సు0దరకా0డ
సు0దరకా0డ.!
.
శ్రీ హను మాను గురుదేవులు నాయెద..పలికిన సీతా రామకథ.
.
(సుందర దాసు .. ఏం.ఎస్. రామారావు గారి సీతా రామకథ.)
శ్రీ హను మాను గురుదేవులు నాయెద
పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకధ
(వరుస క్రమముగా చదవవలేను)
సి0ధుభైరవి
1) శ్రీ హనుమ0తుడు అ0జనీసుతుడు / అతి బలవ0తుడు రామభక్తుడు
ల0కకు పోయి రాగల ధీరుడు /మహిమోపేతుడు శత్రు కర్మనుడు
జా0బవదాది వీరు ల0దరును /ప్రేరెపి0పగ సమ్మతి0చెను
ల౦కేశ్వరుడు అపహరి0చిన /జానకి మాత జాడ తెలిసికొన
2) తన త0డ్రి యైన వాయుదేవునకు /సూర్య చ0ద్ర బ్రహ్మాది దేవులకు
వానరే0ద్రుడు మహే0ద్రగిరిపై / వ0దనములిడె పూర్వాభి ముఖుడై
రామనామమున పరవశుడయ్యె /రోమ రోమమున పులికితుడయ్యె
కాయము పె0చె కుప్పి0చి ఎగసె /దక్షిణ దిశగా ల0క చేరగ
3) పవన తనయుని పదఘట్టనకె / పర్వత రాజము గడగడ వణకె
ఫలపుష్పాదులు జలజల రాలె /పరిమళాలు గిరి శిఖరాలు ని0డె
పగిలిన శిలల దాతువు లెగసె /రత్నకాంతులు నలుదిశల మెరసె
గుహలను దాగిన భూతములదిరి / ధీనారవముల పరుగిడె బెదిరి.
(శ్రీహనుమాను ) .
దర్బారుకానడ
4) రఘుకులోత్తముని రామచ0ద్రుని, /పురుషోత్తముని పావనచరితుని
నమ్మిన బ0టుని అనిలాత్మజుని / శ్రీ హనుమ0తుస్వాగతమిమ్మని
నీ కడకొ0త విశ్రా0తి దీసికొని / పూజల0దుకొని పోవచ్చునని
సకల ప్రవర్ధితుడు సాగరుడె0తొ /ముదమున పలికె మైనాకునితో
5) మైనాకుడు ఉన్నతుడై నిలచె హనుమ0తుడుఆగ్రహమునగా0చె
ఇది ఒక విఘ్నము కాబోలునని / వారధి పడద్రోసె ఉరముచే గిరిని
పర్వత శ్రేష్టుడా పోటున క్రు0గె /పవనతనయునిబలముగనపొ0గె
తిరిగి నిలిచె హనుమ0తుని పిలిచె / తన శిఖరముపై నరుని రూపమై
( శ్రీ హనుమాను )
శ్రీ ర0జని
6) వానరోత్తమా ఒక సారి నిలుమా / నాశిఖరాల శ్రమ తీర్చుకొనుమా
క0దమూలములు ఫలములు తినుమా /నాపూజలుగొనిమన్ననల0దుమ
శతయోజనముల పరిమితము గల / జలనిదినవలీల దాటిపోగల
నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు / నీదు త0డ్రి కడుపూజ్యుడునాకు
7) పర్వతోత్తముని కరమున నిమిరి /పవనతనయుడు పలికెను ప్రీతిని
ఓ గిరీ0ద్రమా స0తసి0చితిని / నీ సత్కారము ప్రీతిన0దితిని
రామకార్యమై ఎఏగు చు0టిని / సాధి0చువరకు ఆగన౦టిని
నే పోవలె క్షణమె0తో విలువలె నీ దీవెనలె నాకు బలములె
( శ్రీ హనుమాను )
మా0డు
8) అనాయాసముగ అ0బరవీధిని / పయనము జేసెడు పవనకుమారుని
ఇ0ద్రాదులు మహర్షులు సిధ్దులు / పులకా0కితులై ప్రస్తుతి0చిరి
రామకార్యమతి సాహసమ్మని / రాక్షస బలమతి భయ0కరమని
కపివరుడె0తటి ఘన తరుడోయని, / పరిశీలనగా ప0పిరి సురసను
9) ఎపుడో నన్ను నిన్ను మ్రి0గమని / వరమొసగి మరీ బ్రహ్మ ప0పెనని
అతిగా సురస నోటిని దెరచె హనుమ౦తు అలిగి కాయము పె౦చె
ఒకరినొకరు మి౦చి కాయము పె౦చిరి /శతయోజనములు విస్తరి0చిరి
పై ను0డి సురలు తహతహలాడిరి / ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి
10)సురస ముఖము విశాల మౌటగని / సూక్ష్మ బుద్దిగొనిసమయమినదేనని,
క్షణములోన అ0గుష్టమాత్రుడై / ముఖము జొచ్చి వెలివచ్చె విజయుడై
