిలోపలన్

పాతిక పాలు సైకతము – పచ్చడి కొంచెము – ఆది యంతమున్ 

చూతమటన్న లేదు – మరి సున్నము కన్నను మెత్త నన్నమీ 

రాతిరివంటి భోజన మరాతికినైనను వద్దు దైవమా!”

.

మూతిని ముట్టగా వెరతు= నోటిలో పెట్టు కోవడానికే భయంగా ఉందిట. పచ్చడి కొంచమే ఉందిట. ఇంకా ‘ఆది’ మొదట్లో వేసే ‘నేయి’, ‘అంతము’ చివరగా వడ్డించే పెరుగు లేక ‘మజ్జిగ’ చూడటానికి కూడా లేవుట! (“తక్రాంతంహి భోజనం” అని శాస్త్రం. తక్రం అంటే మజ్జిగ.) ఇంక సున్నంలా అన్నం చాల మెత్తగా ఉందిట. ఇటువంటి భోజనము, అరాతికి= శత్రువుకైనా వద్దు అని భగవంతుని ప్రార్థించాడుట శ్రీనాధుడు. ఇది ఈ చాటువు యొక్క భావం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!