అహల్య:

అహల్య:

రామలక్ష్మణులను అహల్య ఆశ్రమం మీదుగా తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు. భర్త గౌతముని శాపం చేత అహల్య మంచు కప్పిన చంద్ర కాంతి లాగా నీటిలో ప్రకాశిస్తున్న సూర్యకాంతి లాగా ఉన్నదట. అహల్యను రాయిలా అయిపొమ్మని శపించినట్టు కనబడదు. 'ఆహారం లేకుండా గాలి తింటూ తపస్సు చేస్తూ ఇతరులకెవ్వరికీ కబడకుండ వేల సంవత్సరాలు బూడిదలో పడి ఉండు ' అని శపిస్తాడు.

.

పురుషుల కామానికీ అత్యాచారానికి బలి అయిన స్త్రీ గా అహల్యను చెప్పుకోవాలి. అహల్యను బ్రహ్మ జగదేక సుందరిగా సృష్టించాడు. గౌతమునికి భార్యగా ఇచ్చాడు. ఒకప్పుడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంతో ఆమెను కలిశాడు. భర్త రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసే ఆమె అతనితో సంగమించిందని కొందరంటారు.

గౌతముని వేషంలో వచ్చిన వాడు ఇంద్రుడని అహల్యకు తెలీదంటారు కొందరు. వచ్చినవాడు గౌతముడే అని ఆమె మోసపోయిందంటారు. 

రామాయణ కావ్య రచయిత మాత్రం యేమాత్రం బిడియం, సంకోచాలు లేకుండ అహల్య ఆలోచనల గురించి ఇలా రాస్తాడు. 'రాజులకు రాజు ఇంద్రుడు, సురులలో శ్రేష్టుడైనవాడితో (ఇంద్రుడు ఎంతటి శ్రేష్టుడో ఎవరికి తెలియదు) కలిసినందుకు సంతుష్టిగా వుంది, ఇంద్రా, తొందరగా వెళ్ళు ' అని ఇంద్రుడితో బరితెగించి సంగమించినట్టుగా కనబడుతుంది. 'గొప్ప ఊరువులగలదానా! నేను సైతం సంత్రుప్తి చెందాను, వెళ్తున్నాను ' అని చెప్పి ఇంద్రుడు కుటీరం దాటి బయటికొస్తాడు.[బా.కాం. 1-48-19,20,21,]

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!