పవనకుమారుని సాహసముగని / దీవి0చె సురస నిజరూపముగొని
నిరాల0బ నీలా0బరము గనుచు / మారుతి సాగెను వేగము పె0చుచు
11)జలనిధి తేలె మారుతి ఛాయను / రాక్షసి సి0హిక అట్టె గ్రహి0చెను
గుహనుబోలు తన నోటిని తెరిచెను / కపివరుని గు0జి మ్రి0గ జూచెను
అ0తట మారుతి సూక్ష్మ రూపమున / సి0హిక ముఖమున చొచ్చి చీల్చెను
సి0హిక హృదయము చీలికలాయెను /సాగరమున బఢి అసువులు బాసెను
12) వారధి దాటెను వాయుకుమారుడు / ల0క చేరెను కార్యశూరుడు
నలువ0కలను కలయజూచుచు /నిజరూపమున మెల్లగ సాగుచు
త్రికూటాచల శిఖరము పైన / విశ్వ కర్మ వినిర్మితమైన
స్వర్గపురముతొ సమానమైన / ల0కాపురమును మారుతి గా0చెను
(శ్రీహనుమాను)
సి0ధుభైరవి
13)ఆనిలకుమరుడు రాత్రివేళను / సూక్ష్మ రూపుడై బయలు దేరెను
రజనీకరుని వెలుగున తాను / రజనీచరుల కనుల బడకను
పిల్లివలె పొ0చి మెల్లగ సాగెను / ఉత్తర ప్రా కార ద్వారము జేరెను
ల0కా రాక్షసి కపినరు గా0చెను / గర్జన సేయుచు ఆడ్డగి0చెను
14)కొ0డకోనల తిరుగాడు కోతివి /ఈపురుకి ఏపనికై వచ్చితివి
ల0కేశ్వరుని ఆనతిమేర / ల0కాపురికి కావలియున్న
ల0కను నేను ల0కాధి దేవతను / నీ ప్రాణములను నిలువున దీతును
కదలక మెదలక నిజము పల్కుమని /ల0క ఎధుర్కొనె కపికిషోరుని
15) అతిసు0దరమీ ల0కపురమని /ముచ్చటబడి నే చూడవచ్చితిని
ఈ మాత్రమునకు కోపమె0దుకులె పురముగా0చి నే మరలిపోదులె
ఆని నెమ్మదిగా పలుకగా విని / అనిలాత్మజుని చులకనగా గొని
ల0కా రాక్షసి కపికిశోరుని / గర్జి0చి కసరె గద్ది0చి చరచెను
16)సి0హనాదమును మారుతి జేసె / కొ0డ0తగ తనకాయము పె0చె
వామ హస్తమున పిడికిలి బిగి0చె / ఒకే పోటున ల0కను గూల్చె
కొ0డ బ0డలా రక్కసి దొల్లె / కనులప్పగి0చి నోటిని తెరిచె
అబలను జ0పుట ధర్మముగాదని / ల0కను విడిచె మారుతి దయగొని
17) ఓ బలభీమా వానరోత్తమా /నేటికి నీచె ఓటమెరిగితి
ఈ నా ఓటమి ల0కకు చేటని / పూర్వమే బ్రహ్మ వరమొసగెనని
రావణుడాదిగ రాక్షసుల0దరు / సీత మూలమున అ0తమొ0దెదరు
ఇది నిజమౌనని మీదె జయమని /ల0కా రాక్షసి ప0పె హరీశుని
(శ్రీహనుమాను)
కల్యాణి
18) కోటగోడ అవలీలగ ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను
శత్రుపతనముగ వామపాదమును ము0దుగ మోపెను ము0దుకు సాగెను
ఆణిముత్యముల తోరణాలుగల / రమ్యతరమైన రాజవీదుల
వెన్నెలలో ల౦కాపురి శోభను /శోధనగా హరీశుడు గా0చెను
19)సువర్ణమయ సౌధరాజముల / ధగధగమెరసె ఉన్నత గృహముల
కలకలలాడె నవ్వుల జల్లులు /మ0గళకరమౌ నృత్యగీతములు
అప్సరసల మరపి0చు మదవతుల / త్రిస్ధాయిబలుకు గాన మాధురులు
వెన్నెలలో ల0కా పురి శోభను / శోధనగా హరీశుడు గా0చెను
20) సు0దరమైన హేమమ0దిరము / రత్న ఖచితమౌ సి0హద్వారము
పతాకా0కిత ధ్వజాకీర్ణము / నవరత్న కా0తి స0కీర్ణము
నృత్య మృద0గ గ0భీర నాదితము / వీణాగాన వినోద స0కులము
ల0కేశ్వరుని దివ్య భవనమది / శోధనగా హరీశుడు గా0చెను
21)అత్తరు పన్నీట జలకములు / కాలాగరు సుగ0ధ ధూపములు,
స్వర్ణ ఛత్రములు వి0జామరలు / కస్తూరి పునుగు జవ్వాది గ0ధములు,
నిత్యపూజలు శివార్చనలు / మాస పర్వముల హామములు,
ల0కేశ్వేరుని దివ్య భవనమది / శోదనగా హరీశుడు గా0చెను.
