శ్రీనాధుడు పల్నాటి సీమలో తనకి పెట్టిన కుభోజనము ను వర్ణించిన పద్యం.

ఈ చాటువు శ్రీనాధుడు పల్నాటి సీమలో తనకి పెట్టిన కుభోజనము ను వర్ణించిన పద్యం. 

.

శ్రీకృష్ణుని తో చెప్పిన పద్యం.!

.

“ ఫుల్ల సరోజ నేత్ర! అల పూతన చన్నుల చేదు ద్రావి నా 

డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల? తింత్రిణీ 

పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో 

మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము! నీ పస కాననయ్యెడిన్”

.

వికసించిన తామరపూ రేకుల వంటి నేత్రములు కల శ్రీకృష్ణా! 

నీవు విషపూరితమైన పూతన అనే రక్కసి పాలు త్రాగేను అని, అడవిలో వచ్చిన దావాగ్నిని మ్రింగేను అని నిక్కేదవేల? గర్వపడతావు ఎందుకు?అదేమీ గొప్పకాదు.

ఇక్కడ పల్నాటిలో తింత్రిణీ పల్లవము అంటేచింతాకుతో కలిపి ఉడికించిన 

బచ్చలి కూర వేసి పెట్టిన జొన్న సంగటి (ఓ రకమైన అన్నం ముద్ద) ఓముద్ద తింటే 

నీపస(నీ గొప్ప) తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!