శ్రీకాళహస్తీశ్వర శతకము.! ధూర్జటి. 9/5/15.

శ్రీకాళహస్తీశ్వర శతకము.!                            ధూర్జటి.  9/5/15.

.

తనువే నిత్యముగానొనర్పౌమదిలే దా, చచ్చి,జన్మింపకుం

డు నుపాయంబు ఘటింపు, మాగతులరెం  టన్నేర్పు లేకున్న లే

దని నాకిప్పుడెచెప్పు చేయగల కా  ర్యంబున్న సంసేవ జే

సి నినుం గాంచెదగాక కాలముననో  శ్రీకాళహస్తీశ్వరా!

.

కాళహస్తీశ్వరా!నా శరీరమునకు చావులేకుండాచేయుము

.లేనిచో మరల పుట్టుక అనగా పునర్జన్మ లేకుండా చేయుము.

పుట్టుక, గిట్టుట అనునవి లేకుండా చేయుట నీకు అసాద్యమైతే నాకు ఇప్పుడే చెప్పు.

నిన్ను చేరే మార్గం చెప్పు.ఆ పద్దతిలోనే సేవ చేసి 

మరణానంతరము నిన్ను చేరుకుంటాను...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!