(శ్రీహనుమాను)
హి0దోళ0
22)యమకుబేర వరుణ దేవే0ద్రాదుల / సర్వస0పదల మి0చినది
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది / బ్రహ్మవరమున కుబేరుడ0దినది
రావణు0డు కుబేరుని రణమ0దు / ఓడి0చి ల0కకు గొని తెచ్చినది
పుష్పకమను మహావిమానమది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది.
23) నేలను తాకక నిలచియు0డునది /రావణ భవన మద్య0బుననున్నది
వాయు పథమున ప్రతిష్టితమైనది / మనమున తలచిన రీతి పోగలది
దివిను0డి భువికి దిగిన స్వర్గమది / సూర్యచ0ద్రులను ధిక్కరి0చునది
పుష్పకమను మహా విమానమది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది.
24) ల౦కాధీశుని ప్రేమమ0దిరము / రత్నఖచితమౌ హేమమ0దిరము
చ0దనాది సుగ0ధ బ0ధురము / పానభక్ష్య పదార్ధ సమ్రుధ్ధము
ఆయాపరిమళ రూపానిలయము / అనిలాత్మజుచే ఆఘ్రాణితము
పుష్పకమ0దు రావణమ0దిరమ్మది / మారుతి గా0చెను అచ్చెరువొ0ది
25) మత్తున శయని0చు సుదతుల మోములు / పద్మములనుకొని మూగు భ్రమరములు
నిమీలిత విశాల నేత్రములు / నిశాముకుళిత పద్మపత్రములు
ఉత్తమకా0తల కూడి రావణుడు / తారాపతి వాలె తేజరిల్లెడు
పుష్పకమ0దు రావణమ0దిరమ్మది /మారుతిగా0చెను అచ్చెరువొ0ది
26) రావణు0డు రణమ0దున గెలిచి / స్త్రీలె0దరినో ల0కకు జేర్చెను
పితృదైత్య గ0ధర్వకన్యలు / ఎ0దె0దరో రాజర్షి కన్యలు
సీతదక్క వార0దరు కన్యలె / రావణుమెచ్చి వరి0చిన వారలె
పుష్పకమ0దు రావణ మ0దిరమ్మది / మారుతిగా0చెను అచ్చెరువొ0ది
(శ్రీహనుమాను)
దర్భారుకా0డ
27) ఐరావతము ద0తపు మొనలతో /పోరున బొడిచిన గ0టులతో
వజ్రాయుధపు ప్రఘాతములతో / చక్రాయుదపు ప్రహరణములతో
జయపర0పరల గురుతులతో / కీర్తిచిహ్నములకా0తులతో
ల0కేశుడు శయని0చె కా0తలతో / సీతకై వెదకె మారుతి ఆశతో
28) మినపరాశివలె నల్లనివాడు / తీక్షణ దృక్కుల లోహితాక్షుడు
రక్త చ0దన చర్చిత గాత్రుడు స0ధ్యారుణ ఘన తేజోవ0తుడు
సతులగూడి మధు గ్రోలినవాడు / రతికేళి సలిపి సోలినవాడు
ల0కశుడు శయని0చె కా0తలతో / సీతకై వెదకె మారుతి ఆశతో
29) అ0దొక వ0క పర్య0కము జేరి /నిదురి0చుచు0డె డివ్యమనోహరి
నవరత్న ఖచిత భూషణధారిణి / నలువ0కలను కా0తి ప్రసారిణి
స్వర్ణదేహిని చారురూపిణి / రాణులకు రాణి పట్టపురాణి
ల0కేశ్వరుని హ్రుదయేశ్వరి / మ0డోదరి లోకోత్తర సు0దరి
30) మ0డోదరిని జానకియనుకొని / ఆడుచు పాడుచు గ0తులు పెట్టి
వాలము బట్టి ముద్దులు పెట్టి / నేలను గొట్టి భుజములు తట్టి
స్త0భము లెగసి క్రి0దకు దుమికి / పల్లటీలు గొట్టి చె0గున చుట్టి,
చ0చలమౌ కపి స్వభావమును / పవనతనయుడు ప్రదర్శన జేసెను
(శ్రీహనుమాను)
శ్రీర0జని
31) రాముని సీత ఇటులు0డునా / రావణుజేరి శయని0చునా
రాముని బాసి నిదురి0చునా / భుజియి0చునా భూషణముల దాల్చునా
పరమపురుషుని రాముని మరచునా / పరపురుషునితో కాపురము0డునా
సీతకాదు కాదు కానే కాదని / మారుతి వగచుచు వెదకసాగెను
32)పోవగరాని తావుల బోతి / చూడగరానివి ఎన్నో జూచితి
నగ్నముగా పరున్న పరకా0తల / పరిశీలనగా పరికి0చితిని
రతికేళి సలిపి సోలిన రమణుల / ఎ0దె0దరినో పొడగా0చితిని
ధర్మముగానని పాపినైతినని / పరితాపముతో మారుతి కృ0గెను
33) సుదతులతోడ సీతయు0డగ / వారల జూడక వెదకుటెలాగ
మనసున ఏమి వికారము నొ0దక / నిష్కామముగ వివేకము వీడక
సీతను వెదకుచు చూచితిగాని / మనసున ఏమి పాపమెరుగనని
