బసవరాజు అప్పారావు గీతం...( కోణంగిపద్దు.).

బసవరాజు అప్పారావు గీతం...( కోణంగిపద్దు.).

.

పన్నెండేళ్ళ చిన్నాడే

పైట కొల్ల గొన్నాడే

అడగవమ్మ అడగవమ్మ

అమ్మ యశోదమ్మా!

.

చీకటైన కాలేదే,

రాకపోక లాగలేదే!

లోకానికి జడవొద్దా?

పోకిళ్ళకి అదుపొద్దా? పన్నెండేళ్ళ...

.

ఇంటి కిల్లాలినిగాదే

కంటబడితె తంటాలౌనె!

అంటె నీకు కోపమొద్దే

కొంటీ కోణంగిపద్దే! పన్నెండేళ్ళ..

.

వొట్టే నలుగురిలో తల

గొట్టినట్టు లాయెనమ్మ!

ఏంతో టబ్బరాలైనా

ఇంతపనులు జేసేనా?

.

పన్నెండేళ్ళ చిన్నాడే

పైట కొల్ల గొన్నాడే

అడగవమ్మ అడగవమ్మ

అమ్మ యశోదమ్మా!

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!