స్పర్ధయా వర్ధతే విద్యా "....!

స్పర్ధయా వర్ధతే విద్యా "....!

.

(ఈ కధనం నాది కాదు.. విన్నది ..చదివినది.)

.

శ్రీశ్రీ దాశరధి ల మధ్య కొన్ని రోజులు కవనకదనం తీవ్రంగా జరిగింది.

తెరవెనుక ఏమిటీ అన్నది మనకవసరం. శ్రీశ్రీ గారు దాశరధి మీద సంధించిన బాణం:

.

"పొట్టికవీ, తిట్టుకవీ,

నారాయణ రెడ్డి లాగ

రాయాలని దురదా

రాసేదంతా పచ్చి సెక్సు బురద."

.

దానికి దాశరధి ఎదురు దాడి:

"రంగు రంగు మేడలలో

ఇద్దరాడువాండ్రతో

సామ్యవాద మెక్కడిదిరా

చవట చచ్చు సన్యాసీ."

.

నారయణ రెడ్డి  , దాశరధి గార్ల  మధ్య సుహృద్భావముండేది.

: "నడిరేయి యే జాములో స్వామి నిను చేర దిగివచ్చునో అనే పాట చాలా బాగుంది. మీరు వ్రాశారా?" అని అడిగితే..

నవ్వుతూ అన్నారు: "అంతబాగా దాశరధే వ్రాయగలడు".

స్పర్ధయా వర్ధతే విద్యా అని అ మహాకవుల మధ్య స్పర్ధ వున్నా

అది పరస్పర ద్వేషంగా మనం భావించనవసరం లేదు. పాత రోజుల్లో కూడా తెనాలి వారు, ధూర్జటి, రామరాజభూషణుడు మధ్య కవనకదనాలు జరిగినా ఇప్పటికీ అవి చదివి నవ్వుకుంటాము.అంతే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!