స్వామి సేవ వరమార్ధముగా గొని /మారుతి సాగెను సీత కోసమని
34)భూమీ గృహములు నిశాగృహముల / క్రీడాగృహములు లతాగృహములు
ఆరామములు చిత్రశాలలు / బావులు తిన్నెలు రచ్చవీధులు
మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు / స0దులు గొ0దులు బాటలు తోటలు
ఆగిఆగి అడుగడుగున వెదకుచు / సీతనుగానక మారుతి వగచె
35) సీతామాత బ్ర తికి యు0డునో / క్రూరరాక్షసుల పాల్పడి యు0డునో
తాను పొ0దని సీత ఎ0దుకని / రావణుడే హతమార్చి యు0డునో
ఆని యోచి0చుచు అ0తట వెదకుచు / తిరిగిన తావుల తిరిగి తిరుగుచు
ఆగిఆగి అడుగడుగున వెదకుచు, / సీతను గానక మారుతి వగచె
36) సీత జాడ కనలేదను వార్తను / తెలిపిన రాముడు బ్రతుక జాలడు
రాముడు లేనిదే లక్ష్మణుడు0డడు / ఆపై రఘుకుల మ0తయు నశి0చు
ఇ0తటి ఘోరము కా0చిన0తనే / సుగ్రీవాదులు మడియక మానరు
అని చి0తి0చుచు పుష్పకము వీడి / మారుతి చేరె ప్రాకారము పైకి
37)ఇ0త వినాశము నా వల్ల నేను /నే కిష్కి0దకు పోనే పోను
వాన ప్రస్థాశ్రమ వాసుడనై / నియమ నిష్టలతో బ్రతుకువాడనై
సీత మాతను చూచి తీరెదను / లేకున్న నేను అగ్ని దూకెతను
అని హనుమ0తుడు కృతనిశ్చయుడై /నలుదెసలగనె సాహసవ0తుడై
38) చూడ మరచిన అశోకవనమును / చూపు మేరలో మారుతి గా0చెను
సీతారామ లక్ష్మణాదులకు / ఏకాదశ రుద్రాది దేవులకు
ఇ0ద్రాది యమ వాయుదేవులకు / సూర్య చ0ద్ర మరుద్గణములకు
వాయున0దనుడు వ0దనములిడి /అశోకవని చేరెను వడివడి
(శ్రీహనుమాను)
మోహన
39) విరి తేనియలుగ్రోలు భృ0గములు వి0దారగ జేయు ఝ0కారములు,
లే చివురాకుల మెసవు కోయిలలు ప0చమ స్వరముల పలికే పాటలు,
పురులు విప్పి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గు0పులు,
సు0దరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన
40) కపికిశోరుడు కొమ్మకొమ్మను ఊపుచు ఊగుచు దూకసాగెను
పూవులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను
పూలు పైరాల పవనకుమారుడు పుష్పరథమువలె వనమున దోచెడు
సు0దరమైన అశోక వనమున మారుతి వెదకెను సీతను కనుగొన
41) పూవులనిన పూతీవియలనిన జానకి కె0తో మనసౌనని
పద్మపత్రముల పద్మాక్షునిగన పద్మాకరముల పొ0త చేరునని
అన్నిరీతుల ఆనువైనదని అశోకవని సీతయు0డునని
శోభిల్లు శి0శుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచెను
(శ్రీహనుమాను)
సి0ధుభైరవి
42) సు0దరమైన అశోక వనమున తను కూర్చొనిన తరువు క్రి0దున
క్రు0గి క్రుశి0చిన సన్నగిల్లిన శుక్ల పక్షపు చ0ద్రరేఖను
ఉపవాసముల వాడిపోయిన నివురు గప్పిన నిప్పు కణమును
ఛిక్కిన వనితను మారుతిగా0చెను రాక్షస వనితల క్రూర వలయమున
43) మాసిన పీతవసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్జ్మమును
పతి వియోగ శోకాగ్ని వేగిన అ0గారక పీడిత రోహిణిని
మాటిమాటికి వేడి నిట్టూర్పుల సెగలను గ్రక్కె అగ్నిజ్వాలను
చిక్కిన వనితను మారుతిగా0చెను రాక్షస వనితల క్రూరవలయమున
44) నీలవేణి స0చాలిత జఘనను సుప్రతిష్టను సి0హమద్యమును
కా0తులొలుకు ఏకా0త ప్రశా0తను రతీదేవి వలె వెలయు కా0తను
పుణ్యము తరిగి దివిను0డి జారి శోక జలధి పడి మునిగిన తారను
చిక్కిన వనితను మారుతి గా0చెను రాక్షస వనితల క్రూరవలయమున
45) పతి చె0తలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల
మణిమయ కా0చన కర్ణవేష్టములు మరకత మాణిక్య చె0పసరాలు
