శ్రీకృష్ణ శతకం.!........( 17/5/15)... (శ్రీ నరసింహ కవి.).

శ్రీకృష్ణ శతకం.!........( 17/5/15)... (శ్రీ నరసింహ కవి.).

.

హరియను రెండక్షరములు


హరియించును పాతకముల నంబుజ నాభా


హరి నీ నామ మహాత్మ్యము


హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!

.




ప్రతిపదార్థం: అంబుజ నాభా అంటే నాభియందు పద్మం ఉన్న ఓ విష్ణుమూర్తీ! 

(శ్రీ కృష్ణా); హరి + అను అంటే ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలు; పాతకములను అంటే చేసిన పాపాలను; హరియించును అంటే పోగొడతాయి; హరి అంటే హరి అనెడి; 

నీ నామ మహాత్మ్యము అంటే నీ పేరులో ఉన్న గొప్పదనం; 

హరిహరి అంటే ఆహా; పొగడంగ అంటే స్తుతించడం; వశమె అంటే సాధ్యమగునా!

.


భావం: ఓ శ్రీకృష్ణా! ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలను కలిపి పలికినంత మాత్రానే

 అంతవరకు చేసిన పాపాలనన్నిటినీ హరిస్తావు.

 ఓ శ్రీకృష్ణా! నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని వర్ణించి చెప్పటం ఎవ్వరితరమూ కాదు కదా!

.




హరి అనే రెండు అక్షరాలను స్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు.

 శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు.

 శ్రీహరికై తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్రరూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు. ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించి మహనీయులు అయ్యారు.

 హరి అనే రెండు అక్షరాల పదానికి ఇంత మహాత్మ్యం ఉందని కవి ఈ పద్యంలో వివరించాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!