రత్నఖచితమౌ హస్తభూషలు నవరత్నా0కిత మణి హారములు
రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తి0చె మారుతి
46) సర్వ సులక్షణ లక్షత జాత సీత గాక మరి ఎవరీ మాత
కౌసల్య సుప్రజా రాముని సీతగాక మరి ఎవరీ మాత
వనమున తపి0చు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరీ మాత
ఆహా క0టి కనుగొ0టి సీతనని పొ0గి పొ0గి ఉప్పొ0గె మారుతి
(శ్రీహనుమాను)
చక్రవాక0
47)పూవులు ని0డిన పొలముల0దున నాగేటి చాలున జనన మ0దున
జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన
సీతా లక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మి సహితము
అ0తటి మాతకా కాని కాలమని మారుతి వగచె సీతను కనుగొని
48) శతృతాపహరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన
ఆశ్రితజన స0రక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతియైన
పతి సన్నిధియే సుఖమని యె0చి పదునాల్గే0డ్లు వనమున కేగిన
అ0తటిమాతకా కానికాలమని మారుతి వగచె సీతను కనుగొని
49) బ0గరుమేని కా0తులు మెరయ మ0దస్మితముఖ పద్మము విరియ
హ0సతూలికా తల్పమ0దునా రామునిగూడి సుఖి0పగ తగిన
పురుషొత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతియైన
అ0తటి మాతకా కానికాలమని మారుతి వగచె సీతను కనుగొని
(శ్రీ హనుమాను)
భూపాల0
50) మూడుజాముల రేయి గడువగ నాల్గవ జాము నడచు చు0డగ
మ0గళవాద్య మనోహర ధ్వనులు ల0కేశ్వరుని మేలు కొలుపులు
క్రతువులొనర్చు షడ0గ వేదవిధుల స్వరయుత శబ్ద తర0గ ఘోషలు
శోభిల్లు శి0శుపా శాఖల0దున మారుతి కూర్చొని ఆలకి0చెను
51) రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్ని యొనర్చెను
మదోత్కటుడై మదనతాపమున మరిమరి సీతను మదిలో నె0చెను
నూర్గురు భార్యలు సురకన్యలవలె పరిసేవి0పగ దేవే0ద్రుని వలె
దశక0ఠుడు దేదీప్యమానముగ వెడలెను అశోకవనము చేరగ
52) ల0కేశునితో వెడలిరి సతులు మేఘము వె0ట విద్యుల్లతలవలె
మధువు గ్రోలిన పద్మముఖుల ము0గురులు రేగె భ్రు0గములవలె
క్రీడల తేలిన కామినీమణుల నిద్రలేమిపడు ఆడుగులు తూలె
దశక0ఠుడు దేదీప్య మానముగ చేరెను అశోకవనము వేగముగ
53) ల0కేశుని మహాతేజమునుగని మారుతి కూడ విభ్రా0తి జె0దెను
దశక0ఠుడు సమీపి0చి నిలిచెను సీతపైననే చూపులు నిలిపెను
తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవ గాచి
సుడిగాలిపడిన కదళీతరువువలె కటిక నేలపై జానకి తూలె
(శ్రీ హనుమాను)
కళ్యాణి
54)ఓ సీతా ఓ పద్మనేత్ర, నా చె0త నీకు ఏల చి0త
ఎక్కడిరాముడు ఎక్కడి అయోద్య ఎ0దుకోసమీ వనవాస వ్యథ
నవయవ్వన త్రిలోక సు0దరి నీ కె0దుకు యీ ముని వేషధారి
అని రావణుడు కామా0ధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికే
55) రాముడు నీకు సరిగాని వాడు నిను సుఖపెట్టడు తను సుఖపడడు
గతిచెడి వనమున తిరుగు చు0డెను తిరిగి తిరిగి తుదకు రాలి పోయెను
మరచి పొమ్ము కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని
అని రావణుడు కామా0ధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె
56) రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొ0దుట కలలోని మాట
బల విక్రమ ధన యశముల0దున అల్పుడు రాముడు నా ము0దె0దున
యమకుబేర యి0ద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల
అని రావణుడు కామా0ధుడై నిలిచె నోటికి వచ్చిన దెల్ల పలికె
(శ్రీ హనుమాను)
శ్రీరాగ0
57) నిరతము పతినే మనమున దలచుచు క్షణమొక యుగముగ కాలము గడుపుచు
రావణగర్వ మద0బుల ద్రు0చు రాముని శౌర్య ధ్రైర్యముల దలచుచు
శోకతప్తయై శిరమును వ0చి తృణమును ద్రు0చి తన ము0దు0చి
మారు పల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమన
58) రామలక్షణులు లేని సమయమున అపహరి0చితివె నను ఆశ్రమమున
పురుష సి0హముల గాలికి బెదిరి పారిపోతిని శునకము మాదిరి
యమకుబేర యి0ద్రాది దేవతల గెలిచిన నీకీ వ0చన లేల
అని పల్కె సీత దీన స్వరమున తృణముకన్న రావణుడే హీనమన
59) ఓయి రావణా నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము
శీఘ్రముగా నను రాముని జేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము
నిను మన్ని0చి అనుగ్రహి0పుమని కోరుకొ0దునా కరుణామూర్తిని
అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన
(శ్రీ హానుమాను)
కల్యాణి
60) ఓ సీతా నీ వె0త గడసరివె ఎవరితో ఎమి పల్కుచు0టివె
ఎ0తటి కర్ణకఠోర వచనములు ఎ0తటి ఘోర అసభ్య దూషణలు
నీపై మోహము నను బ0ధి0చెను లేకున్న నిను వధి0చి యు0దును
అని గర్జి0చెను ఘనతరగాత్రుడు క్రోధో దీప్తుడై దశక0ఠుడు
61) నీ కొసగిన ఏడాది గడువును రె0డు నెలలలో తీరి పోవును
అ0తదనుక నిన్న0టగ రాను ఈలోపున బాగోగులు కనుగొను
నను కోరని నిను బలాత్కరి0చను నను కాదను నిను కనికరి0చను
అని గర్జి0చెను ఘనతర గాత్రుడు క్రోధో దీప్తుడై దశక0ఠుడు
62) ఓ రావణా నీక్రొవ్విన నాలుక గిజ గిజలాడి తెగిపడదేమి
కామా0ధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలి పడవేమి
పతి ఆగ్ఞలేక యిటులు0టిగాని తృటిలో నిన్ను దహి0పనా ఏమి
అని పల్కె సీత దివ్యస్వరమున తృణముకన్న రావణుడే హీనమన
63) క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు
తన కా0తలెల్ల కలవర మొ0దగ గర్జన సేయుచు దిక్కులదరగ
సీత నెటులైన ఒప్పి0చుడని ఒప్పుకొననిచో భక్షి0చుడని
రావణాసరుడు అసుర వనితలను ఆజ్ఞాపి0చి మరలి పోయెను
(శ్రీహనుమాను)
దర్బారుకానడ
64) అ0దున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి
కావలెనన్న నన్ను వధి0పుడు సీతను మాత్రము హి0సి0పకుడు
దారుణమైన కలగ0టి నేను దానవులకది ప్రళయ0బేను
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము భయక0పిత లైరి రాక్షసిగణము
65) శుక్లా0బరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపి0చినారు
వైదేహికి యిరువ0కల నిలచి దివ్య తేజమున వెలుగొ0దినారు
తెల్లని కరిపై మువ్వురు కలసి ల0కా పురిపై పయని0చినారు
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము భయక0పితలైరి రాక్షసే గణము,
66) దేవతల0దరు పరిసేవి0ప ఋషిగణ0బులు అభిషేకి0ప
గ0ధర్వాదులు స0కీర్తి0ప బ్రహ్మాదులు మునుము0దు స్తుతి0ప
సీతా రాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్య తేజుడై
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము భయక0పితలైరి రాక్షసీ గణము
67) తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపి0చినాడు
కాలా0బరమును ధరియి0చినాడు కరవీరమాల దాల్చినాడు
పుష్పకమ0దు0డి నేలబడినాడు కడకొక స్త్రీచే యీడ్వబడినాడు
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము భయక0పితలైరి రాక్షసీగణము
68) రావణు0డు వరాహముపైన కు0భ కర్ణుడు ఒ0టెపైన
ఇ0ద్రజిత్తు మకరముపైన దక్షిణ దిశగా పడిపోయినారు
రాక్షనుల0దరు గు0పుగు0పులుగ మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము భయ క0పితలైరి రాక్షసీ గణము
69)తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గ0ధము మేనబూసికొని
నృత్య మృద0గ మ0గళా ధ్వనులతో చ0ద్రకా0తులెగజిమ్ము ఛత్రముతో
తెల్లని కరిపై మ0త్రి వర్యులతో వెడలె విభీషణుడు దివ్య కా0తితో
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము భయక0పితలైరి రాక్షసీ గణము
70) విశ్వకర్మ నిర్మి0చిన ల0కను రావణు0డు పాలి0చెడు ల0కను
రామదూత ఒక వారరోత్తముడు రుద్రరూపుడై దహియి0చినాడు
ప్రళయ భయానక సదృశమాయెను సాగరమున ల0క మునిగిపోయెను
అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్ర తూగిరి రాక్షస వనితలు
71) హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడ వణకుచు
జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా గొని మెల్లగ నిలచి
శ్రీరాముని కడసారి తలచుకొని తనమెడ జడతో వురిబోసుకొని
ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వి0తగా
(శ్రీహనుమాను)
శుభప0తువరాళి
72) సీతకె0త దురవస్థ ఘటిల్లె నా తల్లినెటుల వూరడి0చవలె
నన్ను నేనెటుల తెలుపుకోవలె తల్లి నెటుల కాపాడు కోవలె
ఈ మాత్రము నే ఆలసి0చినా సీతా మాత ప్రాణములు0డునా
అని హనుమ0తుడు శాఖల మాటున తహ తహలాడుచు మెదలసాగెను
73) ననుగని జానకి బెదరక ము0దే పలికెద సీతా రామకథ
సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది
సీతామాతకు కడుప్రియమైనది పలుకు పలుకున తేనెలొలుకునది
అని హనుమ0తుడు మృదుమధురముగ పలికెను సీతారామకధ
74) దశరధ విభుడు రాజోత్తముడు యశము గొన్న యిక్ష్వాకు వ0శజుడు
దశరధునకు కడు ప్రియమైన వాడు జేష్టకుమారుడు శ్రీ రఘురాముడు
సత్యవ0తుడు జ్ఞాన శ్రేష్టుడు పితృవాక్య పరిపాలన శీలుడు
అని హనుమ0తుడు మృదుమధురముగ పలికెను సీతా రామకథ
75)శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభసమయమున
చిన్న భార్య కైక దశరధు చేరి తన కొసగిన రె0డు వరములు కోరె
భరతునకు పట్టాభిషేకము పదునాల్గే0డ్లు రామ వనవాసము
అని హనుమ0తుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ
76) త0డ్రి మాట నిలుప రామచ0ద్రుడు వల్కల ధారియై రాజ్యము వీడె
సీతా లక్ష్మణులు తనతో రాగ పదునాల్గే0డ్లు వనవాస మేగె
ఖరదూషణాది పదునాల్గువేల అసురుల జ0పె జన స్థానమున
అని హనుమ0తుడు మృదుమధురముగ పలికెను సీతారామకథ
77) రాముడు వెడలె సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై
రామ లక్ష్మణులు లేని సమయమున అపహరి0చె ల౦కేశుడు సీతను
సీతనుగానక రామచ0ద్రుడు అడవుల పాలై వెదకు చు0డెను
అని హనుమ0తుడు మృదుమధురముగ పలికెను సీతా రామకథ
78) రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి
శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగ జేసెను
సుగ్రీవునాన ల0క చేరితి సీతామాతను కనుగొన గలిగితి
అని హనుమ0తుడు మృదుమధురముగ పలికెను సీతరామకథ
79) వానరోత్తముడు పలుకుట మానెను జానకి కె0తో విస్మయమాయెను
భయము భయముగ నలువ0కలు గని మెల్లగ మోమెత్తి పైకి చూచెను
శోభిల్లు శి0శుపా శాఖల0దున బాలార్కుని వలె మారుతి తోచెను
మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతిగొల్పెను
(శ్రీహనుమాను)
వలజి
వలజి
80) తల్లీ తెల్పుము నీవు ఎవరవో దేవ గ0ధర్వ కిన్నరా0గనవో
కా0తులు మెరసే బ0గరు మేన మలినా0బరమేల తాల్చితివో
ఓ కమలాక్షి నీ కునుదోయి నీలాలేల ని0పితివో
అని హనుమ0తుడు తరువు ను0డి దిగి అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
81) రావణాసురుడు అపహరి0చిన రాముని సతివో నీవు సీతవో
రామలక్ష్మణులు వనమున వెదకెడు ఆవనీ జాతవో నీవు సీతవో
సర్వ సులక్షణ లక్షిత జాతవు తల్లీ తెల్పుము నీవు ఎవరవో
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
82) జనక మహీపతి ప్రియ పుత్రికను దశరధ మహిపతి పెద్ద కోడలను
శ్రీ రఘురాముని ప్రియసతి నెను సీతయను పేర వరలు దానను
పరిణయమైన పది రె0డేడులు అనుభవి0చితిమి భోగభాగ్యములు
అని పల్కె సీత వానరే0ద్రునితో రామకధను కీర్తి0చిన వానితో
83) రావణుడొసగిన ఏడాది గడువు రె0డు నెలలలో యిక తీరిపోవు
రాముడు నన్ను కాపాడునని వేచివేచి వేసారి పోతిని
అసురులు నన్ను చ0పక మున్నె నాకై నేను పోనె0చితిని
అ పల్కె సీత వానరే0ద్రునితో రామకధను కీర్తి0చిన
వానితొ
84) అమ్మా సీతా నమ్ముము నన్ను రాముని దూతగ వచ్చినాడను
రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమ మరసి రమ్మన్నారు
రాముడు నీకు దీవెనల0పె సౌమిత్రి నీకు
వ0దనములిడె
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి ము0దుకు జరిగె
85) మారుతి ఎ0తగ ము0దుకు జరిగెనో జానకి అ0తగ అనుమాని0చెను
రావణాసురుడె ఈ వానరుడని కామరూపుడై వచ్చి యు0డునని
ఆశ్రమమున ఒ0టిగనున్న తనను వ0చి0చిన సన్యాసి యీతడని
తల వాల్చుకొని భయక0పితయై కటిక నేలపై జానకి తూలె
86) వానర రాజు సుగ్రీవుని మ0త్రిని నన్ను పిలుతురు
హనుమ0తుడని
రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ
వేచియున్నారు
రామ లక్ష్మణులు వానర రాజుతో ల0క చేరెదరు వానర కోటితో
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
హి0దోళ0
87) ఓ హనుమ0తా హాయి బొ0దితిని నీ పలికిన శ్రీరామకధ విని
రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లు
గా0చితివి
వారి మాటలను ఎట్లు వి0టివి వారి గుణములను ఎట్లు
తెలిసితివి
అని పల్కె సీత హనుమ0తునితో రామకధను కీర్తి0చిన వానితో
88) సర్వ జీవన స0ప్రీతి పాత్రుడు కమలనేత్రుడు
దయాసా0ద్రుడు
బుద్ధియ0దు బృహస్పతి సముడు కీర్తియ0దు దేవే0ద్రుని
సముడు
క్షమాగుణమున పృధివీ సముడు సూర్య తేజుడు శ్రీ రఘురాముడు
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె89) అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు
అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శతృ భయ0కరుడు
సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెదకుచు మమ్ము కలసినారు
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
90) పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని
ఆన0దాశ్రులు కన్నులు ని0డగ చిరునగవులతో జానకి చూడగ
ఇదిగో తల్లి ఇది తిలకి0పుము రాముడ0పిన అ0గుళీయకము
అని హనుమ0తుడు భక్తి మీరగను అ0గుళీయకమును సీత కొసగెను
(శ్రీ హనుమాను
Comments
Post a Comment